‘బాహుబలి కాదు.. పెద్ద బఫూన్‌’ | sarve satyanarayana fires on kcr | Sakshi
Sakshi News home page

‘బాహుబలి కాదు.. పెద్ద బఫూన్‌’

Published Fri, Apr 28 2017 6:51 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

‘బాహుబలి కాదు.. పెద్ద బఫూన్‌’ - Sakshi

‘బాహుబలి కాదు.. పెద్ద బఫూన్‌’

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ బాహుబలి కాదు..పెద్ద బఫూన్‌ అని సర్వే ఎద్దేవా చేశారు. కబాలి సినిమా లాగానే.. వరంగల్ సభ కేసీఆర్ ఫ్లాప్ షో అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

కేసీఆర్ చేతకాని దద్దమ్మ అని.. సన్నాసి..కేకే, డీఎస్ లాంటి దద్దమ్మలను పార్టీ చేర్చుకున్న పెద్ద దద్దమ్మవు అంటూ విమర్శించారు. 2014 లో కేసీఆర్ ది యాక్సిడెంటల్ విన్ అని వర్ణించారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కు లు చేసినా 2019 లో కాంగ్రెస్ దే అధికారమని స్పష్టం చేశారు. వరంగల్ నుంచే కేసీఆర్ వినాశం మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ సర్వే ఫలితాలు చూసి కేసీఆర్ వణుకు మొదలైందని చెప్పారు. కేసీఆర్ గద్దె దిగక తప్పదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement