
సాక్షి,బళ్లారి: ఇద్దరు కాలేజీ విద్యార్థినులు ఒకరినిపై మరొకరు మంచి స్నేహం పెంచుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థాయికి స్నేహం ముదిరింది. ఆ స్నేహమే ఇద్దరి మధ్య గొడవ జరిగి పతాకస్థాయికి చేరుకుని బ్లేడ్‌తో హత్యాయత్నానికి దారితీసింది. ఈ ఘటన దావణగెరె నగరంలో చోటు చేసుకుంది. వివరాలు..గురువారం సాయంత్రం దావణగెరె నగరంలోని ఏవీకే కాలేజీ సమీపంలో చిక్కమగళూరు విద్యార్థిని లాస్య ఆమె స్నేహితురాలిపై దాడి చేసింది.
దావణగెరెలో కాలేజీలో చేరినప్పటి నుంచి లాస్య, ఆమె స్నేహితురాలితో ఎంతో గాఢస్నేహం పెంచుకుంది. రోజులు గడిచే కొద్ది ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేని విధంగా స్నేహం ముదిరిపోయింది. లాస్య తన స్నేహితురాలిపై గొడవకు దిగి బ్లేడ్‌తో హత్యాయత్నం చేయడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన యువతిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
దాడి చేసిన లాస్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కళాశాలలో ఇద్దరి స్నేహం గురించి పోలీసులు ఆరా తీయగా నివ్వెరపోయేలా పోలీసులకు సమాధానం దొరికింది. బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇద్దరు యువతుల మధ్య గొడవ ఎందుకు పెరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేయగా ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కం కూడా ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment