assassination attempts
-
Nehru Birthday: ఆ హత్యాయత్నాల నుంచి నెహ్రూ తప్పించుకున్నారిలా..
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1889, నవంబరు 14న జన్మించారు. నెహ్రూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. స్వాతంత్య్రోద్యమంలో నెహ్రూ పలుమార్లు జైలుకు వెళ్లారు. నెహ్రూ ప్రధానిగా ఉండగా ఆయనపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. వాటినుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.జవహర్లాల్ నెహ్రూపై మొదటి హత్యాయత్నం 1947లో జరిగింది. ఆ సమయంలో నెహ్రూ దేశ తాత్కాలిక ప్రభుత్వానికి అధ్యక్షునిగా ఉన్నారు. నెహ్రూ నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లో కారులో ప్రయాణిస్తుండగా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ ప్రాంతం నేటి పాకిస్థాన్‌లో ఉంది. 1948 జూలైలో నెహ్రూపై రెండవసారి హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వచ్చాయి. నెహ్రూను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీకి వెళ్తున్న ముగ్గురిని బీహార్‌లోని ధర్మశాలలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రెండు పిస్టల్స్, రెండు రివాల్వర్లు, రైఫిల్, కంట్రీ మేడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో వీరి కుట్ర బయటపడింది.1953లో కూడా నెహ్రూపై హత్యాయత్నం జరిగింది. నాటి నివేదికల ప్రకారం నెహ్రూ ప్రయాణిస్తున్న బొంబాయి-అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైలును పేల్చివేసేందుకు కొందరు కుట్ర పన్నారు. అయితే కళ్యాణ్‌లోని రైల్వే పట్టాల దగ్గర కూర్చున్న ఇద్దరిని పోలీసులు పట్టుకోవడంతో ఈ కుట్ర విఫలమైంది.1955లో నెహ్రూపై ఒక రిక్షా పుల్లర్ కత్తితో దాడి చేశాడు. నాటి వార్తాపత్రికల నివేదికల ప్రకారం 32 ఏళ్ల రిక్షా పుల్లర్ నుంచి పోలీసులు ఆరు అంగుళాల కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి నెహ్రూ కారుపైకి దూకాడు. దీనిని గమనించిన నెహ్రూ అతనిని కిందకు నెట్టివేశారు. 1955లో నెహ్రూ ముంబైలోని ఒక వేదికపై ప్రసంగిస్తుండగా వందలాది మంది రాళ్లతో దాడికి ప్లాన్ చేశారని నాడు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.ఇది కూడా చదవండి: 15న మరో రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య -
నా పైనా రెండు హత్యాయత్నాలు: మస్క్
వాషింగ్టన్: గత ఎనిమిది నెలల కాలంలో తనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగినట్లు బిలియనీర్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వెల్లడించారు. టెక్సాస్‌లోని టెస్లా ప్రధాన కార్యాలయం సమీపంలో తుపాకులతో ఉన్న వ్యక్తులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో మస్క్ వ్యక్తిగత భద్రతపై ఆయన సొంత సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఓ యూజర్ ‘దయచేసి మీకున్న భద్రతా ఏర్పాట్లను మూడింతలు పెంచుకోండి. ఇవాళ ట్రంప్.. రేపు మీ వంతు రావచ్చు’అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ... ‘నిజమే, ప్రమాదం పొంచి ఉంది. గత ఎనిమిది నెలల్లో నన్ను చంపేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. తుపాకీలతో సహా వారిని అరెస్ట్ చేశారు’అని తెలిపారు. ఏ సమయంలోనైనా తాను హత్యకు గురి కావచ్చునంటూ గతంలోనూ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. -
నన్ను చంపించేందుకు జర్దారీ కుట్ర: ఇమ్రాన్
ఇస్లామాబాద్: మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తనను చంపించేందుకు ఉగ్రవాదులకు ముడుపులిచ్చారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(70) ఆరోపించారు. ఇప్పటికే తనపై జరిగిన రెండు హత్యాయత్నాలు విఫలం కావడంతో ఈ కొత్త పథకం వేశారని పేర్కొన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బు జర్దారీ వద్ద చాలానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాజా కుట్రలో జర్దారీతోపాటు మరో ముగ్గురికి కూడా భాగముందని ఇమ్రాన్ విమర్శించారు. వజీరాబాద్ హత్యాయత్నంతో ఏర్పడిన బుల్లెట్ గాయాలు మానాక తిరిగి పోరాటం మొదలుపెట్టడం ఖాయమన్నారు. తనకు ఏదైనా జరిగితే అందుకు కారణమైన వారిని దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఇమ్రాన్ అన్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. -
త్రుటిలో తప్పిన ప్రాణాపాయం... స్నేహితురాలిపై బ్లేడుతో దాడి...
సాక్షి,బళ్లారి: ఇద్దరు కాలేజీ విద్యార్థినులు ఒకరినిపై మరొకరు మంచి స్నేహం పెంచుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థాయికి స్నేహం ముదిరింది. ఆ స్నేహమే ఇద్దరి మధ్య గొడవ జరిగి పతాకస్థాయికి చేరుకుని బ్లేడ్‌తో హత్యాయత్నానికి దారితీసింది. ఈ ఘటన దావణగెరె నగరంలో చోటు చేసుకుంది. వివరాలు..గురువారం సాయంత్రం దావణగెరె నగరంలోని ఏవీకే కాలేజీ సమీపంలో చిక్కమగళూరు విద్యార్థిని లాస్య ఆమె స్నేహితురాలిపై దాడి చేసింది. దావణగెరెలో కాలేజీలో చేరినప్పటి నుంచి లాస్య, ఆమె స్నేహితురాలితో ఎంతో గాఢస్నేహం పెంచుకుంది. రోజులు గడిచే కొద్ది ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేని విధంగా స్నేహం ముదిరిపోయింది. లాస్య తన స్నేహితురాలిపై గొడవకు దిగి బ్లేడ్‌తో హత్యాయత్నం చేయడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన యువతిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. దాడి చేసిన లాస్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కళాశాలలో ఇద్దరి స్నేహం గురించి పోలీసులు ఆరా తీయగా నివ్వెరపోయేలా పోలీసులకు సమాధానం దొరికింది. బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇద్దరు యువతుల మధ్య గొడవ ఎందుకు పెరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేయగా ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కం కూడా ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలడం గమనార్హం. (చదవండి: లోదుస్తుల్లో బంగారం తరలింపు.. మహిళ అరెస్ట్) -
ప్రాణాలు తీసేందుకు యత్నించిన మైక్రోవేవ్
Microwave with voice-controlled AI: శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త విషయాలు కనుక్కునే క్రమంలో అనేక రకాలైన ప్రమాదాలను ఎదుర్కొవడం సహజం. ఒక్కోసారి తమ ప్రాణాలనే కోల్పోతారు కూడా. కానీ కొన్ని విపత్కర పరిస్థితి తాము రూపొందించిన వాటి చేతిలోనే హతమవ్వడం లేదా అవే ప్రాణాంతకంగా మారడం జరుగుతుంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడొక వ్యక్తికి ఎదురైంది. వివరాల్లోకెళ్తే..యూట్యూబర్ లుకాస్ రిజోట్టో తను చేసిన విచిత్రమైన ప్రయోగం తనకు చేదు అనుభవాన్ని ఇచ్చింది. లూకాస్ ఏకంగా తన చిన్ననాటి ఊహజనిత స్నేహితుడు మాగ్నెట్రాన్ గురించి వంద పేజీల పుస్తకాన్ని రాశాడు. పైగా అతను మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కొన్న అనుభవశాలి అని చెప్పడం గమనార్హం. అంతేకాదు తన ఊహజనిత స్నేహితుడిని పునర్జీవింప చేసే ప్రయత్నంలో భాగంగా...వాయిస్ నియంత్రిత ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఒక సరికొత్త మైక్రోవేవ్‌ని తయారు చేశాడు. అతను ఆ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) మైక్రోవేవ్‌ని ఆన్ చేయగానే తన పాత మిత్రుడితో మాట్లాడుతున్నట్లు భావించేవాడు. అంతేకాదు లూకాస్ శిక్షణలో అన్ని విషయాలను నేర్చుకున్నాడు మైక్రోవేవ్గా రూపొందిన మాగ్నెట్రాన్. అయితే మాగ్నెట్రాన్ తన గత కాలపు మొదటి ప్రపంచ యుద్ధం తాలుకా భయాలు, బాధలు ఒత్తిడికి సంబంధించిన మనోవ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో మైక్రోవేవ్ రూపంలో ఉన్న మాగ్నెట్రాన్ లూకాస్ని బెదిరించడం, హింసించడం వంటివి మొదలు పెట్టాడు. అఖరికి నీ మనసులో ఏముందని లుకాస్ మాగ్నెట్రాన్ మైక్రోవేవ్‌ని అడిగితే ప్రతీకారం అని పదే పదే బదులు ఇవ్వడమే కాకుండా నిన్ను వెన్నుపొటు పొడిచి మరీ చంపుతానని వచెప్పడం గమనార్హం. అంతేకాదు లూకాన్ని మైక్రోవేవ్‌లోకి రావాల్సిందిగా మైక్రోవేవ్ రూపంలో ఉన్న మాగ్నెట్రాన్ అన్నాడు. అయితే లూకాస్ తనతో వస్తున్నట్లు నటించి మైక్రోవేవ్ డోర్‌ని మూసేశాడు. మనం సృష్టించింది మనకే యుముడై కూర్చోవడం అంటే ఇదే కదా!. I brought my childhood imaginary friend back to life using A.I. (#GPT3) and it was one of the scariest and most transformative experiences of my life. A thread 🤖 (1/23) pic.twitter.com/70C9Yo7m4x — Lucas Rizzotto (@_LucasRizzotto) April 19, 2022 (చదవండి: పోకిరిని చితకబాదిన యువతి.. హ్యాట్సాఫ్ అంటూ వాసిరెడ్డి పద్మ కామెంట్) -
ప్రియుడి మోజులో భార్య.. భర్త మెడకు చీరచుట్టి..ఆపై!
సింగరాయకొండ: ప్రియుడిపై మోజుతో భర్తపై హత్యాయత్నానికి ప్రయత్నించి చివరకు ఆమె తన ప్రియుడితో కలిసి కటకటాల పాలైంది. ఈ సంఘటన మండలంలోని ఊళ్లపాలెం పంచాయతీ దేవలం పల్లెపాలెంలో బుధవారం జరిగింది. ఫిర్యాదు అందిన 3.30 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ సంపత్‌కుమార్ తెలిపారు. కథనం ప్రకారం..దేవలం పల్లెపాలేనికి చెందిన కొక్కిలిగడ్డ సుబ్బారావు తన భార్య వెంకటేశ్వరమ్మతో కలిసి బేల్దారి పని కోసం హైదరాబాద్ వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. వీరికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు కుమారులున్నారు. గృహిణిగా ఇంటి వద్దే ఉంటున్న వెంకటేశ్వరమ్మకు కారు డ్రైవర్ గంటా సతీష్‌తో పరిచయమైంది. నిజామాబాద్‌కు చెందిన సతీష్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండు నెలల క్రితం సుబ్బారావు తన భార్యతో కలిసి స్వగ్రామం వచ్చాడు. ప్రియుడిపై ఉన్న మోజుతో అతడిని మంగళవారం తన ఇంటికి పిలిపించుకుంది. భర్తకు తెలియకుండా అతడిని ఇంట్లో దాచి పెట్టింది. రాత్రి వేళ రోజూ మద్యం తాగి వచ్చే భర్తపై వెంకటేశ్వరమ్మ రుసరుసలాడుతోంది. మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు ఎదురేగి మరీ మద్యం ఫుల్ బాటిల్ ఇచ్చి తాగమని ఒత్తిడి చేసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి తర్వాత తాగుతానని చెప్పాడు. ఆదమరిచి ఉన్న భర్త మెడకు చీరచుట్టి ఇద్దరూ ఉరేసే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన భర్త సుబ్బారావు బలవంతంగా తప్పించుకోవడంతో వీరి ప్రయత్నం విఫలమైంది. సముద్రం వద్ద ఉన్న బోట్లలో తలదాచుకుని అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీసులు ఎస్ఐ సంపత్‌కుమార్‌కు సమాచారం అందించారు. వెంకటేశ్వరమ్మను ఆయన అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక సహకారంతో ప్రియుడు సతీష్ ఫోన్‌ను ట్రాప్ చేసి అతను కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో పారిపోతున్నాడని తెలుసుకున్నారు. చీరాల రైల్వేస్టేషన్లో నిందితుడు సతీష్‌ను కూడా అదుపులోకి తీసుకుని సింగరాయకొండకు తరలించారు. భార్య, ప్రియుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, ఫిర్యాదు ఇచ్చిన 3.30 గంటల్లోనే కేసును ఛేదించామని ఎస్ఐ పేర్కొన్నారు. ఎస్ఐను సీఐ లక్ష్మణ్ ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: మచ్చా అన్నందుకు డబుల్ మర్డర్ -
వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధిపై హత్యాయత్నం
సాక్షి,విశాఖపట్నం: నిత్యం ప్రజల మధ్య ఉండే వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబుపై హత్యా యత్నం జరిగిందన్న వార్త తెలుసుకొని స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటి వరకు ఆయనతో తిరిగిన అనుచరులు, ఆయనను చూసిన స్థానికులు శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో నిశ్చేష్టులయ్యారు. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో గతంలో ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు. గవరపేటలో ఉన్న తన ఇంటి నుంచి సాయంత్రం 5.30 గంటల సమయంలో బైక్ పై ఒంటరిగా ఆయన బయలుదేరారు. శారదానది అవతల పొలాల్లో నిర్మించుకుంటున్న అతిథి గృహానికి వెళుతుండగా.. సమీపంలో నది వంతెన అవతలకు చేరే సరికి గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చే శాడు. మెడపై కత్తితో నరకడానికి ప్రయత్నించగా బుల్లిబాబు తన చేతులతో అడ్డుకున్నారు. దీంతో చేతి వేళ్లు రెండు తెగిపడ్డాయి. మరో రెండు వేళ్లకు తీ వ్రగాయమైంది. తలపైన కూడా బలమైన గాయం తగిలింది. చేతిని అడ్డుపెట్టకపోతే మెడపై తగిలి ప్రాణానికి ప్రమాదం జరిగి ఉండేదని సమాచారం. సంఘటన అనంతరం అగంతకుడు పరారయ్యాడు. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా కొత్త వ్యక్తులు తచ్చాడుతున్నట్టు స్థానికులు చెప్పారు. రెక్కీ నిర్వహించి, పకడ్బందీగా పథకం ప్రకారం హత్యకు యత్నించినట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్ఐ సురేష్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. కశింకోటలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న బుల్లిబాబు ఇంటికి అభిమానులు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిందితుడి గుర్తింపు కంచిపాటి నాగ ఉదయ్ సాయి హత్యాయత్నానికి పాల్పడినట్టు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశామని అనకాపల్లి సీఐ జి. శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఈ సంఘటనలో ఒకరే హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. సాయి భార్య గ్రామ వలంటీర్‌గా గతంలో పనిచేసేవారు. ఆమెను ఇటీవల తొలగించారు. ఇందుకు బుల్లిబాబు కారణమని అపోహతో హత్యాయత్నానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. పరామర్శించిన ఎమ్మెల్యే అమర్, రత్నాకర్ అనకాపల్లి టౌన్: బుల్లిబాబు చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆస్పత్రికి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్ హుటాహటిన వెళ్లారు. ఆయన పరి స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ ఆస్పత్రికి తరలించారు. పార్టీ నేతలు మందపాటి జానకీరామరాజు, గొర్లి సూరిబాబు బుల్లిబాబును పరామర్శించారు. చదవండి: చిట్టీ డబ్బులు అడిగినందుకు .. ఒంటిపై పెట్రోల్ పోసి.. మంత్రి ముత్తంశెట్టి పరామర్శ ఆరిలోవ: విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ సీనియర్ నేత మల్ల బుల్లిబాబు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. బుల్లిబాబు ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడ వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. -
ఆఫీసు పనుందని చెప్పి రెండు మూడు రోజులైనా..
