sarve satyanarayana
-
సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: ఓ వైపు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు కురిపిస్తుండగా.. మరోపక్క హస్తం పార్టీ ముఖ్య నేత ఒకరు సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధు గొప్ప పథకమంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు ప్రశంసలు కురిపించి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు.. కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ.. సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు. దళిత బంధు చాలా గొప్ప పథకం అన్నారు సర్వే సత్యనారాయణ. దళితులు బాగుపడటానికి మంచి పథకం తీసుకొచ్చారని కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురపించారు. ఎవరికీ రాని ఆలోచన సీఎం కేసీఆర్‌కు వచ్చిందంటూ అభినందించారు. ఓవైపు కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌పై కారాలుమిరయాలు నూరుతుంటే.. సర్వే మాత్రం ఇలా ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే సర్వే కారు ఎక్కుతారా ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక సర్వే వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. గతేడాది జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో సర్వే సత్యనారాయణను రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కలిశారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరినట్లు ప్రచారం జరిగింది. అయితే సర్వే మాత్రం అధికారికంగా ఎక్కడా బీజేపీలో చేరలేదు. నిజానికి బీజేపీ నుంచి ఆయన రాజ్యసభ సీటు ఆశించారని... కానీ అందుకు హామీ లభించకపోవడంతోనే ఆ పార్టీలో చేరలేదనే ప్రచారం ఉంది. -
కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ యాక్షన్
-
చలో ప్రగతి భవన్: మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ డ్రామ
-
కాంగ్రెస్‌లో ‘సర్వే’ దుమారం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ సస్పెన్షన్ వ్యవహారం ఆ పార్టీలో దుమారం రేపుతోంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం హడావిడిగా ప్రకటించడంపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా సర్వే సస్పెన్షన్ వ్యవహారంలో జోక్యం చేసుకొని కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సర్వే సస్పెన్షన్ ఎపిసోడ్‌పై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియాను ఢిల్లీ పిలిపించి మరీ హైకమాండ్ వివరణ తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. తమను సంప్రదించకుండా సర్వేను సస్పెండ్ చేస్తున్నట్లు ఎలా ప్రకటించారని, ఈ వ్యవహారానికి సంబంధించిన నివేదిక ఏదని కుంతియాను పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎ. కె. ఆంటోనీ ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో హుటాహుటిన గాంధీభవన్ నుంచి నివేదిక తయారు చేయించి పంపించాల్సి వచ్చింది. అయితే ఈ ఘటన గురించి తెలుసుకునేందుకు సర్వేను కూడా ఆంటోని ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో సర్వే సస్పెన్షన్ వ్యవహారం పెండింగ్‌లో ఉందని, త్వరలోనే దీనిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలా ఎలా చేస్తారు..? ఈ నెల 6న జరిగిన మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో కుంతియా, ఉత్తమ్‌లపై సర్వే సత్యనారాయణ పలు ఆరోపణలు చేశారు. కుంతియాను వ్యక్తిగతంగా పరుష పదజాలంతో దూషించారని, అడ్డువచ్చిన వారిపై దాడి చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ సస్పెన్షన్‌కు ముందు అధిష్టానాన్ని సంప్రదించేందుకు టీపీసీసీ నేతలు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో హడావుడిగా ప్రకటన చేసేశారు. దీనిపై అధిష్టానం అభ్యంతరం వ్యక్తం చేసిందని, కుంతియాను వివరణ కోరిన సందర్భంగా ఆయనకు ఆంటోనీ పలు ప్రశ్నలు వేశారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం క్రమశిక్షణా రాహిత్యం కిందకు ఎలా వస్తుందని, ఎన్నికల ఫలితాల సమీక్ష కోసం పిలిచినందుకే సర్వే సమావేశానికి హాజరై అభిప్రాయం చెప్పినప్పుడు నోట్ చేసుకొని తమకు తెలియజేసి ఉంటే ఏం చేయాలో తామే నిర్ణయం తీసుకునేవాళ్లమని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఏఐసీసీ సభ్యుడిగా ఉన్న, కేంద్ర మంత్రిగా పనిచేసిన నాయకుడిని పీసీసీ స్థాయిలో ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో కంగుతిన్న కుంతియా... వెంటనే గాంధీ భవన్‌ను సంప్రదించి సమీక్ష సమావేశంలో పాల్గొన్న వారి సంతకాలతో కూడిన నివేదికను ఢిల్లీకి తెప్పించుకున్నట్లు తెలిసింది. అయితే మల్కాజిగిరి పార్లమెంటు సమీక్ష జరుగుతున్నప్పుడు ఆ నియోజకవర్గంతో సంబంధం లేని వారు వచ్చారని, వారితోనే తనపై దాడి చేయించేందుకు ప్రయత్నించారని సర్వే ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వారితోనే సంతకాలు చేయించి పార్టీ అధిష్టానానికి నివేదిక పంపడం చర్చకు దారితీస్తోంది. ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే గురువారం సర్వే సత్యనారాయణ కూడా ఆంటోనీని కలిశారు. ఈ ఘటనపై వివరణ కోరేందుకు క్రమశిక్షణ కమి టీ పిలవడంతో ఢిల్లీ వెళ్లిన సర్వే... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు కుంతియాపై మరోసారి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సర్వే సస్పెన్షన్ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం కలిగించారు: సర్వే సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్‌కు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ క్రమశిక్షణ సంఘానికి కాంగ్రెస్ సీని యర్ నేత సర్వే సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో పార్టీ ఓటమిపై రాష్ట్ర ఇన్చార్జి కుంతియా, ఉత్తమ్‌పై చేసిన వ్యాఖ్య లపై ఆయన గురువారం ఢిల్లీలో ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఏకే ఆంటోనీని కలసి వివరణ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో ఓటమికి ఉత్తమ్, కుం తియాల తప్పిదాలను ఆంటోనీకి వివరించినట్లు తెలిపారు. దీనిపై ప్రశ్నించిన ఏఐసీసీ సభ్యుడినైన తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం లేకపోయినా పీసీసీ అధ్యక్షుడు సస్పెండ్ చేశారన్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా మిత్ర ధర్మాన్ని ఉత్తమ్ వమ్ము చేశారని, టికెట్ల కేటాయింపులో డబ్బులు దండుకొని పక్షపాతంగా వ్యవహరించినట్లు చెప్పానని వివరించారు. ఉత్తమ్ పార్టీకి శనిలా దాపురించి నిండా ముంచారని మండిపడ్డారు. ఉత్తమ్ చర్యల వల్ల చంద్రబాబు, ప్రొఫెసర్ కోదండరాం, కమ్యూనిస్టు పార్టీలు అందరూ అభాసు పాలయ్యారన్నా రు. ఇబ్రహీంపట్నం లాంటి స్థానాల్లో సమర్థులైన అభ్యర్థులకు స్థానం కేటాయించకుండా పార్టీకి నష్టం చేకూర్చారని వివరించినట్లు తెలిపారు. -
నిన్ను సస్పెండ్ చేయడమేంటని అడిగారు: సర్వే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వే సత్యనారాయణ గురువారం ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వేను సస్పెండ్ చేస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సర్వే నేడు క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఏకే ఆంటోనికి వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యాను. కమిటీ సభ్యులు నిన్ను సస్పెండ్ చేయడమేంటని అడిగారు. డోంట్ వర్రీ, ఫిర్యాదు రాసి ఇవ్వమన్నార’ని తెలిపారు. అలాగే టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాపై సర్వే మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తమ్, కుంతియాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని విమర్శించారు. తనను సస్పెండ్ చేసే అధికారం ఉత్తమ్‌కు లేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌ను బర్తరఫ్ చేయాలని.. కొత్త నాయకత్వానికి ఆ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. తను సోనియా కుటుంబానికి నమ్మిన బంటునని తెలిపారు. నన్నే సస్పెండ్ చేస్తారా.. మీ భరతం పడతా: సర్వే -
బ్రేకింగ్: కాంగ్రెస్ నుంచి సర్వే సస్పెండ్..!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణకు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మాల్కాజ్‌గిరి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌తో సర్వే వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. కిషన్‌పై సర్వే వాటర్ బాటిల్ విసిరి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పీసీపీ చీఫ్ ఉత్తమ్‌పై, కుంతియాపై ఆరోపణలు చేశారని కిషన్ తెలిపారు. దీంతో అధిష్టానం ఆదేశాల మేరకు సర్వేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆపార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం ప్రకటించింది. సర్వే సత్యనారాయణ వీధి రౌడీలా ప్రవర్తించాడని, పార్టీ నేతలను తీవ్ర పదజాలంతో దూషించారని కిషన్ ఆరోపిస్తున్నారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై గాంధీభవన్‌లో జరుగుతున్న సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ నాయకత్వంపై సర్వే తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియాలే కారణమని సర్వే పేర్కొన్నారు. ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేసిన టీ కాంగ్రెస్ నేతలు సర్వేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. టీపీసీసీపై సర్వే సంచలన వ్యాఖ్యలు -
టీపీసీసీపై సర్వే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ఈ సందర్బంగా మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్ల మధ్య వివాదం నెలకొంది. దీనిపై సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియాలే కారణమని ఆరోపించారు. ఓటమి కారకులే మళ్లీ ఓటమిపై సమీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్, కుంతియాల వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదని అన్నారు. వాళ్ల అసమర్ధతను ప్రశ్నిస్తే దాడులు చేయించడానికి గాంధీభవన్‌లో రౌడీలను పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు చెబుతుంటే మహేశ్ గౌడ్, బొల్లి కిషన్లతో ఉత్తమ్ తనపై దాడి చేయించినట్టు ఆరోపించారు. పార్టీలో కొందరు రౌడీ మూకలు ఉన్నారని.. ఒకరిద్దరు దద్దమ్మలు తనపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ గెలుపుకు సలహాలు ఇస్తుంటే.. ఇది నచ్చనివారు తనపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీకాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో రేపు మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. అర్హత లేని ఉత్తమ్‌కు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారని.. ఆయనను పదవి నుంచి వెంటనే తొలగించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ అభ్యర్థి వద్ద రూ. 50లక్షల నగదు పట్టివేత!
సాక్షి, హైదరాబాద్ : కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు చెందిన రూ.50లక్షల నగదును పోలీసులు సీజ్‌చేశారు. సర్వే ప్రధాన అనుచరుడు గాలి బాలాజీ వద్ద ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.50లక్షలు, ప్రచార సామాగ్రిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును సర్వే సత్యనారాయణ కోసం తీసుకెళ్తుండగా.. నాంపల్లి వద్ద పట్టుకున్నారు. సర్వే ఆదేశాల మేరకు బేగంబజార్‌లోని హవాలా డీలర్ దిలీప్ నుంచి రూ. 50లక్షలు గాలి బాలాజీ తీసుకున్నట్లు సమాచారం. మరో చోట రూ.40లక్షలు పట్టివేత! గచ్చిబౌలి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.40లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా ఈ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నగదు టీడీపీకి చెందిన ఓ నేతవిగా పోలీసులు చెబుతున్నారు. -
కంటోన్మెంట్లో మహాకూటమి బలంగా ఉంది
-
ముందస్తుతో కేసీఆర్ పనితీరు బయటపడింది
-
దేశం మొత్తం తెలంగాణ ఎన్నికలను గమనిస్తోంది!
సాక్షి, హైదరాబాద్ : దేశం మొత్తం తెలంగాణ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోందని, ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కలిసి తెలంగాణను మోసం చేయాలని చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో కాంగ్రెస్ పార్టీ ఆదివారం నిర్వహించిన మైనారిటీలో సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు కేసీఆర్‌కు గుణపాఠం కాబోతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లిం మైనారిటీల పక్షపాతి అని, పేద ముస్లింల కోసం వైఎస్సార్ హయాంలో ఎన్నో పథకాలను కాంగ్రెస్ అమలు చేసిందని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్‌కు ఓటు వేస్తె మోదీకి వేసినట్టేనని, కేసీఆర్ ఊసరవెల్లిలాంటి వారని విమర్శించారు. కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. కేసీఆర్ మైనారిటీలకు ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్ అమలు చేయలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కేబినెట్లో ఎస్సీలకు, మహిళలకు చోటు దక్కలేదన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు ఫ్యామిలీగా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పార్లమెంటులో తాము పోరాటం చేసినపుడు కేసీఆర్ లేరని పేర్కొన్నారు. డైనమిక్ యువ నేత రేవంత్ అంటే కేసీఆర్‌కు భయమన్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుందని ఆరోపించారు. చిన్న దొంగ కేసీఆర్ అయితే.. పెద్దదొంగ నరేంద్ర మోదీ అని అభివర్ణించారు. రాష్ట్రంలో అభివృద్ధి అటకెక్కిందని, కేసీఆర్‌కు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చిందని చెప్పారు. కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింల అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయం
-
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయం
-
సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సంబంధాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం బోడుప్పల్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సర్వే చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయేలా ఉన్నాయని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనతో కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. తనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందుగానే కేంద్ర మంత్రి పదవి రిజర్వేషన్ చేసి ఉంచారని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం కొన్ని కార్యక్రమాల్లో వారి తీరుతో తెలిపోయింది. కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణ స్వీకారం రోజున రాహుల్‌తో చంద్రబాబు వ్యవహరించిన తీరు, ఇటీవల అవిశ్వాస తీర్మాణంపై చర్చలో భాగంగా పార్లమెంటులో టీడీపీ, కాంగ్రెస్‌లు ఉమ్మడి అజెండాతో పనిచేయడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మక్కా పేలుళ్ల కేసులో కేంద్ర వైఫల్యం
సాక్షి, హైదరాబాద్: మక్కామసీదు పేలుళ్ల కేసులో కేంద్రం సాక్ష్యా లు చూపించడంలో విఫలమైనందునే కేసును కొట్టివేశారని కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ విమర్శించారు. పేలుళ్లతో ఎవరికి సంబంధం ఉందో తెలియకుండా పోయిందని.. ఎవరూ దోషులు కాకపోతే పేలుళ్లు ఎలా జరిగాయని ప్రశ్నించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కూకట్పల్లి వైజంక్షన్‌లో జరిగిన ఘటనను ఆసరాగా చేసు కుని తనపై క్రిమినల్ కేసు పెట్టడం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందన్నారు. తాను కలెక్టర్‌ను అవమానపరిచి ఉంటే ఆయనే తనపై కేసు పెట్టాలని, సభ అర్ధాంతరంగా ఆగిపోయిందంటూ తనపై ప్రభుత్వం కేసు ఎందుకు పెడుతుందని ప్రశ్నించారు. సీఎంకు దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. -
‘అందరూ నిర్దోషులే.. పేలుళ్లు ఎలా?’
సాక్షి, హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ సెక్యులర్ దేశమని.. అన్ని మతాలను గౌరవించాలన్నారు. గాంధీ కుటుంబం పాలించినప్పుడల్లా దేశం సంతోషంగా ఉందని, లౌకికవాదాన్ని కాపాడింది కాంగ్రెస్ మాత్రమే అని ఆయన తెలిపారు. నగరంలోని మక్కామసీదుకు ప్రపంచంలోనే పేరుందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. నేటి తీర్పుతో పేలుళ్లలో ఎవరున్నారో తెలియకుండా పోయిందన్నారు. ప్రాసిక్యూషన్ ఫెయిలయింది కాబట్టే నిందితులు నిర్దోషులుగా ప్రకటించబడ్డారన్నారు. సాక్ష్యాధారాలను నిరూపించడంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. ప్రాసిక్యూషన్ విఫలం వెనుక ఎవరున్నారని ఆయన నిలదీశారు. ఎవరూ దోషులు కాకపోతే.. పేలుళ్లు ఎలా జరిగాయని ఆయన ప్రశ్నించారు. బ్లాస్ట్ సూత్రధారులకు శిక్షపడాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. తీర్పు పూర్తిగా పరిశీలించాక స్పందిస్తామని ఆయన వెల్లడించారు. 11 ఏళ్ల నాటి మక్కా మసీదు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులు ఐదుగురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న న్యాయమూర్తి.. 10 మంది నిదితుల్లో స్వామి అసిమానంద, భరత్, దేవెందర్ గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలను నిర్దోషులుగా పేర్కొన్నారు. మిగిలినవారిపై చార్జిషీటు కొనసాగుతుందని తెలిపారు. 2007 మే 18 తేదీన మధ్యాహ్నం మక్కా మసీద్‌లో ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 9 మంది చనిపోగా, అనంతరం చెలరేగిన అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా మరో ఐదుగురు మృతి చెందారు. -
‘బాహుబలి కాదు.. పెద్ద బఫూన్’
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ విరుచుకుపడ్డారు. కేసీఆర్ బాహుబలి కాదు..పెద్ద బఫూన్ అని సర్వే ఎద్దేవా చేశారు. కబాలి సినిమా లాగానే.. వరంగల్ సభ కేసీఆర్ ఫ్లాప్ షో అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ చేతకాని దద్దమ్మ అని.. సన్నాసి..కేకే, డీఎస్ లాంటి దద్దమ్మలను పార్టీ చేర్చుకున్న పెద్ద దద్దమ్మవు అంటూ విమర్శించారు. 2014 లో కేసీఆర్ ది యాక్సిడెంటల్ విన్ అని వర్ణించారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కు లు చేసినా 2019 లో కాంగ్రెస్ దే అధికారమని స్పష్టం చేశారు. వరంగల్ నుంచే కేసీఆర్ వినాశం మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ సర్వే ఫలితాలు చూసి కేసీఆర్ వణుకు మొదలైందని చెప్పారు. కేసీఆర్ గద్దె దిగక తప్పదని అన్నారు. -
హరీష్ రావు సీఎం కావడం ఖాయం
మంత్రి హరీశ్‌రావు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందన్నారు. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవిత అవినీతికి పాల్పడుతూ మంత్రి హరీశ్‌ను ఒంటరి చేశారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలనను బుద్ధి చెప్పేవరకు ప్రజలు నిద్రపోరని, దీనికి ఈ పాదయాత్ర నాంది పలుకుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణను పథకం ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకుంటున్నారని, మాదిగలంటే ఆయనకు చులకనగా ఉందని ఆయన మండిపడ్డారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాకపోయినా కేసీఆర్ తప్పుడు హామీలతో వారిని మోసగిస్తున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు అమరసేనారెడ్డి, రాష్ట్ర మైనారిటీ విభాగం ఉపాధ్యక్షుడు శంశొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
వారిని వారే పొగుడుకుంటున్నారు..!
హైదరాబాద్‌సిటీ: కేసీఆర్ ఫ్యామిలీలో అవినీతి రాజ్యమేలుతోందని కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జనం పొగడటం లేదు కాబట్టే.. వారిని వారే పొగుడుకుంటున్నారని అన్నారు. ప్రజలు చెప్పులతో కొట్టే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు. అధికారులు అవినీతి చేస్తున్నారంటే.. సీఎంగా కేసీఆర్ ఫెయిల్ అయినట్లేనని చెప్పారు. కాంగ్రెస్ పుణ్యమే కేసీఆర్‌కు పదవులు వచ్చేలా చేసిందన్నారు. జనం క్షణికావేశంలో టీఆరెస్‌కు ఓట్లేశారని పేర్కొన్నారు. -
'రచ్చెకెక్కి పార్టీకి నష్టం చేయొద్దు'
హైదరాబాద్: సర్వే సత్యనారాయణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. రచ్చెకెక్కి పార్టీకి నష్టం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చిద్దామని, లేదంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళదామని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో గెలవలేక డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు మరింత నష్టాన్ని కలిగిస్తాయని చెప్పారు. గత వైఫల్యాలను మర్చిపోయి, నష్టం చేసిన వారిని క్షమిస్తూ పార్టీ ఐక్యత కోసం సీనియర్లు కృషి చేయాలని షబ్బీర్ అలీ సలహాయిచ్చారు. -
'సర్వేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి'
హైదరాబాద్ : టీ కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై పీసీసీ కార్యదర్శి సురేష్ యాదవ్ శుక్రవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్‌గిరిలోని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ టిక్కెట్ కోసం సర్వే సత్యనారాయణ తన వద్ద రూ. 26 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. అయితే ఆ డివిజన్ టికెట్ తనకు కాకుండా... సెటిలర్కు ఇచ్చారని విమర్శించారు. సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ అంశంపై శనివారం తాను న్యూఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవనున్నట్లు సురేష్ యాదవ్ తెలిపారు. -
వరంగల్ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదు
-
వరంగల్ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదు : సర్వే
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఈవీఎంలను మానిప్లేట్ చేసి టీఆర్ఎస్ గెలిచిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో సర్వే సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ.... ఎన్నికల ప్రచారం సందర్బంగా టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత కనిపించిందని ఆయన గుర్తు చేశారు. అందులోభాగంగా ఆ పార్టీ మంత్రులు, నేతలను ప్రజలు నిలదీశారని అన్నారు. ఈవీఎంల మానిప్లేట్పై ప్రత్యేక కమిషన్‌తో బహిరంగ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సర్వే సత్యనారయణ డిమాండ్ చేశారు. ఈవీఎంలు కరెక్ట్ అని తేలితే కేసీఆర్‌కి సలాం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈవీఎంలు మానిప్లేట్ అయ్యాయని తేలితే కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు. హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నుంచే... టీఆర్ఎస్ ఈవీఎంల మానిప్లేట్ చేయడం ప్రారంభించిందన్నారు. ప్రచారంలో కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు. ఉద్యమ కాలంలోనూ టీఆర్ఎస్కు భారీ మెజార్టీ రాలేదని తెలిపారు. వరంగల్‌లో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ రావడం.. కాంగ్రెస్‌కి డిపాజిట్ రాకపోవడానికి కారణం ఈవీఎంలు మానిప్లేట్ చేయడమే అని సర్వే స్పష్టం చేశారు. -
సోనియమ్మ ఫోన్ చేస్తేనే...
పిలిచి పిల్లనిస్తే కులం తక్కువ అన్నది సామెత... వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి అక్షరాలా ఈ అనుభవమే ఎదురైంది. వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో ఘటన తరువాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చాలని నిర్ణయించుకుని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు కబురు చేసింది. సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. అంతకు ముందు టికెట్ ఇవ్వండంటూ సర్వే కోరినా పట్టించుకోని కాంగ్రెస్ అవసరానికి కాళ్ల బేరానికి వచ్చింది. సర్వే మాత్రం తక్కువ తిన్నాడా మరి కొద్ది గంటల్లో నామినేషన్ల గడువు ముగుస్తున్న దశలో పార్టీ అధినేత సోనియాగాంధీ ఫోన్ చేస్తే తప్ప తాను నామినేషన్ వేయనని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ గంట సేపు నానా హైరానా పడ్డారట. ఈ విషయాన్ని ఢిల్లీకి చేరవేశారు గానీ సోనియమ్మ ఫోన్ ఎప్పుడు వస్తుందో తెలియక పార్టీ నేతల్లో కంగారు...నేతలు కంగారు పడుతుండగానే సర్వేకు సోనియా ఫోన్ చేసి పోటీ చేయమని చెప్పడం, నేతలకు సమాచారం ఇచ్చేలోపే ఆయన వరంగల్ పయనం కావడం అన్నీ రెండు గంటల్లో జరిగిపోయాయి. అప్పుడు గానీ కాంగ్రెస్ నేతల ఉత్కంఠకు తెరపడలేదు. -
'టి.కాంగ్రెస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారు'
హైదరాబాద్ : టి.కాంగ్రెస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టివిక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ... పొన్నాల వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ముద్ర పడిందని గుర్తు చేశారు. పొన్నాలను తొలగించాలని కొందరు నేతలు పార్టీ అధిష్టానానికి చెప్పారని ఆరోపించారు. 2019 నాటి వరకు ఉత్తమ్ నాయకత్వాన్నే కొనసాగించాలని ఈ సందర్బంగా సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ సర్కార్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు కాబట్టి పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి, డీఎస్‌లు మాట్లాడుతూ... యువనాయకత్వానికి అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పచెప్పిందని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ఉత్తమ్, భట్టి విక్రమార్కలకు సహకరించాలని నేతలందరికి జైపాల్‌రెడ్డి, డీఎస్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్టీఆర్‌ను అవమానపర్చేందుకే పేరుమార్పు
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం ఆయన ఖ్యాతిని దిగజార్చి.. అవమానపర్చడమేనని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తే అందుకు సహకరించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. రాజీవ్‌గాంధీ విమానాశ్రయం దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్రాలో ఉన్న నాలుగు ఎయిర్‌పోర్టులతో పాటు నిర్మాణం చేయదల్చుకున్న వాటికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని సూచించారు. చేసిన వాగ్దానాలను నేరవేర్చలేని స్థితిలో ఉన్న బాబు ఆంధ్రాలో ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేశీయ టెర్మినల్‌కు పెట్టిన ఎన్టీఆర్ పేరును వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేరు మార్పుపై చిత్తశుద్ధిలేదని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చేతులు దులిపేసుకుందన్నారు. పేరుమార్పుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏర్పాటు చేసిన ఘనత యూపీఏదేనని చెప్పారు. పేర్లు మార్చే సంస్కృతి మంచిది కాదని సబిత హితవుపలికారు. ప్రస్తుతం చేసే ధ ర్నా కేవలం ఆరంభం మాత్రమేనని ఎన్టీఆర్ పేరును తొలగించే వరకు ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టడం సమంజసం కాదని మాజీ మంత్రి ప్రసాద్ పేర్కొన్నారు. ప్రసంగాల అనంతరం సర్వే సత్యనారాయణతో పాటు పలువురు నేతలు జాతీయరహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ తర లించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, కాంగ్రెస్ యువనేత కార్తీక్‌రెడ్డి , జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఇళ్ల కూల్చివేతలు ఆపాల్సిందే: సర్వే
అనుమతులు లేవన్న పేరుతో జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న ఇళ్ల కూల్చివేతలను తక్షణం ఆపాల్సిందేనని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. అలా అక్రమ నిర్మాణాలుంటే క్రమబద్ధీకరణ చేయాలన్నారు.మల్కాజ్గిరి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమీక్షించినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. కూల్చివేతలు, ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారాలతో కేసీఆర్ సీమాంధ్రుల్లో భయాందోళనలు కలిగిస్తున్నారని, తెలంగాణలో పుట్టిన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సిందేనని సర్వే అన్నారు. రీయింబర్స్‌మెంట్‌కు 1956 స్థానికత ప్రాతిపదిక అనడం సరికాదని ఆయన మండిపడ్డారు. ఇక తెలంగాణ ప్రాంతంలో సీనియర్ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని, పార్టీ ఓటమికి ఒక్క పొన్నాలనే బాధ్యుణ్ని చేయడం సరికాదని ఆయన చెప్పారు. పొన్నాలనే పీసీసీ చీఫ్‌గా కొనసాగించాలని సోనియాను కోరినట్లు వెల్లడించారు. -
సొంత మనిషికి టీఆర్ఎస్ టికెట్ ఇప్పించిన సర్వే!!
రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి.. తీరా అది దక్కకపోవడంతో నిరాశకు గురై, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామనుకునే సమయానికి టీఆర్ఎస్ టికెట్ వరించింది. కేంద్ర మంత్రి, మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ అనుచరుడు రామ్మోహన్ గౌడ్. ఈయన ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని ఉత్సాహపడ్డారు. తన మనిషికి ఎలాగైనా ఆ టికెట్ ఇప్పించాలని సర్వే తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాత్రం ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరిపి, తన టికెట్ ఖరారు చేయించుకున్నారు. దీంతో రామ్మోహన్ గౌడ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా ఎల్బీనగర్ బరిలోకి దిగాలనుకున్నారు. సరిగ్గా ఇక్కడే మళ్లీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చక్రం తిప్పారు. టీఆర్ఎస్లో తనకున్న పరిచయాలతోనే చేశారో, ఇంకేం చేశారో గానీ.. తెల్లవారేసరికి టీఆర్ఎస్ విడుదల చేసిన రెండో జాబితాలో రామ్మోహన్ గౌడ్ పేరు కనిపించింది. ఒక్కసారిగా నియోజకవర్గ ప్రజలతో పాటు.. నాయకులు కూడా విస్తుపోయారు. సోమవారం వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన అసలు ఎప్పుడు టీఆర్ఎస్లో చేరారో, ఎప్పుడు టికెట్ కోసం ప్రయత్నించారో, ఎలా సాధించారో ఎవ్వరికీ తెలియలేదు. టికెట్ మాత్రం ఇట్టే వచ్చేసింది. -
పాత.. కొత్త కలబోత
ఇదీ కాంగ్రెస్ జాబితా.. లోక్‌సభ అభ్యర్థుల ఖరారు మల్కాజిగిరి, సికింద్రాబాద్ సీట్లు సిట్టింగ్‌లకే.. హైదరాబాద్‌కు కృష్ణారెడ్డి చేవెళ్లలో కార్తీక్‌రెడ్డి.. జైపాల్ మహబూబ్‌నగర్‌కు.. ‘అసెంబ్లీ’ వీడని ఉత్కంఠ సాక్షి, సిటీబ్యూరో: కొన్ని కొత్త ముఖాలు.. ఇంకొన్ని పాత ముఖాలు.. సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి కాంగ్రెస్ తన అభ్యర్థుల్ని సిద్ధం చేసింది. తొలి జాబితాను శనివారం రాత్రి ప్రకటించింది. గ్రేటర్ పరిధిలోని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలకు సిట్టింగ్‌లైన సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్‌ల పేర్లే ఖరారయ్యాయి. చేవెళ్లలో సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డికి అవకాశమివ్వగా, అక్కడి సిట్టింగ్ ఎంపీ జైపాల్‌రెడ్డికి మహబూబ్‌నగర్ టికెట్‌ను కేటాయించింది. హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి నగర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ సామ కృష్ణారెడ్డిని పోటీకి దించింది. అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనను చివరి నిమిషంలో రద్దు చేయడంతో పార్టీ వర్గాలను నిరాశ పరిచింది. మల్కాజిగిరి ‘సర్వే’దే.. మంత్రి సర్వే సత్యనారాయణ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. జనరల్ స్థానమైన మల్కాజిగిర లోక్‌సభ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించినా సర్వే అభ్యర్థిత్వానికే అధిష్టానం మొగ్గు చూపడం గమనార్హం. అగ్రనేతలు, సెలబ్రిటీల పేర్లు ఆశావహుల జాబితాలో కనిపించినా.. చివరకు ఆయన పలుకుబడి ముందు నిలవలేదు. కాగా, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చే భువనగిరి లోక్‌సభ స్థానం కూడా సిట్టింగ్ సభ్యుడు కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డికే ఖ రారైంది. తొలుత ఇక్కడి నుంచి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రేసులో నిలవడం.. కోమటిరెడ్డి బ్రదర్స్ దీన్ని వ్యతిరేకించడంతో అధిష్టానం ఈ సీటు విషయంలో పునరాలోచన చేసింది. చేవెళ్లకు కార్తీక్.. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలనే అభిలాషను కార్తీక్‌రెడ్డి నెరవేర్చుకున్నారు. సీనియర్ నేత జైపాల్ రెడ్డి రాకతో 2009లో చివరి నిమిషంలో పార్టీ టికెట్ కోల్పోయిన కార్తీక్.. ఈసారి పట్టువదలకుండా పోరాడి బీ ఫారం దక్కించుకున్నారు. ఎలాగైనా ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్న కార్తీక్.. మూడు నెలల క్రితమే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీటు మారుతున్నట్లు జైపాల్ వెల్లడించకముందే చేవెళ్ల పార్లమెంటుపై తన ఇష్టాన్ని ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ పేర బహిరంగ పరిచారు. ఈసారి కూడా పార్లమెంటు స్థానానికి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. జైపాల్ తప్పుకున్నప్పటికీ, అక్కడి నుంచి బరిలోకి దిగడానికి మర్రి శశిధర్‌రెడ్డి గట్టి ప్రయత్నమే చేశారు. కుటుంబంలో ఒకరికే సీటు అని కాంగ్రెస్ నిబంధన పెట్టడంతో ఒకదశలో సబితా ఇంద్రారెడ్డికే చేవెళ్ల ఎంపీ టికెట్ ఖరారవుతుందని అంతా భావించారు. ఇదే విషయాన్ని అధిష్టానం కూడా స్పష్టం చేసింది. చివరకు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సీటును కార్తీక్రెడ్డికే కేటాయించారు. మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిపేరు : సర్వే సత్యనారాయణ పుట్టిన తేదీ : 4 ఏప్రిల్, 1954 విద్యార్హత : బీఏ, ఎల్ఎల్బీ భార్యా : సునీత పిల్లలు : ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు రాజకీయ నేపథ్యం : 13 ఏళ్ల పాటు ప్రభుత్వ సర్వీసులో కొనసాగి ఎస్ఎఐల్ ట్రేడ్ యూనియన్ నాయకునిగా పని చేశారు. 1985-89 మధ్య కాలంలో సిద్ధిపేట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు. 2004, 2009 ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్ అభ్యర్థి పేరు : సామ కృష్ణారెడ్డి, హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పుట్టినతేదీ : 01-17-1963 విద్యార్హత :బీకాం నివాసం :నగరి అపార్ట్మెంట్, వినయ్‌నగర్ కాలనీ, ఐఎస్ సదన్ భార్య పేరు : విజయలక్ష్మి పిల్లలు :రేష్మిరెడ్డి, రోహిణిరెడ్డి, భానుప్రతాప్ రాజకీయ నేపథ్యం : 1984లో ఎన్ఎస్యూఐ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. 2003లో రంగారెడ్డిజిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నిక. 2010లో నగర గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా ఎన్నికై ఇంకా కొనసాగుతున్నారు. సికింద్రాబాద్ అభ్యర్థిపేరు : ఎం.అంజన్‌కుమార్ యాదవ్, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ నివాసం : గొల్లకిడికి, పురానాపూల్ (పాతబస్తీ) విద్యార్హత : బీఏ భార్య : నాగమణి, పిల్లలు : ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు రాజకీయ నేపథ్యం : 1985లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో తొలిసారిగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ప్రత్యర్థి దత్తాత్రేయపై విజయం సాధించారు. 2009 మరోసారి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మూడోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. -
