షిరీన్ మజారీ
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని మానవహక్కుల మంత్రిగా పనిచేసిన తన తల్గి షిరీన్ మజారీని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆమె కుమార్తె ఆరోపించింది. వాస్తవానికి ఆమె అవినీతి నిరోధక సంస్థ కస్టడీలో ఉన్నారు. కానీ ఆమె కుమార్తె ఇమాన్ జైనాబ్ మజారీ మాత్రం పోలీసులు తన తల్లిని కొట్టి తీసుకెళ్లారని ఆరోపణలు చేశారు. అయినా ఏ వ్యక్తినైన అరెస్ట్ చేసేముందు ఏ అభియోగంతో తీసుకెళ్తున్నారో చెప్పాలి కానీ తనకు అవేమీ చెప్పలేదని కేవలం తన తల్లి లామోర్ అవినీతి నిరోధక విభాగంలో ఉందని మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు.
సున్నితంగా ఉండే మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఈ ప్రభుత్వం తన తల్లిని కిడ్నాప్ చేసిందంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. తన తల్లికి ఏదైన జరిగితే ఎవరిని వదలిపెట్టనంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తన సహోద్యోగిని ఈ ఫాసిస్ట్ పాలన హింసాత్మక ధోరణితో కిడ్నాప్ చేసిందంటూ ఆరోపణలు చేశారు. తమ ఉద్యమం శాంతియుతమైనదని ఫాసిజాన్ని దిగుమతి చేసుకున్న ప్రభుత్వం దేశాన్ని గందరగోళంలోకి నెట్టాలని చూస్తోందన్నారు. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడి ఉన్నది సరిపోదన్నట్లు ఈ ఎన్నికలను నివారించేందుకే ఈ అరాచకాలు సృష్టిస్తున్నారంటూ విమర్శించారు.
(చదవండి: ఉత్తర కొరియాకు వ్యాక్సిన్ ఆఫర్ ప్రకటించిన అమెరికా...కిమ్‌ని కలుస్తానంటున్న బైడెన్)
Comments
Please login to add a commentAdd a comment