హైదరాబాద్: ఇటు తెలంగాణలో, అటు ఆంధ్ర ప్రదేశ్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మాజీ మంత్రులు ఎక్కువమంది ఓట్ల లెక్కింపులో వెనుకబడిపోయారు. తెలంగాణలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య,శ్రీధర్ బాబు, డి.శ్రీనివాస్, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు బట్టి విక్రమార్క్, ఏపిలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, పల్లం రాజు, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ,కొండ్రు మురళి, ఆనం రామనారాయణ రెడ్డి, టిజి వెంకటేష్, మోపిదేవి వెంకటరమణ వెనుకబడిపోయారు.
తెలంగాణలో మాజీ మంత్రులు డికె. అరుణ, గీతారెడ్డి, ఉత్త్మకుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ ముందంజలో ఉన్నారు. ఏపిలో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, శత్రుచర్ల విజయరామరాజు, గంటా శ్రీనివాసరావు ఆధిక్యతలో ఉన్నారు.
వెనుకంజలో మాజీ మంత్రులు
Published Fri, May 16 2014 10:53 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
Advertisement