
'రాజయ్యను అవమానకరంగా తొలగించారు'
మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను మంత్రివర్గం నుంచి అవమానకర రీతిలో తొలగించారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... మాదిగలకు అన్యాయం చేసేలా టీఆర్ఎస్ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజయ్యకు జరిగిన అవమానంపై శుక్రవారం వరంగల్లో నిర్వహించే సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వంపై దండయాత్ర ప్రకటిస్తామన్నారు. కనీసం రాజయ్య వివరణ తీసుకోకుండా ఆయనపై చర్యలు తీసుకోవటం సరికాదని మందకృష్ణ అన్నారు.