Personal safety
-
నా పైనా రెండు హత్యాయత్నాలు: మస్క్
వాషింగ్టన్: గత ఎనిమిది నెలల కాలంలో తనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగినట్లు బిలియనీర్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వెల్లడించారు. టెక్సాస్‌లోని టెస్లా ప్రధాన కార్యాలయం సమీపంలో తుపాకులతో ఉన్న వ్యక్తులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో మస్క్ వ్యక్తిగత భద్రతపై ఆయన సొంత సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఓ యూజర్ ‘దయచేసి మీకున్న భద్రతా ఏర్పాట్లను మూడింతలు పెంచుకోండి. ఇవాళ ట్రంప్.. రేపు మీ వంతు రావచ్చు’అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ... ‘నిజమే, ప్రమాదం పొంచి ఉంది. గత ఎనిమిది నెలల్లో నన్ను చంపేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. తుపాకీలతో సహా వారిని అరెస్ట్ చేశారు’అని తెలిపారు. ఏ సమయంలోనైనా తాను హత్యకు గురి కావచ్చునంటూ గతంలోనూ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. -
రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న బెంగాల్ పోలీసు బృందంతో మనకు ముప్పు ఉందని గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో డ్యూటీలో ఉన్న పోలీసులంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించిన కొద్దిరోజులకే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘ ప్రస్తుత ఆఫీసర్–ఇన్చార్జ్, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేశా. అయినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చుట్టూ ఉన్న కోల్‌కతా పోలీసులతో నాలో అభద్రతా భావం గూడుకట్టుకుపోయింది’’ అని గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఇక్కడి పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాజ్‌భవన్‌కు వ్యతిరేకంగా వాళ్లు పనిచేస్తున్నట్లు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పోలీసులు గతంలో రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో పనిచేశారు. ఒకరి కోసం వీళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
‘పర్సనల్ సేఫ్టీ’పై అవగాహన
పిల్లలు, పెద్దలకు వ్యక్తిగత భద్రత పట్ల అవగాహన కలిగించేందుకు ఈనెల 16న సాయంత్రం 4.30 గంటలకు బంజారాహిల్స్ లామకాన్‌లో చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలోచనా విధానాలు, యంత్రాంగాలు ఇలా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని కోణాలపై చర్చించనున్నారు. పిల్లల భద్రత గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడానికి సిద్ధంగా ఉన్న టీనేజర్, యంగ్‌స్టర్, పేరెంట్స్ అందరూ ఈ చర్చలో పాల్గొనవచ్చని కార్యక్రమ నిర్వాహకులు మిహిరా అపరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 15 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రవేశం ఉచితం. తబలా క్లాసెస్ సుహాస్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి 11 వరకు బంజారాహిల్స్ లామకాన్‌లో తబలా శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. -
బండికీ ఆధార్ం
ఆర్టీఏ అనుసంధాన ప్రక్రియ పెలైట్ ప్రాజెక్టుగా గుడివాడ ఎంపిక సోమవారం నుంచి ఇంటింటి సర్వే డ్వాక్రా మహిళలతో నిర్వహణ గుడివాడ : వాహనాల భద్రత, వ్యక్తిగత భద్రత పేరుతో ఆర్టీఏ చేపట్టిన వాహనాలకు ఆధార్ అనుసంధానం పెలైట్ ప్రాజెక్టుగా గుడివాడ ఎంపికయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండుచోట్ల పెలైట్ ప్రాజెక్టులుగా ఎంచుకోగా రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల పట్టణాన్ని, కోస్తా జిల్లాల్లో గుడివాడ పట్టణాన్ని పెలైట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు. ఇందుకోసం సోమవారం నుంచి డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 36 వార్డుల్లో సర్వే.. గుడివాడ పట్టణాన్ని ఆధార్ అనుసంధానానికి పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో ఆర్టీఏ శాఖ ఉన్నతాధికారులు సైతం కదలి వచ్చి యుద్ధప్రాతిపధికన సర్వే పనులపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర జాయింట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ కమిషనర్ ప్రసాదరావు స్వయంగా వచ్చి డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చారు. గుడివాడ పట్టణంలో ఉన్న 36 వార్డుల్లో ఈసర్వే చేయాల్సి ఉంది. ప్రతి వార్డుకు ఇద్దరు చొప్పున డ్వాక్రా మహిళలు ఇంటింటి సర్వేచేసి వాహనం నంబరు, వాహనదారుని పేరు, వాహన దారుడి ఆధార్ నంబరు, ఫోన్ నంబరు సేకరించాల్సి ఉంది. అలాగే లెసైన్సు ఉంటే లెసైన్సు దారుడు పేరు లెసైన్సు నంబరు లేదా రిఫరెన్స్ నంబరు, లెసైన్స్ దారుడి ఫోన్ నంబరు వీరు సేకరించాలి. ఒక్కో వాహనదారుడి వివరాలు సేకరించినందుకు రూ.8 చెల్లిస్తుంది. వివరాలను ఏరోజుకు ఆరోజు కంప్యూటరీకరించాల్సి ఉంది. ఇలా ప్రతి అడ్రస్సు కంప్యూటరీకరించినందుకు మరో రూ.3 చెల్లిస్తారు. ఉపయోగం ఏమిటంటే.. ఆధార్ అనుసంధానం చేయడం వల్ల వాహనం నంబరు ఆన్లైన్లో చూడగానే యజమాని పూర్తి వివరాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కానీ వాహనానికి ఆధార్ అనుసంధానం చేస్తే ఆదాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని వాహన యజమానులు అనుమానిస్తున్నారు. దీంతో డ్వాక్రా సభ్యులకు వాహన యజమానులు ఎంతవరకు సహకరిస్తారో వేచిచూడాల్సిందే.