Asif Ali Zardari
-
పాక్ సుప్రీం సీజే పదవీ కాలం ఇక మూడేళ్లే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) పదవీ కాలాన్ని మూడేళ్లకు పరిమితం చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ సోమవారం ఆమోదముద్ర వేశారు. అంతేకాదు, సీజేను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జిలతో ప్రత్యేక కమిటీ నియామకం ఉత్తర్వుపైనా ఆయన సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన 26వ రాజ్యాంగ సవరణపై నేషనల్ అసెంబ్లీ, సెనేట్లతో ఆదివారం మొదలైన చర్చలు, సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. అనంతరం ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజా సవరణ ద్వారా ఈ నెల 25న పదవీ విరమణ చేసే సీజే జస్టిస్ కాజీ ఇసా స్థానంలో జస్టిస్ మన్సూర్ అలీ షా కొత్తగా బాధ్యతలు చేపట్టకుండా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అడ్డుకోగలిగింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. ఆయన స్థానంలో సీనియర్ మోస్ట్ జడ్జి ఆటోమేటిక్‌గా ఆ పదవిని చేపడతారు. తాజా పరిణామంతో ఈ సంప్రదాయానికి ముగింపు పలికినట్లయింది. అంతేకాకుండా, సీజే ఎంపిక కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటుకానుంది. ఇందులో సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జీలతోపాటు, సెనేట్, నేషనల్ అసెంబ్లీ నుంచి ఇద్దరు చొప్పున సభ్యులుగా ఉంటారు. చట్ట సవరణను నవ శకానికి నాందిగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభివర్ణించగా దేశ స్వతంత్ర న్యాయవ్యవస్థకు చావుదెబ్బగా ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ పేర్కొంది. -
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
ఇస్లామాబాద్: ఆందోళనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలతో పాకిస్తాన్ ఆక్రమిత కాశీ్మర్(పీఓకే) అట్టుడికిపోతోంది. శనివారం మొదలైన రగడ ఆదివారం మరింత ఉధృతమైంది. గోధుమ పిండి ధరలు విపరీతంగా పెరగడం, విద్యుత్ చార్జీలు మండిపోతుండడం పట్ల జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గంచాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. వారిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచిన భద్రతా సిబ్బందిపై తిరగబడుతున్నారు. తుపాకులతో కాల్పులు తెగబడుతున్నారు. ఆదివారం పీఓకేలోని ఇస్లాంగఢ్లో జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారు. పీఓకేలో పలు ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. తాజా పరిస్థితిపై సమీక్షించేందుకు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. పీఓకేలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. -
పాకిస్తాన్ అధ్యక్షుడిగా జర్దారీ ప్రమాణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) నేత అసిఫ్ అలీ జర్దారీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫయీజ్ ఈసా ఆయనతో ప్రమాణం చేయించారు. జర్దారీ పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అíసీమ్ మునీర్, జర్దారీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జర్దారీ 2008 నుంచి 2013 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. అధికార కూటమి ఉమ్మడి అభ్యరి్థగా ఆయన శనివారం అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
పాక్ అధ్యక్షుడిగా జర్దారీ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్పర్సన్ ఆసిఫ్ అలీ జర్దారీ(68) పాక్ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికయ్యా రు. శనివారం జరిగిన ఓటింగ్‌లో పీపీపీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) ఉమ్మడి అభ్యర్థి జర్దారీకి 255 ఓట్లు, ఎస్ఐసీ బలపరిచిన మహ్మూద్ ఖాన్‌కు 119 ఓట్లు పోలయ్యాయి. -
నన్ను చంపించేందుకు జర్దారీ కుట్ర: ఇమ్రాన్
ఇస్లామాబాద్: మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తనను చంపించేందుకు ఉగ్రవాదులకు ముడుపులిచ్చారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(70) ఆరోపించారు. ఇప్పటికే తనపై జరిగిన రెండు హత్యాయత్నాలు విఫలం కావడంతో ఈ కొత్త పథకం వేశారని పేర్కొన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బు జర్దారీ వద్ద చాలానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాజా కుట్రలో జర్దారీతోపాటు మరో ముగ్గురికి కూడా భాగముందని ఇమ్రాన్ విమర్శించారు. వజీరాబాద్ హత్యాయత్నంతో ఏర్పడిన బుల్లెట్ గాయాలు మానాక తిరిగి పోరాటం మొదలుపెట్టడం ఖాయమన్నారు. తనకు ఏదైనా జరిగితే అందుకు కారణమైన వారిని దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఇమ్రాన్ అన్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. -
నిశ్చితార్థం జరిగింది: బఖ్తావర్ భావోద్వేగం!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ- దివంగత ప్రధాని బేనజీర్ భుట్టోల కుమార్తె బఖ్తావర్ భుట్టో జర్దారీ త్వరలోనే వివాహ బంధంలో బంధంలో అడుగుపెట్టనున్నారు. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కుమారుడు మహ్మద్ చౌదరిని ఆమె పెళ్లి చేసుకోనున్నారు. కరాచిలోని బిలావల్ హౌజ్‌లో వీరిద్దరి నిశ్చితార్థం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 100- 150 మంది అతిథులు ఈ శుభకార్యంలో పాల్గొని కాబోయే వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. అందరికీ ధన్యవాదాలు: బఖ్తావర్ భుట్టో- జర్దారీ కుటుంబ సన్నిహితులతో పాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేతలు, ఇతర రాజకీయ నాయకులు, బిజినెస్ టైకూన్లు, న్యాయవాదులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బఖ్తావర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘‘ఇది సెంటిమెంటల్, ఎమోషనల్ డే. మాపై ప్రేమను కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీపీపీ కుటుంబానికి థాంక్స్. ఇది ఆరంభం మాత్రమే. ఆ దేవుడి దయతో భవిష్యత్ వేడుకలు ఘనంగా చేసుకుందాం’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. (చదవండి: త్వరలోనే పెళ్లి చేసుకోనున్న ప్రధాని!) వీడియోకాల్‌లో విష్ చేసిన బిలావల్ బఖ్తావర్ సోదరుడు, రాజకీయ నాయకుడు బిలావల్ భుట్టోకు గతవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో వీడియో కాల్లో సోదరిని విష్ చేయగా.. అనారోగ్య కారణాలతో గత నెలలో ఆస్పత్రిపాలైన అసిఫ్ అలీ జర్దారీ ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో బిలావల్ హౌజ్‌కు చేరుకున్న ఆయన కూతురి నిశ్చితార్థ తంతును దగ్గరుండి జరిపించారు. Very sentimental & emotional day. So grateful for everyone’s love & prayers. Especially our PPP family whom I know are eager to participate. InshAllah this is only the beginning - will be able to celebrate in a post Covid world. Please keep SMBB and our family in your prayers💗🤗 — Bakhtawar B-Zardari (@BakhtawarBZ) November 27, 2020 -
రెహ్మాన్ మాలిక్ నాపై అత్యాచారం చేశారు..
-
'రెహ్మాన్ మాలిక్ నాపై అత్యాచారం చేశారు'
ఇస్లామాబాద్: అమెరికా బ్లాగర్ సింథియా డి రిచీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సీనియర్ లీడర్, మాజీ విదేశాంగ మంత్రి రెహ్మాన్ మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2011లో ఆయన పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ఉండగా తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని సింథియా పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష భవనంలో మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, మాజీ ఆరోగ్య మంత్రి మఖ్దూమ్ షాహబుద్దీన్ కూడా తనను శారీరకంగా వేధించారని ఆమె ఆరోపించారు. కాగా ఈ ఘటన సమయంలో అసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నట్లు సింథియా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రోజున ఆమె తన ఫేస్బుక్ పేజీ లైవ్ ద్వారా మాట్లాడుతూ.. ఈ ముగ్గురి వ్యవహారాలకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వచ్చే వారంలో వాటన్నింటినీ విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. కాగా.. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో వైవాహిక జీవితంపై సింథియా డి రిచీ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ సింథియాపై గత వారం ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) సైబర్ క్రైమ్ విభాగానికి పీపీపీ షెషావర్ జిల్లా అధ్యక్షుడు జుల్ఫికర్ ఆప్ఘానీ ఫిర్యాదు చేశారు. సింథియా గత వారం బెనజీర్ భుట్టో గురించి 'ఇన్‌డీసెంట్ కరస్పాండెంట్ సీక్రెట్ సెక్స్ లైఫ్ ఆప్ బెనజీర్ భుట్టో’ పుస్తకంలోని కొన్ని భాగాలను ట్విటర్లో పోస్ట్ చేశారు. పుస్తకంలో బెనజీర్ భుట్టో, ఆమె కుమారుడు బిలావల్ భుట్టో, పార్టీ సీనియర్ నేత షెర్రీ రెహమాన్ గురించి వివరంగా రాశారు. చదవండి: డీ గ్యాంగ్ బాస్‌కు కరోనా? పీపీపీ నేతలు మద్యం తాగుతూ, మహిళలతో డ్యాన్స్ వేస్తూ.. మోసం చేస్తారని సింథియా పునరుద్ఘాటించారు. సింథియా ఆరోపణల ప్రకారం.. బెనజీర్ భుట్టో మహిళలపై అత్యాచారాలు చేసేవారు అంటూ దివంగత రాజకీయ నాయకుల లైంగిక జీవితం గురించి ఆమె కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఒక బొమ్మల దుకాణం యొక్క రశీదును కూడా పోస్ట్ చేస్తూ సెక్స్ బొమ్మల వ్యాపారానికి సహాయం చేయడానికి తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించారనే ఆరోపణలను ఖండించమని పీపీపీ సీనియర్ నాయకుడు షెర్రీ రెహ్మాన్‌కు సవాల్ చేయడం గమనార్హం. చదవండి: జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి ఎవరీ సింథియా డి. రిచీ..? సింథియా నేపథ్యంపై పూర్తిగా ఆధారాలు లేవు. అయితే ఆమె 2009లో మొదటిసారిగా పాకిస్తాన్‌కు పర్యాటకురాలిగా వచ్చారు. తర్వాతి కాలంలో పాకిస్తాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, విదేశాంగ మంత్రి రెహ్మాన్ మాలిక్‌లతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. పీపీపీ కమ్యూనికేషన్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఈమె ఉర్దూ, పంజాబీ భాషలు మాట్లాడతారు. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో నివసిస్తూ.. ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్, రచయిత, కాలమిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ మధ్య పీపీపీ అధికారానికి దూరం కావడంతో ఇమ్రాన్ ఖాన్ శిబిరంలోకి వెళ్లిన సింథియా పీపీపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. -
పాక్ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ(63) అరెస్టయ్యారు. మనీ లాండరింగ్ కేసులో ఆయన్ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) బృందం సోమవారం అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) సహాధ్యక్షుడిగా ఉన్న జర్దారీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఆయన అరెస్ట్అయ్యారు. కోర్టులో ప్రవేశపెట్టే వరకు ఎన్ఏబీ కార్యాలయంలోనే ఆయన్ను ఉంచుతారని సమాచారం. ఈ కేసులో జర్దారీతోపాటు ఆయన సోదరి ఫర్యాల్ తల్పూర్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. అధికారంలో ఉండగా అక్రమంగా సంపాదించిన రూ.6.80 కోట్లను విదేశాలకు తరలించేందుకు వేలాది నకిలీ అకౌంట్లను సృష్టించారని వీరిపై ఆరోపణలున్నాయి. అధికారులు తల్పూర్‌ను అరెస్ట్ చేయలేదు. జర్దారీ అరెస్టుపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాక్ ప్రధానిగా బేనజిర్ భుట్టో 1988–90, 1993–96 సంవత్సరాల్లో పనిచేయగా, ఆమె భర్త జర్దారీ అధ్యక్షుడిగా 2008–13 సంవత్సరాల మధ్య పనిచేశారు. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం అరెస్టు చేసిందని, నకిలీ బ్యాంకు అకౌంట్లతో తనకు సంబంధంలేదని జర్దారీ పేర్కొన్నారు. -
జర్దారీ ఆస్తులన్నీ జప్తు చేయండి
ఇస్లామాబాద్: నకిలీ ఖాతాల ద్వారా సుమారు రూ.22 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడిన కేసులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆస్తులను జప్తు చేయాల్సిందిగా జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం (జేఐటీ) సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. ఈమేరకు జేఐటీ.. కరాచీ, లాహోర్‌లలోని ప్రఖ్యాత బిలావల్ హౌజ్, ఇస్లామాబాద్‌లోని జర్దారీ ఇంటిని జప్తుచేయాలని కోరుతూ శనివారం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. కరాచీలోని 5 ప్లాట్లతో పాటు న్యూయార్క్, దుబాయిల్లో ఉన్న జర్దారీ ఆస్తులను కూడా జప్తు చేయాలంది. దర్యాప్తు బృందం జర్దారీ పట్టణ, వ్యవసాయ భూములు, జర్దారీ గ్రూప్, అతని సోదరి ఫరీల్ తాల్పూర్ ఆస్తులపై విచారణ జరపాల్సిందిగా నివేదికలో కోరింది. జర్దారీ, ఓమ్ని గ్రూప్స్ ప్రభుత్వ నిధుల్లో అక్రమాలకు పాల్పడినట్లు, నగదును ‘హుండి’, ‘హవాలా’ ద్వారా దేశం నుంచి బదిలీ చేసినట్లు ఆరోపించింది. ఆయన ఆస్తులను దేశం నుంచి బదిలీ చేసే అవకాశం ఉన్నందున ఈ కేసులో తీర్పు వెలువడే వరకు ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోరింది. కాగా, జర్దారీ, తాల్పూర్‌లు ఈ నివేదికను ఊహాగానాలుగా, రాజకీయ వేధింపులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారని ఆరోపించారు. జర్దారీ, ఇక్బాల్ మెమాన్ పేరుతో ఓ బినామీ కంపెనీని స్థాపించగా, దాన్ని 1998లో జప్తు చేశారు. ఈ కేసులో జర్దారీ అత్యంత సన్నిహితుడైన హుస్సేన్ లవాయి గతేడాది జూలైలో అరెస్టు కాగా, మరో సన్నిహితుడు ఓమ్ని గ్రూప్ చైర్మన్ అన్వర్ మజీద్, అతని కుమారుడు అబ్దుల్ ఘనీ మజీద్‌ను గతేడాది ఆగస్టులో అరెస్టు చేశారు. -
కెప్టెన్ సెన్సేషన్.. ప్రత్యర్థులు విలవిల
ఇస్లామాబాద్: సానూభూతి గాలి పని చేయలేదు.. అధికారంపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఊహించని రీతిలో సత్తా చాటుతున్న పీటీఐ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులేస్తోంది. పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 272 స్థానాలకుగానూ ఎన్నికలు జరగ్గా.. దాదాపు 120 సీట్ల ఆధిక్యంతో పీటీఐ దూసుకుపోతోంది. ఇమ్రాన్ దెబ్బకు పీఎంఎల్-ఎన్, పీపీపీ, ఎంక్యూఎమ్‌లు విలవిలలాడిపోతున్నాయి. ఇమ్రాన్ ఘనత.. ఇదిలా ఉంటే ఫలితాల్లో మాజీ క్రికెట్ స్టార్ ఇమ్రాన్‌ఖాన్ ఓ అరుదైన ఘనత సాధించారు. మొత్తం పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఆయన ఘన విషయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా పీఎంఎల్-ఎన్ పార్టీ కంచుకోటగా ఉన్న రావల్పిండిలో ఇమ్రాన్ జెండా ఎగరేయటం చర్చనీయాంశంగా మారింది. అధికారం దిశగా ఫలితాలు పీటీఐకు అనుకూలంగా వస్తుండటంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సయీద్‌కు షాక్.. గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్‌కు ఈ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురైంది. సయీద్ ‘అల్లాహో అక్బర్‌తెహరిక్ పార్టీ’ని ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే ఈ పార్టీ మద్ధతుదారులు కొందరు ఇండిపెండెంట్లుగా పోటీ చేయగా, వాళ్లు మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. NA-3 స్వాట్‌లో షరీఫ్ సోదరుడు, పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెబాజ్ షరీఫ్ ఓటమి పాలయ్యాడు. అక్కడ పీటీఐ అభ్యర్థి సలీం రెహమాన్ జయకేతనం ఎగరవేశాడు. NA-200 లార్కానా లో పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో వెనకంజలో ఉన్నారు. ఎంఎంఏ రషీద్ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బిలావల్ తండ్రి అసిఫ అలీ జర్దారీ NA-213 నవాబ్షా నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. మొత్తం 272 స్థానాలకు గానూ ఎన్నికలు జరగ్గా, మ్యాజిక్ ఫిగర్ 137. ఒకవేళ పీటీఐకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే మాత్రం.. ఇండిపెండెంట్లు కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. ఫలితాలపై పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. అవకతవకల ఆరోపణలపై స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి ముహమ్మద్ రాజా వాటిని ఖండించారు. ఫలితాలు ఆలస్యం కావటం వెనుక ఎలాంటి ఒత్తిడి లేదని.. కేవలం సాంకేతిక సమస్యల కారణంగానే జాప్యం జరుగుతోందని ఆయన వెల్లడించారు. సాయంత్రంకల్లా పూర్తి ఫలితాలు వెల్లడిస్తామని ఆయన చెబుతున్నారు. -
పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ దూకుడు
-
పాక్ ఎన్నికల ఫలితాలు: అప్డేట్స్
ఇస్లామాబాద్: ఉద్రిక్త పరిస్థితులు, ఉగ్రదాడుల నడుమ కొనసాగిన పాకిస్తాన్ ఎన్నికలు ముగిశాయి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. మేజిగ్ ఫిగర్ 172 సీట్లు సాధించిన పార్టీ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో అధికారం పీఠం అధిరోహించనుంది. ఇక ఈ రెండు పార్టీలకు తగిన మెజార్టీ రానిపక్షంలో బిలావల్ భుట్టో జర్దారీ ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంది. జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా.. 272 స్థానాలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. మహిళలకు కేటాయించిన 60 సీట్లు, మైనారిటీలకు కేటాయించిన మరో 10 సీట్లకు పరోక్ష పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. కాగా, సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల కమిషన్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించింది. పాకిస్తాన్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో.. ఏ పార్టీ పరాజయం వైపు పయనిస్తుందో.. ఎప్పటికప్పుడు ఇవిగో వివరాలు...! పార్టీలు: ఆధిక్యం+ గెలుపు ఇమ్రాన్‌ఖాన్: పీటీఐ 120 నవాజ్ షరీఫ్: పీఎంఎల్-ఎన్ 61 అసిఫ్ అలీ జర్దారీ: పీపీపీ 40 స్వతంత్రులు, ఇతరులు 51 చిత్తుగా రాసిచ్చారా..!! ఎన్నికలను సజావుగా నిర్వహించామని చెప్పుకొంటున్న పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తీరు మాత్రం విమర్శల పాలవుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫారం 45పై ఎవరికెన్ని ఓట్లు పోలయ్యాయో వెల్లడించాల్సిందిపోయి అధికారులు చిత్తు కాగితంపై రాసిచ్చారు. ఒక స్టాంపు వేసి ఆ కాగితాన్ని అధికారికం చేసేశారు. ఈ వార్త ఎన్నికల అధికారుల పనితీరుకు అద్దం పడుతోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #PakistanElections2018 As per rules,Election Commission of Pakistan(ECP)officials are bound to provide results on Form 45,instead results were handed out on plain paper in Khi&Hyderabad. As per latest unofficial trends on ARY news,PTI leading on 114 seats,PMLN-63 seats& PPP on 42 pic.twitter.com/rxFEosfG1p — ANI (@ANI) July 26, 2018 ఫలితాలు ఆలస్యం.. పాక్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి సర్దార్ ముహమ్మద్ రజాఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోందని అన్నారు. ముందుగా అనుకున్న సమయానికి ఫలితాలను వెల్లడించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 47 శాతం ఓట్ల లెక్కింపు మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన 24 గంటల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని ఇంతకుముందు ఆయన పేర్కొనడం గమనార్హం. చదవండి: పాక్ ఎన్నికలు.. పది ముఖ్య విషయాలు భారత్‌కు మున్ముందు ముప్పే! ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే పక్కలో తుపాకే! -
నన్ను చంపేందుకు కుట్ర చేశారు
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అతని సోదరుడు షాబాజ్ షరీఫ్‌లపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. గతంలో నన్ను రెండు సార్లు హత్య చేసేందుకు నవాజ్ అతని సోదరుడు షాబాజ్ ప్రయత్నించినట్లు జర్దారీ పేర్కొన్నారు. గతంలో అవినీతి కేసుల విషయంలో జర్దారీ సుదీర్ఘ కాలం కోర్టులు, జైలు చుట్టూ తిరిగారు. అదే సమయంలో ఒక సందర్భంలో కోర్టుకు హాజరవుతున్న సమయంలో నన్ను హత్య చేసేందుకు షరీఫ్ సోదరులు కుట్ర పన్నారని జర్దారీ ఆరోపించారు. నాకు నా భార్య బేనజీర్ భుట్టోకు షరీష్ సోదరులు చేసినదానిని ఎన్నటికీ మర్చిపోను అని జర్దారీ అన్నారు. -
ముషారఫ్ పాలనే బెటర్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రజలు ప్రజా పాలకులకన్నా.. మిలటరీ పాలకుల పరిపాలనే బాగుందని తాజా సర్వేలో స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు, మంత్రుల్లో 99 శాతం మంది అవినీతి పరులేనంట పాక్ ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజా ప్రభుత్వాల కన్నా.. మిలటరీ పాలకుల ఏలుబడిలోనే దేశం అంతోఇంతో అభివృద్ధి సాంధించిందని ప్రజలు అభిప్రయాపడ్డారు. దేశం ఏర్పడ్డనాటినుంచి ఇప్పటి వరకూ అద్భుతంగా పాలించిన నేతలపై డాన్ పత్రిక సర్వే నిర్వహించింది.. ఇందులో పలు ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకూ పాకిస్తాన్‌ను పాలించిన ప్రధానమంత్రుల్లో.. మొదటి ప్రధాని లియాఖత్ ఇలీఖాన్ అత్యద్భుత పాలకుడని మెజారటీ పాకిస్తానీయులు అభిప్రయాన్నివ్యక్తం చేశారు. మిలటరీ పాలకుల్లో మహమ్మద్ ఆయూబ్ ఖాన్ పాలన ప్రజారంజకంగా సాగిందని సర్వేలో ప్రజలు తెలిపారు. బెనజీర్ భుట్టో కన్నా.. మిలటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ చాలా మేలని ప్రజలు స్పష్టం చేశారు. ఆసిఫ్ ఆలీ జర్దారీ అత్యంత చెత్త అధ్యక్షుడని ప్రజలు తీర్పు చెప్పారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతి పరుడని.. అతని వల్ల దేశానికి ఎటువంటి మేలు జరగదనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. -
ముషార్రఫ్ సంచలన ఆరోపణలు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, నియంత పర్వేజ్ ముషార్రఫ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ పాకిస్థాన్ సహ చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీపై సంచలన ఆరోపణలు చేశారు. జర్దారీ భార్య బెనజీర్ భుట్టో హత్యలో జర్దారీకి కూడా భాగస్వామ్యం ఉందని, ఆమె హత్యకు అసిఫ్ అలీ జర్దారీ హస్తం ఉందన్నారు. ఆమె సోదరుడు ముర్తాజ భుట్టో చావుకు కూడా జర్దారీ కారణం అన్నారు. రావల్పిండిలో 2007 డిసెంబర్ 27న బెనజీర్ భుట్టోపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె మృత్యువాత పడ్డారు. అయితే, ఆగస్టు 31న యాంటీ టెర్రరిజం కోర్టు ముషార్రఫ్ పాత్ర కూడా ఈ హత్యలో ఉందంటూ ఆరోపించింది. అదే సమయంలో సాక్ష్యాధారాలు లేవని ఓ ఐదుగురు నిందితులను విడిచిపెట్టింది. ఇక బెనజీర్ భుట్టో ప్రధానిగా ఉన్న సమయంలోనే ఆమె సోదరుడు ముర్తాజా 1996లో కరాచీలో హత్యకు గురయ్యారు. ఆ హత్య ఆమె ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముషార్రఫ్ భుట్టో కుటుంబానికి సంబంధించి మాట్లాడుతూ ’భుట్టో కుటుంబంలో జరిగిన దుర్ఘటనలన్నింటికి ఒక వ్యక్తే కారణం అదే జర్దారీ. బెనజీర్ భుట్టో, ఆమె సోదరుడు ముర్తాజా భుట్టో హత్యకు కారణం జర్దారీనే’ అంటూ ఆయన భుట్టో జర్దారీ ముగ్గురు పిల్లలకు వీడియో ద్వారా ఈ సందేశం చెప్పారు. భార్య చనిపోయినా ఏమీ పట్టించుకోని జర్దారీ పదవీ కాలాన్ని మాత్రం ఐదేళ్లపాటు దర్జాగా అనుభవించారని ఆరోపించారు. -
పార్లమెంట్‌కు వస్తానంటున్న మాజీ అధ్యక్షుడు
కరాచీ : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, బెనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ ఆలీ జర్దారీ పార్లమెంట్‌కు రానున్నట్టు తెలిపారు. కొడుకు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్, తాను కలిసి ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు పోటీచేయనున్నామని ప్రకటించారు. ప్రధాని బెనజీర్ భుట్టో 9వ వర్థంతిని పురస్కరించిన పీపీపీ మద్దతుదారులతో జరిపిన సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. షరీఫ్ ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని, అవినీతి మయంలో కూరుకుపోయిందని ఘాటైన విమర్శలు చేశారు. జర్దారీ, పాకిస్తాన్ పీపుల్ పార్టీ(పీపీపీ)కి కో-చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 8 నెలల పాటు స్వీయ బహిష్కరణలో ఉన్న ఈయన, నవాబ్షా నుంచి పోటీచేయనున్నానని, బిలావల్ సింధ్ ప్రావినెన్స్ నుంచి బరిలోకి దిగనున్నారని చెప్పారు. ఈ ప్రకటన దేశ రాజకీయాల్లో ఓ పెద్ద మార్పును తీసుకురానుందని చెప్పారు. ఈ ప్రకటన చేయబోయే ముందు తాను ప్రజలతో పంచుకుంటునాన్న గుడ్‌న్యూస్‌ను చెబుతున్నాను. తాను, బిలావల్ ప్రస్తుత పార్లమెంట్‌కు పోటీచేయబోతున్నాం అని తెలిపారు. జర్దారీ తన చెల్లి అజ్రా పెచువ్సో సీటుపై, బిలావల్ సూమ్రో షాహిబ్ సీట్లో పోటీచేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికల ద్వారా జర్దార్ పార్లమెంట్‌లోకి వెళ్లబోతున్నారని డాన్ రిపోర్టు చేసింది.. ఈ పరిస్థితిలో ఆ నియోజకవర్గాలకు తాజా ఎన్నికలు నిర్వర్తించబోతున్నారని తెలిపింది. -
పాక్‌లో ఉద్యమ ప్రహసనం
సంపాదకీయం: సంక్షోభాలు పాకిస్థాన్‌కు కొత్త కాదు. నిజానికి అలాంటి సంక్షోభాలు అక్కడ లేకపోవడమే వింత. ఎందుకనో నిరుడు జూలైలో గద్దె దిగిన అసిఫ్ అలీ జర్దారీ ప్రభుత్వం ఒక్కటే తన పాలనాకాలాన్ని సజావుగా పూర్తిచేయగలిగింది. ఈ ఆరున్నర దశాబ్దాల్లోనూ జర్దారీ సర్కారు మినహా పాక్‌లో ఏ ఒక్క ప్రభుత్వమూ స్థిరంగా అయిదేళ్లూ పాలించలే కపోయింది. జర్దారీ కూడా చివరి రెండు సంవత్సరాలూ అక్కడి సుప్రీంకోర్టు కల్పించిన అనేక అవరోధాల వల్ల చిక్కుల్లో పడ్డారుగానీ ఆయన అర్ధాంతరంగా గద్దె దిగే పరిస్థితి రాలేదు. పాకిస్థాన్ ఇక మారిందేమో... ప్రజాస్వామ్య విలువలు ఒంటబట్టాయేమోనని అం దరూ అనుకునేంతలోనే నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. నిరుడు జూన్‌లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశాక ఆయన పని నల్లేరు మీద నడకలా లేదుగానీ... చెప్పుకోదగిన సంక్షోభాలైతే రాలేదు. ఇన్నాళ్లకు పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) నేత ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ నేత తహిరుల్ ఖాద్రీల రూపంలో పెను సవాల్ ఎదురైంది. నవాజ్ షరీఫ్‌ను గద్దె దించటమే తమ లక్ష్యమంటూ వేలాదిమంది తమ అనుచరులతో ఇస్లామ్‌బాద్ లోని పార్లమెంటు భవనమున్న రెడ్ జోన్ ప్రాంతంలో వారు బైఠాయించారు. పక్షం రోజులక్రితం ప్రారంభమైన ఈ ఉద్యమం అంతూ దరీ లేకుండా సాగుతున్నది. నిజానికి పాకిస్థాన్ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. ఉగ్రవాదం, జాతుల పోరు, అంతులేని విద్యుత్ కోతలు, అధిక ధరలు ఆ దేశాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. నవాజ్ షరీఫ్ సర్కారు ఇందులో ఏ ఒక్కదాన్నీ సరిగా పరిష్కరించలేకపోయిందన్న అసంతృప్తి అక్కడివా రిలో అంతకంతకూ పెరుగుతోంది. ఇదంతా చాలదన్నట్టు ఇస్లామా బాద్‌ను స్తంభింపజేస్తూ ఈ ఉద్యమం! లాహోర్‌లో మూడునెలల క్రితం తమ ఉద్యమంపై పోలీసులు విరుచుకుపడి 14మందిని కాల్చి చంపడంపై ఖాద్రీ ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఉదంతంలో ప్రధాని షరీఫ్... ఆయన సోదరుడు, పంజాబ్ ప్రా విన్స్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్‌లపై హత్య కేసులు నమోదు చేయాలన్నది ఖాద్రీ ప్రధాన డిమాండు. షరీఫ్ అక్రమ పద్ధతుల్లో గద్దెనెక్కారు గనుక తప్పుకోవాలన్నది ఇమ్రాన్ డిమాండు. చిత్రమేమంటే ఇద్దరి ర్యాలీలూ ఈ నెల 14నే ఇస్లామాబాద్ చేరుకున్నాయి. ఇద్దరూ ఖరీదైన, విలాసవంతమైన వాహనాల్లో కాలక్షేపం చేస్తూ ‘ప్రజాస్వామిక ఉద్యమాన్ని’ నడిపిస్తున్నారు. అందుకనే స్థానిక మీడియా దీనికి ‘కంటైనర్ ఉద్యమం’ అని ముద్దుపేరు పెట్టింది. ఇద్దరి దారులూ వేర్వేరు. ఒకరిది లౌకికవాద పార్టీ, మరొకరిది మతతత్వ పార్టీ. కానీ, ఇద్దరూ తోడుదొంగల్లా ఉద్యమాన్ని నడుపు తున్నారు. ఒకరు ఓ మెట్టుదిగితే, మరొకరు కూడా తగ్గినట్టే కనబడతారు. ఒకరు బెట్టు చేస్తే, మరొకరు