రాహుల్‌ సభ సక్సెస్‌.. కాంగ్రెస్‌లో సమరోత్సాహం | Rahul Gandhi Warangal Meeting Boost Up For Nizamabad Congress Cadre | Sakshi
Sakshi News home page

రాహుల్‌ సభ సక్సెస్‌.. కాంగ్రెస్‌లో సమరోత్సాహం

May 8 2022 3:58 PM | Updated on May 8 2022 4:41 PM

Rahul Gandhi Warangal Meeting Boost Up For Nizamabad Congress Cadre - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ముందస్తు ఎన్నిక లు వస్తాయా అనే వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్య క్షుడు అయ్యాక జిల్లా నుంచి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో తొమ్మి ది నెలలుగా వరుసగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు.

ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రె స్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ భారీ విజయంతో జి ల్లా పార్టీ నాయకులతో పాటు, కార్యకర్తల్లో ఉత్సా హం రెట్టింపైంది. నిజామాబాద్‌ జిల్లా వ్యవసా య పరంగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో రైతు సంఘర్షణ సభ ఇంత స్థాయిలో విజయవంతం కావడంపై మరింతగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను రూపొందించుకునేందుకు జిల్లా నాయకులు ప్రణాళికలు సిద్ధం చే సుకుంటున్నారు. వరంగల్‌ రైతు సంఘర్షణ సభ లో పార్టీ ప్రకటించిన డిక్లరేషన్‌ జిల్లా రైతాంగానికి తిరుగులేని మేలు చేస్తుందని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.  

ఇప్పటికే 1.50 లక్షల సభ్యత్వాలు.. 
ఇప్పటికే జిల్లాలో డిజిటల్‌ విధానంలో పకడ్బందీగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు 1.50 లక్షల సభ్యత్వాలు చేశారు. ఇక క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సి ద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా రాహుల్‌ సభ మరింత జోష్‌ తెచ్చిందని జిల్లా కాంగ్రెస్‌ నాయ కులు చెబుతున్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహే
ష్‌కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటికే జాతీయ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌ పాదయాత్ర సక్సెస్‌ చేశారు. తాజాగా వరంగల్‌ డిక్లరేషన్‌ అంశాలను జిల్లాలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేందుకు జిల్లా నేతలు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. 

రెండుమూడు రోజుల్లో షెడ్యూల్‌ నిర్ణయించుకుని నెలరోజుల పాటు ఇంటింటికీ తిరిగి రైతుల డిక్లరేషన్‌ను వివరించనున్నారు. దీ నికి సంబంధించి హైదరాబాద్‌లో శనివారం రా హుల్‌ ఆధ్వర్యంలో ఎక్స్‌టెండెట్‌ ఎగ్జిక్యూటివ్‌ స మావేశం జరిగింది. ఇక పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇకపై మ రిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

డిక్లరేషన్‌ కాదు.. గ్యారంటీ
ఇందులో ముఖ్యంగా జిల్లాలో అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన 1937లో నిర్మించిన బోధన్‌లోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని పేర్కొన్నారు. ఇక జిల్లాలో పసుపు పంట రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా రైతులు పండిస్తున్నారు. దీంతో జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, పసుపునకు మద్దతు ధర రూ.12 వేలు ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో ఎక్కువగా పండించే ఎర్రజొన్నలకు మద్దతు ధర ఇస్తామని, ఇతర అన్ని పంటలకు మద్దతు ధరలు ఇస్తామని ప్రకటించారు.

ఇక రుణమాఫీని ఏకమొత్తంలో రూ.2లక్షల మాఫీ చేస్తామని డిక్లరేషన్‌లో పేర్కొనడంతో పాటు ధరణి రద్దు చేసి మెరుగైన విధానం తెస్తామన్నారు. ఇవి కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో పాటు ఇంకా అనేక అంశాలు పొందుపర్చారు. ఇది డిక్లరేషన్‌ కాదు కాంగ్రెస్‌ ఇచ్చే గ్యారంటీ అని రాహుల్‌ చెప్పడంతో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement