నవాజ్ షరీఫ్, ఇమ్రాన్‌ఖాన్, బిలావల్ భుట్టో జర్దారీ (ఫైల్ ఫొటోలు)
ఇస్లామాబాద్: ఉద్రిక్త పరిస్థితులు, ఉగ్రదాడుల నడుమ కొనసాగిన పాకిస్తాన్ ఎన్నికలు ముగిశాయి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. మేజిగ్ ఫిగర్ 172 సీట్లు సాధించిన పార్టీ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో అధికారం పీఠం అధిరోహించనుంది. ఇక ఈ రెండు పార్టీలకు తగిన మెజార్టీ రానిపక్షంలో బిలావల్ భుట్టో జర్దారీ ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంది.
జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా.. 272 స్థానాలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. మహిళలకు కేటాయించిన 60 సీట్లు, మైనారిటీలకు కేటాయించిన మరో 10 సీట్లకు పరోక్ష పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. కాగా, సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల కమిషన్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించింది. పాకిస్తాన్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో.. ఏ పార్టీ పరాజయం వైపు పయనిస్తుందో.. ఎప్పటికప్పుడు ఇవిగో వివరాలు...!
పార్టీలు: | ఆధిక్యం+ గెలుపు |
---|---|
ఇమ్రాన్‌ఖాన్: పీటీఐ | 120 |
నవాజ్ షరీఫ్: పీఎంఎల్-ఎన్ | 61 |
అసిఫ్ అలీ జర్దారీ: పీపీపీ | 40 |
స్వతంత్రులు, ఇతరులు | 51 |
చిత్తుగా రాసిచ్చారా..!!
ఎన్నికలను సజావుగా నిర్వహించామని చెప్పుకొంటున్న పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తీరు మాత్రం విమర్శల పాలవుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫారం 45పై ఎవరికెన్ని ఓట్లు పోలయ్యాయో వెల్లడించాల్సిందిపోయి అధికారులు చిత్తు కాగితంపై రాసిచ్చారు. ఒక స్టాంపు వేసి ఆ కాగితాన్ని అధికారికం చేసేశారు. ఈ వార్త ఎన్నికల అధికారుల పనితీరుకు అద్దం పడుతోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
#PakistanElections2018 As per rules,Election Commission of Pakistan(ECP)officials are bound to provide results on Form 45,instead results were handed out on plain paper in Khi&Hyderabad. As per latest unofficial trends on ARY news,PTI leading on 114 seats,PMLN-63 seats& PPP on 42 pic.twitter.com/rxFEosfG1p
— ANI (@ANI) July 26, 2018
ఫలితాలు ఆలస్యం..
పాక్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి సర్దార్ ముహమ్మద్ రజాఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోందని అన్నారు. ముందుగా అనుకున్న సమయానికి ఫలితాలను వెల్లడించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 47 శాతం ఓట్ల లెక్కింపు మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన 24 గంటల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని ఇంతకుముందు ఆయన పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment