
ఇస్లామాబాద్: మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తనను చంపించేందుకు ఉగ్రవాదులకు ముడుపులిచ్చారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(70) ఆరోపించారు. ఇప్పటికే తనపై జరిగిన రెండు హత్యాయత్నాలు విఫలం కావడంతో ఈ కొత్త పథకం వేశారని పేర్కొన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బు జర్దారీ వద్ద చాలానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా కుట్రలో జర్దారీతోపాటు మరో ముగ్గురికి కూడా భాగముందని ఇమ్రాన్ విమర్శించారు. వజీరాబాద్ హత్యాయత్నంతో ఏర్పడిన బుల్లెట్ గాయాలు మానాక తిరిగి పోరాటం మొదలుపెట్టడం ఖాయమన్నారు. తనకు ఏదైనా జరిగితే అందుకు కారణమైన వారిని దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఇమ్రాన్ అన్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment