Former Minister
-
సైలెంట్‌గా మాజీ మంత్రి కొడుకు బ్యాంకాక్ ట్రిప్.. విమానం గాల్లో ఉండగా ట్విస్టులు
ఆయనో మాజీ మంత్రి తనయుడు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఓ ఆగంతకుడు పోలీసులకు సమాచారం అందించాడు. అతని తండ్రి అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులే స్వయంగా కిడ్నాప్ చేసి నమోదు చేసి రంగంలోకి దిగారు. ఆపై ఆ మాజీ మంత్రి సీన్లోకి రావడంతో అధికార యంత్రాగమే దిగి వచ్చింది. పాపం.. ఆ బాబుగారి సీక్రెట్ బ్యాంకాక్ ప్లాన్ ‘గాల్లో ఉండగానే’ బెడిసి కొట్టింది. ముంబై: శివసేన(షిండే వర్గం) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్ సావంత్ కిడ్నాప్‌నకు గురయ్యారనే వ్యవహారం సోమవారం రాత్రి మహారాష్ట్రలో కలం రేపింది. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న తానాజీ.. హుటాహుటిన కమిషనర్ ఆఫీస్‌కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఎంక్వైరీ చేసిన పోలీసులు అతనొక ప్రైవేట్ ఛార్ట్‌లో అండమాన్ వైపు వెళ్తున్నాడనే సమాచారం తెలుసుకున్నారు. ఎవరో ఇద్దరు బలవంతంగా తన కొడుకును ఎత్తుకెళ్తున్నారని ఆయన మీడియా ముందు వాపోయారు. ఆ వెంటనే డీజీసీఏకు ఈ కేసు గురించి సమాచారం అందించారు. బ్యాంకాక్ వైపు వెళ్తున్న ఆ ప్రైవేటు విమానం.. పుణెకు తీసుకురావాలని పైలట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత పైలట్లు అదొక తప్పుడు సమాచారం అనుకున్నారట. సాధారణంగా మెడికల్ ఎమర్జెన్సీ లేదంటే సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే అలా వెనక్కి రావడానికి పైలట్లకు అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఎందుకైనా మంచిదని ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి ధృవీకరణ చేసుకుని వెనక్కి తిప్పారు. అలా.. అండమాన్ దాకా వెళ్లిన విమానం అలాగే వెనక్కి వచ్చేసింది.పుణే ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కాగానే విమానంలో ఉన్న ముగ్గురు షాక్ తిన్నారు. తమకు తెలియకుండానే తిరిగి రావడంతో రిషిరాజ్, అతడి స్నేహితులు.. పైలట్లపై మండిపడ్డారు. అయితే తాము కేవలం ఆదేశాలు మాత్రమే పాటిస్తామని పైలట్లు చెప్పడంతో ఏం చేయలేకపోయారు. ఆ వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది విమానంలోకి వెళ్లి వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తన కుటుంబానికి తెలియకుండా రిషిరాజ్ ఇద్దరు స్నేహితులతో ‘బిజినెస్ ట్రిప్’ ప్లాన్ చేశాడట. విషయం తెలిసి పోలీసులు, ఆ మాజీ మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకోకుండా తన కొడుకును బలవంతంగా వెనక్కి రప్పించారంటూ అధికారులపై ఆ మాజీ మంత్రి అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. మరోవైపు మరోవైపు పోలీసుల అత్యుత్సాహం, తానాజీ అధికార దుర్వినియోగంపై ఉద్దవ్ శివసేన మండిపడింది. ఎక్కడైతే రిషిరాజ్ కిడ్నాప్‌నకు గురయ్యారని హడావిడి జరిగిందో.. అదే సింగాద్ రోడ్ పీఎస్‌లో ఈ వ్యవహారంపై యూబీటీ శివసేన ఫిర్యాదు చేసింది. -
Akshainie Reddy: నానమ్మ గురించి రాస్తా...
పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల్ల అమ్మాయి గురించి కథ రాస్తే ఎలా ఉంటుంది?! ఏడవతరగతి చదువుతున్న పన్నెండేళ్ల పట్లోళ్ల అక్షయినీ రెడ్డి రాసిన ‘ట్రైల్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్’ పుస్తకం ద్వారా మనకు ఈ విషయాలు తెలుస్తాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలు అక్షయినీ రెడ్డి.‘‘మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో రోజూ చూస్తుంటాను. నానమ్మ, అమ్మ, నాన్న.. మా ఇంట్లోని వ్యక్తులే నాకు స్ఫూర్తి. నానమ్మ లైఫ్ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను...’ అంటూ ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.‘‘నాకు కథలపైన ఆసక్తి మొదలైందంటే అమ్మ చెప్పిన స్టోరీస్ వల్లే. రోజూ రాత్రి పడుకునే ముందు అమ్మ రకరకాల కథలు చెబుతుంటుంది. తముణ్ణి, నన్ను బయటకు తీసుకెళ్లినప్పుడైనా, కాస్త టైమ్ దొరికినా ఏదో చిట్టి కథ ఉంటుంది. సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు కథలు చెప్పి, వాటిని షార్ట్ ఫార్మ్‌లో రాసి చూపించమనేది. తర్వాత్తర్వాత పుస్తకాల్లోని కథలు చదివినా, వాటిని ఒక చిన్న పేరాలో రాసి చూపించేదాన్ని. ఈ అలవాటు నాకు పుస్తకాలంటే ఇష్టం పెరిగేలా చేసింది. ఇప్పుడు నా కోసం ఇంట్లో ఓ లైబ్రరీయే ఏర్పాటు చేశారు. ఎక్కువ భాగం ఇంగ్లిష్వే ఉంటాయి. ఫారినర్స్ రాసినవి, సుధామూర్తి రచనలు బాగా చదువుతాను. ఒక బుక్ చదివాక బాగా నచ్చితే ఆ బుక్ నుంచి మరొక స్టోరీ రాస్తాను. ‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ పుస్తకం అలా రాసిందే. నానమ్మ, నాన్న, అమ్మ, స్కూల్లో టీచర్స్, ఫ్రెండ్స్.. చాలా మెచ్చుకున్నారు.బలమైన వ్యక్తిత్వం‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ బుక్ లో పదహారేళ్ల అమ్మాయి పేరు ఆటమ్. ఆమె భావోద్వేగాలు ఈ పుస్తకం నిండా ఉంటాయి. ఒక చిన్న వెకేషన్ కోసం తల్లిదండ్రులను ఒప్పించి మెక్సికోకు బయల్దేరుతుంది. అనుకోని సంఘటనలో తల్లి మరణిస్తుంది. తమ కుటుంబం నుంచి దూరమైన ఆంటోనియోను కలుసుకుంటుంది. క్షేమకరం కాని ఆ ్రపాంతంలో ఉండలేక మెక్సికో నుంచి వాళ్లు లండన్‌కు చేరుకుంటారు. అక్కడ జేమ్సన్ అనే వ్యక్తిని కలుస్తారు. జేమ్సన్ కుటుంబంతో ఉండటమూ క్షేమకరం కాదని అర్థమై తండ్రి, ఆంటోనియోలతో కలిసి జర్మనీకి వెళ్లిపోతుంది. జీవితమెప్పుడూ సంతోషంగా ఉండాలనుకునే ఆటమ్ ప్రతినిత్యం సమస్యలతో చేసే ప్రయాణం గురించి ఈ కథ వివరిస్తుంది. ఆ అమ్మాయి స్నేహాలను ఎలా డెవలప్ చేసుకుంటుంది, ఫ్యామిలీని ఎలా చూసుకుంటుంది, ఒకమ్మాయి ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అనే విషయాలు నేర్పిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే హ్యాపీ ఎండింగ్ తప్పక దొరుకుతుంది అనే హోప్‌ని ఇస్తుంది. నా ఫ్రెండ్స్ టైటిల్ విషయంలో, కవర్ పేజీ విషయంలో సాయం చేశారు. ఈ బుక్ కోసం ఏడాది పాటు వర్క్ చేశాను. నిజానికి 16 ఏళ్ల అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది అనే విషయాలను గురించి అంతగా మ్యాచ్ చేయలేకపోవచ్చు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ బుక్స్ బాగా చదువుతారు. వారికి ఈ పుస్తకంలో స్నేహపూర్వక స్వభావం, స్ట్రాంగ్ విల్‌పవర్, వ్యక్తిత్వం బాగా నచ్చాయి. నా ఫ్రెండ్స్‌కు నేను రాసిన స్టోరీ నచ్చింది. నా ఫ్రెండ్స్ ఈ బుక్ కొని చాలా సపోర్ట్ చేశారు. స్కూల్లో అందరూ నన్ను అభినందించారు. కొందరు మంచి విమర్శలు కూడా చేశారు.ఎంతో నేర్చుకోవాలి...రచనలు చేయడంలో చాలా నేర్చుకోవాల్సి ఉందని నాకు ఈ పుస్తకం ద్వారా తెలిసి వచ్చింది. వచ్చిన విమర్శల నుంచి కూడా నేర్చుకుంటున్నాను. స్టోరీలో ఒక పాత్రను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఆ క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేయాలి, స్టోరీ ΄్లాట్ ఎలా రాయాలి.. వంటివి నేర్చుకోవాలి. ఇదంతా తెలుసుకుంటూనే నా రచనల్లో వాటిని ఇంక్లూడ్ చేస్తూ వెళ్లాలని ఉంది. ముఖ్యంగా మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో చూస్తుంటాను. నానమ్మ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను. అందుకు, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. మంచి రైటర్‌గా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పేరుతెచ్చుకుంటూనే లాయర్ని అవ్వాలనే లక్ష్యంతో చదువుకుంటున్నాను. లాయర్‌గా న్యాయం కోసం పోరాటం చేస్తూనే, నా రచనల ద్వారా కొంతమందినైనా ప్రభావితం చేయాలనేది నా ముందున్న లక్ష్యం’’ అంటూ తెలిపింది ఈ బాల రచయిత్రి. టైమ్ క్రియేషన్ఈ బుక్ రిలీజ్ అయ్యాక మా ఫ్రెండ్స్‌తో సహా కొంతమంది నీకు టైమ్ ఎలా సరిపోతుంది అని అడిగారు. నేను టైమ్‌ను క్రియేట్ చేసుకున్నాను. రోజులో ఒక గంటసేపు ఈ బుక్ కోసం కేటాయించుకున్నాను. మొత్తం ఇరవై ఐదు వేల పదాలు. నేనే స్వయంగా టైప్ చేసి, ఎడిటింగ్ చేసుకుంటూ, తిరిగి మార్పులు చేసుకుంటూ రాశాను. దీనిని బుక్‌గా తీసుకురావడానికి అమ్మవాళ్లకు చెప్పకుండానే నలుగురు పబ్లిషర్స్‌తో మాట్లాడాను. వాళ్లు ఆశ్చర్యపోయారు. పబ్లిషర్స్ అమ్మ వాళ్లను అ్రపోచ్ అవడంతో... ఈ పని ఈజీ అయ్యింది. – నిర్మలారెడ్డిఫొటోలు: గడిగె బాలస్వామి -
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు
గాందీనగర్: గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శనివారం బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రంతిజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి గజేంద్రసిన్హ్ పర్మార్ 2020 జూలై 30న గాందీనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్‌కు తనను పిలిపించుకున్నారని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకున్నారని దళిత బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత తన ఫోన్‌కాల్స్‌కు ఆయన స్పందించలేదని తెలిపింది. ఓసారి మాత్రం తమ మధ్య సంబంధం విషయం ఎవరికైనా చెబితే కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెడతానంటూ కులం పేరుతో దూషించారని పేర్కొంది. ఈ మేరకు ఆమె అందజేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో, బాధితురాలు 2021లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల తీరును ప్రశ్నించింది. ఎమ్మెల్యేపై వెంటనే అత్యాచారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గాం«దీనగర్ సెక్టార్–21 పోలీస్‌స్టేషన్ పోలీసులు అత్యాచారం, పోక్సో తదితర కేసులు పెట్టారు. -
సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్దిఖీని కాల్చిచంపడానికి పుణెలో కుట్ర జరిగిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. íసిద్దిఖీని గుర్తించడానికి వీలుగా ఆయన ఫొటో, చిత్రం ముద్రించిన ఫ్లెక్సీని షూటర్లకు అందజేశారు. ఈ హత్యలో పుణెకు చెందిన సోదరులు ప్రవీణ్ లోంకర్, శుభమ్ లోంకర్ల పాత్ర ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. నిందితులు దొరకితే హత్యకు కారణాలు తెలుస్తాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. లోంకర్ సోదరులే హత్యకు పాల్పడిన షూటర్లకు రూ.50 వేల చొప్పున అడ్వాన్సు అందించారని, నిందితుల మధ్య సమావేశాలను ఏర్పాటు చేశారని, హత్యకు కావాల్సిన ఏర్పాట్లను చూశారని చెప్పారు. శుభమ్‌కు చెందిన డైరీలో ప్రవీణ్ పనిచేస్తున్నాడని.. అక్కడే షూటర్లు శివకుమార్ గౌతమ్, ధర్మరాజ్ కశ్యప్‌లను హత్య కోసం నియమించుకున్నారని తెలిపారు. అడ్వాన్సుగా అందిన మొత్తం నుంచి నిందితులు ఒక మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసి.. దాని పైనే సిద్దిఖీ నివాసం, ఆఫీసుల వద్ద, ఆయన దినచర్య పైనా రెక్కీ నిర్వహించారని వివరించారు. గుర్మైల్ బల్జీత్‌సింగ్ (హరియాణా), ధర్మరాజ్ కశ్యప్ (ఉత్తరప్రదేశ్), ప్రవీణ్ లోంకర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులకు దిశానిర్దేశం చేసిన మొహమ్మద్ యాసిన్ అక్తర్ కోసం. సిద్దిఖీని కాల్చిచంపిన గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
జైలుకు ఈశ్వరన్
సింగపూర్: అవినీతి కేసులో దోషిగా రుజువైన సింగపూర్ మాజీ మంత్రి, ఏపీ సీఎం చంద్రబాబు ‘అమరావతి పార్ట్నర్’ ఎస్.ఈశ్వరన్ (62) సోమవారం జైలుకు వెళ్లారు. మంత్రిగా ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఏడేళ్ల కాలంలో ఆయన 3.12 లక్షల డాలర్ల విలువైన అక్రమ కానుకలు స్వీకరించడం నిజమేనని కోర్టు తేల్చడం, ఏడాది జైలు శిక్ష విధిస్తూ గత గురువారం తీర్పు వెలువరించడం తెలిసిందే. ఇప్పటికే నేరాన్ని అంగీకరించిన ఈశ్వరన్ కోర్టు తీర్పుపై అపీలుకు వెళ్లకుండా శిక్ష అనుభవించేందుకే మొగ్గు చూపారు. ‘‘నా చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా. సింగపూర్వాసులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా’’ అంటూ సోమవారం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అనంతరం శిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లారు. ఏపీలో రాజధాని అమరావతి పేరిట 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో జరిగిన భూ దోపిడీలో ఈశ్వరన్ కూడా కీలక పాత్రధారి అన్నది తెలిసిందే. -
కిషిదా వారసుడిగా ఇషిబా
టోక్యో: జపాన్ నూతన ప్రధానమంత్రిగా షిగెరు ఇషిబా(67) బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఫుమియో కిషిదా వారసుడిగా ఆయన ఎన్నికయ్యారు. రక్షణ శాఖ మాజీ మంత్రి అయిన ఇషిబాను జపాన్ అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) శుక్రవారం తమ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచి్చంది. పార్లమెంట్లో మెజార్టీ ఉన్న పార్టీ అధ్యక్షుడే ప్రధానమంత్రి కావడం ఆనవాయితీ. కిషిదా తప్పుకోవడంతో నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. ఎల్డీపీ పార్లమెంట్ సభ్యులతోపాటు దాదాపు 10 లక్షల మంది పార్టీ ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి పదవి కోసం ఇద్దరు మహిళలు సహా మొత్తం 9 మంది ఎంపీలు పోటీపడ్డారు. ఇషిబాతోపాటు ఎకనామిక్ సెక్యూరిటీ మంత్రి సనాయే తకైచి చివరి వరకు బరిలో కొనసాగారు. కానీ, ఇషిబాను విజయం వరించింది. ఒకవేళ తకైచి గెలిచి ఉంటే జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించి ఉండేవారు. ఎంపీల ఓట్లు 368, స్థానిక ప్రభుత్వాల్లోని ఓట్లు 47 ఉన్నాయి. ఇషిబాకు అనుకూలంగా 215 ఓట్లు, తకైచి అనుకూలంగా 194 ఓట్లు వచ్చాయి. కొందరు ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. జపాన్ ప్రధాని కిషిదా, ఆయన కేబినెట్ మంత్రులు అక్టోబర్ 1న రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు పార్లమెంటరీ ఓటింగ్‌లో ఇషిబాను ప్రధానిగా లాంఛనంగా ఎన్నుకుంటారు. తర్వాత అదే రోజు ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. జపాన్ను సురక్షితమైన దేశంగా మారుస్తా: ఇషిబా ప్రజల పట్ల తనకు ఎనలేని విశ్వాసం ఉందని ఇషిబా చెప్పారు. ధైర్యం, నిజాయతీతో ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడుతానని అన్నారు. ఎల్డీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఇషిబా శుక్రవారం టోక్యోలో మీడియాతో మాట్లాడారు. జపాన్ను సురక్షితమైన, సౌభాగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. ద్రవ్యోల్బణం, అధిక ధరల నుంచి ప్రజలకు విముక్తి కలి్పంచడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతానని తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్దపీట వేస్తానని వెల్లడించారు. అణు ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆసియా ఖండంలో ‘నాటో’ తరహా కూటమి ఏర్పాటు కావాలని ఇషిబా ఆకాంక్షించారు. జపాన్‌లో పెళ్లయిన మహిళలకు ఏదో ఒక ఇంటిపేరు ఉండాలి. పుట్టింటివారు లేదా అత్తింటివారి ఇంటి పేరుతో కొనసాగవచ్చు. కానీ, రెండు ఇంటి పేర్లతో కొనసాగేలా చట్టం తీసుకురావాలని ఇషిబా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి చట్టం కావాలని ఆయన ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు స్వలింగ వివాహాల పట్ల సానుకూల వ్యక్తం చేస్తున్నారు. ఎవరీ ఇషిబా? షిగెరు ఇషిబా న్యాయ విద్య అభ్యసించారు. బ్యాంకింగ్ రంగంలో సేవలందించారు. తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1986లో 29 ఏళ్ల వయసులో ఎల్డీపీ టికెట్‌పై తొలిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఎల్డీపీ సెక్రెటరీ జనరల్‌గా వ్యవహరించారు. వ్యవసాయం, రక్షణ శాఖల మంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రి పదవిపై ఎప్పుటినుంచో కన్నేశారు. గతంలో నాలుగుసార్లు గట్టిగా ప్రయతి్నంచి భంగపడ్డారు. ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో విజయం సాధించారు. ఇషిబా తండ్రి సైతం రాజకీయ నాయకుడే. ఆయన కేబినెట్ మంత్రిగా పనిచేశారు. కిషిదాకు, ఇషిబాకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎల్డీపీలో ఇషిబాకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారన్న విమర్శలున్నాయి. ఎల్డీపీలో ఇషిబా పలు సందర్భాల్లో అసమ్మతి గళం వినిపించారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్‌సింగ్ కన్నుమూత
కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి కె నట్వర్ సింగ్(93) శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నట్వర్‌సింగ్ గత కొన్ని వారాలుగా మేదాంతలో చికిత్సపొందుతున్నారు.నట్వర్ సింగ్ 1931లో రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో జన్మించారు. సింగ్ కుటుంబ సభ్యులు ఒకరు శనివారం అర్థరాత్రి మీడియాతో మాట్లాడుతూ నట్వర్‌సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతూ, మేదాంతలో చికిత్స పొందుతున్నారన్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఢిల్లీలో జరుగుతాయని, ఈ కార్యక్రమాలకు అతని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరవుతారన్నారు.కాంగ్రెస్ మాజీ ఎంపీ నట్వర్ సింగ్ 2004-05లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో భారత విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. పాకిస్తాన్లో భారత రాయబారిగా కూడా పనిచేశారు. 1966 నుండి 1971 వరకు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కార్యాలయంతో పనిచేశారు. నట్వర్‌సింగ్‌కు 1984లో పద్మభూషణ్ అవార్డు లభించింది. ఆయన పలు పుస్తకాలు రచించారు. -
కాలువలో సిక్కిం మాజీ మంత్రి మృతదేహం
గాంగ్టక్: సిక్కిం మాజీ మంత్రి ఆర్సీ పౌడ్యాల్ (80) మృతదేహం పశ్చిమ బెంగాల్లో దొరికింది. సిలిగురి సమీపంలోని తీస్థా కాలువలో మంగళవారం మృతదేహం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. చేతి వాచ్, ధరించిన దుస్తుల ఆధారంగా ఆయన్ను గుర్తించారు. మృతదేహం తీస్థా నదిలో కొట్టుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. పౌడ్యాల్ జూలై 7న తన స్వస్థలమైన పాక్యోంగ్ జిల్లా చోటాసింగ్టామ్లో ఇంటి నుంచి సోదరి వద్దకు బయల్దేరి తిరిగి రాలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి గాలించారు. 9 రోజుల తరువాత ఆయన మృతదేహం లభించింది. పౌడ్యాల్ మృతి పట్ల సీఎం తమాంగ్ సంతాపం వ్యక్తం చేశారు. -
ముందు మీ దేశం సంగతి చూసుకోండి: కేజ్రీవాల్ స్ట్రాంగ్ రిప్లై
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు, భారత్‌లో ప్రస్తుత రాజకీయాలపై జోక్యం చేసుకున్న పాకిస్థాన్ మాజీ మంత్రికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు రిప్లై ఇచ్చారు. మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ దేశం సంగతి మీరు చూసుకోండని చురకంటించారు. మీ సపోర్ట్ ఏమీ అవసరం లేదని తిప్పికొట్టారు. లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో శనివారం(మే25) కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఓటు వేసిన ఫొటోను తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. కేజ్రీవాల్ చేసిన ఈ పోస్ట్‌ను పాకిస్థాన్ మాజీ మంత్రి, ఎంపీ చౌధరి ఫహద్ హుస్సేన్ రీపోస్ట్ చేశారు.ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్‌ను జత చేశారు. ఇండియా ఎలక్షన్స్ అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. చౌధరి కామెంట్లకు అరవింద్ కేజ్రీవాల్ తిరిగి వెంటనే స్పందించారు.‘చౌధరి సాహిబ్ మా దేశంలో సమస్యలను నేను, నా దేశ ప్రజలు పరిష్కరించుకోగలం. ఇందుకు మీ సలహాలు మాకు అక్కర్లేదు. అసలే మీ దేశం పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ముందు ఆ పని చూడండి. భారత్‌లో ఎన్నికలు పూర్తిగా మా అంతర్గత వ్యవహారం. మీ జోక్యాన్ని మా దేశం ఏమాత్రం సహించదు’అని కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. -
అక్రమాలు కో‘కొల్లు’లు
విజయవాడ: కృష్ణాజిల్లాలోని తీరప్రాంత ముఖ్య పట్టణానికి ప్రాతినిధ్యం వహించిన ఆ టీడీపీ నేత అక్రమాలు కోకొల్లలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవీ వెలగబెట్టిన ఆయన హయాంలో ప్రజలు మౌలిక వసతులు లేక నరకం అనుభవించారు. గుక్కెడునీటికీ అంగలార్చారు. కానీ ఆయన మాత్రం భారీగా అక్రమాస్తులు మూటగట్టారు. మామ ద్వారా వసూళ్ల దందా సాగించారు. సెటిల్మెంట్లు చేశారు. ప్రభుత్వ స్థలాలూ కాజేశారు. అవినీతి సొమ్ముతో విజయవాడతో పాటు తీరప్రాంత మండలాలు, హైదరాబాద్‌లలో రూ.కోట్ల విలువ చేసే స్థలాలు కొన్నారు. ఎక్సైజ్‌లో భారీగా దోపిడీ ∗ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భారీగా దండుకున్నారు. ఒక్కో బదిలీకి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మంత్రిగా ఉన్న రెండేళ్లలోనే రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు దోపిడీకి పాల్పడ్డారు. లిక్కర్ దందా నడిపారు. ∗ భీమవరంలో భార్యాభర్తల మ్యూచువల్ బదిలీ కోసం దాదాపు రూ.40 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ∗ ఎక్సైజ్ శాఖలో డిజిటలైజేషన్ నిమిత్తం కాంట్రాక్టర్ నుంచి రూ.5 కోట్లు నాటి ప్రభుత్వ పెద్దలకు అందాయి. ఆ కాంట్రాక్టర్ నుంచి మాజీ మంత్రి రూ.2 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్ స్టేషన్ల నుంచి నెలవారీ మామూళ్లూ వసూలు చేశారని సమాచారం. ∗ ఇసుక రవాణాలోనూ వసూళ్ల దందాకు పాల్పడ్డారు. ఈ తంతు మొత్తం మాజీ మంత్రి అనుచరుడు దగ్గరుండి నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన అండతో ముఖ్యపట్టణంలో తెలుగు తమ్ముళ్లు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్లాట్లుగా వేసి స్థలాలు అమ్ముకున్నారు. రూ.కోట్లకు పడగలెత్తారు. ∗ సొంత రైసు మిల్లును అడ్డుపెట్టుకుని ధాన్యం కొనుగోళ్లలో అక్రమ దందాకు పాల్పడ్డారు. రూ.3 కోట్ల వరకు ఇలా బొక్కేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండూ ప్రతిపక్షాల నుంచి వినిపించింది. ∗ కరకట్ట, చల్లపల్లి బైపార్ రోడ్డు, విజయవాడ – మచిలీపట్నం హైవే నిర్మాణ పనులకు సంబంధించిన మట్టి (బుసక) సరఫరాలో నాలుగున్నరేళ్లలో రూ.వందల కోట్లు మింగారు. పొక్లెయిన్ బుజ్జీని బినామీగా పెట్టి కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వి వచి్చన మట్టిని నిర్మాణాలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ∗ ప్రభుత్వ పథకాల మంజూరులోనూ భారీ వసూళ్లకు తెరతీశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి కమీషన్లు వసూలు చేసి తన కక్కుర్తి బుద్ధిని చాటుకున్నారు. రైతు రథం పంపిణీ, అదనపు తరగతుల నిర్మాణాల్లోనూ గడ్డికరిచినట్టు ఆరోపణలు ఉన్నాయి. ∗ బినామీల పేరుతో కాల్‌మనీ వ్యవహారం నడిపించి రూ.1.50 కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ∗ రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ అభ్యర్థి వద్ద రూ.5 లక్షలు వసూలు చేశారని సమాచారం. ఉద్యోగం రాకపోవడంతో ఆ అభ్యర్థి ప్రశి్నస్తే రూ.3 లక్షలు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పిస్తానని నచ్చజెప్పినట్లు సమాచారం. ∗ ముఖ్యపట్టణంలో డివైడర్ గ్రిల్ పనుల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారు. బీచ్ ఫెస్టివల్, పోర్టు పనులు ప్రారంభం విషయంలో చంద్రబాబు పర్యటనలోనూ భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణంలోనూ భారీగా కమీషన్లు దండుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ∗ ఒక్కో వాటర్ ట్యాంక్ రూ.5 కోట్లతో 7 ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ట్యాంకుకు 10 శాతం చొప్పున రూ.3.50 కోట్లు దండుకున్నట్లు తెలిసింది. ∗ రైల్వే గేట్ నుంచి మంగినపూడి బీచ్ వరకు రూ.14 కోట్లతో చేపట్టిన రోడ్డు పనుల్లో 10 శాతం వాటా కింద రూ.1.40 కోట్లు వసూలు చేశారు. గుట్కా విక్రయదారుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ∗ జాతీయ తుపాను విపత్తుల నివారణ పథకం కింద రూ.36.45 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో మచిలీపట్నం నుంచి కృత్తివెన్ను మండల సమీపం వరకు 18.6 కిలోమీటర్ల మేర చేపట్టిన కరకట్ట నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. అనతి కాలంలో ఆ కరకట్ట బాగా దెబ్బతింది. ∗ మంత్రి రాజకీయ గురువు కూడా ఈ అక్రమాల్లో భాగం పంచుకున్నారు. తన పరిశ్రమలో నకిలీ ఎరువులు తయారు చేసి, వాటిని రైతులకు కట్టబెట్టి రూ.లక్షలు కొల్లగొట్టారు. ఈ విషయం అప్పట్లో దుమారం రేపింది. విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. హత్య సహా 25 కేసులు ఈ మాజీ మంత్రి 2020 జూలై 27న మచిలీపట్నం చేపల మార్కెట్లో జరిగిన వైఎస్సార్ సీపీ నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్నారు. క్రైం నంబర్ 192/2020తో 120 బీ, 302 ఐపీసీ 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. ఆయన పరారు కావడంతో పోలీసు ప్రత్యేక బృందం గాలించి అదుపులోకి తీసుకుంది. రెండు నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఈయనపై 2009 నుంచి ఇప్పటి వరకు హత్య, ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు మొత్తం 25 కేసులు నమోదయ్యాయి. అందులో 12 కేసుల నుంచి తన పలుకుబడి ఉపమోగించి బయటపడ్డారు. మిగిలినవి విచారణ దశలో ఉన్నాయి. -
భార్యను అతికిరాతకంగా చంపిన మాజీ మంత్రి
అస్తానా: మధ్య ఆసియా దేశం కజకస్తాన్ నిరసనలతో అట్టుడికిపోతోంది. ఓ మాజీ మంత్రి తన భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ మానవ మృగం కోర్టు విచారణ ఎదుర్కొంటుండగా.. కఠిన శిక్ష పడాలంటూ ఆందోళనలు చేపట్టారు అక్కడి ప్రజలు.కువాన్దిక్ బిషింబయెవ్(44) కజకస్తాన్ దేశపు మాజీ ఆర్థిక మంత్రి. ఈయన బంధువు పేరిట ఉన్న ఓ రెస్టారెంట్లో గతేడాది నవంబర్‌లో ఆయన సతీమణి సల్తానత్ నుకెనోవా(31) అనుమానాస్పద రీతిలో మృతి చెందిది. అంతకు ముందు ఒకరోజు అంతా ఆ జంట ఆ హోటల్లోనే గడిపింది.అయితే విచారణలో ఆయనే ఆమెను దారుణంగా హింసించి చంపినట్లు తేలింది. దీంతో ఆయన కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈలోపు ఆ హోటల్ సీపీ టీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. జుట్టుపట్టి ఈడ్చి కొట్టి.. ఇష్టానుసారం తన్ని.. సుమారు ఎనిమిది గంటల పాటు ఆ కిరాతకం కొనసాగింది. రక్తపు మడుగులో అచేతనంగా భార్య పడి ఉన్నప్పటికీ ఆమె బాగానే ఉందంటూ హోటల్ సిబ్బందితో బిషింబయెవ్ చెప్పడం కూడా వీడియోలో రికార్డయ్యింది. చివరకు 12 గంటల తర్వాత ఆంబులెన్స్ అక్కడికి చేరుకోగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.తలకు, ముక్కుకు బలమైన గాయం కావడం, ఒంటిపై పలు చోట్ల గాయాల్ని శవ పరీక్షలో గుర్తించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో.. సీసీ టీవీ ఫుటేజీ సహా సాక్ష్యాలన్నింటిని మాయం చేసేందుకు బిషింబయెవ్ ప్రయత్నించారని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. తన భార్య మానసిక స్థితి బాగోలేదని, ఈ క్రమంలోనే తనకు తాను గాయాలు చేసుకుని ఆమె చనిపోయిందని న్యాయస్థానాల్ని నమ్మించే యత్నం చేశాడు కూడా.అయితే.. 8 గంటలపాటు సాగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడంతో ఆ భర్త అకృత్యం వెలుగు చూసింది. భార్యను అలా ఎందుకు చంపాడో మాత్రం ఇంకా నోరు విప్పలేదు నిందితుడు. అయితే ఆమెను అంత క్రూరంగా చంపిన ఆ మాజీ మంత్రిని కఠినంగా శిక్షించాలంటూ అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గృహ హింస చట్టం గురించి విస్తృతంగా చర్చ జరిగింది అక్కడ. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఆ దేశపు సుప్రీం కోర్టులో జరుగుతోంది. కజకస్తాన్ చరిత్రలోనే తొలిసారి ఈ కేసు విచారణను లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది ఆ దేశ అత్యున్నన్యాయస్థానం. బిషింబయెవ్ నేరం గనుక రుజువు అయితే అక్కడి చట్టాల ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపడుతుంది. -
కాంగ్రెస్ రెబల్‌కు బీజేపీ టికెట్.. మాజీ మంత్రి రాజీనామా
హిమాచల్‌ప్రదేశ్ మాజీ మంత్రి, లాహౌల్ - స్పితి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత రామ్‌లాల్ మార్కండ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన కాంగ్రెస్ రెబల్‌కు తాజా అసెంబ్లీ ఉప ఎన్నకల్లో బీజేపీ టికెట్ ఇవ్వడంతో పార్టీ నుంచి రామ్ లాల్ మార్కండ వైదొలిగారు. అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రామ్‌లాల్ మార్కండ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. లాహౌల్- స్పితి నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించారు. అది కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సంకేతాలివ్వడం గమనార్హం. జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వంలో రామ్ లాల్ మార్కండ వ్యవసాయ, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్న ఠాకూర్ చేతిలో 1542 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికల్లో లాహౌల్- స్పితి నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ రెబల్ ఠాకూర్ పేరు రావడంతో రామ్ లాల్ మార్కండ బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలైన హమీర్పూర్, సిమ్లా, మండి, కాంగ్రా స్థానాలతో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జూన్ 1న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లాహౌల్- స్పితి నుండి ఠాకూర్‌తో పాటు, ధర్మశాల నుండి సుధీర్ శర్మ, సుజన్పూర్ నుండి రాజిందర్ రాణా, బర్సార్ నుండి ఇందర్ దత్ లఖన్‌పాల్, గాగ్రెట్ నుండి చెతన్య శర్మ, కుట్లేహార్ నుండి దేవిందర్ కుమార్ భుట్టోలను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. -
ఉత్తరాఖండ్‌లో ఈడీ రెయిడ్స్.. ఆ పార్టీ నేతే టార్గెట్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ లక్ష్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు జరుపుతోంది. ఉత్తరాఖండ్, ఢిల్లీలోని మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఈడీ రెయిడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీలోనే ఉన్న హరక్ సింగ్ 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా హరక్‌సింగ్‌ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2022 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చింది. ఇదీ చదవండి.. ప్రధాని సుడిగాలి పర్యటనలు.. ప్రసంగాల్లో దానిపైనే ఫోకస్ ! -
karnataka: కాంగ్రెస్‌పై సొంత పార్టీ నేత తీవ్ర విమర్శలు
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బి శివరాము సొంత పార్టీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు. గత బీజేపీ ప్రభుత్వంలో 40 శాతం అవినీతి జరిగిందని ప్రశ్నించిన కాంగ్రెస్.. అంతకంటే ఎక్కువగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. తన సొంత జిల్లా హసన్‌లోనే ఈ అవినీతి.. బీజేపీ హాయాంలోని 40 శాతం కంటే అధికంగా పెరిగిపోందన్నారు. ఈ విషయాన్ని తాను నేరుగా సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు చేస్తున్న అవినీతిపై పార్టీ కార్యకర్తల్లో సైతం తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. తాను అవినీతి విషయంలో చాలా స్పష్టంగా తన అభిప్రాయాలు తెలియజేస్తున్నానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు నేతల్లో కూడా ఇదే అభిప్రాయం ఉందని తెలిపారు. పార్టీలో కొంతమంది చేస్తున్న అవినీతిపై చర్చ జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా.. ఎప్పటికప్పుడు పార్టీ నేతలపై నిఘా ఉంచాలని అన్నారు. తాను సొంతపార్టీ నేతల అవినీతిపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తే చెడ్డవాడిగా ముద్రవేస్తారని తెలుసని అన్నారు. కానీ, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల కోసమే తాను మాట్లాడుతున్నానని తెలిపారు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే మాజీ ఎమ్మెల్యే శివరాము.. అధికారంలో ఉన్న సొంత పార్టీపై అవినీతి ఆరోపణలు చేయటం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం గానీ.. సీఎం సిద్ధరామయ్య గాని ఎలా స్పందిస్తారో చూడాలి. చదవండి: ఢిల్లీలో ఆప్, బీజేపీ హోరాహోరీ నిరసనలు -
దళితులకిచ్చే గౌరవం ఇదేనా బాబూ?
తిరుపతి రూరల్: దళితులను అవమానించి ఆనందపడటం చంద్రబాబుకి అలవాటులా మారిపోయింది. ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారంటూ గతంలో మీడియా ముందే అహంకారంతో మాట్లాడిన బాబు మరోసారి దళితుల పట్ల తనకున్న చిన్నచూపును ప్రదర్శించారు. సంక్రాంతి పండుగ రోజు తిరుపతి రూరల్ మండలం అవిలాలలోని టీడీపీ నేత వెంకటమణిప్రసాద్ ఇంట్లో నిర్వహించిన సమావేశంలో దళిత మాజీ మంత్రి పరసారత్నాన్ని అందరి ముందు నిల్చోబెట్టి ఘోరంగా అవమానించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి.. రెండు సార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రిగా కూడా చేసిన ఆయనను కనీసం తమ పక్కన కూడా బాబు కూర్చోనివ్వలేదు. దాంతో ప్రెస్‌మీట్ జరిగినంతసేపు పరసారత్నం అవమానభారంతో చెమర్చిన కళ్లతో నిల్చోనే ఉండిపోయారు. దళితులను నిత్యం అవమానిస్తూ రాక్షసానందం పొందుతున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని దళిత సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఇదీ చదవండి: చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు -
మాజీ మంత్రి చాంబర్ నుంచి ఫర్నిచర్ తరలింపు!
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రవీంద్రభారతిలో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చాంబర్ నుంచి కొందరు ఫర్నిచర్‌ను తీసుకువెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం కొంతమంది వ్యక్తులు ఫర్నిచర్‌ను తీసుకువెళుతుండగా ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తులకు, ఓయూ జేఏసీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. #OU student union leaders stopped the shifting of furniture from Former Minister Srinivas Goud's office, alleging that public property is being moved illegally. pic.twitter.com/cHlqXF4zgb — Sudhakar Udumula (@sudhakarudumula) December 6, 2023 ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్‌ను ఎలా తీసుకువెళతారని జేఏసీ నాయకులు వారిని ప్రశ్నించారు. దీంతో వారు ఫర్నిచర్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటనపై టీజీఓ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ, తమ కార్యాలయంలో వినియోగించుకునేందుకు ఆ ఫర్నిచర్‌ను తీసుకువెళ్లాలనుకున్నామని, అయితే అది ప్రభుత్వానిదని తెలియడంతో ఆ ప్రయత్నం మానుకున్నామని తెలిపారు. -
Karnataka: మాజీ మంత్రి శ్రీరాములు కాంగ్రెస్‌లో చేరుతున్నారా?
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బి.శ్రీరాములు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను సోమవారం బెంగళూరులోని ఆయన నివాసంలో కలిశారు. దీంతో శ్రీరాములు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్రను పార్టీ ఇటీవల నియమించింది. దీంతో ఈ పదవిని ఆశించిన శ్రీరాములుకు భంగపాటు ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే శ్రీరాములు తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు డీకే నివాసానికి వెళ్లినట్లు సమాచారం. శ్రీరాములు బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో 2021 ఆగస్టు నుండి 2023 మే వరకు రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖలకు మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2020 అక్టోబర్ నుండి 2021 జూలై వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. శ్రీరాములు ప్రస్తుతం చిత్రదుర్గ జిల్లాలోని బళ్లారి రూరల్ మొలకల్మూరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో నిరుపేద అసైన్డ్‌దారులను బెదిరించి బినామీలు, బంధువుల పేరిట కారు చౌకగా భూములను కొట్టేసిన మాజీ మంత్రి నారా యణ అధికారులనూ బెదిరించారని సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు బుధవారం నివేదించారు. ప్రభుత్వం తమదని, తాము చెప్పిందే చట్టమని, చెప్పినట్లు చేయాలంటూ అధికారులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. అప్పటి అడ్వొకేట్ జ నరల్ (ఏజీ), న్యాయశాఖ, ముఖ్య కార్యద ర్శులు, ఐఏఎస్ అధికారులు వారించినా నారాయణ లెక్క చేయలేదని తె లిపారు. అసైన్డ్ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో నారా యణే కీలక సూత్రధారి అని చెప్పారు. ఆయన సమీప బంధువులు, బినామీల పేరిట 148 ఎకరాలను కొనుగోలు చేసేందుకు రూ.18.10 కోట్లు వెచ్చించి నట్లు నివేదించారు. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ రూ.600 కోట్లకు పైనే ఉంటుందని కోర్టు దృష్టికి తెచ్చారు. అసైన్డ్ భూములను ప్రభు త్వం వెనక్కి తీసుకుంటుందని, అంతిమంగా పేదలకు ఎలాంటి లబ్ధి చేకూరదంటూ గత ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు భయాందోళనలు రేకెత్తించారన్నారు. చదవండి: రామోజీ.. మీ ఆకాంక్షే గాలిలో దీపం అనంతరం అసైన్డ్‌దారుల నుంచి భూ ములను అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ల ద్వారా నామ మాత్రపు ధరలకు కొట్టేశారని తెలిపారు. ఆ తరువాత వాటిని ల్యాండ్ పూలింగ్ స్కీం కింద సీఆర్ఏడీకు ఇచ్చి జీవో 41 (ల్యాండ్ పూలింగ్ స్కీం రూల్స్) ని అడ్డం పెట్టుకుని విలువైన నివాస, వాణిజ్య ప్లాట్లను పొందినట్లు తెలిపారు. కొన్నిటిని అధిక ధరలకు అమ్ముకున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మొత్తం నేరంలో అప్పటి సీఎం చంద్రబాబు, నాటి మంత్రి నారాయణ పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని నివేదించారు. దర్యాప్తులో సీఐడీ అధికా రులు స్వాధీనం చేసుకున్న నారాయణ ఫోన్ లో ఆయన కు మార్తె సింధూరతో జరిపిన సంభాషణలున్నట్లు తెలిపారు. తాను అసైన్డ్ భూములను కొన్నట్లు ఆ సంభాషణల్లో నారా యణ అంగీకరించారని చెప్పారు. అసైన్డ్ భూములు తమ పేర్లతో ఉంటే ప్రభుత్వం జైల్లో వేస్తుందని నారాయణ తన కుమార్తెతో చెప్పారన్నారు. ఆ సంభాషణల తాలుకూ పెన్ డ్రైవ్ ను సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేశారు. ఈ వ్యవహా రానికి సంబంధించి ఒరిజినల్ రి కార్డులను సైతం సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. ఏఏజీ వాదనలు పూర్తి కాక పోవడంతో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులిచ్చారు. అసైన్డ్ భూముల బద లాయింపులో అక్ర మాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, నారాయ ణ లపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీన్ని కొట్టివేయాలని కోరుతూ దాఖలైన క్వాష్ పిటి షన్లపై స్టే విధించిన కోర్టు ఇటీవల తుది విచారణ చేపట్టింది. చట్టపరమైన రక్షణ ఉంది.. ప్రాసిక్యూషన్ తగదు నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ సీఆర్డీఏ చట్టం కింద తీసు కున్న నిర్ణయాల విషయంలో ప్రభుత్వం, అధికారులు, అథారిటీలకు వ్యతిరేకంగా ఎలాంటి కేసులు దాఖలు చే యడానికి వీల్లేదన్నారు. చట్టం కింద రక్షణ ఉన్నందున నారాయణను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదన్నారు. తమ కున్న అధికారం మేరకే జీవో 41 జారీ చేశారని తెలిపారు. ఈ అధికారాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. అసైన్డ్ భూముల విషయంలో ఎస్సీ, ఎస్టీలెవరూ ఫిర్యాదుదారులు కాదన్నారు. అందువల్ల ఆ చట్టం కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదన్నారు. ఇతర టీడీపీ నేతలు కూడా.. అసైన్డ్‌దారులను బెదిరించి నారాయణ మాత్రమే కాకుండా అప్పటి అధికార పార్టీ నేతలైన రావెల కిషోర్‌బాబు, అనగాని సత్యప్రసాద్, పరిటాల శ్రీరామ్, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు కూడా భూములను సొంతం చేసుకున్నట్లు ఏఏజీ సుధా కర్‌రెడ్డి తెలిపారు. ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి అసైన్డ్ భూములను తీసుకురావడం, ఆ భూముల బదలాయింపుపై అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, జేసీ చెరుకూరి శ్రీధర్ అభ్యంతరం తెలిపారన్నారు. ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. అసైన్డ్ భూ ముల విషయంలో చట్టపరమైన నిబంధనలను నారాయణకు స్పష్టంగా వివరించినట్లు వారు త మ వాంగ్మూలాల్లో స్పష్టంగా చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో స్టే ఎత్తివేసి సీఐడీ దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతినివ్వాలని అభ్యర్థించారు. -
మైనర్ బాలికలనూ విడిచిపెట్టడం లేదు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ వేధింపుల పర్వంపై వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వావివరసలు లేకుండా సొంత కుటుంబ సభ్యులనే కాకుండా ప్రజలను, తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్న మైనర్ బాలికలను కూడా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే నారాయణ అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రకాశం జిల్లాలో కట్టిన ఫ్లెక్సీల్లో ‘అసలోడు వచ్చే వరకే కొసరోడికి పండుగ’ అని రాసి ఉందన్నారు. ‘అసలోడు .. కొసరోడు’.. ఇందులో అంతరార్థం ఏమిటో చంద్రబాబు అధికారికంగా స్పష్టత ఇవ్వాలని కోరారు. కొసరోడు అంటే ఆ జిల్లాలో యువగళం చేస్తున్న చినబాబు కాదు కదా? అని ప్రశ్నించారు. ప్రజలకు వచ్చిన సందేహాన్నే తాను కూడా ప్రస్తావిస్తున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈవెంట్ మేనేజ్మెంట్లో చంద్రబాబును మించిన వారెవరూ ఉండరని ఎద్దేవా చేశారు. ప్రతి కార్యక్రమానికి ఏదో ఒక ఆకర్షణను జత చేసి జనాన్ని మొబిలైజ్ చేయడం ఆయనకు మొదటి నుంచీ అలవాటేనన్నారు. చినబాబు యువగళం యాత్రకు గ్లామర్ అద్దేందుకు టీవీ యాంకర్‌ను హైదరాబాద్ నుంచి రప్పించడం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి ఇక నుంచి సినీనటుల సందడి మొదలవుతుందనేది అర్థమవుతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
బాలికపై అమానుషం.. కాలితో తన్ని.. మినిష్టర్ భార్య నిర్వాకం
అస్సాం : అసోం గణ పరిషద్ కు చెందిన మాజీ మంత్రి హాజీ రౌఫ్ చౌదరి(85) భార్య ఫర్హానా(28) ఒక మైనర్ బాలికను కాలితో తన్నుతూ కొడుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. వెంటనే బాలల హక్కుల సంరక్షణ సంస్థ ప్రతినిధి చంద్రధర్ భుయాన్ ఫిర్యాదు మేరకు అసోం పోలీసులు రంగంలోకి దిగి మాజీ మంత్రిని అతడి భార్యను అరెస్టు చేశారు. బాలల సహాయక సంస్థ ప్రతినిధి చంద్రధర్ భుయాన్ తెలిపిన వివరాల ప్రకారం మాజీ మంత్రి చౌదరి ఫర్హానా దంపతులు ఈ 12 ఏళ్ల బాలికను తీసుకొచ్చి పెంచుకుంటున్నామని చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలేవైనా ఉన్నాయా అంటే లేవంటున్నారు. వీడియోలో ఆ బాలికను ఎందుకలా చావగొడుతున్నావని అడిగితే స్కూల్ చదువుల్లో బాగా వెనకబడిపోయినందునే కోపంతో కొట్టానని చెబుతోంది మాజీ మంత్రి భార్య. అంతేకాదు ఈ వీడియో స్వయంగా నేనే తీశానని నా భర్తకు ఈ విషయం గురించి ఏమీ తెలియదని చెబుతోంది. ఏది ఏమైనా ఆ బాలిక పట్ల ఆమె ప్రవర్తన అమానుషమన్నారు చంద్రధర్. కేసు నమోదు చేసిన హోజాయ్ పోలీసులు బాలిక తల్లితో పాటు మిగతావారిని కూడా సంప్రదించి ఇందులో వీరిద్దరే కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు. హాజీ రౌఫ్ చౌదరి పైనా అతని భార్య ఫర్హానా పైనా ఐపీసీ 324,25 సెక్షన్లతో పాటు బాల కార్మికుల(నిషేధం & నియంత్రణ) చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: మీ నాన్నను అవమానిస్తున్నారు. సిగ్గుగా లేదా? -
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు వైద్య పరీక్షలు
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న జైన్‌కు శనివారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్లో పరీక్షలు చేయించామని, మరోసారి వైద్యుల అభిప్రాయం తీసుకోవాలన్న ఆయన కోరిక మేరకు సోమవారం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లామని జైలు అధికారులు తెలిపారు. ఆయన వెంట పోలీసులున్నారని చెప్పారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు పరీక్షించాక ఆయన్ను తిరిగి జైలుకు తీసుకొచ్చారన్నారు. జైన్‌ను 2022 మే 31వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. జైన్ త్వరగా కోలుకోవాలని ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆకాంక్షించారు. ‘జైన్‌ను బీజేపీ చంపాలనుకుంటోంది. ఇంతటి క్రూరత్వం పనికిరాదు, మోదీజీ’ అంటూ ట్వీట్ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో జైన్ 35 కిలోలు తగ్గారని ఆయన లాయర్ అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు. -
కారులో వెళ్తూ బుల్డోజర్ను ఢీకొట్టిన మాజీ మంత్రి.. అక్కడికక్కడే..
గాంధీనగర్: గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత వల్లభ్‌బాయ్ వఘాసియా(69) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బుల్డోజర్ను ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. కారును ఆయనే స్వయంగా డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వఘాసియాతో పాటు కారులో ఉన్న మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో అమ్రేలి జిల్లా సావర్‌కుంద్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విజయ్‌రూపానీ మొదటి సారి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వఘాసియా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సావర్‌కుంద్ల నియోజకవర్గం నుంచి 2012లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వఘాసియా మృతి పట్ల సావర్‌కుంద్ల ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే మహేష్ కశ్వాలా విచారం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఒక మాస్ లీడర్‌ను కోల్పోయామన్నారు. చదవండి: సంపు క్లీన్ చేస్తుండగా విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి.. -
54 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న మాజీ మంత్రి
భువనేశ్వర్: అధికార పార్టీ బీజూ జనతాదల్ కొరాపుట్ జిల్లా పరిశీలకుడు, మాజీమంత్రి కెప్టెన్ దివ్యశంకర్ మిశ్రా(54) రెండో వివాహం చేసుకున్నారు. పూరీ సమీపంలోని ఓ రిసార్టులో ఆదివారం ఈ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పరిమిత బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే ప్రవేశానికి అనుమతించారు. కాగా దివశంకర్‌తోపాటు అతను వివాహం చేసుకున్న ప్రియాంక అగస్తీకి కూడా ఇది రెండో పెళ్లి. వీరిద్దరూ ఇంతకముందు తమ గత వైవాహిక జీవితాలలో విడాకులు తీసుకున్నారు. గతంలో జయపట్నకు చెందిన మహిళతో వివాహం చేసుకున్న ఆయన.. వివిధ కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరి దాంపత్యంలో జన్మించిన కుమారుడు దుబాయ్‌లో చదువుతున్నట్లు సమాచారం. టాటాలో సీనియర్ ఇంజినీర్.. దివ్యశంకర మిశ్రాను వివాహం చేసుకున్న ప్రియాంక అగసీకలహండి జిల్లాలోని గోలముండా మండలం డెకోటా గ్రామానికి చెందిన భవానీ అగస్తీ కుమార్తె. సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం టాటా పవర్లో సీనియర్ లీడ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ప్రియాంకకు కూడా ఇది రెండో వివాహం కాగా, గతంలో మానస్ పండా అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకున్నారు. సంచలనాలకు మారు పేరైన దివ్యశంకర్.. ఈ వివాహంతో మరోసారి వార్తల్లో నిలిచారు. దివ్యశంకర్ ప్రస్తుతం కలహండి జిల్లా జునాఘడ్ విధానసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తొలుత నవీన్ క్యాబినెట్లో హోంశాఖ సహాయ మంత్రిగా ఉండేవారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉపాధ్యాయురాలు మమతా మెహర్ హత్య కేసులో దివ్యశంకర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవిని నిలబెట్టుకోలేక పోయారు. అయితే ఇటీవల బీజేడీ అధిష్టానం ఆయనకు కొరాపుట్ జిల్లా బాధ్యతలు అప్పగించింది. -
లైవ్ టీవీ షోలో ఏడ్చేసిన పాక్ మాజీ మంత్రి.. వీడియో వైరల్..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ మంత్రి, ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఫవాద్ చౌదరి లైవ్ టీవీ షోలో బోరున విలపించారు. దేశద్రోహం కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆయన.. జైలు జీవితాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం అధికారులను బెదిరించారనే ఆరోపణలతో ఫవాద్ చౌదరిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు జీవితం ఎలా ఉందని, కుటుంబసభ్యుల పరిస్థితి ఏంటని టీవీ యాంకర్ ఫవాద్‌ను ప్రశ్నించారు. తనను అరెస్టు చేసినప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫవాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తన చేతికి సంకెళ్లు, మొహానికి ముసుగు వేసి కోర్టుకు తీసుకెళ్లారని, ఫోన్ కూడా లాక్కున్నారని చెప్పారు. ఆ ఫోన్ ఇంకా తనకు తిరిగి ఇవ్వలేదన్నారు. జైల్లో ఉన్నప్పుడు కుమారులు తనను చూసేందుకు వచ్చినప్పుడు చాలా బాధేసిందని చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే బోరున విలపించారు. కన్నీటిని చేతులతో తుడుచుకుంటూనే మాట్లాడారు. ఫవాద్‌కు ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేయొద్దనే షరతుతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. చదవండి: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కన్నుమూత
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున వైజాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వసంత్‌కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళ గ్రామం. కాగా అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకురానున్నారు. ఆది నుంచి వసంత్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్లోనూ అదే శాఖా మంత్రిగా పని చేశారు. ఇక కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్లో పర్యాటక శాఖ మంత్రి విధులు నిర్వర్తించారు. 2018 లో టీడీపీ-కాంగ్రెస్ కలయిక తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న వసంత్‌కుమార్ విశాఖలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. -
హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. హైకోర్టు ఆదేశాలతో నారాయణను ఆయన ఇంట్లో సీఐడీ ప్రశ్నించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలపై అధికారులు విచారణ జరిపారు. 160 సీఆర్పీసీ కింద ఇప్పటికే నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 2014-19 మధ్య ఇన్నర్ రింగ్‌రోడ్డు భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అలైన్మెంట్ మార్చడంతో రామకృష్ణా హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్‌కు లబ్ధి చేకూర్చారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అప్పటి సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే నారాయణ నాటి మున్సిపల్ మినిస్టర్ హోదాలో అలైన్మెంట్ మార్పులు చేసిట్టు గుర్తించారు. ఇప్పటికే నారాయణ బెయిల్‌ను సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ సవాల్ చేసింది. చదవండి: ఈడీ విచారణలో ఎల్ రమణకు తీవ్ర అస్వస్థత -
మనవరాలితో కలిసి స్టెప్పులేసిన రఘువీరారెడ్డి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘువీరా రెడ్డి గురించి తెలియని వారుండరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి.. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా కుటుంబంతో గడపడం మొదలుపెట్టారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదా వ్యక్తిగా అందరిలో కలిసిపోయి జీవిస్తున్నారు. తాజాగా.. రఘువీరా రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన మనుమరాలితో సరదాగా డ్యాన్స్ వేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. టీవీలో ఓ పాట పెట్టి.. దానికి అనుగుణంగా రఘువీరా తన మనుమరాలితో కలిసి డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఎన్నికల ముందు బీజేపీకి షాక్..!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికార బీజేపీకి మాజీ మంత్రి జయనారాయణ్ వ్యాస్ షాకిచ్చారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. అయితే, ఆయన ఏపార్టీలో చేరతారనే విషయాన్ని వెల్లడించలేదు. కాంగ్రెస్‌లో చేరతారనే వాదనలు బలంగా వినిపిస్తున్నా.. మరోవైపు ఆప్ వైపు సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు పంపించారు మాజీ మంత్రి. ‘నేను బీజేపీతో విసిగిపోయాను, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశాను. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సద్ధాపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. ఏ పార్టీలో చేరటమనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడుతున్నాను.’ అని వ్యాస్ పేర్కొన్నారు. 75ఏళ్ల వ్యాస్ ఇటీవల కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్, కాంగ్రెస్ గుజరాత్ ఎన్నికల పరిశీలకులతో వరుసగా సమావేశమయ్యారు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరే అవకాశముందని ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పెద్దలతో వ్యాస్ మంతనాలు జరుపుతున్నట్లు హస్తం పార్టీ నేత ఒకరు పేర్కొనటం ఆ వాదనలకు బలం చేకూర్చుతోంది. 2007లో నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాస్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012, 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో కాషాయ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన వ్యాస్.. పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం మంతనాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: ‘మిస్టర్ కేజ్రీవాల్ మీ దృష్టిలో నేను దొంగనైతే.. మరి మీరేంటి?’ -
Bengal Schools Scam: పార్థా చటర్జీకి చెందిన రూ.46 కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ, ఆయన సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీకి చెందిన రూ.46.22 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. రాష్ట్రంలో 2016లో చోటుచేసుకున్న టీచర్ల నియామకం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో పార్థా చటర్జీ, అర్పితా ముఖర్జీల ఆస్తులను జప్తు చేసినట్లు సోమవారం తెలిపింది. ఈడీ సోమవారం వీరిపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ వేసింది. వీరిద్దరినీ ఈడీ జూలైలో అరెస్ట్ చేసింది. వీరికి చెందిన పలు ప్రాంతాల్లో దాడులు జరిపిన ఈడీ రూ.55 కోట్ల నగలు, నగదును స్వాధీనం చేసుకుంది. ఇలా ఉండగా, ఇదే కుంభకోణానికి సంబంధించి సీబీఐ నార్త్ బెంగాల్ యూనివర్సిటీ వీసీ సుబిరెస్ భట్టాచార్యను సోమవారం అరెస్ట్ చేసింది. అప్పట్లో ఆయన బెంగాల్ సెంట్రల్ స్కూల్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉండేవారు. -
Karnataka: మాజీ మంత్రి కన్నుమూత
బెంగళూరు: మాజీమంత్రి, ఉత్తర కన్నడ జిల్లా కారవారలో పలు విద్యాసంస్థలను స్థాపించిన ప్రభాకర్ రాణె (81) సోమవారం మధ్యాహ్నం తన స్వగృహంలో కన్నుమూశారు. నెల క్రితం జ్వరం రావటంతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఇంటిలోనే చికిత్స తీసుకుంటున్నారు. కారవార జోయిడా స్థానం నుంచి క్రాంతిరంగ పార్టీ నుండి ఒకసారి, కాంగ్రెస్ తరపున ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1993లో వీరప్ప మెయిలీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: (బతికి వస్తాడని బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర) -
పంజాబ్ మాజీ మంత్రి అరెస్ట్, నెల క్రితమే సీఎం వార్నింగ్
చండీఘడ్: అవినీతి ఆరోపణలపై పంజాబ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సాధు సింగ్ ధరమ్‌సోత్ అరెస్టయ్యారు. మంగళవారం తెల్లవారుజామున రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో ధరమ్సోతను అరెస్ట్ చేసింది. అతనితో పాటు సహాయకుడిగా పనిచేస్తున్న కమల్జిత్ సింగ్ అనే స్థానిక జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు. కాగా సాధు సింగ్ గతంలో కెప్టెన్ అమరీందర్ సింఘ్ కేబినెట్లో అటవీ, సాంఘిక, సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే పంజాబ్‌లో అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చెట్లను నరికివేయడానికి అనుమతి ఇచ్చినందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం చెట్లు నరికినప్పుడు కాంట్రాక్టర్లు చెట్టుకు రూ.500 చొప్పున లంచం తీసుకున్నారని విజిలెన్స్ అధికారులు అభియోగాలు మోపారు. అలాగే దళితుల స్కాలర్షిప్ పథకాల్లో కోట్లాది రూపాయల కుంభకోణానికి సూత్రధారిగా ఉన్నట్లు సాధు సింగ్‌పై ఆరోపణలు వచ్చాయి. కాగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రిపై చర్యలు తీసుకుంటామని ఆప్ నాయకుడు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్సింగ్ హెచ్చరించిన నెల రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇక గతవారం అవినీతికి పాల్పడిన ఆరోపణలపై క్యాబినెట్ మంత్రి విజయ్ సింగ్లా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. టెండర్లపై ఒక శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అతన్ని అరెస్టు చేసింది. చదవండి: ఇంటిముందున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్ -
మాజీ మంత్రి కొడుకు హల్చల్.. కారులో మందు తాగుతూ రోడ్డుపై..
మద్యం మత్తులో కాంగ్రెస్ మాజీ మంత్రి కొడుకు రెచ్చిపోయాడు. ఫుల్లుగా తాగి వాహనం నడుపుతూ రోడ్డుపై హల్చల్ చేశాడు. మద్యం మత్తులోనే ఓ వ్యాపారి కారును ఢీకొని అతడితో వాగ్వాదానికి దిగి కత్తితో బెదిరించాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షాజాపూర్‌కు చెందని కాంగ్రెస్ మాజీ మంత్రి హుకుమా కరాడ కొడుకు రోహితప్ సింగ్ మద్యం మత్తులో రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. తన ఎస్వీయూ(SVU) కారులో మద్యం తాగుతూ రోడ్డు మీద ఉన్న వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీకొట్టాడు. దినేస్ అహుజా అతడి అనుచరులతో కలిసి భోపాల్ నుంచి ఇండోర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, భాదితులు దినేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రోహితప్ సింగ్ మద్యం తాగుతూ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై తన కారును ఢీకొట్టడంతో వారు అతడిని ప్రశ్నించగా.. రోహితప్ మరింత రెచ్చిపోయాడు. బాధితులు తాము పోలీస్ స్టేషన్‌కు వెళతాము. నష్ట పరిహారం ఇవ్వాలని కోరడంతో వారు రోహితప్ మరింత రెచ్చిపోయాడు. మరోసారి దినేష్ కారును ఢీకొట్టాడు. దీంతో దినేష్, అతడి అనుచరులు.. రోహితప్ను బయటకు దిగాలని కోరడంతో అతడు వారిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయినట్టు తెలిపారుకాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు అష్టా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ యాదవ్ తెలిపారు. కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. Former minister and senior @INCIndia leader Hukum Singh Karada's heavily drunk son Rohitap who was driving an SUV hit the car of a businessman When asked him to come to the local police, Karada again dashed the car with his SUV @ndtv @ndtvindia pic.twitter.com/quzQf5sh1P — Anurag Dwary (@Anurag_Dwary) May 23, 2022 ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- లారీ ఢీకొని తొమ్మిది మంది మృతి -
30 ఏళ్లపాటు సేవలు.. డ్రైవర్ పాడె మోసిన మాజీ మంత్రి
సాక్షి, ఖమ్మం: వాహనం డ్రైవర్‌గానే కాకుండా కుటుంబానికి ఆప్తుడిగా ముప్పై ఏళ్ల పాటు సేవలందించిన వ్యక్తి మృతి చెందడంతో... ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన మాజీ మంత్రి కృతజ్ఞత చాటుకున్నారు. కామేపల్లికి చెందిన సిద్ధబోయిన కృష్ణ(59) మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి డ్రైవర్‌గా పనిచేశాడు. అంతేకాకుండా ముప్పై ఏళ్ల ముఖ్య అనుచరుడిగా కొనసాగారు. కాగా, కృష్ణ శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలియగానే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు చేరుకుని నివాళులర్పించారు. కృష్ణ అంత్యక్రియల్లో పాడె మోసిన దామోదర్‌రెడ్డి.. తమ కుటుంబానికి కృష్ణ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జెడ్పీటీసీ బానోత్ వెంకటప్రవీణ్‌కుమార్, నాయకులు నర్సింహారెడ్డి, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, చీమల వెంకటేశ్వర్లు, భూక్యా దళ్‌సింగ్, లక్కినేని సురేందర్, డాక్టర్ భూక్యా రాంచందర్‌నాయక్, జి.రవి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఆదిలాబాద్: ఆఫీసర్స్ క్లబ్లో రికార్డింగ్ డ్యాన్సులు -
‘మా అమ్మను కిడ్నాప్ చేశారు’
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని మానవహక్కుల మంత్రిగా పనిచేసిన తన తల్గి షిరీన్ మజారీని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆమె కుమార్తె ఆరోపించింది. వాస్తవానికి ఆమె అవినీతి నిరోధక సంస్థ కస్టడీలో ఉన్నారు. కానీ ఆమె కుమార్తె ఇమాన్ జైనాబ్ మజారీ మాత్రం పోలీసులు తన తల్లిని కొట్టి తీసుకెళ్లారని ఆరోపణలు చేశారు. అయినా ఏ వ్యక్తినైన అరెస్ట్ చేసేముందు ఏ అభియోగంతో తీసుకెళ్తున్నారో చెప్పాలి కానీ తనకు అవేమీ చెప్పలేదని కేవలం తన తల్లి లామోర్ అవినీతి నిరోధక విభాగంలో ఉందని మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు. సున్నితంగా ఉండే మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఈ ప్రభుత్వం తన తల్లిని కిడ్నాప్ చేసిందంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. తన తల్లికి ఏదైన జరిగితే ఎవరిని వదలిపెట్టనంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తన సహోద్యోగిని ఈ ఫాసిస్ట్ పాలన హింసాత్మక ధోరణితో కిడ్నాప్ చేసిందంటూ ఆరోపణలు చేశారు. తమ ఉద్యమం శాంతియుతమైనదని ఫాసిజాన్ని దిగుమతి చేసుకున్న ప్రభుత్వం దేశాన్ని గందరగోళంలోకి నెట్టాలని చూస్తోందన్నారు. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడి ఉన్నది సరిపోదన్నట్లు ఈ ఎన్నికలను నివారించేందుకే ఈ అరాచకాలు సృష్టిస్తున్నారంటూ విమర్శించారు. (చదవండి: ఉత్తర కొరియాకు వ్యాక్సిన్ ఆఫర్ ప్రకటించిన అమెరికా...కిమ్‌ని కలుస్తానంటున్న బైడెన్) -
చీప్ పాలి‘ట్రిక్స్’కు తెరలేపిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తి అర్బన్(శ్రీ సత్యసాయి జిల్లా): మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చీప్ ట్రిక్స్‌కు తెరలేపారు. శుక్రవారం కొత్తచెరువు మండలం బండ్లపల్లికి చెందిన సర్పంచ్ గీతాబాయి మామ తిరుపాల్‌నాయక్ వీధిలైట్ల కోసం బండ్లపల్లికి వెళ్తుండగా...అదే సమయంలో సోమందేపల్లికి వెళ్లున్న మాజీ మంత్రి అతన్ని దారిలో ఆపాడు. బలవంతంగా టీడీపీ కండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని టీడీపీ వాట్సాప్ గ్రూపులకు పంపారు. దీంతో మనస్తాపానికి గురైన తిరుపాల్ నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి వివరించారు. చదవండి: వైరల్ వీడియో: సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని సెల్ఫీ దిగిన కోతి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి, సీఎం జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అంతేగాని పల్లె చీప్ ట్రిక్స్‌కు లోనయ్యే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ నాయకులు ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీధర్‌రెడ్డిని ఎమ్మెల్యేగాను, వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో బండ్లపల్లి సర్పంచ్ గీతాబాయి, రూప్లానాయక్, తిరుపాల్ నాయక్, తలమర్ల మాజీ సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు ఉన్నారు. -
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా బొజ్జల పనిచేశారు. చదవండి: ఉత్తరాంధ్రపై మరోసారి అక్కసు వెల్లగక్కిన చంద్రబాబు 1994-99లో రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014లో చంద్రబాబు క్యాబినెట్లో అటవీ శాఖ మంత్రిగా బొజ్జల పని చేశారు. 2004-09లో కాంగ్రెస్ నేత ఎస్సివి నాయుడు చేతిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి శ్రీ కాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
అమ్మ ‘అమరనాథా’.. మాజీ మంత్రి ప్రాపకంలోనే ‘పుష్ప’రాజులు
ఎల్లో గ్యాంగ్ ... అదేనండి ‘పచ్చ’ నేతలు.. ఇంకా చెప్పాలంటే వాస్తవాలను తొక్కిపెట్టి విష ప్రచారం చేసే టీడీపీ నాయకులు... అందుకు వత్తాసు పలికే మీడియాలు తిమ్మని బమ్మిని చేసి... తప్పుడు ప్రచారాలకు పాల్పడే టీడీపీ నేతలు కొంతకాలంగా పెద్దాయన, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పట్టుబడిన ఎర్రచందనం కేసు నిందితుల్లో ఏ-4 అభినవ్... మంత్రి పెద్దిరెడ్డితో దిగిన ఫొటోను ప్రచురించి తమదైనశైలిలో విషపు బుద్ధిని బయట పెట్టుకున్నారు. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఏ-4 అభినవ్ మాత్రమే కాదు ఆ కేసులోని ఏ–3 అనిల్ కుడా టీడీపీకి చెందిన మాజీ మంత్రి అమరనాథరెడ్డి శిష్యులుగా తేలింది. ఆయనతో నిందితులిద్దరూ దిగిన ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన పూర్వపరాలిలా ఉన్నాయి. చదవండి: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం సాక్షి ప్రతినిధి, తిరుపతి: పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండల సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని బేటనూరు వద్ద ఇటీవల ఆ రాష్ట్ర పోలీసులు ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు యువకులను పట్టుకున్నారు. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను అనుమానం రాకుండా ఖరీదైన కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని వారి నుంచి రూ.50 లక్షల విలువైన దుంగలను సీజ్ చేసిన విషయం తెలిసిందే. పట్టుబడిన వారిలో ఏ–4గా ఉన్న అభినవ్‌ది బైరెడ్డిపల్లి మండలం, గొల్లచీమనపల్లి గ్రామం. ఇతను ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యునిగా ఉన్నాడు. కొన్నాళ్లు వైఎస్సార్సీపీలో తిరిగినప్పటికీ అతని చెడు ప్రవర్తన ముందే పసిగట్టిన జిల్లా నేతలు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వాస్తవానికి అతను ముందు నుంచీ మాజీ మంత్రి అమరనాథ రెడ్డి శిష్యుడిగానే పేరొందాడు. టీడీపీ నేతలతోనే సన్నిహితంగా మెలిగేవాడు. గతంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి గొల్లచీమనపల్లిలోని అభినవ్ ఇంటికి సైతం వెళ్లినట్టు టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. ముందుగానే సోషల్ మీడియాలో పోస్టింగులు గుమ్మడికాయల దొంగ ఎవరంటే ముందుగానే భుజాలు తడుముకున్నట్టు మాజీ మంత్రి అమరనాథరెడ్డి అభినవ్ వైఎస్సార్సీపీ నాయకులతో ఉన్న ఫొటోలను సంఘటన జరిగిన వెంటనే తన ఫేస్బుక్లో అప్డేట్ చేశారు. ఎర్రచందనం దుంగలతో పట్టుబడ్డ నిందితులను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసి దీనివెనుక ఎవరున్నారని కూడా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఈ నెపాన్ని అధికారపార్టీ మీదకు నెట్టేందుకు వైఎస్సార్సీపీ నాయకులతో అభినవ్ దిగిన ఫొటోలను పోస్టింగులు చేశారు. అభినవ్‌కు తనతో సంబంధాలున్నాయని తెలిసిపోతుందనే భయంతోనే ఇలా చేసి దీన్ని కూడా రాజకీయలబ్ధి కోసం వాడుకునేందుకు ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. ఇటీవలే అమరనాథరెడ్డిని కలిసిన ఏ–3 అనిల్ ఇక ఇదే కేసులో ఏ–3గా ఉన్న అనిల్‌కుమార్‌ది పలమనేరు పట్టణంలోని బజారువీధి. ఇతను మూడేళ్లుగా బెంగళూరుకు చెందిన గణేష్ యాదవ్ అనే వ్యక్తి వద్ద వ్యక్తిగత సహాయకునిగా ఉంటున్నాడు. అయన స్థానికంగా చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లో కీలకంగా ఉంటున్నాడు. తాజాగా కర్ణాటక పోలీసులకు చిక్కకముందు కూడా అనిల్‌కుమార్ మాజీ మంత్రి అమరనాథరెడ్డి స్వగృహంలో కలసి ఆయన్ను ఓ శుభకార్యక్రమానికి ఆహా్వనించాడు. ఇవన్నీ చూస్తుంటే ఎర్రచందనం కేసులో పట్టుబడ్డ నిందితులు మాజీ మంత్రికి బాగా పరిచయస్తులేననే విషయం స్పష్టమవుతోంది. వారం ముందే అభినవ్ని సస్పెండ్ చేశాం ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె ఎంపీటీసీ అభినవ్‌కు, వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ చిత్తూరు జిల్లా అ«ధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజులుగా సదరు ఎంపీటీసీపై ఆరోపణలు రావడంతో విచారించిన నేపథ్యంలో అనుమానాలు తలెత్తాయని, సంజాయిషీ ఇవ్వాలని నోటీసు జారీచేశామని వివరించారు. కానీ అతను స్పందించకపోవడంతో ఏప్రిల్ 23న అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చామని పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులు అతనితో పాటు, స్థానిక ఎమ్మెల్యేకు కూడా అందించామని వివరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజూ వందల సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఫొటోలు దిగుతారని, దానిని పట్టుకుని ఎల్లో మీడియా, టీడీపీ విష ప్రచారాలు చేయడం వారి దిగజారుడుతనానికి పరాకాష్ట అని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అయ్యన్న పాత్రుడి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
-
తమిళనాడు మాజీ మంత్రి ఇంట్లో ఏసీబీ దాడులు
-
మాజీ మంత్రికి ఝలక్.. 69 చోట్ల విజిలెన్స్ సోదాలు
అన్నాడీఎంకే మాజీ మంత్రులపై డీఎంకే ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. ఇప్పటికే నలుగురు మాజీలపై అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన డీవీఏసీ తాజాగా తంగమణి లక్ష్యంగా సోదాలు చేపట్టింది. ఇందులో ఇప్పటివరకు రూ.2.37 కోట్లు లెక్కలోకి రాని నగదు, 40 కేజీల వెండి, 1.5 కేజీల బంగారం సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): మాజీ మంత్రి తంగమణిని బుధవారం డీవీఏసీ (డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్) టార్గెట్ చేసింది. తంగమణి, ఆయన కుటుంబం, సన్నిహితులకు సంబంధించిన సంస్థలు, ఇళ్లు, కార్యాలయాలు అంటూ 69 చోట్ల అధికారులు సోదాల్లో నిమగ్నమయ్యారు. ఈ చర్యల్ని అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించారు. కక్షసాధింపు ధోరణి తగదని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సిద్ధం చేసిన జాబితా మేరకు.. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు సాగిన అక్రమాలు, నిధుల దుర్వినియోగం, లంచగొండితనం తదితరుల వ్యవహారాలపై ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఓ జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. వీరిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. తాజాగా, తాము అధికారంలోకి వచ్చినానంతరం ఆ జాబితాలో ఉన్న అవినీతి రాయుళ్ల భరతం పట్టే దిశగా డీఎంకే ప్రభుత్వం దూకుడు పెంచింది. తొలుత రవాణశాఖ మాజీ మంత్రి ఎంఆర్ విజయ భాస్కర్‌ను టార్గెట్ చేసి సోదాలు విస్తృతం చేసి, ఆయన్ని విచారణ వలయంలోకి తెచ్చా రు. తదుపరి ఆరోగ్యశాఖ మాజీమంత్రి ఎంఆర్ విజ య భాస్కర్, రిజస్ట్రేషన్ల శాఖ మాజీ మంత్రి వీరమ ణిని టార్గెట్ చేశారు. ఇటీవల నగరాభివృద్ధి శాఖ మంత్రి, పళనిస్వామి సన్నిహితుడు ఎస్పీ వేలుమణిపై దృష్టి పెట్టారు. తాజాగా మరో సన్నిహితుడు, విద్యుత్‌శాఖ మాజీ మంత్రి తంగమణి లక్ష్యంగా డీవీఏసీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తు లు గడించినట్టు ఆయనపై కేసు నమోదు చేసింది. ఏక కాలంలో సోదాలు 2016–2021 మధ్య కాలంలో ఆదాయానికి మించి రూ.4.85 కోట్లు ఆస్తుల్ని తంగమణి గడించినట్టు ఆధారాలతో సహా తేల్చిన డీవీఏసీ వర్గాలు కేసు నమోదు చేశాయి. ఆయన భార్య శాంతి, కుమారు డు ధరణి ధరణ్‌ను సైతం ఈ కేసులో చేర్చారు. దీంతో బుధవారం ఉదయాన్నే పలు బృందాలుగా డీవీఏసీ అధికారులు రంగంలోకి దిగారు. ఏక కాలంలో తంగమణి ఆస్తులు, సన్నిహితుల ఇళ్లు, బినామీ సంస్థలపై దాడులకు దిగారు. చెన్నై, నామక్కల్, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్ తదితర తొమ్మిది జిల్లాలతో పాటుగా ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల్లోని నివాసాలు, కార్యాలయాల్లో అనేకచోట్ల పొద్దు పోయే వరకు సోదాలు జరిగాయి. నామక్కల్ జిల్లా ఆలపాళయంలోని తంగమణి ఇంట్లో సోదాలు సాగుతున్నాయి. ఈ సమయంలో అన్నాడీఎంకే వర్గాలు అక్కడికి తరలివచ్చి వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నైలో అరుంబాక్కం, షెనాయ్ నగర్‌తో పాటుగా 14 చోట్ల, సేలంలోని తంగమణి కుమారుడు ధరని ధరణ్ ఇంట్లోనూ సోదాలు సాగుతున్నాయి. పలు ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, బినామీ సంస్థలు, పలు చోట్ల పెట్టుబడులే కాకుండా క్రిష్టోకరెన్సీలోనూ పెట్టుబడులు పెట్టినట్టుగా ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల సోదాలు ముగిసినా, తంగమణి, ధరణి ధరణ్ నివాసాలు, టైల్స్ సంస్థలు, మాల్స్‌లలో ఇంకా సోదాలు సాగుతున్నాయి. కాగా ఇప్పటివరకు రూ.2.37 కోట్లు లెక్కలోకి రాని నగదు, 40 కేజీల వెండి, 1.5 కేజీల బంగారం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కక్ష సాధింపు తగదు డీవీఏసీని ఉసిగొలిపి డీఎంకే ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతోందని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో–కన్వీనర్ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సేలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల వాగ్దానాల్ని విస్మరించిందని, వీటిని కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీ వర్గాల మీద కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా తాము నిరసనలకు పిలుపు నివ్వగానే కేసులు, దాడులు అంటూ ముందుకు సాగడం శోచనీయమన్నారు. ఈ విషయంపై నగరాభివృద్ధి శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ స్పందిస్తూ, 2011 తర్వాత తనతో పాటుగా డీఎంకే వర్గాల్ని అన్నాడీఎంకే సర్కారు పెద్దఎత్తున అరెస్టు చేయించిందని గుర్తు చేశారు. అది కక్షసాధింపు అయితే, ఇది కూడా అలాగే అనుకోనివ్వండి అని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
సాక్షి, కోలారు(కర్ణాటక): గత రెండు రెండురోజులుగా ఆనారోగ్యం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్ఎల్ జాలప్పను మాజీ సీఎం సిద్ధరామయ్య ఆదివారం పరామర్శించారు. జాలప్ప ఆరోగ్యం విషమంగా ఉందని, ప్రస్తుతానికి స్థిరంగానే ఉందని సిద్ధరామయ్య అన్నారు. మత మార్పిడి నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. జేడీఎస్ ఎప్పటికి బీజేపీకి బి – టీం గానే ఉంటుందని అన్నారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లు రద్దు చేయాలి -
మాజీమంత్రి అల్లుడి నిర్వాకం.. రూ. 6 కోట్లు తీసుకుని..
సాక్షి, చెన్నై(తమిళనాడు): కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి చెందిన మాజీమంత్రి అల్లుడు, అతడి స్నేహితుల వద్ద చెన్నైకి చెందిన వ్యక్తులు రూ.6 కోట్లు మోసం చేశారు. మాజీమంత్రి అల్లుడు ప్రవీణ్ అలెగ్జాండర్, మిత్రులు గౌతమ్, గణేష్‌కుమార్‌కు ఇటీవల చెన్నై పులియాంతోపునకు చెందిన బాలాజీ పరిచయం అయ్యాడు. బాలాజీ మిత్రుడు దినేష్ ఎలాంటి రశీదులు లేకుండా దొడ్డిదారిని బంగారంతో పాటు వాహనాలు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో తొలుత రూ.6 లక్షలకు బంగారం కొనుగోలు చేశారు. ఆ తదుపరి రూ.6.5 కోట్లకు బంగారం కొనేందుకు అలెగ్జాండర్‌తో సహామిత్రులు నిర్ణయించారు. నగదు తీసుకున్న బాలాజీ, అతడి మిత్రుడు దినేష్ పత్తాలేకుండా పోయారు. దీంతో ముగ్గురు మిత్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారించిన పోలీసులు బాలాజీ, అతడి తండ్రి తులసీదాసు, మిత్రులు మహేష్, జయకృష్ణన్‌ను ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న దినేష్‌కు శాస్త్రి భవన్లో కస్టమ్స్ వర్గాలు పలువురు సన్నిహితం అని, అందుకే అతడు తక్కువ ధరకు బంగారం, వాహనాలు, ఇతర వస్తువులను విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం: మాజీ మంత్రిపై కేసు
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.3.30 కోట్లు నగదు వసూలు చేసి.. మోసం చేశారంటూ మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీపై కేసు నమోదు చేశారు. విరుదునగర్ జిల్లా క్రైం విభాగం పోలీస్‌స్టేషన్‌లో సాతనూరుకు చెందిన రవీంద్రన్ ఓ గతంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీమంత్రి రాజేంద్రబాలాజీ, బలరామన్, బాబురామ్, ముత్తుపాండిపై విరుదునగర్ జిల్లా క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
సామూహిక అత్యాచారం కేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు
లక్నో: సామూహిక అత్యాచారం కేసులో ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. ప్రజాపతితోపాటు మరో ఇద్దరు ఆశిష్ శుక్లా, అశోక్ తివారీకి శుక్రవారం జీవిత ఖైదు విధించింది. అలాగే రెండు లక్షల రూపాయల జరిమానాను విధించింది. ఈ కేసులో నిందితులైన వికాశ్ వర్మ, రూపేశ్వర్, అమరేంద్ర సింగ్ అలియాస్ పింటూ, చంద్రపాల్‌పై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్ధోషులుగా ప్రకటించింది. ఈ కేసులో మొత్తం 17 మంది సాక్షులను విచారించారు. కాగా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో రవాణా, మైనింగ్ శాఖల మంత్రిగా ప్రజాపతి పని చేశారు. కాగా మాజీ మంత్రి, అతని ఆరుగురు అనుచరులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చిత్రకూట్‌కు చెందిన ఓ మహిళ 2017 ఫిబ్రవరి 18న యూపీలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి తాను పని కోసం లక్నోలోని ఆయన అధికారిక నివాసానికి వెళ్లినప్పుడు వీరంతా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాక తన కుమార్తెపై కూడా అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించింది. అయితే పోలీసులు తన కేసులో నిర్లక్ష్యం వహించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంత్రిపై గౌతంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం 2017 మార్చి 15న మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. -
మాజీ మంత్రిని నిర్బంధించిన రైతులు.. చేతులు జోడించి క్షమాపణ చెప్పాకే..
గుర్గావ్: ప్రధాని మోదీ కేదార్నాథ్ పర్యటన ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో వీక్షించేందుకు ఆలయానికి వెళ్లిన బీజేపీ నేతలను రైతులు దిగ్బంధించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు సాగిస్తున్న రైతులను దుర్భాషలాడారంటూ మాజీ మంత్రి మనీష్ గ్రోవర్ లక్ష్యంగా రైతులు బీజేపీ నేతలను దాదాపు 8 గంటలపాటు ఎటూ కదలనీయలేదు. పోలీసులు జోక్యం చేసుకున్నా వెనక్కి తగ్గలేదు. చివరికి మనీష్ గ్రోవర్ చేతులు జోడించి క్షమాపణ చెప్పాకే అందరినీ వదిలిపెట్టినట్లు రైతులు తెలిపారు. హరియాణా రాష్ట్రం రొహ్తక్ జిల్లా కిలోయిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, రైతులకు క్షమాపణ చెప్పారంటూ వచ్చిన వార్తలను మాజీ మంత్రి గ్రోవర్ ఖండించారు. మరో ఘటన.. హిసార్ జిల్లా నిర్నావుండ్ వద్ద కొందరు వ్యక్తులు బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ రామ్‌చందర్ కారు అద్దాలను పగులగొట్టారు. చదవండి: (కొరడా దెబ్బలు తిన్న సీఎం.. ఎందుకో తెలుసా?) -
మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనుమానాస్పద మృతి
లక్నో: బీజేపీ సీనియర్ నేత ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి ఆత్మారామ్ తోమర్ (75) అనుమానాస్పద స్థితిలో మరణించారు. యూపీలోని బాగ్పత్ జిల్లా బారౌత్ బిజ్రాల్ రోడ్‌లోని ఆయన నివాసంలో గురువారం అర్థరాత్రి చనిపోయి ఉండటం కలకలం రేపింది. మెడకు టవల్ చుట్టి ఉండటం, ఆయన స్కార్పియో కారు అదృశ్యం కావడంతో హత్యకు గురయ్యారనే అనుమానాలు బలపడుతున్నాయి. సంఘటనా స్థలంలో పోలీసులు, కార్యకర్తలు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆత్మారామ్‌ను టవల్‌తో గొంతుకు ఉరి బిగించి చంపినట్లు తెలుస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులు డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఇంటి తలుపు బయటి నుండి లాక్ చేసి ఉన్నట్టు జిల్లా ఎస్పీ నీరజ్ కుమార్ జడౌన్ తెలిపారు. దగ్గరి బంధువులపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కాగా ఆత్మారామ్ 1997లో యూపీ మంత్రిగా పనిచేశారు. -
ఎంతటి దుస్థితి! అఫ్గాన్ మాజీ మంత్రి నేడు డెలివరీ బాయ్‌గా
అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారాయి. సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ భయంతో పక్కదేశాలకు తరలి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సామాన్యులతో పాటు ఆ దేశ రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆ దేశ మాజీ మంత్రి డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. మొన్నటి దాక అధికారంలో ఉన్న ఆయన ఇప్పుడు ఇంటింటికి వెళ్లి పిజ్జాలు అందిస్తున్నారు. ఆయనే అఫ్గానిస్తాన్ ఐటీ మాజీ మంత్రి సయ్యద్ అహ్మద్ షా సాదత్. మొన్నటి దాక స్వదేశంలో ఐటీ అభివృద్ధిపై దృష్టి సారించిన సాదత్ ఇప్పుడు విదేశంలో పిజ్జాలు అందించడంపై దృష్టి పెట్టారు. ఈ దుస్థితికి గల కారణాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ‘గతేడాది దేశ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీతో తనకు విబేధాలు, మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశా. రాజీనామా అనంతరం కొంతకాలం ప్రశాంతంగా జీవనం సాగింది. అనంతరం నా వద్ద ఉన్న డబ్బు ఖర్చయిపోయింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో డెలివరీ బాయ్‌గా చేయాల్సి వచ్చింది’ అని తెలిపారు. సాదత్ ప్రస్తుతం జర్మన్‌లోని లీప్జిగ్ పట్టణంలో పిజ్జాలు సైకిల్‌పై డెలివరీ చేస్తున్నారు. ఈ పని చేయడానికి తానేమీ మొహమాట పడడం లేదని పేర్కొన్నారు. సాదత్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అఫ్గానిస్తాన్‌లో మొబైల్ నెట్వర్కింగ్ అభివృద్ధి చేశారు. మాజీ మంత్రిగా మారిన అనంతరం స్వదేశంలోనే ఉన్నారు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమిస్తారని ముందే గ్రహించి తాలిబన్లు ఆక్రమించే వారం రోజుల ముందే జర్మన్‌కు వచ్చేశారు. ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవడంతో కుటుంబ పోషణ కోసం విధిలేక డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. وزير الاتصالات والتكنولوجيا الأفغاني السابق سيد أحمد سادات يلجأ لمهنة توصيل طلبات الطعام على متن دراجة هوائية في مدينة لايبزيغ الألمانية التي وصلها نهاية عام 2020، بعد تخليه عن منصبه pic.twitter.com/zfFERbqCmD — قناة الجزيرة (@AJArabic) August 24, 2021 -
సాయం చేసి ఫోటోలు తీసుకోవడమా ?
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): దిగజారిన నేటి రాజకీయాల విష వలయంలో తాను ఇరుక్కున్నానని మాజీమంత్రి సంతోష్‌లాడ్ రేషన్ కిట్లు పంపిణీ వేళ ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. కలఘటికి తాలూకా కూడళిగి గ్రామంలో పేదలకు రేషన్ కిట్లు పంపిణీ చేస్తూ ఉద్వేగంతో మాట్లాడారు. కిట్లు ఇచ్చేటప్పుడు చాలా బాధేస్తుందన్నారు. రేషన్కిట్లు ఇచ్చి ఫొటోలు తీసుకోవడం నాకు సిగ్గు కలిగిస్తుందన్నారు. కలఘటికిలో క్యాంటీన్ ఓపెన్ చేశా మని రోజు 1000 మందికి ఆహారం అందిస్తున్నామని ఇది తనకెంతో ఆత్మ సంతృప్తి కలిగిందన్నారు. ప్రస్తుతం సహాయం చేసిన విషయాలన్ని చెప్పు కోవడం వంటి విచిత్రమైన పరిస్థిలో ఉన్నామన్నారు. చదవండి: మొదటి భార్యను వదిలేసి రెండో పెళ్లి.. మూడు రోజులకే.. -
అత్యాచారం కేసు.. మాజీ మంత్రి అరెస్ట్
సాక్షి, చెన్నై: మాజీ మంత్రి మణికంఠన్ చిక్కారు. బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో తలదాచుకుని ఉన్న ఆయన్న చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆదివారం చెన్నై తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచారు. మాజీ మంత్రి మణికంఠన్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని, మూడుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని నటి చాందిని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఆరు సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఆయన్ను విచారించేందుకు చెన్నై పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తూనే మరో వైపు ఆధారాల కోసం ఆయనకు పీఏగా, గన్‌మెన్‌గా వ్యవహరించిన వారిని విచారించారు. ఆయన వాహనానికి డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి పత్తా లేకుండా పోయాడు. అలాగే బలవంతంగా మూడుసార్లు చాందినికి అబార్షన్ చేసిన డాక్టరును విచారించేందుకు పోలీసులు కసరత్తు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో అందిన రహస్య సమాచారం మేరకు ఒక బృందం శనివారం బెంగళూరు వెళ్లింది. అక్కడి శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో తలదాచుకుని ఉన్న మాజీ మంత్రిని అదుపులోకి తీసుకుంది. రాత్రికి రాత్రే చెన్నై తరలించిన పోలీసులు ఉదయాన్నే అడయార్ స్టేషన్లో ఉంచి తీవ్రంగా విచారణ చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం సైదాపేట కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. విచారణ నిమిత్తం ఆయన్ను కస్టడీకి తీసుకునేందుకు సోమవారం పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. చదవండి: నటితో సహజీవనం: ఆమె ఎవరో తెలియదన్న మాజీ మంత్రి -
మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ కన్నుమూత
భువనేశ్వర్: రాష్ట్ర మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ (68) బుధవారం కన్ను మూశారు. కరోనా చికిత్స నుంచి కోలుకుని ఇతర దీర్ఘకాల రోగాలతో ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు పేర్కొన్నారు. మే నెల తొలి వారంలో ఆయన కోవిడ్ బారిన పడి చికిత్స పొందారు. మాజీ ముఖ్యమంత్రి నీలమణి రౌత్రాయ్ కుమారుడిగా రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తిగా ఆయన పేరొందారు. భద్రక్ జిల్లా బాసుదేవ్‌పూర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసన సభకు వరుసగా 6 సార్లు ఎన్నికయ్యారు. అటవీ-పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు విష్ణువ్రత రౌత్రాయ్ ఈ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజల కోసం పోరాడిన నాయకుడు మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బిజయశ్రీ రౌత్రాయ్ నిస్వార్థంతో ప్రజల కోసం పోరాడిన నాయకుడని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సానుభూతి ప్రకటించారు. ఆయన సేవలు చిరస్మరణీయం మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ సేవలు చిరస్మరణీయమని గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ సంతాపం ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఒడిశా స్పీకర్ సూర్యనారాయణ పాత్రో, పలువురు మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తదితరులు బిజయ శ్రీ రౌత్రాయ్ మృతి ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. -
భార్యాభర్తల తరహాలో జీవితం.. మూడుసార్లు అబార్షన్: నటి చాందిని
సాక్షి, చెన్నై: నటి చాందిని వ్యవహారంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే మాజీ మంత్రి మణికంఠన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు నాగపట్టినం, రామానాథపురం జిల్లాల్లో గాలిస్తున్నట్లు తెలుస్తోంది. పలు తమిళ చిత్రాల్లో నటించిన చాందినీ ఇటీవల చెన్నై వెప్పేరీ పోలీస్‌స్టేషన్‌లో మణికంఠన్‌పై ఇటీవల ఫిర్యాదు చేశారు. అందులోని వివరాలు.. మలేషియా పర్యాటకాభివృద్ధి రాయబార కార్యాలయంలో పనిచేస్తున్నపుడు విధి నిర్వహణలో భాగంగా తరచూ భారత్‌కు రాకపోకలు సాగించేదానిని. పర్యాటకాభివృద్ధి సంబంధించి మాట్లాడాల్సి ఉందని అప్పట్లో రామనాథపురం అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఉండిన మణికంఠన్.. భరణి అనే వ్యక్తిద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో 2017 మే 3వ తేదీన మంత్రి హోదాలో మణికంఠన్‌ను ఆయన ఇంటి వద్ద కలిశాను. అదే సమయంలో నా సెల్‌ఫోన్ నెంబరు తీసుకున్న మణికంఠన్ పెళ్లిపేరుతో నమ్మబలికాడు. చెన్నై బిసెంట్‌నగర్‌లోని ఒక అపార్టుమెంటులో భార్యాభర్తల తరహాలో జీవితం సాగించాం. ఈ సమయంలో మూడుసార్లు నాకు తన స్నేహితుడైన ఓ డాక్టర్ సహాయంతో అబార్షన్ చేయించాడు. వేధింపులతో నా కళ్లు దెబ్బతిన్నాయి. పెళ్లి చేసుకుందామని కోరడంతో.. రహస్యంగా తీసిన నా అంతరంగ ఫొటోలను టెలిగ్రాం ద్వారా పంపి బెదిరింపులకు దిగాడు.. అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జీవాల్ అదేశాల మేరకు అడయారు మహిళా పోలీస్‌స్టేషన్‌లో పలుసెక్షన్లపై మణికంఠన్, భరణిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
కరోనాతో మాజీ మంత్రి నాగిరెడ్డి కన్నుమూత
ధర్మవరం: కరోనాతో మాజీ మంత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గరుడమ్మగారి నాగిరెడ్డి(68) శనివారం మృతి చెందారు. పదిరోజుల క్రితం కరోనాతో బాధపడుతున్న ఆయనను అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గరుడమ్మగారి నాగిరెడ్డి ధర్మవరం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా 1983, 1985, 1989లో టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. తెలుగు సాహిత్యం మీద అవగాహన ఉన్న నాగిరెడ్డి సొంతంగా పత్రిక పెట్టి సంపాదకునిగా వ్యవహరించారు. ఈ పరిచయంతోనే టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పార్టీలో చేర్చుకుని టీడీపీ టికెట్ ఇచ్చారు. మూడో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన చేనేత జౌళి, చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. భార్య సునీత, కుమారుడు సతీష్‌రెడ్డి ఉండగా.. కుమారుడు 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమారుని మరణంతో రాజకీయాలకు స్వస్తి పలికి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. నాగిరెడ్డి మృతి పట్ల ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: సినీ గేయ రచయిత అదృష్ట దీపక్ కన్నుమూత కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట -
గౌరీ అమ్మ ఇక లేరు: గవర్నరు, సీఎం సంతాపం
తిరువనంతపురం: కేరళ ప్రముఖ కమ్యూనిస్టు నేత, మాజీమంత్రి నేత కేఆర్ గౌరీ కన్నుమూశారు. కేరళ రాజకీయాల్లో ఐరన్ లేడీగా పేరుగాంచిన కేఆర్ గౌరీ తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయసు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు. మరికొన్ని వారాల్లో ఆమె 102వ పుట్టిన రోజులు జరుపుకునేవారు. కేరళ గవర్నరు, ముఖ్యమంత్రి సహా పలువురు రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు గౌరీ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాలాతో సహా పార్టీ సీనియర్ నాయకులు ఆమె స్వస్థలమైన అలప్పులో ఘనంగా నివాళులు అర్పించారు. ‘‘దోపిడీకి వ్యతిరేకంగా సమ సమాజ నిర్మాణంకోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధురాలు. మరింత ప్రగతిశీల సమాజాన్నినిర్మిస్తామని ప్రతిజ్ఞ చేయడం ద్వారా ఆమెకిచ్చే నివాళి. రెడ్ సెట్యూట్’’ అని సీఎం విజయన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో భూసంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి ఆమె చేసిన కృషి చిర స్మరణీయమని గవర్నరు సంతాపం తెలిపారు. అసాధారణమైన ధైర్యం, ఉత్తేజకరమైన నాయకత్వంతో మహిళా సాధికారతకు నిజమైన చిహ్నంగా నిలిచారన్నారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం చేసిన ఆమె పోరాటాలు కేరళ ప్రజలు గుర్తు పెట్టుకుంటారని ట్వీట్ చేశారు. ఆధునిక కేరళకు పునాదులు వేసిన వారిలో కేఆర్ గౌరీ అమ్మ ఒకరని ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఆమెకు నివాళులర్పించారు. మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఆమె అని గుర్తు చేసుకున్నారు. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేరళలోని రాజకీయ రంగాలలో అనేక కీలక ఫైనాన్స్, పరిశ్రమలు మంత్రి పదవులను చేపట్టారు. గౌరీ అమ్మ చారిత్రాత్మక భూస్వామ్య వ్యతిరేక భూ సంస్కరణల చట్టాన్ని తీసుకు రావడంలో ఆమె చేసిన కృషి అమోఘం. భూమిలేని రైతులకు భూమిని సొంతం చేసుకోవడానికి మార్గం సుగమమైంది.1952లో ట్రావెన్కోర్-కొచ్చిన్ శాసనసభకు ఎన్నిక కావడంతో గౌరీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1957లో కమ్యూనిస్ట్ లెజెండ్ ఇఎంఎస్ నంబూద్రిపాత్ నేతృత్వంలోని ప్రపంచంలోని మొట్టమొదటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన కమ్యూనిస్ట్ ప్రభుత్వ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. 1960 లలో కమ్యూనిస్టులు విడిపోయిన తరువాత, గౌరీ సీపీఎంలో చేరారు, ఆమె భర్త మరో ముఖ్య నాయకుడు టీవీ థామస్ సీపీఐలో చేరారు. మొదటి కేరళ శాసనసభ నుండి 1977 వరకు ఆమె ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మొత్తం ఆరు క్యాబినెట్లలో 16 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. Hon'ble Governor Shri Arif Mohammed Khan said : "My heartfelt condolences on the demise of Smt K R #GouriAmma , former minister & veteran political leader. Her exceptional courage and inspiring leadership made her a true symbol of woman empowerment": PRO,KeralaRajBhavan(T1/2) pic.twitter.com/WQjHwiYZRC — Kerala Governor (@KeralaGovernor) May 11, 2021 Com. K R Gauri was a brave fighter, dedicated her life to end exploitation, build an egalitarian society. She made seminal contributions in building the Communist movement & as an administrator. Let's show respects, by pledging to build a more progressive society. Red Salute! pic.twitter.com/NYzyv8wyjD — Pinarayi Vijayan (@vijayanpinarayi) May 11, 2021 -
కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత, సీఎం సంతాపం
-
కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత, సీఎం సంతాపం
సాక్షి, పట్నా : దేశవ్యాప్తంగా రెండో దశలో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా భారీగా విస్తరిస్తోంది. బిహార్ మాజీ విద్యాశాఖ మంత్రి, జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి కన్నుమూశారు. గతవారం కరోనా బారిన పడిన ఆయన పట్నాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో సోమవారం తుది శ్వాస విడిచారు. దీనిపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం విచారకరమని, విద్య, రాజకీయ రంగాలకు కోలుకోలేని నష్టమని సీఎం తెలిపారు. బిహార్ తారాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న చౌదరి అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర విద్యా మంత్రి పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలను మే 15 వరకు మూసివేయాలని, పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. అలాగే ఈ ఏడాది ఆరోగ్య సంరక్షణ కార్మికులందరికీ ఒక నెల బోనస్ జీతాన్ని అందించనుంది. మరోవైపు 8,690 కొత్త కేసులతో ఆదివారం నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 3,24,117 కు చేరింది. 27 తాజా మరణాలతో కరోనా మరణాల సంఖ్య 1,749కు పెరిగింది. बिहार सरकार के पूर्व मंत्री एवं तारापुर से जदयू विधायक डॉ. मेवालाल चौधरी जी के असामयिक निधन से जदयू परिवार मर्माहत है। उनका निधन न केवल राजनीतिक बल्कि शैक्षणिक एवं सामाजिक जगत के लिए भी अपूरणीय क्षति है। ईश्वर उनके परिजनों को संबल प्रदान करें। उन्हें हमारी विनम्र श्रद्धांजलि। pic.twitter.com/nUvoeveAbo — Janata Dal (United) (@Jduonline) April 19, 2021 -
ఈఎస్ఐ కుంభకోణం: మాజీ మంత్రి పేషీ నుంచే..!
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్) కుంభకోణం కేసులో దరాప్తు, సోదాలు చేసిన కొద్దీ అనేక అక్రమాలు, అక్రమార్జనలు వెలుగు చూస్తున్నాయి. అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డిల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సోదాలు చేయడం, వారి నుంచి దాదాపు రూ.3 కోట్ల నగదు, రూ.కోటి విలువైన నగలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో వీరికి కూడా సంబంధాలు ఉన్నప్పుడు మరి రెండేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ వీరిని ఎందుకు అరెస్టు చేయలేదు? కనీసం విచారించ లేదా? విచారించినా ఆ విషయాన్ని బయటికి చెప్పలేదా? ఒకవేళ ఏసీబీ వీరిని ప్రశ్నించేందుకు యత్నించినా.. ఏవైనా రాజకీయశక్తులు అడ్డు పడ్డాయా? అప్పటి మంత్రి పేషీ నుంచి కథంతా నడిచిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2019లో ఏసీబీ విచారణ ప్రారం భమవుతున్న దశలో కార్మిక శాఖకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి ఏసీబీకి ఓ లేఖ రాశారు. అందులో అక్రమాలు కిందిస్థాయిలోనే జరిగాయని, ఉన్నతాధికారులకు సంబంధం లేవన్నట్టుగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడదే ఉన్నతాధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా మారి అరెస్టు కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఏసీబీ నివేదిక ఆధారంగా రంగంలోకి ఈడీ మనీలాండరింగ్ జరిగిందన్న ఏసీబీ నివేదిక (8ఎఫ్ఐఆర్లు) ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని డిసెంబర్ నుంచి ప్రశ్నిస్తోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగానే కొత్తగా శ్రీనివాసరెడ్డి, ముకుందరెడ్డిల పేర్లు తెరపైకి రావడం గమనార్హం. కాగా ఇదే పనిని గతంలో ఏసీబీ ఎందుకు చేయలేకపోయింది? అన్న చర్చ సాగుతోంది. ఏపీలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఇదే తరహా కేసులో అరెస్టయ్యారు. ఇక్కడా, అక్కడా కుంభకోణం జరిగిన తీరు (మోడస్ ఆపరెండి) ఒకటే కావడం గమనార్హం. ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై కన్ను ముకుందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, దేవికారాణి, శ్రీహరిబాబు తదితరుల బ్యాంకు ఖాతాలు, ఆస్తులపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. 2014 నుంచి 2019లో ఈ కేసు వెలుగు చూసే వరకు వీరు, వీరి బంధువుల బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన ఆన్లైన్ లావాదేవీలు, కొనుగోలు చేసిన ఆస్తులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కూడబెట్టిన నగలు, చెల్లించిన ఆదాయపు పన్ను తదితరాలను విశ్లేషిస్తోంది. ముఖ్యంగా బ్యాంకు లాకర్లు తెరిచేందుకు అంతే వేగంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇంతకాలం అధికారులు మాత్రమే ఈ కుంభకోణంలో ఉన్నారనుకున్నప్పటికీ తాజాగా ఈడీ రంగప్రవేశంతో వాతావరణం వేడెక్కింది. ఈ కుంభకోణానికి మంత్రి కార్యాలయం నుంచే కుట్ర జరిగిందా? అన్న అనుమానాలు వాస్తవానికి ముందు నుంచీ ఉన్నాయి. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ డిప్యూటీ డైరెక్టర్ కలకుంట్ల పద్మలు ఇష్టానుసారంగా, నిబంధనలకు విరుద్ధంగా మందుల సరఫరా కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు మంత్రి కార్యాలయం అభ్యంతరం తెలపలేదు. ‘‘కార్మిక శాఖ నిబంధనలకు విరుద్ధంగా నాలుగేళ్లు కాంట్రాక్టులు ఇచ్చినా ఏనాడూ వివరణ కోరలేదు. విజిలెన్స్ రంగప్రవేశం చేసేవరకూ ఆడిటింగ్‌లో ఎలాంటి లోపాలు వెలుగుచూడలేదు’’ అంటూ ఈఎస్ఐ సిబ్బంది అనేక సందేహాలు లేవనెత్తినప్పటికీ వీటిపై ఏసీబీ అంతగా దృష్టి సారించలేదు. కానీ, ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ కావడంతో కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. పేద కార్మికుల సొమ్మును తినేశారు! ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు రూ.700 కోట్లకుపైగా మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టి ఉంటాయని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈఎస్ఐ ఆసుపత్రి పేద కార్మికులకు ఒక వరం లాంటిది. రూ.25 వేలలోపు వేతనం ఉన్న కార్మికుల నుంచి నెలానెలా రూ.500 వరకు చందా కింద వసూలు చేస్తారు. అలా సేకరించిన నిధులతో పాటు ప్రభుత్వం ఇచ్చే నిధులు కలిపి అనారోగ్యం బారిన పడిన కార్మికులకు వైద్యసేవలు అందిస్తారు. అలాంటి బీద కార్మికులకు దక్కాల్సిన మందులను, వైద్య పరీక్షలకు కావాల్సిన మెడికల్ కిట్లను తదితరాల ధరలను ఇష్టారీతిన పెంచుకుంటూ పోవడం, కమీషన్ల రూపంలో అందినకాడికి దండుకోవడం నాలుగేళ్లపాటు యధేచ్ఛగా సాగింది. ‘‘ఆరుగాలం శ్రమించిన పంటను పందికొక్కులు తిన్నట్లు, తాము చందాగా చెల్లించిన డబ్బులను కొందరు అవినీతిపరులు అదేవిధంగా పంచుకుతిన్నారంటూ’’ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఏపీలో కూడా ఇదే తరహాలో రూ.988 కోట్ల కొనుగోళ్లలో సుమారు రూ.150 కోట్లకుపైగా కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇక్కడా, అక్కడా.. పాత్రధారులు వేరైనా.. సూత్రధారులు ఒకరేనా? అన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఏపీలో జరిగిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదల అయిన బుర్రా ప్రమోదరెడ్డి పేరిట తెలంగాణ, ఏపీల్లో 7 డొల్ల కంపెనీలు ఉన్నాయి. కాగా శనివారం హైదరాబాద్‌లో శ్రీనివాసరెడ్డి, ముకుందరెడ్డి ఇంటితో పాటు ప్రమోదరెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించడం, రూ.1.15 కోట్లను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. -
బీజేపీకి షాకిచ్చిన మాజీ కేంద్రమంత్రి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు జైసింగ్రావ్ గైక్వాడ్ పాటిల్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌కు ఆయన మంగళవారం ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ది కోసం పనిచేసే వారు బీజేపీకి అవసరం లేదంటూ విమర్శలు గుప్పించారు. సీనియర్ నాయకుడిగా పార్టీకోసం పనిచేయడానికి సిద్దంగా ఉన్నా, తనకు అవకాశం కల్పించడంలేదని తన రాజీనామా లేఖలో ఆయన ఆరోపించారు. అందువల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. గతంలో తాను కేంద్రంతో పాటు రాష్ట్రంలో మంత్రిగా పనిచేశానని చెప్పారు. ఎంపీగానో, ఎంఎల్ఏగానో ఉండాలని లేదు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భావించాను, గత పదేళ్లుగా అలాంటి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నాను. అయినా తనకు పార్టీ అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంపై స్పందించడానికి చంద్రకాంత్ పాటిల్ నిరాకరించారు. -
డ్రగ్స్ కేసు: మాజీ మంత్రి కుమారుడి ఇంట్లో సోదాలు
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సినీ నటి రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న బెంగళూరు కేంద్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు మంగళవారం నగరంలోని మాజీ మంత్రి, దివంగత జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా బంగ్లాపై దాడి చేశారు. మరో విషయం ఏంటంటే ఈ కేసులో నిందితుడైన ఆదిత్య అల్వా సీసీబీ ఏజెంట్లు దాడుల ప్రారంభిన నాటి నుంచే కనిపించకుండా పోయాడు. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిపై కేసులు నమోదు చేయగా, తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక సెర్చ్ వారెంట్ పొందిన తర్వాతనే హెబ్బాల్ సమీపంలోని ఆదిత్య అల్వా 'హౌస్ ఆఫ్ లైఫ్' అని పిలువబడే ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. (చదవండి: డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం) నాలుగు ఎకరాలలో విస్తరించిన ఈ బంగ్లాను ఆదిత్య అల్వా పార్టీలు నిర్వహించడానికి ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన వారిలో సినీ నటులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ, పార్టీ ఆర్గనైజర్ వీరెన్ ఖన్నా, రియల్టర్ రాహుల్, ఆర్టీఓ గుమస్తా బి.కె.రవిశంకర్ ఉన్నారు. -
రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత
పట్నా/న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రఘువంశ్ ప్రసాద్ సింగ్(74) కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రఘువంశ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రఘువంశ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. భార్య కొంతకాలం క్రితమే మరణించారు. గత శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఎయిమ్స్ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. జూన్‌లో రఘువంశ్‌కు కోవిడ్–19 నిర్ధారణ కావడంతో పట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. ఇటీవల మళ్లీ కోవిడ్ లక్షణాలు బయటప డటంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆయన మృతదేహాన్ని ఆదివారం రాత్రి పట్నాకు తరలించారు. వైశాలి జిల్లాలోని స్వగ్రామం షాపూర్ గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. సోషలిస్టు నేత అయిన రఘువంశ్ ప్రసాద్ బిహార్‌లోని వైశాలి లోక్‌సభ స్థానం నుంచి ఐదు పర్యాయాలు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు విశ్వాసపాత్రునిగా ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. 4 రోజుల క్రితం ఆస్పత్రిలో ఉండగానే ఆర్జేడీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ చీఫ్ లాలూప్రసాద్కు లేఖ రాశారు. కానీ, ఆయన రాజీనామాను రాంచీ జైలులో ఉన్న లాలూ అంగీకరించలేదు. ఆరోగ్యం కుదుటపడ్డాక మాట్లాడుకుందామంటూ జవాబిచ్చారు. -
ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి అంత్యక్రియలు
సాక్షి, గోదావరిఖని(రామగుండం): ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి మాతంగి నర్సయ్య పార్థివదేహానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్య సమస్యతో మంగళవారం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా నర్సయ్య పార్థివదేహాన్ని బుధవారం గోదావరిఖని కాకతీయనగర్‌లోని ఇంటివద్ద ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాష్ట్ర సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ చేరుకొని పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ నివాళి అర్పించారు. అనంతరం మాతంగి అంతిమయాత్రలో పాల్గొన్నారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మాతంగి నర్సయ్య నాలుగుదశాబ్దాలుగా తనకు సుపరిచితులన్నారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అన్నారు. ఈ ప్రాంతం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేక సమస్యలు పరిష్కరించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రామగుండం కార్పొరేషన్ మేయర్ అనిల్‌కుమార్, డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమేందర్, గోదావరిఖని వన్‌టౌన్ సీఐ పర్శ రమేశ్, ఆర్ఐ శ్రీధర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
ప్రజా నాడి తెలిసిన నేత మరిలేరు
సాక్షి, కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డా. ఎస్ఏ ఖలీల్‌బాషా మరి లేరనే నిజాన్ని ఆయన అభిమానులు..పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గుండెపోటుతో ఆయన మంగళవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ప్రజల నాడి పసిగట్టిన నేతగా గుర్తింపు పొందిన ఖలీల్ బాషా 1974 నుంచి రెండు రూపాయల ఫీజుతో వైద్యం చేస్తూ విస్తృత ప్రాచుర్యం పొందారు. పట్టణ ప్రజలకేగాక, గ్రామీణ ప్రజలకు బాగా చేరువయ్యారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రవేశించి 1994, 1999లలో కడప నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత ప్రముఖ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో చేరినా ఎంతోకాలం ఇమడలేకపోయారు. 2019 ఎన్నికలకు ముందు తన ముగ్గరు కుమారులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేశారు. వయసు మీద పడినా ఆయన వైద్య సేవలను మాత్రం వీడలేదు. కరోనా బారిన పడిన వారికి సేవలందించారు. ఈ క్రమంలోనే గతనెల 30న వైరస్ బారిన పడ్డారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. తర్వాత నెగెటివ్ వచ్చింది. మూడు రోజుల క్రితం గుండెనొప్పి రావడంతో పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు కడపలోని ఆయన స్వగృహం వద్ద కోవిడ్ – 19 నిబంధనలను అనుసరించి జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురి సంతాపం మాజీ మంత్రి ఖలీల్‌బాషా పట్ల డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పారీ్టకి తీరని లోటని చెప్పారు. ఖలీల్ బాషా మృతిపట్ల టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. -
కరోనాతో ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి మృతి
సాక్షి, లక్నో : కరోనా సామాన్యుల నుంచి రాజకీయనేతల వరకు అందరినీ కబలిస్తుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఘూరా రామ్ గురువారం కరోనా వైరస్ కారణంగా మరణించారు. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రెండు రోజుల క్రితం ఆయన్ని లక్నోలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో చేర్పించినట్లు ఆయన కుమారుడు సంతోష్ కుమార్ వెల్లడించారు. పరీక్షలు నిర్వహించగా ఘూరా రామ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రత్యేక వైద్య సిబ్బంది ఆయనకు చికిత్స అందించగా, అప్పటికే ఆరోగ్యం విషమించడంతో కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌కు ఘూరా రామ్ ఎంతో విశ్వాసపాత్రుడిగా కొనసాగారు. ఘూరా రామ్ 1993, 2002, 2007 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా, మాయావతి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలో చేరిన ఆయన జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. (క్షీణించిన మధ్యప్రదేశ్ గవర్నర్ ఆరోగ్యం) -
మాజీ మంత్రి కుటుంబ సభ్యుల నిర్వాకం
దొండపర్తి(విశాఖ దక్షిణ): టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి జిల్లా మాజీ మంత్రి కుటుంబ సభ్యుల అక్రమాలకు జిల్లాలో కొండలు తరిగిపోయాయి. బినామీల పేరుతో అనుమతులు పొంది గత ప్రభుత్వ హయాంలో చేసిన మైనింగ్ అక్రమాలు బయటకొస్తున్నాయి. గోరంత అనుమతులు తీసుకొని కొండలకు కొండలు తవ్వేస్తున్న వ్యవహారాలు గనుల శాఖ విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు సదరు సంస్థకు రూ.5,91,23,012 అపరాధ రుసుము విధించారు. జిల్లాలో రోలుగుంట మండలం కంచుగుమ్మల గ్రామంలో సర్వే నెంబర్ 1లో 4.10 హెక్టార్లలో ఉన్న కొండను హిమాని స్టోన్ క్రషర్ అనే సంస్థకు 2009లో మైనింగ్ కోసం 15 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. 2024 వరకు వీరికి లీజు సమయం ఉంది. 47,060 క్యూబిక్ మీటర్లకే అనుమతి... వాస్తవానికి ఈ సంస్థ 47,060 క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ తవ్వకాలకు మాత్రమే అనుమతులు పొందింది. అయితే గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేపట్టింది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోదరుడు, కుమారుల హస్తం ఉండడంతో అధికారులు ఈ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో అనుమతులు పొందిన దాని కంటే అధికంగా 1,36,126.08 క్యూబిక్ మీటర్లు తవ్వేసింది. అంతటితో ఆగకుండా పక్కన ఉన్న కొండ ప్రాంతంలో 6,073.6 క్యూబిక్ మీటర్లు అక్రమంగా, ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్ చేసేసింది. జిల్లాలో భారీ పెనాల్టీ రోలుగుంట మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై దృష్టిసారించిన గనుల శాఖ రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ప్రతాప్‌రెడ్డి బృందం గురువారం దాడులు నిర్వహించింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో హిమానీ స్టోన్ క్రషర్ సంస్థకు రూ.5,91,23,012 అపరాధ రుసుమును 15 రోజుల్లో చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారులు బి.రవికుమార్, ఎం.సురేష్‌కుమార్, జి.సత్యమూర్తి, ఆర్.అమ్మాజి పాల్గొన్నారు. జిల్లాలో 11 అక్రమ మైనింగ్‌లు? దీంతో పాటు జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, ఇతర ప్రాంతాల్లో 11 చోట్ల అక్రమ మైనింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రాథమిక పరిశీలనలో నాలుగింటిపై త్వరలో దాడులు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు చెందిన బినామీ సంస్థల ద్వారా ఈ మైనింగ్ అక్రమాలకు పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి రూ.100 కోట్లకు పైగా పెనాల్టీ విధించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
మాజీ మంత్రి ఇంట్లో విషాదం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా(పిఠాపురం): తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కొప్పన మోహన్ రావు సతీమణి రమాదేవి అనారోగ్యంతో కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె మృతిపట్ల పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుతోపాటూ పలువురు వైఎస్సార్సీపీ నాయకులు సంతాపం తెలిపారు. -
కొడుక్కి బుద్ధి చెప్పిన మాజీ మంత్రి
గ్వాలియర్: పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన తన కుమారుడికి మాజీ మంత్రి ఒకరు తగిన గుణపాఠం చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో గురువారం బైక్‌పై రోడ్డుపైకి వచ్చిన యువకుడిని పోలీసులు ఆపారు. ముఖానికి మాస్క్ లేకుండా ఎందుకు వచ్చాయని ప్రశ్నించగా సదరు యువకుడు పోలీసులపై జులుం ప్రదర్శించారు. ‘మా నాన్న ఎవరో తెలుసా’ అంటూ పోలీసులను బెదిరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు. (తండ్రి ప్రేమ.. స్క్రాప్ నుంచి బైక్ తయారీ) ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా అనుచరుడైన మాజీ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ స్పందించారు. ఎందుకంటే పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది ఆయన కుమారుడే. తన కొడుకు రిపుదమాన్ చేసిన పనికి తోమర్ విచారం వ్యక్తం చేయడమే కాకుండా అదే రోజు సాయంత్రం అతడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి పోలీసులకు క్షమాపణ చెప్పించి, జరిమానా చెల్లించారు. అక్కడితో ఆగకుండా తర్వాతి రోజు కొడుక్కి గుణపాఠం చెప్పారు. మున్సిపల్ కార్మికులతో కలిసి శుక్రవారం చెత్త ఎత్తించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు శిక్షగా పారిశుద్ధ్య పని చేయించారు. కొడుకు చేసిన తప్పును సరిదిద్ది హుందాగా ప్రవర్తించిన ప్రద్యుమన్ సింగ్ తోమర్‌ను అందరూ అభినందిస్తున్నారు. (స్పెషల్ ట్రైన్ ఎక్కాలంటే.. ఇవి పాటించాలి) -
జైలు నుంచి వచ్చిన డీకేకు ఘనస్వాగతం
సాక్షి, బెంగళూరు: యాభై రోజులపాటు జైల్లో గడిపి తిరిగి బెంగళూరు చేరుకున్న కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఘన స్వాగతం లభించింది. అభిమానులు భారీ సంఖ్యలో చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు. మనీ ల్యాండరింగ్ కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరైంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి భారీ ర్యాలీ మధ్య నగరంలోని కేపీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సిద్ధరామయ్య, పరమేశ్వర్ తదితరులు ఈ కార్యక్రమానికి రాలేదు. -
శివకుమార్‌కు బెయిల్
సాక్షి, బెంగళూరు: మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన కర్ణాటక కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. సెప్టెంబర్ 3వ తేదీన ఢిల్లీలో సుదీర్ఘ విచారణ అనంతరం ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఢిల్లీ తీహార్ జైల్లో కస్టడీలో ఉన్నారు. బుధవారం ఢిల్లీ హైకోర్టులో ఆయన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. పాసుపోర్టును అప్పజెప్పడంతో పాటు రూ.25 లక్షల పూచీకత్తు సమర్పించాలని, ఈడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది. -
అనారోగ్యంతో మాజీ మంత్రి మృతి
సాక్షి, హైదరాబాద్ : పురపాలక శాఖ మాజీ మంత్రి మాదాటి నర్సింహారెడ్డి (96) అనారోగ్యంతో తన నివాసంలో గురువారం మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా మొసలపల్లిలో జన్మించిన నర్సింహారెడ్డి 1962లో మొట్లపల్లి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 1970 - 75 వరకు పరకాల సమితి అధ్యక్షుడిగా, 1981లో సమితి మెంబర్‌గా నియమితులయ్యారు. సమితి ఆధ్వర్యంలోనే జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా 1985 వరకు పనిచేశారు. 1985, 89లలో శాయంపేట నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిల కేబినెట్లో పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. నర్సింహారెడ్డికి ముగ్గురు సంతానం. కొడుకు, కోడలు అమెరికాలో ప్రముఖ వైద్యులు. పెద్ద కుమారుడు ఆయనతోనే హైదరాబాద్‌లో ఉన్నారు. కాగా, మాదాటి నర్సింహారెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. -
చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై న్యాయ విద్యార్థి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును స్యుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు బాధిత యువతి తన ఎల్ఎల్ఎం కోర్సును కొనసాగించేందుకు వీలుగావేరే కాలేజీకి బదిలీ చేయాలని యోగి ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఐజీ స్థాయి పోలీసు అధికారి ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించాలని సూచించింది. అనంతరం కేసును అలహాబాద్ హైకోర్టుకు సుప్రీం బదిలీ చేసింది. అలాగే బాధితురాలితో పాటు, ఆమె తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. న్యాయమూర్తుల బృందం గురువారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు లేఖ రాయడంతో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చేపట్టింది. కాగా బీజేపీ నాయకుడు చిన్మయానంద్‌పై చిన్మయానంద్‌కు చెందిన లా కాలేజీలో చదువుతున్న విద్యార్థిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేసిన అనంతరం కనిపించకుండా పోయింది. చివరకు న్యాయవాదులు, కోర్టుల జోక్యంతో ఆమెను రాజస్థాన్‌లో గుర్తించారు పోలీసులు. అనంతరం గత శుక్రవారం సుప్రీంకోర్టులో హాజరుపరిచారు. అయితే తనను తాను రక్షించుకునే క్రమంలో తన ముగ్గురు కళాశాల సహచరులతో కలిసి షాజహాన్‌పూర్ నుంచి పారిపోయానని బాధిత యువతి న్యాయమూర్తులకు తెలిపిన సంగతి విదితమే. చదవండి : మాజీ కేంద్రమంత్రిపై లైంగిక ఆరోపణలు చిన్మయానంద్‌పై ఆరోపణలు చేసిన యువతి ఆచూకీ లభ్యం -
‘గృహ’ కుంభకోణంలో 48 మందికి శిక్షలు
సాక్షి, ముంబై: జల్గావ్ గృహనిర్మాణ పథకం కుంభకోణంలో ధులే జిల్లా కోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రము ఖులైన మాజీ మంత్రి, శివసేన నేత సురేష్ జైన్, ఎన్సీపీ నేత గులాబ్రావ్ దేవకర్‌లతోపా టు మొత్తం 48 మందిని జల్గావ్ జిల్లా కోర్టు దోషులుగా ప్రకటించింది. వీరిలో సురేష్ జైన్‌కు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. గులాబ్‌రావు దేవకర్‌కు అయిదేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా, బిల్డర్ జగన్నాథ్ వాణీ, రాజేంద్ర మయూర్‌లకు ఏడేళ్ల జైలు, రూ.40 కోట్ల జరిమానా, ప్రదీప్ రాయసోనికి అయిదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 1999లో జల్గావ్ మున్సిపాలిటీ ప్రారంభించిన గృహనిర్మాణ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయి. -
జైట్లీ మృతికి బీసీసీఐ ప్రగాఢ సంతాపం
న్యూఢిల్లీ: క్రికెట్ పాలకుడిగా తనదైన ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి బీసీసీఐ సంతాపం ప్రకటించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, సుదీర్ఘ కాలం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీని సమర్ధుడైన పాలకుడిగా కొనియాడింది. జైట్లీ మృతి తనకు, దేశానికి తీరని లోటని బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా అన్నారు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో పలువురు స్థానిక క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగారు. వారిలో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, టీమిండియా ప్రస్తుత ఆటగాళ్లైన కెప్టెన్ కోహ్లి, ధావన్, ఇషాంత్ శర్మ తదితరులున్నారు. జెట్లీ తనకు పితృ సమానుడని గంభీర్ అభివర్ణించాడు. జైట్లీ మృతి కలచి వేసిందని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. జైట్లీ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు విండీస్‌తో టెస్టులో నల్ల బ్యాడ్జీలు ధరించారు. -
జైట్లీ అస్తమయం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత, స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణకు ఆద్యుడు అరుణ్ జైట్లీ (66) ఇకలేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఏయిమ్స్‌లో శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు కన్నుమూశారు. బీజేపీ అగ్రనేతగా.. కష్టకాలంలో బీజేపీని అదుకున్న మూలస్తంభాల్లో ఒకరిగా అభిమానుల గుండెల్లో ఆయన స్థానం చెరగనిది. సుష్మాస్వరాజ్ వంటి మహానేత హఠాన్మరణాన్ని (ఆగస్టు 6న) మరవక ముందే.. అదేతరానికి చెందిన జైట్లీ వంటి మరో రాజకీయ ప్రముఖుడిని కోల్పోవడం దేశానికి మరీ ముఖ్యంగా బీజేపీకి పెద్దలోటు. ఆగస్టు 9న శ్వాస ఇబ్బందులతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చగా అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్సపొందుతూ.. శనివారం తుదిశ్వాస విడిచారని ఏయిమ్స్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అరుణ్ జైట్లీ మృతి బీజేపీకి తీరని శోకాన్ని మిగిల్చింది. జైట్లీ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ ప్రముఖులు, బీజేపీయేతర పార్టీల నేతలు, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలకు ఆయన లోటు పూడ్చలేనిదన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జైట్లీ భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతాయి. పార్టీలకతీతంగా అభిమానం పొంది.. రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధనలో జైట్లీ చొరవను ప్రశంసించకుండా ఉండలేం. స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ విషయంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనే ఏకాభిప్రాయంతో అద్భుతమైన చట్టానికి రూపకల్పన చేశారు. నరేంద్ర మోదీ తొలి ఐదేళ్ల ప్రభుత్వంలో జైట్లీది క్రియాశీలక పాత్ర. కీలక వ్యూహకర్తగా ఆయన వ్యవహరించిన తీరు అందరికీ గుర్తే. ఆర్థిక శాఖతోపాటు రక్షణ, కార్పొరేట్ వ్యవహారాలు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వంటి కీలక బాధ్యతలను ఆయన సమర్థంగా నిర్వర్తించారు. ఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం మొదలై.. బీజేపీలో ఉన్నతస్థానానికి చేరినా.. కరడుగట్టిన హిందుత్వ రాజకీయాల జోలికి ఆయనెప్పుడూ వెళ్లలేదు. అందుకే పార్టీలకు అతీతంగా ఆయనంటే ఎనలేని గౌరవాభిమానాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఆమోదం పొందడం, ఆ తర్వాత ప్రభుత్వం సమర్థవంతంగా నడవడం వెనక కూడా జైట్లీ కృషి చాలా ఉంది. రాజకీయాల్లో ఉంటూ.. న్యాయవాదిగా పలు ముఖ్యమైన కేసుల్లో తనముద్ర వేశారు. ప్రముఖ కంపెనీలకు న్యాయవాదిగా, న్యాయ సలహాదారుగా ఆయన పనిచేశారు. బీజేపీలో ఆయనో ట్రబుల్ షూటర్‌గా పేరు సంపాదించారు. విషాదంలో బీజేపీ శ్రేణులు... సుష్మాస్వరాజ్ మృతి నుంచి తేరుకోకముందే మరో అగ్రనేత జైట్లీని కోల్పోవడంతో బీజేపీ శ్రేణులు నిర్వేదంలో (విషాదం) మునిగిపోయాయి. జైట్లీ ఇకలేరనే వార్త తెలియగానే కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎయిమ్స్ వద్దకు చేరుకున్నారు. భౌతికకాయం జైట్లీ ఇంటికి చేరాక అక్కడికి కూడా భారీగా అభిమానులు చేరుకున్నారు. బీజేపీలో కొత్తతరం నేతలకు స్ఫూర్తిగా నిలిచే జైట్లీ... 2019 ఎన్నికల సమయంలో ఆరోగ్యం సహకరించక బహిరంగ సభలకు వెళ్లకపోయినా.. పార్టీ కార్యాలయం నుంచే ప్రెస్మీట్ల ద్వారా విపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ.. పార్టీ విజయంలో కీలక భూమిక పోషించారు. ప్రభుత్వం, పాలన సమర్థవంతంగా మందుకెళ్లడంలోనూ కీలకంగా వ్యవహరించారు. పార్టీ ట్రబుల్ షూటర్: అడ్వాణీ ‘అందరినీ కలుపుకుని పోయేవాడిగా.. పార్టీలకు అతీతంగా జైట్లీ అందరి మదిలో ఉంటారు. జైట్లీ భోజన ప్రియుడు. మంచి రెస్టారెంట్ అనిపిస్తే.. అక్కడోసారి భోజనం చేయండని సూచించేవాడు. ప్రతి దీపావళికి కుటుంబసమేతంగా ఇంటికొచ్చి శుభాకాంక్షలు చెప్పేవాడు’ అని బీజేపీ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి ఎల్కే అడ్వాణీ గద్గదస్వరంతో జైట్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, ఇతర విపక్ష నేతలు కూడా జైట్లీ మృతిపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జైట్లీల మధ్య దశాబ్దాలుగా స్నేహం ఉంది. గతేడాది నుంచే అనారోగ్యంతో.. 2014లో ఆయన బరువు తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. గతేడాది మే 14న ఆయన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం చాలా వేగంగా క్షీణించింది. దీంతో ఆయన విశ్రాంతి తీసుకునేందుకే ప్రాధాన్యమివ్వాల్సి వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో మృదు కణజాల కేన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. దీంతో 2019 ఎన్నికల్లో పోటీపై విముఖత చూపించటమే కాక... భారీ విజయం సాధించిన తర్వాత కేబినెట్లో తనకు చోటు వద్దని కరాఖండిగా చెప్పేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2000 నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో పార్టీ పక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖుల నివాళి దక్షిణ ఢిల్లీలోని కైలాశ్ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. అక్కడే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, హర్షవర్ధన్, జితేంద్ర సింగ్, ఎస్ జైశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు తదితరులు జైట్లీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్ శుక్లా కూడా ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతోపాటు వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. మరణవార్త విని బాధపడ్డాను: సీజేఐ ‘దేశం ఓ ఉన్నతమైన సీనియర్ లాయర్, గొప్ప నేతను కోల్పోయింది. ఆయన మరణ వార్త వినగానే బాధపడ్డాను. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని అన్నారు. న్యాయవాదిగా ప్రస్థానం జైట్లీది న్యాయవాద కుటుంబం. న్యూఢిల్లీలో డిసెంబర్ 28, 1952లో జన్మించారు. ఆయన తండ్రి ఢిల్లీలో పేరు ప్రఖ్యాతులున్న న్యాయవాది మహరాజ్ కిషన్ జైట్లీ. తల్లి రతన్ ప్రభ సామాజిక కార్యకర్త. చిన్నప్పటి నుంచి చర్చాగోష్టుల్లో పాల్గొనటం అంటే జైట్లీకి చాలా ఇష్టం. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేశారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా పాల్గొని ఆ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. దాదాపు 19 నెలలు జైల్లో ఉన్నారు కూడా. అప్పట్లో ఏబీవీపీ యువమోర్చా కన్వీనర్ బాధ్యతలు నిర్వహించేవారు. 1977లో ఏబీవీపీ అ«ఖిల భారత కార్యదర్శిగా ఉన్నారు. 1980లో బీజేపీలో చేరారు. పార్టీ తరఫున ఎన్నో కేసులు వాదించారు. బోఫోర్స్ వంటి కుంభకోణాలను వెలికితీయడంలో జైట్లీ పాత్ర కీలకం. కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా, జనతాదళ్ నేత శరద్‌యాదవ్ వంటి వారు కూడా జైట్లీ క్లయింట్లే. న్యాయపరమైన అంశాలపై పుస్తకాలు కూడా రాశారాయన. జైట్లీ భార్య సంగీత. ఆయనకు కుమారుడు రోహన్, కుమార్తె సొనాలీ. పిల్లలిద్దరూ న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు. జైట్లీ పార్థివ దేహం వద్ద అమిత్ షా నివాళి, జైట్లీ భార్య సంగీతను ఓదారుస్తున్న సోనియా 2001లో వాజ్‌పేయితో.. 2004లో కలకత్తా హైకోర్టులో లాయర్‌గా.. 1974లో ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా.. -
సాగు లెక్క..ఇక పక్కా
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్) : ప్రభుత్వం జిల్లాల వారీగా పంట కాలనీల ఏర్పాటుకు వీలుగా ఫిబ్రవరిలో ప్రారంభించిన రైతు సమగ్ర సర్వే ఇటీవల పూర్తయింది. వ్యవసాయాధికారులు జిల్లాలో ప్రతి రైతు కుటుంబం వివరాలు, వారు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకున్నారు. అధికారులు సర్వే ఫారాల్లో ముందుగానే ప్రింట్ చేసిన 13 అంశాలు కాకుండా మరో 14అంశాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. రైతుకు మేలు చేసేందుకు పంటకాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనికి అనుగుణంగా రైతుల వివరాలు సేకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం కాలనీల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇదీ సాగు లెక్కా.. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రైతు సమగ్ర సర్వేలో మొత్తం 5.10లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతున్నట్లు తేలింది. 1.21లక్షల మంది రైతులు ఉండగా, ప్రధానంగా పత్తి పంటను సాగు చేస్తున్నారు. పత్తి తరువాత సోయా, అంతర పంటగా కంది పంటలు తరువాత స్థానంలో నిలిచాయి. మొత్తం 18మండలాల్లోని 102 క్లస్టర్ల పరిధిలోని 508 గ్రామాల్లో ఈ సర్వే కొనసాగింది. మొత్తం 105మంది సిబ్బంది జిల్లా వ్యాప్తంగా 90వేల రైతు కుటుంబాలను జూన్ వరకు సర్వే చేపట్టారు. జిల్లాలో అత్యధికంగా జైనథ్ మండలంలో 14113మంది రైతులు ఉండగా, మావల మండలంలో అత్యల్పంగా కేవలం 775మంది రైతులు మాత్రమే ఉన్నారు. పంట కాలనీల ఏర్పాటుకు... ప్రభుత్వం జిల్లాల వారీగా పంట కాలనీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉండటంతో రైతుల పక్కా సమాచారం అవసరమైంది. అయితే వ్యవసాయ శాఖ వారు ప్రతీ ఏటా రైతులు వేసిన పంటల వివరాలను సేకరిస్తారు. ఈ వివరాల్లో చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉండటంతో మరోసారి రైతు సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. గతంలో రైతుల సాగు వివరాలు తెలుసుకోవడం ఒక రకంగా చాలా కష్టంగా ఉండిందనే చెప్పవచ్చు. రైతులు బ్యాంకులో ఒక పంట పేరిట రుణం తీసుకుంటే.. బీమా కోసం మరో పంట నమోదు చేయించేవారు. దీంతో పాటు పంట రుణం కోసం ఇంకో పంట చూపించడం సాధారణంగా మారింది. దీంతో రైతులు అసలు ఏఏ పంటలు సాగు చేస్తున్నారు అని తెల్సుకోవడం కొంత ఇబ్బందిగానే మారింది. అయితే ఈ సమగ్ర సర్వేతో రైతుల పక్క వివరాలు తెలియడంతో పంట కాలనీల ఏర్పాటు దిశగా ముందడుగు పడే అవకాశం ఉంది. ఈ సర్వే ద్వార ఒక ఒక నిర్ణీత ప్రదేశంలో ఎక్కువగా సాగయ్యే పంటలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించి, వాటి దిగుబడి పెంచేందుకు, విస్తృత మార్కెట్ కల్పించేందుకు అవకాశం కలుగనుంది. అలాగే ఫుడ్ ప్రాసెసిసింగ్, క్రాప్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక పరిపుష్టి చేకుర్చేందుకు అవకాశాలు మెరుగుపడనున్నాయి. కొనసాగుతున్న ఆన్లైన్.. సమగ్ర సర్వేలో సేకరించిన వివరాలు ప్రత్యేకమైన పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఏఈవోలు వారి క్లస్టర్ గ్రామాల్లో ఆఫ్‌లైన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్ చేస్తున్నారు. వారికి ఇచ్చిన ట్యాబ్‌లలో ఈ పూర్తి సర్వే వివరాలు నమోదు చేస్తున్నారు. ఒక్కసారి ఆన్లైన్ ప్రక్రియ పూర్తి అయితే ఒక్క క్లిక్‌తో ఏ గ్రామంలోని వివరాలైన తెలుసుకునే వీలుటుంది. అన్ని జిల్లాల నుంచి సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తుండటంతో రైతుల సమస్త సమాచారం ఒకే చోటు లభించే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్క రైతు వివరాలను ఆన్లైన్ చేసేందుకు కనీసం 20–30నిమిషాలు పడుతుండటంతో ఆన్లైన్ ప్రక్రియ కొంత నెమ్మదిగా కొనసాగుతోంది. గ్రామాల వారీగా నివేదికలు పంపించాం సమగ్ర సర్వేపై ప్రభుత్వానికి గ్రామాల వారీగా నివేదికలు పంపించాం. గ్రామాల వారీగా సాగు విస్తీర్ణం, పంటల వివరాలు ఆన్లైన్ చేశాం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్, రైతుబంధు పనుల్లో కొంత సిబ్బంది బిజీగా ఉండటంతో రైతుల వారీగా ఆన్లైన్ చేసే పనులు కొంత నెమ్మదిగా కొనసాగుతున్నా యి. ఏఈవోలు వారి వారి క్లస్టర్ సమాచా రాన్ని ఆన్లైన్ చేయాలని ఆదేశాలు జారీ చే సాం. త్వరలో పూర్తిస్థాయిలో ఆన్లైన్ చే స్తాం. – ఆశాకుమారి, డీఏవో,ఆదిలాబాద్ -
మాజీ మంత్రి కుమారుడికి బెదిరింపులు..?
సాక్షి, వరంగల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కుమారుడిని పలువురు శనివారం ఫోన్లో బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఓ హత్యతో సంబంధం ఉందని దానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, బయటకు తెలియకుండా ఉండాలంటే తమకు రూ 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని సమాచారం. దీనిపై పోలీసులకు మాజీ మంత్రి తనయుడు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
మాజీ మంత్రులకు మరణశిక్ష
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ మంత్రి లుత్‌ఫోజ్మన్ బాబర్‌కు గ్రెనేడ్ దాడి కేసులో స్థానిక కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. మాజీ మంత్రి బాబర్‌తో పాటు మరో 19 మందికి ఆ కేసులో మరణశిక్షను ఖరారు చేశారు. తీర్పు సందర్బంగా స్పెషల్ కోర్టు న్యాయమూర్తి షెహజాద్ నురుద్దిన్ ఆ సంఘటనను వివరిస్తూ.. ఈ నిందితులు ఇక జీవించే హక్కు లేదని ఉద్విగ్నభరితంగా తీర్పులు వెలువరించారు. ఇదే కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్ రెహ్మాన్‌కు జీవిత ఖైదు శిక్ష పడింది. 2004, ఆగస్టు 21న జరిగిన గ్రేనేడ్ దాడిలో 20 మందికిపైగా మరణించారు. సుమారు 500 మంది గాయపడ్డారు. షేక్ హసీనాను టార్గెట్ చేస్తూ గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం బంగ్లా ప్రధాని అయిన హసీనా.. దాడి సమయంలో ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే పేలుడు వల్ల హసీనా పాక్షికంగా వినికిడిని కోల్పోయారు. బహిరంగ సభ కోసం వచ్చిన షేక్ హసీనా ట్రక్కు నుంచి దిగుతున్న సమయంలో దాడి జరిగింది. ఇదే కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ సలామ్ పింటూకు కూడా మరణశిక్షను ఖరారు చేశారు. బీఎన్పీ పార్టీలో కార్యదర్శిగా చేసిన హరిస్ చౌదరీకి జీవిత శిక్షను వేశారు. గ్రేనేడ్ దాడి కేసులో మరో 11 మంది ప్రభుత్వ అధికారులకు కూడా శిక్ష ఖరారైంది. -
మాజీ మంత్రి బస్వారాజ్ సారయ్యకు షాక్
-
‘చంద్రబాబు అనుభవం దీనికే పనికొచ్చింది’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుభవముందని ప్రజలు ఓట్లు వేస్తే ఆ అనుభవాన్ని దోచుకోవడానికి, దాచుకోవడానికే ఉపయోగించారని కాంగ్రెస్ మాజీ మంత్రి సి. రామచంద్రయ్య విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, దీనికి నిదర్శనం కాగ్ రిపోర్టేనని ఆరోపించారు. అసెంబ్లీ ఆఖరి రోజున కాగ్ రిపోర్ట్ రావడం వల్ల కొన్ని విషయాలు చర్చకు రాలేదని, మొదట్లో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెడితే చర్చకు తావు ఉండేదని ఆయన అభిప్రాయ పడ్డారు. చంద్రబాబు ప్రపంచం అంతా తిరిగి అప్పులు తీసుకువచ్చారని, ఆ భారం అంతా ప్రజలపైనే పడుతుందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 32 శాతం అప్పులే కట్టాలన్నారు. డబ్బును దుర్వినియోగం చేయడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన 271 ప్రాజెక్టుల్లో ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదని విమర్శించారు. చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల 2018-19 చివరినాటికి రాష్ట్రం రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. -
102వ ఏట కన్నుమూసిన మాజీ మంత్రి
లక్నో : ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి బేగమ్ హమీదా హబిబుల్లా తన 102 ఏట కన్నుమూశారు. లక్నోలో ఈ తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నవాబ్ నజీర్ యర్ జంగ్ బహదూర్ కుమార్తె అయిన హమీదా లాండ్ ఆఫ్ అవద్గా పేరుగాంచిన ప్రముఖ సంఘసంస్కర్త. పూణెలోని ఖడక్వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీ స్థాపకుడు, మేజర్ జనరల్ ఇనాయత్ హబిబుల్లాను హమీదా పెళ్లాడారు. 1965లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి హమీదా.. యూపీ సామాజిక, దళిత సంక్షేమ శాఖ మంత్రి పదవితో పాటు మరికొన్ని పదవులతో ప్రజలకు సేవలు అందించారు. హమీదా అంత్యక్రియలు ఆమె స్వగ్రామం బరబంకీలోని సైధాన్పూర్లో జరిగాయి. -
అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలుగుదేశం నుంచి వలసల పరంపరకు అడ్డుకట్ట వేసినా ఫలితం లేకుండా పోతుందా..? అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదా..? ఆ పార్టీ ప్రస్థానం ఇక ముగిసినట్లేనా..? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీ కనుమరుగు కానుందా..? అంటే... జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవలే మూడు జిల్లాల అధ్యక్షులు, పది నియోజకవర్గాల ఇన్చార్జిలు టీడీపీకి టాటా చెప్పి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో చేరారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి ‘చెయ్యేత్తి’ జై కొట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు ఇరుపార్టీల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 26 తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుండటం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆగని వలసలు.. ‘దేశం’లో అయోమయం ఉమ్మడి జిల్లాలో గతంలో జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన చింతకుంట విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి, చొప్పదండి ఇన్చార్జి మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కశ్యప్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అన్నమనేని నర్సింగరావు, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పేర్యాల రవీందర్రావు, మంథని నియోజకవర్గం ఇన్చార్జి కర్రు నాగయ్య టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. అందులో 10 నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కరువయ్యారు. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఒకరు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంతనాలతో పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మాజీ ఎంపీ మల్లు రవి గృహంలో చర్చలు కూడా జరిపారు. క్రిస్మస్ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో పార్టీలో చేరేందుకు అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటారనుకున్న సదరు నేత సైతం వలసబాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. రంగంలోకి చంద్రబాబు వేగులు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికే జిల్లాకు చెందిన టీడీనీ ప్రథమ శ్రేణి నేతలు తలోదారి చూసుకున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నేతలు సైతం తమ భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో కాకపోతే ఇకపార్టీ మారడం ఇబ్బందిగా పరిణమించే అవకాశాలు ఉండడంతో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్నారు. టీడీపీలోనే ఉంటే రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనే అనుమానాలు తలెత్తుతుండడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు డోలాయమానంలో పడుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఉమ్మడి జిల్లాలో తిరుగులేని శక్తిగా వెలుగొందిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలో వలసలు ఇలాగే జరిగితే పార్టీలో మిగిలేది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద టీడీపీకి గడ్డు రోజులు వచ్చాయని సొంత పార్టీలోనే బాహాటంగా చర్చించుకోవడం గమనార్హం. ఇదే సమయంలో చంద్రబాబు దూతలు ఇటీవల ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ద్వితీయశ్రేణి నేతలకు పదవులు కట్టబెట్టేందుకు పలువురి పేర్లను పరిశీలించారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్లో సీనియర్ నేతలంతా వలసబాట పట్టడంతో పార్టీకి మూడు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిల కోసం అధిష్టానం వెదకడం ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోంది. -
ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడుదాం
నిజామాబాద్ సిటీ(నిజామాబాద్ అర్బన్): ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ వాదులంత ఐక్యంగా ఉంటూ ప్రభుత్వంపై పోరాడుదామని మాజీమంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఇటీవల టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి న నాయకులు, కార్యకర్తలకు స్వాగత సమావేశాన్ని ఏ ర్పాటు చేశారు. దీనిలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పాలన దేశంలో ఎక్కడా లేదన్నారు. ఎవరు మాట్లాడితే వారిపై కేసులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఆ పార్టీలో గౌరవం లేనివారు కాంగ్రెస్‌లోకి రావాలన్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి జిల్లాకు 30 టీఎంసీలు నీళ్లు రాకుండా సీఎం అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జి ల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను బైపాస్ రోడ్డులో నిర్మించ డం ద్వారా జనం ఇబ్బంది పడతారని పీఎస్ఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోకి వస్తాననుకోలేదు: అరికెల గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకుడిగా చేసిన టీడీపీని వదిలి కాంగ్రెస్‌లో చేరుతానని ఎప్పుడూ ఊ హించలేదని మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నా రు. రాష్ట్రం ఏర్పడ్డాక టీడీపీకి ఆదరణ లేకుండా పో యిందన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులతో కాంగ్రెస్‌లో చేరానన్నారు. 35 ఏళ్లపాటు టీడీపీలో పనిచేశానన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాడాలంటే కాంగ్రెస్‌యే సరైన వేదికని అన్నారు. జీవనది ఎప్పటికి ఎండిపోదని, అలాంటిదే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ చీఫ్ తాహెర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాం గ్రెస్ అధ్యక్షుడు కేశవేణు, నాయకులు బాల్‌రాజు, ము ప్పా గంగారెడ్డి, శేఖర్‌గౌడ్, రత్నాకర్, జావిద్, సుజన్, విపుల్, చరణ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, నగర అధ్యక్షురాలు చంద్రకళ ఉన్నారు.