తాడిపత్రి: ఐకేపీ ఉద్యోగిపై జరిగిన హత్యాయత్నం మిస్టరీని పోలీసులు ఛేదించారు. సోమవారం ఐకేపీ కార్యాలయంలో సీసీ రామ్మోహన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను 24 గంటలలోపు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ ద్విచక్రవాహనంతో పాటు మూడు వేటకొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యాయత్నానికి కారణమని విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామ్మోహన్ వెలుగు కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పొదుపు సంఘాల లీడర్లు సీసీతో తరచూ సమావేశమయ్యేవారు. తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లికి చెందిన మహిళతో సీసీకి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజుల్లోనేఆమెకు వెలుగు కార్యాలయంలోనే యానిమేటర్‌గా ఉద్యోగం ఇప్పించాడు. వీరిద్దరి వ్యవహారశైలిపై ఆమె భర్త వెంకటలింగారెడ్డికి అనుమానం వచ్చింది. పలుమార్లు హెచ్చరించినా భార్య పద్ధతిలో మార్పు రాలేదు. ఒక్కొక్కసారి ఆఫీసు పనిమీద అనంతపురం వెళ్తున్నానని చెప్పి రెండు మూడు రోజులైనా ఇంటికి వచ్చేది కాదు. తన భార్యతో మాట్లాడవద్దని, పద్ధతి మార్చుకోకపోతే అంతమొందిస్తానని సీసీని వెంకటలింగారెడ్డి హెచ్చరించాడు. దీంతో సీసీ రామ్మోహన్ తాడిమర్రి నుంచి జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయానికి బదిలీ చేయించుకున్నాడు. అయినా యానిమేటర్ తరచూ అనంతపురానికి వెళ్లి రామ్మోహన్‌ను కలిసి వచ్చేది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయితే ఆమె తన భర్తతో కలిసి ఉండలేనని తెగేసి చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న రామ్మోహన్ జిల్లా కేంద్రం నుంచి నార్పలకు బదిలీ చేయించుకున్నాడు. నాగలక్ష్మి అక్కడికి వస్తూ పోతుండేది. అంతమొందించేందుకు రెక్కీ తమ వైవాహిక జీవితానికి అడ్డుపడిన రామ్మోహన్‌ను ఎలాగైనా అంతమొందించాలని అనుకున్న వెంకటలింగారెడ్డి తన సోదరుడు రాజారెడ్డితో విషయాన్ని చెప్పి అతడి సహాయం తీసుకున్నాడు. దీంతో వీరిరువురూ రామ్మోహన్‌ను అంతమొందించేందుకు పథకం వేశారు. ఈలోపు రామ్మోహన్ నార్పల నుంచి తిరిగి అనంతపురానికి బదిలీపై వెళ్లడంతో అక్కడ అంతమొందించేందుకు వెంకటలింగారెడ్డి, సోదరుడు రాజారెడ్డిలు రెక్కీ నిర్వహించారు. అక్కడ కూడా వీలు కాలేదు. కానీ తాజాగా రామ్మోహన్ తాడిపత్రి వెలుగు కార్యాలయానికి బదిలీపై వచ్చాడు. విషయం తెలుసుకున్న వెంకటలింగారెడ్డి సోదరులు సోమవారం తాడిపత్రికి చేరుకున్నారు. కార్యాలయంలో రామ్మోహన్ ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన వెంకటలింగారెడ్డి సోదరులు లోనికి చొచ్చుకెళ్లి వేటకొడవళ్లతో దాడి చేశారు. చుట్టుపక్కల వారు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటలు గడవకముందే దాడికి పాల్పడిన వెంకటలింగారెడ్డి, సోదరుడు రాజారెడ్డిలను అరెస్టు చేసి, వారి వద్దనుంచి ఓ ద్విచక్ర వాహనంతో పాటు మూడు వేటకొడవళ్లు, కారంపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించారు. 24 గంటల్లో హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. -
టీడీపీ నేతల స్వైరవిహారం
క్రైం (కడప అర్బన్) : సిద్దవటం పరిధిలోని భూముల వద్దకు వెళ్లిన దాసరి శ్రీనివాసులు అనే వ్యక్తిని ఆదివారం మధ్యాహ్నం టీడీపీ నేతలైన అతికారి వెంకటయ్య, అతికారి కృష్ణయ్య మరికొందరితో కలిసి హత్యా యత్నానికి పాల్పడ్డారు. బాధితులు తన బంధువులతో కలిసి రిమ్స్‌కు వస్తుండగా భాకరాపేట వద్ద కాపుకాచి సుమోను వెంబడించి మరణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో శ్రీనివాసులుతోపాటు అతని సోదరుడు శివ తీవ్రగాయాల పాలయ్యారు. సినీ ఫక్కీలో టీడీపీ నేతలు స్వైరవిహారం చేసి మరణాయుధాలతో దాడులు నిర్వహించారు. బాధితుల కథనం మేరకు... సిద్దవటం ఆకలివీధికి చెందిన దాసరి శ్రీనివాసులు, అతని సోదరుడు దాసరి శివ తమకున్న నాలుగెకరాల పొలం ఉంది. ఇతర గ్రామస్తులకు చెందిన భూములకు వెళ్లే దారులను, వంక పొరంబోకు స్థలాన్ని బ్రిటీష్ కాలంలో నిర్మించిన చెరువు కాలువను అతికారి వెంకటయ్య, అతని సోదరుడు కృష్ణయ్య, వెంకట సుబ్బయ్య అలియాస్ వైఎస్, పోలిశెట్టి శ్రీనివాసులు అలియాస్ ఎల్సీ శ్రీను అనే వారు గతంలో తమ భూములకు ఆనుకుని ఉన్న స్థలాల కబ్జాకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఆగస్టు నెలలో దీనిపై పలు కేసులు నమోదు చేసి ఇప్పటికే నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే దాసరి శ్రీనివాసులు పొలం వద్ద ఉండగా, పై వారు దాడి చేశారు. పోలీసుస్టేషన్‌ను ఆశ్రయిస్తే రిమ్స్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని తెలిపారు. దీంతో శ్రీనివాసులు తమ బంధువులతో కలిసి సుమోలో కడపకు వస్తుండగా భాకరాపేట వద్ద టీడీపీ నేతలు కాపు కాచి వారిని వెంటాడి హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. దాడి చేసిన వారిలో అతికారి వెంకటయ్య, కృష్ణయ్య, వెంకట సుబ్బయ్య, శ్రీనివాసులు, రాజశేఖర్, గంగయ్య, గంగాధర్, సుధాకర్, నాగేంద్ర, మునిస్వామి, వెంకటయ్య, తాడిపత్రి నుంచి వచ్చిన వెంకటయ్య మనుషులు ఉన్నారని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించారు. మరోవైపు పోలిశెట్టి శ్రీనివాసులు స్వల్ప గాయాలతో రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇరువర్గాల వారి ఫిర్యాదు మేరకు సిద్దవటం ఎస్ఐ అన్సర్‌బాషా కేసులు నమోదు చేశారు.