warangal meeting
-
ఇక ప్రతి నెలా తెలంగాణకు అమిత్ షా!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలోనే రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే దాకా ప్రతి నెలా రెండు రోజులు రాష్ట్రానికి కేటాయిస్తూ షెడ్యూల్ వేసుకున్నానని ముఖ్య నేతలకు అమిత్ షా వెల్లడించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా షా మరోసారి తెలంగాణకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో ఏడాదిన్నరలోగా రాష్ట్రంలో ఎన్నికలుంటాయనే అంచనాల నేపథ్యంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలతో కూడిన అగ్రనాయకత్వం పూర్తిగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టిసారించడం తెలిసిందే. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఈ నెల 2, 3 తేదీల్లో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలోనూ ‘మిషన్ తెలంగాణ’ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. అధికార టీఆర్ఎస్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలు, కుటుంబపాలన, పాలనా వైఫల్యాలు, ప్రధాన హామీల అమల్లో వైఫల్యం వంటి అంశాలను ఎండగడుతూ అన్నిస్థాయిల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నిరంతరం ప్రజల్లోనే ఉండాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది. దాన్ని మరింత పటిష్టంగా క్షేత్రస్థాయిలో అమలు చేసే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, వ్యూహాలన్నీ పూర్తిగా జాతీయ నాయకత్వం, అమిత్ షా కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా రాష్ట్ర పర్యటనలకు ప్రాధాన్యత ఏర్పడింది. వరంగల్ సభకు అమిత్ షా! వచ్చే నెల 2 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రను ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని 13–14 నియోజకవర్గాల్లో 20–25 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్ పాదయాత్రతోపాటు రాష్ట్రం మొత్తం చుట్టివచ్చేలా బైక్ ర్యాలీలు చేపట్టాలంటూ గతంలోనే షా రాష్ట్ర పార్టీని ఆదేశించారు. అందుకు అనుగుణంగానే గురువారం నుంచి 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యనేతల బైక్ ర్యాలీలను రాష్ట్ర పార్టీ ప్రారంభించింది. త్వరలోనే మరో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలు మొదలుపెట్టనుంది. ఈ ఏడాది చివర్లోగా ఐదారు విడతల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా బైక్ ర్యాలీలను చేపట్టనున్నారు. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు నెలలో 20 రోజులు బండి సంజయ్ పాదయాత్ర, 10 రోజులు బైక్ ర్యాలీలు నిరంతరం నిర్వహిస్తూ గ్రామస్థాయి వరకు టీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం, మోదీ సర్కార్ విజయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లాలని నిర్ణయించారు. -
రాహుల్ సభ సక్సెస్.. కాంగ్రెస్‌లో సమరోత్సాహం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముందస్తు ఎన్నిక లు వస్తాయా అనే వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్య క్షుడు అయ్యాక జిల్లా నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తొమ్మి ది నెలలుగా వరుసగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రె స్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ భారీ విజయంతో జి ల్లా పార్టీ నాయకులతో పాటు, కార్యకర్తల్లో ఉత్సా హం రెట్టింపైంది. నిజామాబాద్ జిల్లా వ్యవసా య పరంగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో రైతు సంఘర్షణ సభ ఇంత స్థాయిలో విజయవంతం కావడంపై మరింతగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను రూపొందించుకునేందుకు జిల్లా నాయకులు ప్రణాళికలు సిద్ధం చే సుకుంటున్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ లో పార్టీ ప్రకటించిన డిక్లరేషన్ జిల్లా రైతాంగానికి తిరుగులేని మేలు చేస్తుందని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 1.50 లక్షల సభ్యత్వాలు.. ఇప్పటికే జిల్లాలో డిజిటల్ విధానంలో పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు 1.50 లక్షల సభ్యత్వాలు చేశారు. ఇక క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సి ద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా రాహుల్ సభ మరింత జోష్ తెచ్చిందని జిల్లా కాంగ్రెస్ నాయ కులు చెబుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహే ష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటికే జాతీయ నాయకురాలు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సక్సెస్ చేశారు. తాజాగా వరంగల్ డిక్లరేషన్ అంశాలను జిల్లాలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేందుకు జిల్లా నేతలు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. రెండుమూడు రోజుల్లో షెడ్యూల్ నిర్ణయించుకుని నెలరోజుల పాటు ఇంటింటికీ తిరిగి రైతుల డిక్లరేషన్‌ను వివరించనున్నారు. దీ నికి సంబంధించి హైదరాబాద్‌లో శనివారం రా హుల్ ఆధ్వర్యంలో ఎక్స్టెండెట్ ఎగ్జిక్యూటివ్ స మావేశం జరిగింది. ఇక పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇకపై మ రిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. డిక్లరేషన్ కాదు.. గ్యారంటీ ఇందులో ముఖ్యంగా జిల్లాలో అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన 1937లో నిర్మించిన బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని పేర్కొన్నారు. ఇక జిల్లాలో పసుపు పంట రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా రైతులు పండిస్తున్నారు. దీంతో జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, పసుపునకు మద్దతు ధర రూ.12 వేలు ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో ఎక్కువగా పండించే ఎర్రజొన్నలకు మద్దతు ధర ఇస్తామని, ఇతర అన్ని పంటలకు మద్దతు ధరలు ఇస్తామని ప్రకటించారు. ఇక రుణమాఫీని ఏకమొత్తంలో రూ.2లక్షల మాఫీ చేస్తామని డిక్లరేషన్‌లో పేర్కొనడంతో పాటు ధరణి రద్దు చేసి మెరుగైన విధానం తెస్తామన్నారు. ఇవి కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో పాటు ఇంకా అనేక అంశాలు పొందుపర్చారు. ఇది డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీ అని రాహుల్ చెప్పడంతో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. -
వరంగల్ నుంచే కేసీఆర్ చీడ వదిలిద్దాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు అనేక పోరాటాలకు పురుటిగడ్డ వరంగల్ నుంచే సీఎం కేసీఆర్ చీడ వదిలించాలని, ఇందుకు మే 6న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొనే ‘రైతు సంఘర్షణ సభ’ నాంది కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో రాహుల్ రెండ్రోజుల పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని స్థాయిల్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులు, డీసీసీ అధ్య క్షులు, అనుబంధ సంఘాల నేతలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు సమావేశానికి హాజర య్యారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో రాహుల్ పాల్గొనే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయడంపై చర్చించారు. 20 ఏళ్లకు సభ గుర్తుండిపోవాలి 40 లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్పించి దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, సభ్యత్వ నమోదు ప్రక్రియ తర్వాత రాహుల్ పాల్గొనబోయే దేశంలోని తొలి సభ ఇదేనని రేవంత్ అన్నారు. ఇప్పుడు దేశమంతా తెలంగాణవైపు చూస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ కష్టకాలం లో ఉన్నప్పుడల్లా వరంగల్‌లో సభ పెట్టి బలంగా ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం చేసిందని, 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఇక్కడ సభ నిర్వహిస్తోందని అన్నారు. 2002లో సీనియర్ నేత వీహెచ్ ఆధ్వర్యంలో వరంగల్‌లో బీసీ గర్జన సభ జరిగిందని, మళ్లీ ఇప్పుడు సభ పెడుతున్నామని, ఇది రాబోయే 20 ఏళ్లకు గుర్తుండిపో వాలని అన్నారు. ఈ సభతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు పునాదులు పడాలని చెప్పారు. రైతుల కోసం ఏం చేస్తామో కూడా చెప్పాలి: ఉత్తమ్ సభకు రైతు గర్జన సభ అని నామకరణం చేయాలని, రైతుల సమస్యలు లేవనెత్తుతూనే అధికారంలోకి వచ్చాక రైతులకు ఏం చేస్తామో చెప్పాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచిం చారు. సభలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని, 200 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల నుంచి జనసమీకరణ ఎక్కువగా చేయాలని చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున మంచి నీరు, ఇతర ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. -