సర్వే, మందకృష్ణల నుంచి ప్రాణహాని: ఆకుల రాజేందర్
హైదరాబాద్: కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ నుంచి నాకు ప్రాణహాని ఉందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని రాజేందర్ తెలిపారు. మంద కృష్ణ బెదిరింపు ఫోన్ కాల్స్ వెనుక ఉన్నది కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణే అని రాజేందర్ ఆరోపించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశానని మీడియాకు వెల్లడించారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నా ఆరోపణలు తప్పని తేలితే రాజకీయాల్లోంచి తప్పుకుంటాను... ఏ పార్టీ నుంచి పోటీచేయను అని మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ స్పష్టం చేశారు. -
మీదే బాధ్యత
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే ఈ పోరులో విజయం సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీభవన్‌లో నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. ీ సనియర్లను సమన్వయపరుచుకుంటూ ప్రచారపర్వాన్ని కొనసాగించాలన్నారు.మండల/ జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. స్థానిక, సాధారణ ఎన్నికల వరకు పార్టీని సమన్వయపరుచుకునేందుకు వీలుగా జిల్లా స్థాయిలో మూడు కమిటీలు వేయాలని పొన్నాల సూచించారు. ప్రచార కమిటీ, మేనిఫెస్టో, సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని, వీటిని రాష్ట్రస్థాయి కమిటీతో అనుసంధానం చేసుకోవాలన్నారు. జిల్లా సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరిచే అంశంపై జిల్లాస్థాయి సిఫార్సులు చేయాలని ఆయన స్పష్టం చేశారు. దానంపై ఫైర్! గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ రంగారెడ్డి జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. రంగారెడ్డి రెవెన్యూ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల అభ్యర్థులను దానం ప్రకటించడంపై కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశా? దానం నాగేందరా? అని ప్రశ్నించారు. గతంలోనూ ఇలా జిల్లా పరిధిలోని అంశాలపై కలగజేసుకున్నారని, ఇది సరికాదని అన్నారు. సర్వే, ఇతర ఎమ్మెల్యేల వాదనతో ఏకీభవించిన పొన్నాల, ఉత్తమ్.. దానం తీరును తప్పుబట్టారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ కార్యక్రమాలను డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. జెడ్పీ అభ్యర్థిగా యాదవరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డిని ప్రకటించేందుకు టీపీసీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. సొంత మండలం నుంచి జెడ్పీటీసీగా బరిలో దిగాలని యోచిస్తున్నానని, జెడ్పీ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని యాదవరెడ్డి కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు, పార్టీ అగ్రనేతలు.. గెలుపే లక్ష్యంగా పనిచేయండని, అందరం సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఇదిలావుండగా, జిల్లా పరిషత్‌పై కన్నేసిన కొంతమంది నేతలు ఇతర మండలాల నుంచి పోటీకి దిగుతున్నారని, దీంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందని, ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, బండారి రాజిరెడ్డి, ఆకుల రాజేందర్, భిక్షపతి యాదవ్, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికలో తలమునకలైనందున ఈ సమావేశానికి మాజీ మంత్రులు సబిత, ప్రసాద్‌కుమార్ హాజరుకాలేదు. -
వేలు పెట్టడానికి దానం ఎవరు?
-
వేలు పెట్టడానికి దానం ఎవరు?
ఈసారి తాను అసెంబ్లీకి పోటీ చేయడంలేదని, మల్కాజిగిరి ఎంపీగానే పోటీ చేస్తానని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తాను రాహుల్ గాంధీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేయాలనుకుంటున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. మాజీ మంత్రి దానం నాగేందర్‌పై సర్వే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో వేలు పెట్టడానికి దానం ఎవరని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్తో పొత్తుకు ఇప్పటికీ అవకాశం ఉందని సర్వే చెప్పారు. టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీలన్నీ ఏకమవుతున్నందున టీఆర్ఎస్ కూడా తమతో కలిసపొచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. -
'తెలంగాణ ఇస్తే సోనియా ఇంట్లో పనిచేస్తానన్నారు'
కరీంనగర్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఎజెండా తెలంగాణ అని, రాష్ట్రం వచ్చాక పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. సోనియాగాంధీ నాయకత్వంలో కేసీఆర్ పనిచేస్తే.. కేసీఆర్ నాయకత్వంలో తామంతా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తే సోనియాగాంధీ ఇంట్లో పనిచేస్తానని, కాళ్లకడిగి నీళ్లు నెత్తిన పోసుకుంటానన్న కేసీఆర్ ఆ మాటలు మర్చిపోవద్దన్నారు. టీఆర్ఎస్తో ఎన్నికల పొత్తు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం చూసుకుంటుందన్నారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితర ఎంపీలు కాంగ్రెస్ దయతోనే ప్రజాప్రతినిధులు అయిన విషయాన్ని మరిచిపోయి సోనియాగాంధీపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఉందని, కిరణ్, పవన్‌కల్యాణ్ పార్టీలు పెట్టుకునే విషయం వారి సొంతమని అన్నారు. ఆయారాం... గయారాంలు వస్తుంటారు.. పోతుంటారని, అలాంటి వారితో కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి రేసులో తాను లేనని, అవకాశం వస్తే వదులుకునేది లేదని స్పష్టం చేశారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అండగా ఉందని, దళిత ముఖ్యమంత్రి విషయం కాంగ్రెస్ ఎజెండాలో లేదని, సోనియా ఆలోచిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని పేర్కొన్నారు. -
ఫిబ్రవరి నెలాఖరుకల్లా విభజన పూర్తి: సర్వే
ఫిబ్రవరి నెలాఖరు కల్లా విభజన ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. విభజన ఆగిపోతుందని కొంతమంది సీమాంధ్ర నేతలు ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేస్తున్నారన్నారు. విభజన బిల్లుపై చర్చించేందుకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు సరిపోతుందని, ఆ గడువును పొడగించాలని కోరడం సరికాదని సర్వే అన్నారు. గడువును పొడగించవద్దని తాను రాష్ట్రపతిని కోరుతున్నట్లు చెప్పారు. విభజన బిల్లుపై ఓటింగ్ ప్రస్తావన లేదని, ఒకవేళ మొత్తం ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా విభజన ఆగదని, అసలు అసెంబ్లీ అభిప్రాయాన్ని ఆమోదించాల్సిన అవసరం పార్లమెంట్‌కు లేదని సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విభజన అధికారం పూర్తిగా పార్లమెంటుదేనన్నారు. తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం ఉందని, తానెక్కడ సీఎం అవుతానో అని తన వ్యతిరేకులు కొందరు ప్రతిష్టను డ్యామేజ్ చేస్తున్నారని వాపోయారు. రాహుల్ ప్రధానమంత్రి కావాలని, ఆయన కేబినెట్లో మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. -
జేపీకి సర్వే బంపర్ ఆఫర్
మూసాపేట: లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కాంగ్రెస్‌లోకి వచ్చి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ అడిగితే.. అమ్మగారికి చెప్పి తాను ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి సర్వే పేర్కొన్నారు. రాజకీయాల్లో, అసెంబ్లీలో ఆయనకు మంచి పేరు ఉందని, జేపీ కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకుంటున్నానన్నారు. సర్వే ఇలా మాట్లాడుతుండగా పక్కనే ఉన్న జేపీ చిరునవ్వు చిందించారు. మూసాపేటలో నూతనంగా నిర్మించిన వాటర్ రిజర్వాయర్‌ను మంగళవారం కేంద్ర మంత్రి సర్వే, కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ పాల్గొని ప్రారంభించారు. అనంతరం సర్వే మాట్లాడుతూ.. వచ్చేసారీ మల్కాజిగిరి నుంచే పోటీ చేస్తానన్నారు. దేశంలో ఇప్పటివరకు మంచి పాలన అందించిన ముఖ్యమంత్రుల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికే ప్రథమ స్థానం దక్కిందన్నారు. ఆయన ప్రజల కోసం 108, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే జేపీ మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం లేని పాలనతో రాష్ట్రం గందరగోళంగా మారిందన్నారు. కొత్తగా నిర్మించిన రిజర్వాయర్‌తో వచ్చే సంవత్సరంలో మంచినీటి సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో ఉపకమిషనర్ గంగాధర్, ఈఈ రమేశ్ గుప్తా, మూసాపేట, కూకట్పల్లి కార్పొరేటర్లు పి.బాబురావు, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సీటుపై శశిధర్‌రెడ్డి కన్ను!
హైదరాబాద్: కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మరోపేరు తెరపైకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి తనయుడు, సనత్‌నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి పేరు సీఎం పదవి రేసులోకి వచ్చింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన సీఎం పోస్టుపై కన్నేసినట్టు సన్నిహితులు చెబుతున్నారు. శశిధర్‌రెడ్డి మాత్రం.. సీఎం పదవి రేసులో లేనని అంటున్నారు. అధికారం కోసం తానెప్పుడూ పనిచేయదని అన్నారు. అధిష్టానం తనను సీఎం సీటులో కూర్చోబెడితే కాదనబోనని ఆయన చెప్పకనే చెప్పారు. శశిధర్‌రెడ్డి సీఎం సీటులో కూర్చునే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేర్కొన్నారు. శశిధర్‌రెడ్డి తండ్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కూడా రేసులో ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సర్వే సత్యనారాయణ పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. అధిష్టానం ముఖ్యమంత్రి పదవి తనకు ఇస్తానంటే వద్దనే ధైర్యం తనకు లేదని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం పదవి దళితులకు ఇవ్వాలనుకుంటే తనకే వస్తుందన్న ఆశాభావంతో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే దామోదర రాజనర్సింహ నుంచి సర్వేకు పోటీ ఎదురుకానుంది. అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న మర్రి శశిధర్‌రెడ్డి పేరు తాజాగా తెరపైకి రావడంతో తెలంగాణ సీఎం పదవిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ ఆసక్తికరంగా మారింది. జనవరి నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దీంతో కొత్త రాష్ట్రానికి సీఎం ఎవరు అవుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ నాయకులు అధిష్టానం అండ కోరుతున్నారు. హైకమాండ్ దృష్టిలో పడేందుకు తమ మనసులోని కోరికను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. కొంతమంది తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సస్పెన్స్ వీడాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు వేచి చూడాల్సిందే. -
సోనియమ్మ సీఎం పదవిస్తే.. కాదంటానా?: సర్వే
సాక్షి, హైదరాబాద్: ‘మాయమ్మ సోనియమ్మ తెలంగాణ ముఖ్యమంత్రి పదవి నాకే ఇస్తానంటే వద్దనే ధైర్యంనాకు లేదు’ అని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. అయితే సీఎం పదవికి జైపాల్‌రెడ్డి, జానారెడ్డి వంటి సమర్ధులు అనేకమంది ఉన్నారని చెప్పారు. సీఎం పదవి కోరుకుంటే వచ్చేది కాదని, పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యేలు అంగీకరిస్తేనే వస్తుందన్నారు. దళితవర్గానికి చెందిన సీమాం ధ్ర వ్యక్తి సంజీవయ్యకు రెండేళ్లు మాత్రమే సీఎం పదవి దక్కిందని, తెలంగాణకు చెందిన దళితులకు అదీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం పదవి దళితులకు ఇవ్వాలన్న అభిప్రాయం రావడం మంచిదేనన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు రూ. లక్షకోట్ల ప్యాకేజీ ఇవ్వాలన్న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలను సర్వే తోసిపుచ్చారు. ఇలాంటి ప్యాకేజీలు, బోర్డులు విఫలమయ్యాకే తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైందన్నారు. -
'అమ్మగారు సీఎం పదవి ఇస్తే కాదనను'
-
సోనియా సీఎం పదవి ఇస్తే కాదనను: సర్వే
రాష్ట్రాలను విభజించవద్దని...తెలంగాణ ఇవ్వవద్దని ఇందిరాగాంధీ ఎప్పుడు చెప్పలేదని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ప్రజలకిచ్చిన మాట కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. జనవరికల్లా రెండు రాష్ట్రాలు, ప్రత్యేక పీసీసీలు ఏర్పడతాయని సర్వే సత్యనారాయణ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుడికే ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సర్వే సత్యనారాయణ అన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనంటూనే.... కావాలంటే సీఎం అవలేరని.... ఒకవేళ సోనియా గాంధీ ముఖ్యమంత్రి పదవి ఇస్తే కాదనే దమ్ము తనకు లేదని చెప్పుకొచ్చారు. ప్యాకేజీల సమయం అయిపోయిందని, ప్యాకేజీలకు ఎవరూ ఒప్పుకోరని సర్వే అన్నారు. తెలంగాణకు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజి ఇస్తే సరిపోతుందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆయనీ కామెంట్ చేశారు. -
2014లోపే తెలంగాణ: తెలంగాణ మంత్రులు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం(జీజోఎం) ఎదుట తెలంగాణ కేంద్ర మంత్రులు తమ వాదనలు వినిపించారు. ఎస్. జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ ఈ ఉదయం జీఓఎంతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ భేటీ జరిగింది. భద్రాచలం, హైదరాబాద్‌తో కూడిన పూర్తి తెలంగాణ కావాలని జీఓఎంను కోరామని భేటీ అనంతరం ఎస్ జైపాల్‌రెడ్డి విలేకరులతో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ కొరత తీవ్ర మయ్యే అవకాశమున్న మాట నిజమేనని, అలాంటి అంశాలను ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశామన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ 371(డీ) అధికరణను కొనసాగించాలని కోరామన్నారు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని సూచించామన్నారు. కృష్ణా జలాలకు ట్రిబ్యునల్ అవసరమే కానీ, గోదావరికి అవసరం లేదన్నారు. 2014లోపే రాష్ట్ర విభజన జరుగుతుందని జైపాల్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రాచలం తెలంగాణలో భాగమని మరో కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. భద్రాచలాన్ని సీమాంద్రలో కలిపేందుకు స్థానికులు ఒప్పుకోరని ఆయన తెలిపారు. భద్రాచలం డివిజన్ మొత్తం తెలంగాణలోనే ఉంచాలని జీవోఎంకు నివేదిక ఇచ్చినట్లు బలరాం నాయక్ వెల్లడించారు. డిసెంబర్ చివరినాటికి విభజన ప్రక్రియ పూర్తి చేయాలని జీఓఎంను కోరినట్లు మరో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. దేశంలో ఎక్కడా ఉమ్మడి రాజధాని లేదని గుర్తు చేశారు. సోనియా మాటను గౌరవించి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఒప్పుకుంటామని సర్వే తెలిపారు. ఉమ్మడి రాజధాని పరిధి కూడా జీహెచ్ఎంసీ వరకే ఉండాలన్నారు. జీఓఎంకు12 పేజీలతో కూడిన నివేదిక సమర్పించామని తెలిపారు. అయితే దీన్ని మీడియాకు విడుదల చేసేందుకు మంత్రులు నిరాకరించారు. -
చెట్టు మీద పిట్ట.. చేతిలో పిట్ట
కాంగ్రెస్ పార్టీ అంటే ఓ మహా సముద్రం లాంటిదని తలపండిన ఆ పార్టీ నేతలు వీలు చిక్కినప్పుడల్లా సెలవిస్తుంటారు. ఎదిగాలనే కాంక్ష ఉన్న నేతలకు శక్తి సామర్ధ్యాలు ఉండాలే కాని కాంగ్రెస్ మహాసముద్రాన్ని అవలీలగా ఈదేయవచ్చు అని ఆపార్టీ సీనియర్ నేతలను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. సముద్రం లాంటి కాంగ్రెస్ ను బాగా అర్ధం చేసుకున్నాడు కాబట్టే సర్వే సత్యనారాయణ ఓ సాధారణ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి పదవి దాకా ఎగబాకాడు. కేంద్రమంత్రి పదవిని సర్వే వరించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం కాకపోయినప్పటికి.. కావూరి లాంటి సీనియర్ నేతలను కాదని సర్వేకు మంత్రి పదవి లభించడం కాంగ్రెస్ సీనియర్ నేతలను నివ్వెర పోయేలా చేసింది. సర్వే లాంటి నేతలకు మంత్రి పదవి దక్కడం వెనుక అతిపెద్ద క్వాలిఫికేషన్ సోనియా గాంధీకి విధేయుడిగా ఉండటం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ వేదికల మీద, మీడియా ముందు, అపర విధేయుడిగా అవతారమెత్తాల్సిన ప్రతిచోట సర్వే తనదైన శైలిలో అమ్మ జపం చేయడంలో మాస్టర్ డిగ్రీ ఉందా అన్నంతగా ఉంటుంది ఆయన ప్రవర్తన. అమ్మ నామస్మరణలో మునిగి తేలిన సర్వేకు మంత్రి పదవి దక్కడం న్యాయమే అనిపిస్తుంది. కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్న సర్వేకు ఇక లక్ష్యం ముఖ్యమంత్రి అన్నట్టు కనిపిస్తోంది. ఏ ఉద్దేశం ఉందో ఏమో కానీ.. ఇటీవల అందరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తన మదిలో మాటను బయటపెట్టారు. ఇటీవల లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఎక్స్పో టెల్ హోటల్లో గురువారం క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ 26వ వార్షికోత్సవ సమావేశంలో మాట్లాడుతూ.. 'నేను ముఖ్యమంత్రిని కావాలని చాలామంది అంటున్నారు. సీఎం పదవి చెట్టుమీదున్న పిట్ట, కేంద్ర మంత్రి పదవి చేతిలోనున్న పిట్ట. చెట్టు మీద ఉన్న పిట్ట కోసం ఆరాటపడితే చేతిలో ఉన్న పిట్ట తుర్రుమనే అవకాశం ఉంది’ అని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే తొలి ముఖ్యమంత్రి పదవిని దళితుడికే ఇవ్వాలని మెజారిటీ పార్టీలు మొగ్గు చూపుతున్న తరుణంలో తనకున్న అర్హతను సర్వే ఉపయోగించుకోవాలని పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. అమ్మ అండదండలున్న సర్వేకు ముఖ్యమంత్రి పదవి లభించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అమ్మ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే కదా! -
బిల్లుల కోసం సోనియాపై ఒత్తిడి తెండి
* సర్వే, గీతారెడ్డిలను కోరిన టీజీవో నేతలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్లో పెట్టేలా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఒత్తిడి తేవాలని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి గీతారెడ్డిలను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) నాయకులు శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కోరింది. ఇందుకోసం ఈనెల 19లోపు ఢిల్లీ వెళ్లిరావాలని విన్నవించింది. సర్వే సత్యనారాయణను మహేంద్రహిల్స్‌లోని ఆయన నివాసంలో, మంత్రి గీతారెడ్డిని మారేడ్‌పల్లిలోని ఆమె నివాసంలో గురువారం కలిసిన టీజీవో బృందం ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర పక్రియ వేగవంతమవుతోందని, పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని గీతారెడ్డి చెప్పారు. తెలంగాణపై ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో సీమాంధ్రుల కుట్రలను తిప్పికొడతామని చెప్పారు. సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. 2013లోనే తెలంగాణ ఏర్పడుతుందని చెప్పారు. బిల్లు ఆమోదానికి తన వంతు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా మావారే.. హైదరాబాద్‌లో ఉన్నవారంతా తమవారేనని, ఎవరూ ఎక్కడికీ పోనక్కర్లేదని, తాము రక్షణగా ఉంటామని టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. సర్వే నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు సీమాంధ్ర రాజకీయ బ్రోకర్లు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా వారిలో భయాందోళనలు కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా తెలంగాణ బిల్లును ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోకానీ లేదా శీతాకాల సమావేశాల్లోకానీ ఆమోదించేలా చర్యలు చేపట్టాలని సర్వేను ఆయన కోరారు.