కాస్సేపటికల్లా దాన్నే అనుకరిస్తారు. ‘ఇదే చివరి డెడ్‌లైన్’ అంటూ ఇప్పటికి అయిదారు సార్లు ఇద్దరూ ఒకరి వెనక ఒకరు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాక పోయేసరికల్లా దాన్ని పొడిగించడం కూడా మామూలే. ఖాద్రీ ప్రధాన డిమాండును నెరవేరుస్తూ షరీఫ్ సోదరులపై హత్య కేసులు పెట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది. కనుక ఆయన జారుకుంటా డేమోననుకుని గురువారం ఇమ్రాన్ సైతం తగ్గినట్టే కనబడ్డారు. అయితే, హత్య కేసులు పెట్టారు గనుక షరీఫ్ సోదరులు రాజీనామా చేయాలని ఇప్పుడు ఖాద్రీ కొత్త మెలిక పెట్టి ఉద్యమాన్ని కొనసాగిం చదల్చుకున్నట్టు ప్రకటించారు. నిరుడు జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఇమ్రానే కాదు... చాలామంది ఆరోపిస్తున్నారు. ఎన్నికల అక్రమాలపై విచారణ జరిపించాలన్న పీటీఐ డిమాండును మిగిలిన పార్టీలు కూడా సమ ర్ధిస్తున్నాయి. అయితే, ఆ పేరున ప్రజాస్వామిక ప్రక్రియకు విఘాతం కలిగేలా వ్యవహరించడాన్ని అవి నిరసిస్తున్నాయి. పాక్ ప్రజానీకానికి కూడా వీరి ఉద్యమంపై సానుభూతి లేదు. పౌర వ్యవహారాల్లో తరచు జోక్యం చేసుకోవడం అలవాటైన సైన్యం అయిదేళ్లపాటు అందుకు దూరంగా ఉన్నదని, వీరి ఉద్యమాల కారణంగా మళ్లీ అది తన పాత రూపాన్ని ప్రదర్శించే ప్రమాదమున్నదని వారు ఆందోళన చెందుతు న్నారు. అయితే, ఇప్పటివరకూ తటస్థతను పాటిస్తున్న పాక్ సైన్యం జోక్యానికి సిద్ధపడొచ్చునన్న అంచనాలున్నాయి. ఉద్యమకారుల ఒత్తిళ్లకు లొంగక, కఠినంగా ఉన్నట్టు కనబడు తున్న నవాజ్ షరీఫ్ వాస్తవానికి బలహీనపడ్డారని జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో ఆయన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ రహీల్ షరీఫ్‌ను రెండుసార్లు కలిశారంటేనే పరిస్థితి తీవ్రత అర్ధమవుతుంది. షరీఫ్ పగ్గాలు చేపట్టాక సైన్యానికి ఇచ్చే ప్రాముఖ్యతను తగ్గించారు. పౌర ప్రభుత్వం ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి స్వల్పస్థాయిలోనైనా ఆయన కృషి చేశారు. ఆఖరికి మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడంలో కూడా సైన్యం మనోగతం వేరుగా ఉన్నా ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటివి సహ జంగానే పాక్ సైన్యా నికి మింగుడు పడటంలేదు. అది అదును కోసం వేచిచూస్తున్నది. ఇమ్రాన్, ఖాద్రీల రూపంలో ఇప్పుడు వారికది సమకూడింది. నిజా నికి ఈ ఉద్యమం వెనకాల వారి ప్రోద్బలమున్నదని కూడా పాకి స్థాన్లో చాలామంది అనుమానం. మన పొరుగునున్న దేశం కనుక పాక్‌లో ప్రజాస్వామ్యం బలహీనపడితే దాని ప్రభావం మనను కూడా తాకుతుంది. అందువల్లే అక్కడ పరిస్థితులు చక్కబడాలనీ, గత అయిదేళ్లుగా అక్కడ కుదురుకుంటున్న ప్రజాస్వామ్య వ్యవస్థ సుస్థిరం కావాలని అందరూ కోరుకుంటారు. -
అవినీతి కేసుల్లో జర్దారీకి సమన్లు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి ఇస్లామాబాద్‌లోని అవినీతి నిర్మూలన కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం ఆయన కోర్టు ఎదుట హాజరు కావాల్సిఉన్నా విదేశాల్లో ఉన్నందున రాలేకపోయారు. ఈ నెల 29న హాజరు కావాల్సిందిగా కోర్టు నోటీసులు జారీ చేసింది. పదవీకాలం ముగియడంతో ఇటీవల పాక్ అధ్యక్షుడిగా వైదొలిగిన జర్దారీ అవినీతి కేసుల్లో కూరుకుపోయారు. ఆయనపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ జర్దారీ అధికారంలో ఉన్నపుడు అధికార దుర్వినియోగానికి సంబంధించినవి. ఈ కేసులను పునఃప్రారంభించాల్సిందిగా జాతీయ పారదర్శక విభాగం (ఎన్ఏబీ) కోర్టు న్యాయమూర్తి గత నెలలో ఆదేశించినట్టు కథనం. వీటిని సుమోటాగా స్వీకరించింది. పాక్ అధ్యక్షుడిగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న జర్దారీ గత నెల 6న కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రస్తుతం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో చైర్మన్‌గా ఉన్నారు. క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు దృష్టిసారిస్తున్నారు.