వేలు పెట్టడానికి దానం ఎవరు?
ఈసారి తాను అసెంబ్లీకి పోటీ చేయడంలేదని, మల్కాజిగిరి ఎంపీగానే పోటీ చేస్తానని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తాను రాహుల్ గాంధీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేయాలనుకుంటున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో.. మాజీ మంత్రి దానం నాగేందర్పై సర్వే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు మల్కాజిగిరి లోక్సభ పరిధిలో వేలు పెట్టడానికి దానం ఎవరని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్‌తో పొత్తుకు ఇప్పటికీ అవకాశం ఉందని సర్వే చెప్పారు. టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీలన్నీ ఏకమవుతున్నందున టీఆర్ఎస్ కూడా తమతో కలిసపొచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.