‘బాహుబలి కాదు.. పెద్ద బఫూన్’
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ విరుచుకుపడ్డారు. కేసీఆర్ బాహుబలి కాదు..పెద్ద బఫూన్ అని సర్వే ఎద్దేవా చేశారు. కబాలి సినిమా లాగానే.. వరంగల్ సభ కేసీఆర్ ఫ్లాప్ షో అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ చేతకాని దద్దమ్మ అని.. సన్నాసి..కేకే, డీఎస్ లాంటి దద్దమ్మలను పార్టీ చేర్చుకున్న పెద్ద దద్దమ్మవు అంటూ విమర్శించారు. 2014 లో కేసీఆర్ ది యాక్సిడెంటల్ విన్ అని వర్ణించారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కు లు చేసినా 2019 లో కాంగ్రెస్ దే అధికారమని స్పష్టం చేశారు. వరంగల్ నుంచే కేసీఆర్ వినాశం మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ సర్వే ఫలితాలు చూసి కేసీఆర్ వణుకు మొదలైందని చెప్పారు. కేసీఆర్ గద్దె దిగక తప్పదని అన్నారు. -
వరంగల్ సభకు వెయ్యి కోట్లు వసూలు
టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ కోసం ఆ పార్టీ నేతలు రూ.1,000 కోట్లు వసూలు చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌కు ఉస్మానియా విద్యార్థులు గుడి కడతారని భావించారని, ఇప్పుడు ఆ విద్యార్థులే గోరీ కట్టడానికి సిద్ధమయ్యారని హెచ్చరించారు. మూడేళ్ళుగా సీఎం కేసీఆర్ చెబుతున్న అబద్ధాలకు ఓయూ విద్యార్థులు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఓయూ విద్యార్థుల ముందు కనీసం తలెత్తుకుని నిలబడే ధైర్యం కూడా కేసీఆర్ చేయలేకపోయారని.. ఇది సీఎం ఆయన పాలన, పరిస్థితిని తెలియజేస్తోందని రేవంత్ చెప్పారు. వరంగల్ టీఆర్ఎస్ సభ.. ప్రగతి నివేదన సభ కాదని, దోపిడీ దొంగల సభ అని విమర్శించారు. -
వరంగల్ సభ తర్వాత అసెంబ్లీ: కేసీఆర్
– నకిలీ విత్తన వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి ‘‘ఈ ప్లీనరీ సందేశం రైతే రాజు. ఆ రైతును ఆదుకునేందుకు ఎంతదాకా అయినా వెళ్తాం..’’అని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులను దగా చేస్తున్న కల్తీ విత్తనాల వ్యవహారాన్ని ఇక ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. ‘‘కల్తీ విత్తనాలు సరఫరా చేసి రైతుల గోస పోసుకునే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఉక్కుపాదం మోపుతం. ఇందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తం. అసెంబ్లీ ఇంకా ప్రోరోగ్ కాలేదు కాబట్టి వరంగల్ బహిరంగ సభ తర్వాత ఒక రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం. కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేసి కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు బిల్లును పెడతాం’’అని ప్లీనరీ ముగింపు సందర్భంగా ప్రసంగిస్తూ వెల్లడించారు. కల్తీ విత్తనాలతో రైతులు ఎంత నష్టపోతే అంత నష్ట పరిహారాన్ని సంబంధిత విత్తన కంపెనీల నుంచి ఇప్పిస్తామని స్పష్టంచేశారు. ‘‘సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ పూర్తిగా అవినీతమయమైనవి. వారి హయాంలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. వారి నాయకత్వమే దోపిడీలో వాటా కలిగి ఉండేది. దీనికి ఒక్క ఉదాహరణ చెబుతా.. ఇసుక వ్యాపారంలో కాంగ్రెస్ దోపిడీ మామూలుగా జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయం రూ.22 కోట్లు. ఆ తర్వాత ఏడాది అది రూ.10 కోట్లకు చేరింది. తెలంగాణ ఏర్పాటు నాటికి ఇసుక ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం రూ.5 లక్షలు. మేం ఇసుక పాలసీ తెచ్చాక గత ఏడాది రాష్ట్రానికి రూ.370 కోట్ల ఆదాయం వచ్చింది. అది ఈ ఏడాది రూ.460 కోట్లకు చేరింది. రూ.5 లక్షల ఆదాయం ఎక్కడ? రూ.460 కోట్లు ఎక్కడ?’’అని అన్నారు. తాము కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని పనిచేస్తున్నామని, అవినీతి రహితంగా ఉన్నామని తెఉలిపారు. ‘‘అనవసరమైన ఆరోపణలు చేస్తే ఉపేక్షించొద్దు. ఏ శాఖపై ఆరోపణలు చేస్తారో.. సంబంధిత మంత్రులు ఆలోచించాలి. కేసులు పెట్టాలి..’’అని సూచించారు. అవినీతికి దూరంగా ఉంటున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. సంక్షేమ పథకాల కోసం 130 జీవోలు జారీ చేశామని, ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ బాలికలకు 20 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని, విడతల వారీగా రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున వీటిని నెలకొల్పుతామని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీ, ఆసుపత్రుల్లో అనవసర ఆపరేషన్లను నియంత్రించే అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. -
రేపు రాష్ట్రానికి అమిత్ షా
వరంగల్ సభకు హాజరుకానున్న బీజేపీ అధ్యక్షుడు సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒకరోజు పర్యటన కోసం శనివారం రాష్ట్రానికి రానున్నారు. ప్రత్యేక తిరంగా యాత్రలో భాగంగా సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన ఉత్సవాలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 70 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9 నుంచి 22 వరకు తిరంగా యాత్రను నిర్వహించింది. అయితే రాష్ట్రంతోపాటు నిజాం స్టేట్‌లో భాగంగా ఉన్న మహా రాష్ట్రలోని 5, కర్ణాటకలోని మూడు జిల్లాల్లో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు యాత్రను జరుపుతోంది. రాష్ట్రంలో యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్‌లో జరగ నున్న బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హజరవుతారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి 2 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుం టారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్‌కు వెళ్లి, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చి రాత్రి ఓ ప్రైవేట్ హోటల్లో బస చేస్తారు. పర్యటన సందర్భంగా పార్టీ నాయకులతో ఎలాంటి సమావేశాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆదివారం ఉదయమే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లాలో తెలంగాణ పోరాటానికి ప్రాధాన్యమున్న ఒకటి, రెండు ప్రాంతాల్లో అమిత్ షా పర్యటించి నిజాం వ్యతిరేక పోరాట అమరులకు నివాళి అర్పించేలా కార్యక్రమాలను రూపొందించాలని రాష్ట్ర నేతలు తొలుత భావించారు. అయితే సమయం సరిపోకపోవడంతో బహిరంగ సభకే పరిమితం చేశారు. -
సమస్యలుంటే.. కూర్చుని మాట్లాడుకుందాం
వరంగల్ సభలోఏపీ సీఎం చంద్రబాబు విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం నిధుల విషయంలో ఏపీకి ఇబ్బంది అవకాశాలిస్తే పైకొచ్చినవాళ్లు ఇప్పుడు నన్నే విమర్శిస్తున్నారు టీఆర్ఎస్, కేసీఆర్ ప్రస్తావన లేకుండా బాబు ప్రసంగం బాబు పర్యటనలో అడుగడుగునా నిరసనలు.. వరంగల్‌లో సభా వేదిక, టీడీపీ ఆఫీస్‌కు నిప్పు సాక్షి ప్రతినిధి, వరంగల్: విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని.. సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాటి తెలుగువారిగా తెలంగాణకు సహకరిస్తామని, భౌతికంగా విడిపోయినా మానసికంగా కలసి ఉండాలనేదే తన అభిప్రాయమని ఆయన చెప్పా రు. సమస్యల పరిష్కారం కోసం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామంటే ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తెలంగాణకు వాటాపై విద్యుత్ నియంత్రణ సంస్థ (ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ) ఆమోదం లేదని బాబు వ్యాఖ్యానించారు. టీడీపీ వరంగల్ జిల్లా ప్రతినిధుల సమావేశం గురువారం హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో జరి గింది. ఈ సందర్భంగా చంద్రబాబు దాదాపు 55 నిమిషాల పాటు ప్రసంగించారు. అయితే ఎక్కడా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పస్తావన లేకుండా మాట్లాడడం గమనార్హం. కొట్టుకుంటే కోర్టులకు పోవాలి ‘‘సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. లేకుంటే పెద్ద మనుషుల వద్దకు వెళ్లి.. వారు చెప్పినట్లుగా చేద్దాం. రెండు రాష్ట్రాలు కల వవు. ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. సున్నితమైన తెలంగాణ అంశంలో కొందరు ఇబ్బంది పెట్టాలని చూశారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని అప్పుడు చెప్పా. నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు, కరెంటు విషయంలో తెలంగాణకు ఇబ్బందులు ఉన్నాయి..’’ అని ఏపీ సీఎం పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మళ్లీ కలిసే అవకాశాలు లేవని, అందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. నా వల్లే మిగులు బడ్జెట్.. తెలంగాణలో మిగులు బడ్జెట్‌కు తన దూరదృష్టే కారణమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘‘హైదరాబాద్‌తోనే తెలంగాణకు ఎక్కువ ఆదాయం వస్తోం ది. రెండు రాష్ట్రాలకు మేలు జరగాలని అప్పుడు నేను అంటే కొందరు రకరకాలుగా మాట్లాడారు. కేంద్రం విభజన అంశాలను పూర్తిగా అమలు చేయడంలేదు. ఏపీకి న్యాయం జరిగేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాను. కొత్త రాజధాని నిర్మించుకోవాలి. హైదరాబాద్ నుంచి అధికారులు వెళ్లాలంటే కష్టంగా ఉంది. బాబు భద్రతకు పోర్టబుల్ ఆర్ఎఫ్ జామర్ చంద్రబాబు భద్రత కోసం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అత్యాధునిక పోర్టబుల్ రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) జామర్‌ను సమీకరించుకుంది. ఇజ్రాయెల్ సంస్థ తయారు చేసిన ఈ వాహనాన్ని తొలిసారిగా సీఎం వరంగల్ పర్యటనలో వినియోగించారు. కేవలం రాష్ట్రపతి, ప్రధాని వంటి వారి భద్రతలో మాత్రమే ఈ జామర్స్ వినియోగం ఉండేది. చంద్రబాబు భద్రత కోసం ఆర్మీ దళాలు కూంబింగ్ సమయంలో వాడే ఈ తరహా జామర్‌ను కొనుగోలు చేశారు. ఇది ఉన్న ప్రాంతానికి 300 అడుగుల దూరం వరకు పవర్ రేడియో మ్యాగ్నటిక్ ఫీల్డ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాంతం మీదుగా జీఎస్ఎం, సీడీఎంఏ, వీహెచ్ఎఫ్ (వెరీ హైఫ్రీక్వెన్సీ), యూహెచ్ఎఫ్ (అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ) తరంగాలు ప్రయాణించవు. ఫలితంగా ఆ ప్రాంతంలో సెల్‌ఫోన్, శాటిలైట్ ఫోన్, రేడియో తదితరాలను వినియోగించి ముష్కరులు ఎలాంటి ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ పరిజ్ఞానంతో కూడిన బాంబుల్ని పేల్చలేరు. అడుగడుగునా నిరసనలే.. హన్మకొండ: చంద్రబాబు వరంగల్ పర్యటనలో అడుగడుగునా నిరసనలు వెల్లువెత్తాయి. అండగా నిలిచిన తమను మోసం చేశారంటూ ఎమ్మార్పీఎస్ నేతలు.. హన్మకొండలోని కుడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికకు గురువారం వేకువజామున నిప్పంటించారు. ఇక చంద్రబాబు హన్మకొండలోని అదాలత్ వద్దకు రాగానే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకుని, రోడ్డుపై పడుకున్నారు. మహిళా కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. వరంగల్‌లోని భవానినగర్‌లో ఉన్న టీడీపీ కార్యాలయూనికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. అంబేద్కర్ విగ్రహం కూడలిలో ఏర్పాటు చేసిన టీడీపీ తోరణాలను దహనం చేశారు. కాజీపేటలో చంద్రబాబు ఫ్లెక్లీని తగులబెట్టారు. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు ఏపీ నుంచి, చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి కూడా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మరోవైపు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. -
'రాజయ్యను అవమానకరంగా తొలగించారు'
మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను మంత్రివర్గం నుంచి అవమానకర రీతిలో తొలగించారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... మాదిగలకు అన్యాయం చేసేలా టీఆర్ఎస్ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజయ్యకు జరిగిన అవమానంపై శుక్రవారం వరంగల్‌లో నిర్వహించే సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వంపై దండయాత్ర ప్రకటిస్తామన్నారు. కనీసం రాజయ్య వివరణ తీసుకోకుండా ఆయనపై చర్యలు తీసుకోవటం సరికాదని మందకృష్ణ అన్నారు.