ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ మంత్రి, ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఫవాద్ చౌదరి లైవ్ టీవీ షోలో బోరున విలపించారు. దేశద్రోహం కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్‍పై విడుదలైన ఆయన.. జైలు జీవితాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
పాకిస్తాన్ ఎన్నికల సంఘం అధికారులను బెదిరించారనే ఆరోపణలతో ఫవాద్ చౌదరిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు జీవితం ఎలా ఉందని, కుటుంబసభ్యుల పరిస్థితి ఏంటని టీవీ యాంకర్ ఫవాద్‌ను ప్రశ్నించారు.
తనను అరెస్టు చేసినప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫవాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తన చేతికి సంకెళ్లు, మొహానికి ముసుగు వేసి కోర్టుకు తీసుకెళ్లారని, ఫోన్ కూడా లాక్కున్నారని చెప్పారు. ఆ ఫోన్ ఇంకా తనకు తిరిగి ఇవ్వలేదన్నారు. జైల్లో ఉన్నప్పుడు కుమారులు తనను చూసేందుకు వచ్చినప్పుడు చాలా బాధేసిందని చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే బోరున విలపించారు. కన్నీటిని చేతులతో తుడుచుకుంటూనే మాట్లాడారు.
ఫవాద్‌కు ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేయొద్దనే షరతుతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
చదవండి: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు..
Comments
Please login to add a commentAdd a comment