దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతామహిళా డాక్టర్ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసుల దర్యాప్తుల్లో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. ఘటన జరిగే ముందు రోజే నిందితుడు బాధితురాలి కదలికలను గమనించి ఆమెను వెంబడించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు వెల్లడైంది.
ట్రైనీ వైద్యురాలిపై ఆగష్టు9న(శుక్రవారం తెల్లవారుజామున) అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు రోజు అంటే ఆగష్టు 8న వైద్యురాలిని ఆసుపత్రిలని చెస్ట్ మెడిసిన్ వార్డ్‌లో ఫాలో అయినట్లు సంజయ్ రాయ్ తెలిపాడు.
ఇందుకు సంబంధించి ఆగష్టు 8న ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. పౌర వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ బాధితురాలితోపాటు మరో నలుగురు జూనియర్ డాక్టర్లను వెంబడించినట్లు కనిపిస్తుంది.
కాగా ఆగష్టు 8న నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ వైద్యురాలు.. విశ్రాంతి కోసం ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 1 గంటలకు సెమినార్ హాల్‌కు వెళ్లింది. సెమినార్ హాలులో తెల్లవారుజామున 2.30 గంటలకు ఓ జూనియర్ డాక్టర్ ఆమెతో మాట్లాడారు. వారి సంభాషణ అనంతరం వైద్యురాలు నిద్రపోయింది. ఆ సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్‌లోకి ప్రవేశించి.. వైద్యురాలిపై హత్యాచారానికి ఒడిగట్టాడు. సంజయ్ రాయ్ తెల్లవారుజామున 4 గంటలకు ప్రాంగణంలోకి ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అంతేగాక నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన బ్లూటూత్ హెడ్‌సెట్ ఆధారంగా రాయ్‌ని అరెస్ట్ చేశారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. బాధితురాలికి న్యాయ చేయాలని కోరుతూ వైద్యులు, వైద్య సిబ్బంది విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు సైతం విచారణ చేపట్టింది. ఈ ఘటనలో కేసు నమోదు చేయడం, విచారణలో ఆలస్యంపై బెంగాల్ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. అయితేసంజయ్ రాయ్ మానసిక స్థితిని అంచనా వేయడానికి సీబీఐ కొందరు మానసిక విశ్లేషకులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందితుడిని అన్ని కోణాల్లో ప్రశ్నించిన తర్వాత అతడు ఓ 'కామ పిశాచి' అని నిర్ధారించారు. జంతులాంటి ప్రవృత్తితో విచ్చలవిడిగా తయారయ్యాడని తేల్చారు. పోర్న్ వీడియోలకు బానిసై, కామోన్మాదం బాగా తలకెక్కిన స్థితిలో దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని గుర్తించారు.
విచారణ సమయంలో సంజయ్ రాయ్‌లో ఎలాంటి భయం కానీ పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. సెమినార్ హాల్లోకి ప్రవేశించడం దగ్గరి నుంచి, జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేయడం, ఆ తర్వాత ఆమెను చంపేయడం వరకు పూసగుచ్చినట్టు అతడు చెబుతుండడం చూసి మానసిక నిపుణులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ముఖ్యంగా, అత్యాచారం ఎలా చేసిందీ చెబుతున్నప్పుడు అతడి ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు లేకపోగా, అదేదో సాధారణమైన చర్య అయినట్టు అతడు జరిగింది జరిగినట్టు చెప్పడం సీబీఐ బృందాన్ని నివ్వెరపరిచింది. అదే సమయంలో సీబీఐ సంజయ్ రాయ్‌తోపాటు ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, మరో నలుగురు వైద్యులను పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment