imrankhan
-
PAK:ఎన్నికలు రిగ్గింగ్ చేశారు: సుప్రీంకోర్టులో ఇమ్రాన్ పిటిషన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పార్టీ ఎన్నికల్లో గెలవకుండా రిగ్గింగ్ చేసి ప్రజా తీర్పును దొంగిలించాలని ఆయన ఇదివరకే వ్యాఖ్యానించారు. తాము బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి తన పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ మొత్తం 180 సీట్లు గెలుచుకుందని, అయితే రిగ్గింగ్ వల్ల ఆ స్థానాలు 92కు పడిపోయాయని ఇమ్రాన్ తెలిపారు. ఇప్పటికే ఎన్నికలు రద్దు చేయాలని పిటిషన్ వేసిన ఒక ఆర్మీ అధికారికి సుప్రీంకోర్టు జరిమానా విధించిన నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ వేసిన పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. 266 నేషనల్ అసెంబ్లీ సీట్లలో మొత్తం 133 సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారం చేపడుతుంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి కావాల్సిన మెజారిటీ రాలేదు. దీంతో నవాజ్‌షరీఫ్‌కు చెందిన పీఎంఎల్(ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పవర్‌షేరింగ్ ఒప్పందం కూడా ఇప్పటికే కదుర్చుకున్నారు. ఇదీ చదవండి.. అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు -
పాక్ రాజకీయాల్లో పెను సంచలనాలు!
2023లో పాకిస్తాన్లో చోటుచేసుకున్నరాజకీయాలు సినిమా సీన్లను తలపించాయి. యాక్షన్, సస్పెన్స్, డ్రామా అన్నీ కనిపించాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు పాక్‌లో చోటుచేసుకున్న రాజకీయ గందరగోళం మున్ముందు కూడా ఇలానే కొనసాగేలా కనిపిస్తోంది. 2023లో ఇమ్రాన్ ఖాన్ అరెస్టు, నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగి రావడం సంచలనాలుగా నిలిచాయి. పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మాజీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఈ ఏడాది పెను సంచలనం సృష్టించింది. ఈ నేపధ్యంలో ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టారు. విధ్వంస ఘటనలు చోటుచేసుకున్నాయి. మే 9న జరిగిన నిరసనను పాక్ ఆర్మీ.. ఇదొక చీకటి అధ్యాయంగా అభివర్ణించింది. కాగా ఇమ్రాన్ ఖాన్ దేశంలో చట్టాన్ని ఉల్లంఘించారని పాక్ మాజీ ప్రధాని షరీఫ్ ఆరోపించారు. తోషాఖానా కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు ఆగస్టులో దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. అనంతరం పాక్ ఎన్నికల సంఘం ఇమ్రాన్ ఖాన్‌పై ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. ప్రస్తుతం పాక్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థానంలో పీటీఐ కొత్త అధ్యక్షునిగా బారిస్టర్ గోహర్ అలీ ఖాన్ ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్టీలో ఎన్నికలు జరిగాయి. గౌహర్ ఖాన్‌ను స్వయంగా ఇమ్రాన్ ఖాన్ ఈ పదవికి నామినేట్ చేశారు. మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్‌కు తిరిగి వచ్చిన దరిమిలా రాజకీయాలు మరింత వేడెక్కాయి. నవాజ్ షరీఫ్ బ్రిటన్‌లో నాలుగేళ్ల పాటు ఉండి, అక్టోబర్ 21న దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు చేరుకున్నారు. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. 2024 ఫిబ్రవరిలోపు పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ అధికార పగ్గాలు తాత్కాలిక ప్రధాని చేతుల్లోనే ఉన్నాయి. నవాజ్ షరీఫ్ నాలుగేళ్లు దేశానికి దూరంగా ఉన్నా ఆయన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ బలహీనపడలేదు. నవాజ్ షరీఫ్ లేనప్పటికీ, కుమార్తె మరియం, నవాజ్ సోదరుడు షాబాజ్ షరీఫ్‌లు ఇమ్రాన్ ఖాన్‌ను అధికారం నుండి దించి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారు. అల్-అజీజియా మిల్స్, అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో పాకిస్తాన్ కోర్టు నవాజ్ షరీఫ్‌ను దోషిగా నిర్ధారించి, ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతకుముందు 2017లో తన జీతం ప్రకటించనందుకు సుప్రీంకోర్టు అతనిపై జీవితకాల అనర్హత వేటు వేసింది. ఈ నేపధ్యంలో షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అదేసమయంలో ఇమ్రాన్ ఖాన్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్ వైద్య చికిత్స కోసం 2019లో లండన్ వెళ్లేందుకు అనుమతి కోరారు. దీనిపై లాహోర్ హైకోర్టు నాలుగు వారాల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతించింది. అయితే నాలుగు వారాలకు బదులుగా నవాజ్ షరీఫ్ నాలుగు సంవత్సరాల తర్వాత లండన్ నుండి పాకిస్తాన్ తిరిగి వచ్చారు. ఇది కూడా చదవండి: సన్యసించి, కాశీ వెళ్లిన పెరియార్ నాస్తికుడెలా అయ్యారు? -
ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు యత్నం.. ఉద్రిక్తత
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు పోలీసులు ఇవాళ ప్రయత్నించారు. ఆ అరెస్టును అడ్డుకునేందుకు పీటీఐ కార్యకర్తలు తీవ్రంగా యత్నించారు. రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు, కవరేజ్ కోసం జర్నలిస్టులకు గాయాలు అయ్యాయి. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు తన అరెస్టును అడ్డుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ కోర్టును ఆశ్రయించారు. అవినీతి ఆరోపణలు.. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు గత కొన్నిరోజులుగా పోలీసులు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో లాహోర్‌లోని జమాన్ పార్క్‌లో ఉన్న ఆయన ఇంటి వద్ద గత రెండు వారాలుగా హైడ్రామా నడుస్తోంది. అరెస్టు కోసం చాలా పకడ్బందీగా ఆపరేషన్ సిద్ధం చేసిన పోలీసులు.. ఇవాళ దానిని అమలు చేయడానికి యత్నించారు. అయితే.. అదే సమయంలో ఆయన మద్దతుదారులు అడ్డుకునేందుకు యత్నించారు. ఇక అరెస్ట్ ప్రక్రియ ఆగిపోయిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు. తాను జైలుకు వెళ్లినా.. తనను చంపేసినా.. పాక్ ప్రజలు తమ హక్కుల కోసం షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వంతో పోరాడడం ఆపొద్దని పిలుపు ఇచ్చారు. My message to the nation to stand resolute and fight for Haqeeqi Azadi & rule of law. pic.twitter.com/bgVuOjsmHG — Imran Khan (@ImranKhanPTI) March 14, 2023 ఈ క్రమంలో పోలీసులు, పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒక కార్యకర్త సైతం మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే.. అవిశ్వాస తీర్మానం ద్వారా కిందటి ఏడాది గద్దె దిగిపోయిన ఇమ్రాన్ ఖాన్‌పై ఇప్పటిదాకా 81 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. (చదవండి: యుద్ధంలో రష్యా ఓడితే! జరిగేది ఇదే.. పుతిన్ భవిష్యత్‌పై మాజీ దౌత్యవేత్త) -
‘మొత్తం ప్రతిపక్షాన్ని క్లీన్‌స్వీప్ చేయాలని ఇమ్రాన్ చూస్తున్నారు’
Imran Khan wanted to clean sweep the entire opposition leadership: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాక్ విద్యుత్ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఖాన్ 15 ఏళ్లు తానే పాలన సాగించేలా ఫాసిస్ట్ ప్లాన్లు వేస్తున్నారని పాక్ విద్యుత్ శాఖ మంత్రి ఖుర్రం దస్తగిరి ఆరోపణలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికల్లా ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, అహ్సాన్ ఇక్బాల్, పాకిస్థాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసీతో సహా మొత్తం ప్రతిపక్ష నాయకత్వాన్నే ఇమ్రాన్ ఖాన్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నట్లు తనకు ముందస్తు సమాచారం ఉందని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఇమ్రాన్ ఖాన్ కూడా తన రాజకీయ ప్రత్యర్థులపై కేసులను వేగవంతం చేసేందకు సుమారు 100 మంది న్యాయమూర్తి నియమిస్తానని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇమ్రాన్‌ఖాన్ దేశం పై దాడి చేసేలా ఫాసిస్ట్ ప్లాన్లు కలిగి ఉన్నందునే సంకీర్ణం ఏర్పడిందంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు పాక్ మాజీ మంత్రి అలీ హైదర్ జైదీ స్పందిస్తూ...రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కుట్ర ద్వారా తొలగించినట్లు ఖుర్రం దస్తగిర్ బహిరంగంగానే అంగీకరించాడని చెప్పారు. అవినీతి కేసుల నుంచి ప్రతిపక్షాలను కాపాడేందుకు ఇలా చేశారు. ఈ దుండగులు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నభిన్నం చేయాలని చూస్తుండటం బాధాకరం అన్నారు. అంతేకాదు ఖాన్ కూడా రష్యా, చైనా మరియు అఫ్గనిస్తాన్‌ల స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాల కారణంగా తాను ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానంలో ఓటమిని ఎదుర్కొన్నానని అన్నారు. పైగా ఖాన్ ఇది యూఎస్ కుట్రలో భాగమని కూడా ఆరోపించారు. ప్రస్తుత ప్రధాని షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దిగుమతి చేసుకున్నదని, పాకిస్తాన్‌కి ఆయన నిజమైన ప్రతినిధి కాదంటూ ఇమ్రాన్‌ఖాన్ తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. (చదవండి: ఆకాశమంత దట్టమైన పోగ...కెమికల్ ప్లాంట్ భారీ పేలుడు...ఒకరు మృతి) -
‘మా అమ్మను కిడ్నాప్ చేశారు’
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని మానవహక్కుల మంత్రిగా పనిచేసిన తన తల్గి షిరీన్ మజారీని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆమె కుమార్తె ఆరోపించింది. వాస్తవానికి ఆమె అవినీతి నిరోధక సంస్థ కస్టడీలో ఉన్నారు. కానీ ఆమె కుమార్తె ఇమాన్ జైనాబ్ మజారీ మాత్రం పోలీసులు తన తల్లిని కొట్టి తీసుకెళ్లారని ఆరోపణలు చేశారు. అయినా ఏ వ్యక్తినైన అరెస్ట్ చేసేముందు ఏ అభియోగంతో తీసుకెళ్తున్నారో చెప్పాలి కానీ తనకు అవేమీ చెప్పలేదని కేవలం తన తల్లి లామోర్ అవినీతి నిరోధక విభాగంలో ఉందని మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు. సున్నితంగా ఉండే మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఈ ప్రభుత్వం తన తల్లిని కిడ్నాప్ చేసిందంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. తన తల్లికి ఏదైన జరిగితే ఎవరిని వదలిపెట్టనంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తన సహోద్యోగిని ఈ ఫాసిస్ట్ పాలన హింసాత్మక ధోరణితో కిడ్నాప్ చేసిందంటూ ఆరోపణలు చేశారు. తమ ఉద్యమం శాంతియుతమైనదని ఫాసిజాన్ని దిగుమతి చేసుకున్న ప్రభుత్వం దేశాన్ని గందరగోళంలోకి నెట్టాలని చూస్తోందన్నారు. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడి ఉన్నది సరిపోదన్నట్లు ఈ ఎన్నికలను నివారించేందుకే ఈ అరాచకాలు సృష్టిస్తున్నారంటూ విమర్శించారు. (చదవండి: ఉత్తర కొరియాకు వ్యాక్సిన్ ఆఫర్ ప్రకటించిన అమెరికా...కిమ్‌ని కలుస్తానంటున్న బైడెన్) -
Imran Khan: కశ్మీర్‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనే..
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే దాకా భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. ‘జమ్మూకశ్మీర్ ఐక్యరాజ్యసమితి ఎజెండాలో ఉంది. దీనిపై భద్రతా మండలి పలు తీర్మానాలు కూడా చేసింది. అందుకే కశ్మీర్ భారత్ అంతర్గత అంశం కాదు’అని ఆయన మీడియాకు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత ప్రభుత్వం 2019లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. (చదవండి: చైనా జనాభాలో స్వల్ప పెరుగుదల) -
భారత్‌పై ఆక్రోశం? చక్కెర, పత్తికి పాకిస్తాన్లో తిప్పలు
ఇస్లామాబాద్: పక్కనున్న దేశంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అవసరమైన వస్తువుల దిగుమతిపై నిషేధం విధించగా తాజాగా మళ్లీ ఎత్తి వేసే ప్రయత్నాలు జరిగాయి. దీనిపై నిన్న మంత్రిమండలి కూడా నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకోవాలని తీర్మానించారు. అయితే ఒకరోజు తిరిగే లోపే ఆ నిర్ణయానికి బ్రేక్ పడింది. దీంతో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు చుక్కెదురైంది. భారత్ నుంచి వస్తువుల దిగుమతికి ఆ దేశంలోని జాతీయ సంస్థ నిరాకరించింది. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌పై తీసుకున్న చర్యలతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి భారత్ నుంచి దిగుమతి చేసుకునే పత్తి, చక్కెర తదితర వస్తువులపై నిషేధం విధించింది. పాకిస్తాన్ మంత్రిమండలి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన బుధవారం సమావేశమై భారత్ నుంచి దిగుమతులు పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పత్తి, చక్కెర దిగుమతులకు తిరిగి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తెల్లారే గురువారం పాకిస్తాన్లో ఆర్థిక సహకార కమిటీ (ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ-ఈసీసీ) ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. భారత్ నుంచి దిగుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే మంత్రిమండలి తీసుకున్న నిర్ణయమే ఫైనలా? లేదా ఆర్థిక కమిటీ నిర్ణయం ఫైనలా అనేది తేలాల్సి ఉంది. భారత్‌ను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో పాక్ వైఖరి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్లో ఆహార కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే చక్కెర, పత్తి కొరత తీవ్రంగా ఉంది. అందుకే వాటిని తిరిగి దిగుమతి చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తుండగా ఆ నిర్ణయానికి ఆర్థిక కమిటీ నిరాకరించింది. మరి ఇమ్రాన్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
పాక్ దుర్నీతి : పీఓకేను కలిపేస్తూ నూతన మ్యాప్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మరోసారి తన దుర్నీతిని ప్రదర్శించింది. జమ్ము, కశ్మీర్, లడఖ్ ప్రాంతాలనూ తమ భూభాగాలుగా పేర్కొంటూ నూతన రాజకీయ మ్యాప్‌కు పాక్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేసి బుధవారంతో ఏడాది అవుతున్న క్రమంలో పాకిస్తాన్ ఈ మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం. కొత్త మ్యాప్‌ను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఆవిష్కరిస్తూ ఇది పాకిస్తాన్, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతోందని, పాక్ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయమని అభివర్ణించారు. కాగా, ఇప్పటివరకూ పాక్ ఆక్రమిత కశ్మీర్లో అన్ని ప్రాంతాలను అధికారికంగా తమ భూభాగంగా పాకిస్తాన్ పేర్కొనడం లేదు. గిల్గిట్-బాల్టిస్తాన్‌ను తమ భూభాగంగా పాక్ పేర్కొంటుండగా, మిగిలిన ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్‌గా పాక్ వ్యవహరిస్తోంది. నేపాల్ సైతం భారత భూభాగాన్ని తమదిగా పేర్కొంటూ ఇటీవల కొత్త మ్యాప్‌ను విడుదల చేయడం కలకలం రేగింది.అంతర్జాతీయ ఒత్తిళ్లతో పాటు నేపాల్ పాలక పార్టీలోనే తిరుగుబాటు రావడంతో భారత వ్యతిరేక చర్యలపై నేపాల్ వెనక్కుతగ్గింది. చదవండి : జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య -
ఫేక్ ట్వీట్‌తో దొరికిపోయిన ఇమ్రాన్
న్యూఢిల్లీ: భారత్ లోని ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై పోలీసుల దౌర్జన్యం అని ఒక నకిలీ వీడియోను ట్వీట్ చేసి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నెటిజన్లకు దొరికిపోయారు. ఆ వీడియో 2013 బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో అని నెటిజన్లు వెల్లడించి, ట్రోల్ చేయడంతో ఆ ట్వీట్‌ను, వీడియోను ఆయన తొలగించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందించారు. ‘నకిలీ వార్తలను ట్వీట్ చేయండి.. దొరికిపోండి.. ఆ ట్వీట్లను డిలీట్ చేయండి.. మళ్లీ రిపీట్ చేయండి’ అని రవీశ్ శుక్రవారం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. -
భారత్‌తో అణు యుద్ధానికైనా రెడీ
ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో భారత్‌తో అణుయుద్ధానిౖకైనా సిద్ధమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ మరోసారి బెదిరింపులకు దిగారు. సోమవారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. ‘కశ్మీర్ పరిస్థితులు యుద్ధానికి దారి తీస్తే.. గుర్తుంచుకోండి రెండు దేశాల వద్దా అణ్వాయుధాలు ఉన్నాయి. కశ్మీర్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కశ్మీర్ కోసం ఎంతవరకైనా వెళతాం. అంతర్జాతీయ సమాజం ఇప్పుడు బాధ్యత తీసుకోవాలి, లేదా పాక్ ఏదైనా చేయగలుగుతుంది’అని స్పష్టంచేశారు. అంతర్జాతీయంగా జరిగే ప్రతి సమావేశంలోనూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతానన్నారు. ఈ విషయంలో భారత్‌తో చర్చలు జరపడానికి ప్రయత్నించినా సరైన స్పందన రాలేదని తెలిపారు. భారత్‌లో ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంతో చర్చలు జరపవచ్చని భావించానని అయితే మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుతో చారిత్రాత్మక తప్పు చేసిందని అన్నారు. ఈ క్రమంలో భారత్ తమ సొంత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను, ఐక్యరాజ్యసమితి సూచనలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు. ముస్లిం దేశాలు పాక్‌కు మద్దతివ్వడం లేదన్న విషయంపై స్పందిస్తూ.. ‘ఆర్థిక సంబంధాల వల్ల వారు ముందుకు రాకపోవచ్చు. కానీ వారంతా కచ్చితంగా కాలంతోపాటు కలిసి రావాల్సిందే. కశ్మీరీలను కాపాడతామని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఇది ఇప్పుడు వారి బాధ్యత. పుల్వామా వంటి దాడులను సాకుగా చూపి కశ్మీర్ అంశం నుంచి అంతర్జాతీయ సమాజ దృష్టిని మార్చే పనిలో భారత్ ఉంది’అన్నారు. -
ట్రంప్‌తో భేటీకానున్న ఇమ్రాన్‌ఖాన్
సాక్షి, ఇంటర్నేషనల్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జులై నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా ఆహ్వానం మేరకు ఇమ్రాన్‌ఖాన్ ఈ నెల 22న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాషింగ్టన్లో సమావేశం కానున్నారు. పాకిస్తాన్ విదేశాంగ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇమ్రాన్ పర్యటనతో ఇరుదేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వీరి భేటీపై చైనా, భారత్‌తో సహా ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. టెర్రరిజంపై పోరాడటానికి అధికారికంగా ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నా కానీ పాకిస్తాన్ తమ నమ్మకాన్ని వొమ్ముచేసిందని, అమెరికా నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకొని దుర్వినియోగం చేస్తోందని ట్రంప్ గత సంవత్సరం పాకిస్తాన్‌పై తీవ్రంగా విరుచుకపడిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో కూడా ఇరుదేశాలకు బేధాభిప్రాయాలు ఉన్నాయి. తాలిబాన్లకు వ్యతిరేకంగా అమెరికా యుద్ధం చేస్తుంటే, పాకిస్తాన్ మాత్రం పరోక్షంగా తాలిబాన్లకు సహాయ సహకారాలు అందిస్తోందని అమెరికా నాయకులు తరచూ విమర్శిస్తున్నారు. దీంతో ఆమెరికా పాకిస్తాన్‌కు అందించే ఆర్థిక సహాయంలో కోత విధించింది. మరోపక్క అమెరికాతో భారత్‌కు పెరుగుతున్న సాన్నిహిత్యం పాకిస్తాన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్ అభ్యర్థన మేరకు మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో అమెరికా తన సంపూర్ణ మద్దతు తెలిపింది. పాకిస్తాన్ కూడా అంతర్జాతీయంగా అమెరికాను చికాకు పెట్టెలా ప్రవర్తిస్తోంది. ఒకపక్క చైనా ఇబ్బడిముబ్బడిగా పాకిస్తాన్లో పెట్టుబడులు పెడుతూ, అంతర్జాతీయ వ్యవహారాలలో పాకిస్తాన్‌కు వంతపాడటం, మరోపక్క రష్యాతో పాకిస్తాన్ చేసుకుంటున్న సైనిక ఒప్పందాలు తదితర విషయాలపై ఈ సమావేశంలో ఒక స్పష్టత వస్తుందని అమెరికా భావిస్తోంది. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుని దినదిన గండంగా రోజువారిగా వ్యవహారాలు నడుపుతున్న పాకిస్తాన్‌కు ఈ పర్యటన ఎంతో కీలకం కానుందని విశ్లేషకులు అంటున్నారు. -
పాక్ క్రికెటర్లకు ఇమ్రాన్‌ఖాన్ అడ్వైజ్ ఇదే!
సాక్షి: క్రికెట్ ప్రేమికులను ఉత్కంఠకు గురిచేస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తమ జట్టులో ప్రేరణనింపే ప్రయత్నం చేశారు. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తన నాయకత్వ ప్రతిభతో జట్టును ముందుండి విజయతీరాలకు నడిపిస్తాడని ఇమ్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపు గురించి అతిగా ఆలోచించకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ఫోకస్ చేయాలని జట్టు సభ్యులకు ఆయన సూచించారు. పాక్ సారథిగా 1992 ప్రపంచకప్‌ను అందించిన ఇమ్రాన్‌ఖాన్ తన వ్యక్తిగత అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘నా కెరీర్ ప్రారంభంలో 70శాతం ప్రతిభ, 30శాతం మానసిక బలంతో నేను విజయం సాధించానని భావించాను. కానీ కెరీర్ పూర్తయిన తరువాత ఇది 50-50 శాతం అనుకున్నాను. కానీ, 60శాతం మానసిక బలం, 40శాతం ప్రతిభతో రాణించినట్టు నా మిత్రుడు గవాస్కర్ చెప్పాడు. దానితో నేను ఏకీభవిస్తాను’ అని పేర్కొన్నారు. దాయాదుల పోరు సందర్భంగా ఇరుజట్లు తీవ్ర మానసిక ఒత్తిడిలో మ్యాచ్ ఆడతాయని, ఒత్తిడిని తట్టుకున్న వారే విజేతలుగా నిలుస్తారని, అదృష్టవశాత్తు సర్ఫరాజ్ లాంటి సాహసోపేత నాయకుడి ఆధ్వర్యంలో కచ్చితంగా తమ జట్టు విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. -
ఇమ్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారత ప్రధాని మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. శనివారం (మార్చి 23) పాక్ జాతీయ దినోత్సవం. ఈ సందర్భంగా మోదీ పంపిన సందేశాన్ని ఇమ్రాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఉగ్రవాదం, హింసల్లేని, ప్రజాస్వామ్య, శాంతియుత, వృద్ధిదాయకమైన భారత ఉపఖండం కోసం ఇరు దేశాల ప్రజలు కృషి చేయాలని మోదీ అన్నారు. గత నెలలో పుల్వామాలో ఉగ్రవాద దాడి, అనంతరం పాక్‌లోని బాలాకోట్‌పై భారత వైమానిక దళం దాడి, ఆ మరుసటి రోజే పాక్ ప్రతీకార ప్రయత్నం తదితరాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు మోదీ శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మోదీ శుభాకాంక్షలు చెప్పడం నిజమో కాదో వెల్లడించాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాని కార్యాలయాన్ని కోరింది. అటు ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయం జరిపే జాతీయ దినోత్సవ వేడుకలకు ఈసారి భారత్ హాజరవ్వడం లేదు. ఈ వేడుకలకు ప్రతీ ఏడాది భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వెళ్లేవారు. ఈసారి వేడుకలకు కశ్మీరీ వేర్పాటువాదులను కూడా పిలవడంతో వెళ్లకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. -
‘యుద్ధం వస్తే గట్టిగా నిలబడండి’
ఇస్లామాబాద్ : వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలో యుద్ధవిమానాలతో రెచ్చిపోయిన పాకిస్తాన్ యుద్ధం దిశగా సన్నద్ధమవుతున్న సంకేతాలు పంపింది. మహ్మద్ ప్రవక్త ప్రవచించిన కోట్‌ను ఉటంకిస్తూ ‘మీ శత్రువుతో యుద్ధాన్ని కోరుకోకుండా, అల్లా ఆదేశానుసారం వారిని మన్నించండి..అయితే యుద్ధ పరిస్థితి అనివార్యమైతే..అప్పుడు ధృడంగా నిలబడండి..కత్తుల నీడనే స్వర్గం ఉంటుందని మరువకండ’ని పాక్ విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎం ఫైజల్ ట్వీట్ చేశారు. కాగా భారత గగనతలంలోకి బుధవారం మధ్యాహ్నం చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధ విమానాలు ఎఫ్ 16ను భారత వైమానిక దళం దీటుగా తిప్పికొట్టింది. ఎఫ్ 16ను రాజౌరీ సెక్టార్లో వాయుసేన కూల్చివేయగా, మరికొన్ని జెట్స్ భారత భూభాగంపై బాంబులు జారవిడుస్తూ వెనుతిరిగి వెళ్లాయని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఎంతమేర ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లిందనే వివరాలు తెలియరాలేదు. -
ఇండో పాక్ యుద్ధంపై ఇమ్రాన్ వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : శాంతి ప్రక్రియ కోసం తాను చేసిన ప్రతిపాదనలపై భారత్ స్పందించడం లేదని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే అది ఆత్మహత్యాసదృశ్యమేనని హెచ్చరించారు. భారత్‌తో చర్చలకు పాక్ సంసిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఇరు దేశాల ప్రయోజనాలకు కోల్డ్ వార్ సైతం వాంఛనీయం కాదని టర్కీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. చర్చల ప్రతిపాదనను భారత్ పలుమార్లు తోసిపుచ్చిందన్నారు. కశ్మీరీ ప్రజల హక్కులను భారత్ ఎన్నడూ అణిచివేయలేదన్నారు. కాగా 2016లో భారత్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరిపిన దాడి దరిమిలా పాక్ భూభాగంలో భారత్ మెరుపు దాడులు చేపట్టిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. -
ఎన్నికల తర్వాతే భారత్‌తో చర్చలన్న పాక్
ఇస్లామాబాద్ : భారత్‌తో శాంతి చర్చల పునరుద్ధరణ 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరమే ఉంటుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి స్పష్టం చేశారు. భారత్‌లో తదుపరి సార్వత్రిక ఎన్నికల్లోగా చర్చల పునరుద్ధరణకు అవకాశం లేదన్నారు. ఇస్లామాబాద్‌లో గురువారం పాక్ విదేశీ వ్యవహారాల సెనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. స్టాండింగ్ కమిటీ భేటీలో భారత్‌తో ద్వైపాక్షిక చర్చల అంశాన్ని ప్రస్తావించామన్నారు. పొరుగు దేశాలైన భారత్, ఆప్ఘనిస్తాన్‌లతో పాక్ సంబంధాలతో పాటు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవలి సౌదీ అరేబియా, చైనా పర్యటనలపై కూడా పాక్ స్టాండింగ్ కమిటీలో చర్చలు జరిపినట్టు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. కాగా పాక్ వ్యతిరేక ప్రచారంతో భారత్‌లో ఓట్ల వేట సాగుతుందని, పాక్‌తో సంబంధాలు భారత్‌లో ఎన్నికల అంశం అవుతుందని ఇటీవల ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్న క్రమంలో స్టాండింగ్ కమిటీ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం భారత్‌కు తాను మరోసారి స్నేహహస్తం అందిస్తానని ఇమ్రాన్ ఖాన్ గతంలో చెప్పుకొచ్చారు. రియాద్‌లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనీషియేటివ్ ఫోరమ్ వద్ద మీడియా ప్రతనిధులను ఉద్దేశిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
భారత్‌పై వ్యతిరేకతతోనే ఇమ్రాన్‌కు పట్టం
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలను భారత్ వ్యతిరేకత ప్రభావితం చేసింది. పాక్‌లో జరిగిన ఈ ఎన్నికలను భారత్, పాకిస్తాన్ సైన్యాల మధ్య జరుగుతున్న యుద్ధంగా ప్రచారం చేయడంలో, నవాజ్ షరీఫ్ పార్టీని గెలిపించడం కోసం భారత్‌తో కలిసి అంతర్జాతీయ శక్తులు కుట్ర పన్నాయని పాక్ ఓటర్లను నమ్మించడంలో ఇమ్రాన్ ఖాన్, ఆయన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (న్యాయం కోసం ఉద్యమం) పార్టీలు విజయం సాధించాయి. భారత్‌తో కలిసి కుట్ర పన్నిన అంతర్జాతీయ శక్తులెవరో ఇమ్రాన్ ఖాన్ వెల్లడించకపోయినా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలని అర్థం చేసుకోవచ్చు. భారత్‌కు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రచారానికి సోషల్ మీడియాలోని వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు బాగా ఉపయోగపడ్డాయి. 2015, డిసెంబర్ నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్యంగా లాహోర్‌ను సందర్శించినప్పుడు నవాజ్ షరీఫ్, మోదీలు పాక్ గౌరవ వందనం స్వీకరించడం, ఆ సందర్భంగా ఇరువురు ఒకరినొకరు ఆత్మీయంగా కౌగించుకున్న దృశ్యాలను సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ కొత్త అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కూడా భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారుగానీ అది ఓటర్లకు ఆకట్టుకోలేక పోయింది. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ చైనాతో కలిసి పాకిస్తాన్ ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తామని చెప్పడం వారికి చప్పగా అనిపించింది. 2008, 2013లో జరిగిన పాక్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారత్ వ్యతిరేకత అన్న అంశమే అసలు ప్రస్థావనకు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ వ్యతిరేకత రావడం ఇదే మొదటిసారి. 2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు (వారు ఆజాద్ కశ్మీర్ అంటారు) జరిగిన ఎన్నికల్లో మొదటి సారి భారత్ వ్యతిరేకత అంశం వచ్చింది. బహుశ 2014 భారత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, పాకిస్థాన్ వ్యతిరేకత అంశాన్ని తీసుకరావడం కావచ్చు. ఈ అంశంతోపాటు ఎన్నికల్లో అవినీతి, పోకరితనం, ప్రజాస్వామ్యం, అప్రజాస్వామ్యం, వ్యవస్థకు అనుకూలం, వ్యవస్థకు వ్యతిరేకం అన్న అంశాలపై జోరుగా ప్రచారం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ పార్టీవారు సైనిక తొత్తులంటూ నవాజ్ షరీఫ్ పార్టీ వారు ప్రచారం చేయగా, 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సందర్భంగా నవాజ్ షరీఫ్ ప్రభుత్వం నిర్వహించిన పాత్ర గురించి, 1978 నుంచి 1988 మధ్య పాక్ సైనిక నియంత జిలా ఉల్ హక్‌తో నవాజ్ షరీఫ్కున్న సంబంధాల గురించి ప్రస్తావించడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ పార్టీ వారు ఆ దాడిని విజయవంతంగా ఎదుర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న బలమైన పార్టీలను కాదని పాక్ ప్రజలు ఇమ్రాన్‌కు పట్టడం కట్టడమంటే భారత్ వ్యతిరేకతే అందుకు కారణం అని చెప్పవచ్చు. చదవండి: యథా మోదీ తథా ఇమ్రాన్ ఖాన్! పాక్ ఫలితాలు: ఈసీ అధికారిక ప్రకటన -
ఎన్నికల ఫలితాలపై నవాజ్ షరీఫ్ స్పందన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని ‘పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ (పీటీఐ) అతి పెద్ద పార్టీగా అవతరించిన తరుణంలో ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించారు. ప్రస్తుతం అడియాలా జైల్లో ఉన్న నవాజ్ షరీఫ్.. పాకిస్తాన్ ఎన్నికలు దొంగిలించి బడ్డాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో మలినమైన ఫలితాల్ని చూడాల్సి వచ్చిందన్నారు. తాజా పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో చెడు సంకేతాలకు నిదర్శమన్నారు. అడియాలా జైల్లో నవాజ్ షరీఫ్‌ను పరామర్శించడానికి వచ్చిన అభిమానులతో ముచ్చటించిన ఆయన ఎన్నికలు జరిగిన తీరును మొదలుకొని, ఫలితాల వరకూ తనదైన విశ్లేషించారు. అసలు ఎన్నికలే సరిగా జరగలేదన్న షరీఫ్.. ఫైసలాబాద్, లాహోర్, రావల్పిండిల్లో తమ అభ్యర్థులు అత్యంత నిలకడను ప్రదర్శించినా చివరకు ఓటమితో సరిపెట్టుకోవాల్సి రావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరొకవైపు పీటీఐఈ మినహా మిగతా పార్టీలన్నీ ఎన్నికల్లో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగిందని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఒప్పుకోబోమని తేల్చి చెప్తున్నాయి. ఇదిలా ఉంచితే, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఫలితాలను శుక్రవారం ఉదయం పాక్ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 272 సీట్లకుగానూ జరిగిన ఎన్నికల్లో ఇప్పటిదాకా వెలువడ్డ ఫలితాలు 251. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ 110 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్ పార్టీ 63, బిలావల్ భుట్టో(బెనజీర్ భుట్టో తనయుడు) పార్టీ పీపీపీ 39, ఇతరులు 50 స్థానాలను కైవసం దక్కించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 137. చదవండి: పాక్ ఫలితాలు: ఈసీ అధికారిక ప్రకటన -
బాలీవుడ్ విలన్లా చిత్రీకరించారు : ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్ : భారత మీడియా తనను బాలీవుడ్ విలన్లా చిత్రీకరించిందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.భారత్‌తో చర్చలకు తాను వ్యతిరేకం కాదని పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. పీటీఐ పార్టీ పాక్ ఎన్నికల్లో 119 స్ధానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌తో చర్చలకు తాను వ్యతిరేకం కాదని, కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలంటే చర్చల ద్వారానే సాధ్యమవుతుందని ఇరు దేశాలూ గ్రహించాలని సూచించారు. చర్చలు ఫలవంతం కావడం భారత ఉపఖండానికీ మేలు చేకూరుస్తుందని అన్నారు. భారత్‌తో మెరుగైన సంబంధాలు కోరుకునే సగటు పాకిస్తానీలలో తాను ఒకడినన్నారు. పేదరికం లేని ఉపఖండం కావాలనుకుంటే భారత్, పాక్‌ల మధ్య మంచి సంబంధాలు, వాణిజ్య సహకారం ఉండాలని ఆకాంక్షించారు. 22 ఏళ్ల తర్వాత తన పోరాటం ఫలించిందని, తన కల నెరవేరి దేశానికి సేవ చేసే అవకాశం లభించిందన్నారు. -
ముమ్మాటికీ రిగ్గింగే..! పీఈసీపై సంచలన ఆరోపణలు
ఇస్లామాబాద్: తీవ్ర ఉద్రిక్తలు, ఘర్షణల మధ్య ముగిసిన పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని ఓవైపు పాకిస్తాన్‌తో సహా పొరుగుదేశం భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇమ్రాన్‌ఖాన్ ‘పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ (పీటీఐఈ) మినహా మిగతా పార్టీలన్నీ ఎన్నికల్లో భారీయెత్తున రిగ్గింగ్ జరిగిందని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఒప్పుకోబోమని తేల్చి చెప్తున్నాయి. రిగ్గింగ్.. రిగ్గింగ్..!! నవాజ్ షరీఫ్ జైలుపాలు కావడంతో అతని తమ్ముడు షాబాజ్‌ఖాన్ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’ (పీఎంఎల్-ఎన్) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఘన విజయం సాధించి పీఎంఎల్-ఎన్ను అధికారంలోకి తేవడమే కాకుండా జైలుపాలైన నవాజ్ షరీఫ్‌కు ఊరట కలిగిద్దామనుకున్న షాబాజ్ ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన బుధవారం రాత్రి లాహోర్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ పీటీఐ పార్టీ మెరుగైన స్థానంలో ఉండడానికి కారణం రిగ్గింగేనని చెప్తున్నారు. నిస్సిగ్గుగా ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడి అధికారంలోకి వచ్చే పీటీఐతో దేశం మరో ముప్పయ్యేళ్లు వెనక్కి పయనిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెంట్లు లేకుండా ఎలా..! పోలీంగ్ బూత్‌ల నుంచి తమ పార్టీ ఏజెంట్లు బలవంతంగా బయటకు గెంటేశారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మండిపడింది. ఓట్ల లెక్కింపులో సైతం అక్రమాలు చోటుచేసుకున్నాయని అనుమానాలు వ్యక్తం చేసింది. చిన్నాచితకా పార్టీలు కూడా ఎన్నికల ఫలితాలు నమ్మేట్టుగా లేవని అంటున్నాయి. అయితే, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని పేర్కొంది. మరోవైపు 111 పైగా స్థానాల్లో మంచి ఆధిక్యంలో నిలిచిన పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ పగ్గాలు చేపట్టడం ఖాయమని ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. -
పాక్ ఎన్నికల ఫలితాలు: అప్డేట్స్
ఇస్లామాబాద్: ఉద్రిక్త పరిస్థితులు, ఉగ్రదాడుల నడుమ కొనసాగిన పాకిస్తాన్ ఎన్నికలు ముగిశాయి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. మేజిగ్ ఫిగర్ 172 సీట్లు సాధించిన పార్టీ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో అధికారం పీఠం అధిరోహించనుంది. ఇక ఈ రెండు పార్టీలకు తగిన మెజార్టీ రానిపక్షంలో బిలావల్ భుట్టో జర్దారీ ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంది. జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా.. 272 స్థానాలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. మహిళలకు కేటాయించిన 60 సీట్లు, మైనారిటీలకు కేటాయించిన మరో 10 సీట్లకు పరోక్ష పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. కాగా, సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల కమిషన్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించింది. పాకిస్తాన్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో.. ఏ పార్టీ పరాజయం వైపు పయనిస్తుందో.. ఎప్పటికప్పుడు ఇవిగో వివరాలు...! పార్టీలు: ఆధిక్యం+ గెలుపు ఇమ్రాన్‌ఖాన్: పీటీఐ 120 నవాజ్ షరీఫ్: పీఎంఎల్-ఎన్ 61 అసిఫ్ అలీ జర్దారీ: పీపీపీ 40 స్వతంత్రులు, ఇతరులు 51 చిత్తుగా రాసిచ్చారా..!! ఎన్నికలను సజావుగా నిర్వహించామని చెప్పుకొంటున్న పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తీరు మాత్రం విమర్శల పాలవుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫారం 45పై ఎవరికెన్ని ఓట్లు పోలయ్యాయో వెల్లడించాల్సిందిపోయి అధికారులు చిత్తు కాగితంపై రాసిచ్చారు. ఒక స్టాంపు వేసి ఆ కాగితాన్ని అధికారికం చేసేశారు. ఈ వార్త ఎన్నికల అధికారుల పనితీరుకు అద్దం పడుతోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #PakistanElections2018 As per rules,Election Commission of Pakistan(ECP)officials are bound to provide results on Form 45,instead results were handed out on plain paper in Khi&Hyderabad. As per latest unofficial trends on ARY news,PTI leading on 114 seats,PMLN-63 seats& PPP on 42 pic.twitter.com/rxFEosfG1p — ANI (@ANI) July 26, 2018 ఫలితాలు ఆలస్యం.. పాక్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి సర్దార్ ముహమ్మద్ రజాఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోందని అన్నారు. ముందుగా అనుకున్న సమయానికి ఫలితాలను వెల్లడించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 47 శాతం ఓట్ల లెక్కింపు మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన 24 గంటల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని ఇంతకుముందు ఆయన పేర్కొనడం గమనార్హం. చదవండి: పాక్ ఎన్నికలు.. పది ముఖ్య విషయాలు భారత్‌కు మున్ముందు ముప్పే! ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే పక్కలో తుపాకే! -
ఆయనతో పెళ్లంటే..
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ లెజెండ్, ప్రముఖ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్, రెహం ఖాన్ విడాకుల విషయంలో ఆయన భార్య, జర్నలిస్టు భార్య రెహం ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. తనను వంట ఇంటికి పరిమితం చేసే కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని వ్యాఖ్యానించారు. చపాతీలు చేస్కో కానీ, బయటకు రావద్దని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీలోని పెద్దలు తనను ఆదేశించారన్నారు. రెండు వారాల తర్వాత తొలిసారిగా నోరువిప్పిన ఆమె తాము విడిపోవడానికి గల కారణాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని వివాదాస్పద కమెంట్లు చేశారు. 'నన్ను ప్రేమిస్తున్నానని నమ్మించిన వ్యక్తి ని పెళ్లి చేసుకున్నా....ఇద్దరం ఒంటరిగా ఉన్నాం.. ఇద్దరి కష్టాలు.. భావాలు,లక్ష్యం ఒకటే అని నేను నమ్మాను..కానీ మేం పూర్తిగా ఒకరికొకరం భిన్నమని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ తో వివాహ జీవితం ఒక స్వర్గంలా ఉంటుందనుకున్నా, కానీ అంతా తారుమారైంది. ఆయనతో రాజకీయాలు తప్ప, ఇంటి విషయాలు కానీ, కనీసం బాలీవుడ్ సినిమాల గురించి కానీ మరే విషయాలే మాట్లాడే అవకాశం ఉండదని వాపోయారు. ఈ విషయంలో తాను ఎంత మధనపడిందీ ఆ భంగవంతుడికి తెలుసని వ్యాఖ్యానించారు. అసలు ఇమ్రాన్ తో పెళ్లి అయిన దగ్గర్నించి తాను చాలా విధాలుగా నష్టపోయాయనన్నారు. కూతురుతో సహా, ఇస్లామాబాద్ లోని ఇమ్రాన్ నివాసానికి చేరుకున్నప్పటినుంచి అణచివేత మొదలైందని ఆరోపించారు. తన కరీర్ మొత్తం చిక్కుల్లో పడిందనీ, ముఖ్యంగా పెషావర్ లో వీధి బాలల కోసం ప్రతినిధిగా ఎంపికైనప్పటినుంచీ మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కానీ, దీనికి సంబంధించి ఒక్క సమావేశానికి కూడా హాజరు కాలేకపోయానని, తీవ్రమైన అభద్రతా భావం వెంటాడిందన్నారు. భర్త ఇమ్రాన్ తో సత్సంబంధాలు కొనసాగాలనే ఉద్దేశంతోనే చాలా టెలివిజన్ షో లను వదులుకున్నానని చెప్పారు. అయినా తన మీద అసత్య ఆరోపణలతో దాడి చేశారన్నారు. ఇకముందు పాకిస్తాన్ వీధి బాలల కోసం తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో రెండు సినిమాలను నిర్మించే ఆలోచనలో రెహం ఖాన్ ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాల్సి అవసరం ఉందన్నారు. ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న ఇమ్రాన్, రెహం ఖాన్ కనీసం ఏడాది తిరగక ముందే విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ విడాకుల విషయంలో అనేక కథనాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.