Nehru Birthday: ఆ హత్యాయత్నాల నుంచి నెహ్రూ తప్పించుకున్నారిలా.. | Here's The Details Of Assassination Attempts On Jawaharlal Nehru After Becoming Prime Minister | Sakshi
Sakshi News home page

Nehru Birthday: ఆ హత్యాయత్నాల నుంచి నెహ్రూ తప్పించుకున్నారిలా..

Published Thu, Nov 14 2024 9:43 AM | Last Updated on Thu, Nov 14 2024 12:37 PM

Assassination Attempts on Jawaharlal Nehru After Becoming Prime Minister

న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1889, నవంబరు 14న జన్మించారు. నెహ్రూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. స్వాతంత్య్రోద్యమంలో నెహ్రూ పలుమార్లు జైలుకు వెళ్లారు. నెహ్రూ ప్రధానిగా ఉండగా ఆయనపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. వాటినుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.

జవహర్‌లాల్ నెహ్రూపై మొదటి హత్యాయత్నం 1947లో జరిగింది. ఆ సమయంలో నెహ్రూ దేశ తాత్కాలిక ప్రభుత్వానికి  అధ్యక్షునిగా ఉన్నారు. నెహ్రూ నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లో కారులో ప్రయాణిస్తుండగా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ ప్రాంతం నేటి పాకిస్థాన్‌లో ఉంది. 1948 జూలైలో నెహ్రూపై రెండవసారి హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వచ్చాయి. నెహ్రూను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీకి వెళ్తున్న ముగ్గురిని బీహార్‌లోని ధర్మశాలలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రెండు పిస్టల్స్, రెండు రివాల్వర్లు, రైఫిల్, కంట్రీ మేడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో వీరి కుట్ర బయటపడింది.

1953లో కూడా నెహ్రూపై హత్యాయత్నం జరిగింది.  నాటి నివేదికల ప్రకారం నెహ్రూ ప్రయాణిస్తున్న బొంబాయి-అమృతసర్ ఎక్స్‌ప్రెస్‌ రైలును పేల్చివేసేందుకు కొందరు కుట్ర పన్నారు. అయితే కళ్యాణ్‌లోని రైల్వే పట్టాల దగ్గర కూర్చున్న ఇద్దరిని పోలీసులు పట్టుకోవడంతో ఈ కుట్ర విఫలమైంది.

1955లో నెహ్రూపై ఒక రిక్షా పుల్లర్ కత్తితో దాడి చేశాడు. నాటి వార్తాపత్రికల నివేదికల ప్రకారం 32 ఏళ్ల రిక్షా పుల్లర్ నుంచి పోలీసులు ఆరు అంగుళాల కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి నెహ్రూ కారుపైకి దూకాడు. దీనిని గమనించిన నెహ్రూ అతనిని కిందకు నెట్టివేశారు. 1955లో నెహ్రూ ముంబైలోని ఒక వేదికపై ప్రసంగిస్తుండగా  వందలాది మంది రాళ్లతో దాడికి ప్లాన్ చేశారని నాడు పోలీసులు తెలిపారు. ఈ కేసులో  పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: 15న మరో రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement