నా పైనా రెండు హత్యాయత్నాలు: మస్క్‌ | Elon Musk reveals he faced two assassination attempts | Sakshi
Sakshi News home page

నా పైనా రెండు హత్యాయత్నాలు: మస్క్‌

Published Mon, Jul 15 2024 5:20 AM | Last Updated on Mon, Jul 15 2024 8:45 AM

Elon Musk reveals he faced two assassination attempts

వాషింగ్టన్‌: గత ఎనిమిది నెలల కాలంలో తనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగినట్లు బిలియనీర్, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ వెల్లడించారు. టెక్సాస్‌లోని టెస్లా ప్రధాన కార్యాలయం సమీపంలో తుపాకులతో ఉన్న వ్యక్తులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారన్నారు. 

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో మస్క్‌ వ్యక్తిగత భద్రతపై ఆయన సొంత సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో ఓ యూజర్‌ ‘దయచేసి మీకున్న భద్రతా ఏర్పాట్లను మూడింతలు పెంచుకోండి. ఇవాళ ట్రంప్‌.. రేపు మీ వంతు రావచ్చు’అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

దీనికి మస్క్‌ స్పందిస్తూ... ‘నిజమే, ప్రమాదం పొంచి ఉంది. గత ఎనిమిది నెలల్లో నన్ను చంపేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. తుపాకీలతో సహా వారిని అరెస్ట్‌ చేశారు’అని తెలిపారు. ఏ సమయంలోనైనా తాను హత్యకు గురి కావచ్చునంటూ గతంలోనూ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement