
బేగమ్ హమీదా హబిబుల్లా
లక్నో : ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి బేగమ్ హమీదా హబిబుల్లా తన 102 ఏట కన్నుమూశారు. లక్నోలో ఈ తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నవాబ్ నజీర్ యర్ జంగ్ బహదూర్ కుమార్తె అయిన హమీదా లాండ్ ఆఫ్ అవద్‌గా పేరుగాంచిన ప్రముఖ సంఘసంస్కర్త.
పూణెలోని ఖడక్‌వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీ స్థాపకుడు, మేజర్ జనరల్ ఇనాయత్ హబిబుల్లాను హమీదా పెళ్లాడారు. 1965లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి హమీదా.. యూపీ సామాజిక, దళిత సంక్షేమ శాఖ మంత్రి పదవితో పాటు మరికొన్ని పదవులతో ప్రజలకు సేవలు అందించారు. హమీదా అంత్యక్రియలు ఆమె స్వగ్రామం బరబంకీలోని సైధాన్‌పూర్‌లో జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment