Former PM
-
ఊరికే ఇచ్చే డబ్బు వద్దంటూ.. గంగానదిని ఈదాడు
పిల్లలూ! మీరెప్పుడూ అందరూ మెచ్చుకునే స్థితిలోనే ఉండాలి తప్ప ఎవరూ మీ మీద జాలి పడే స్థితిలో ఉండకూడదు. ఈ విషయం మీకు అర్థమవ్వాలంటే ఈ సంఘటన తెలుసుకోండి.అనగనగా ఓ పిల్లవాడు తన తోటివారితో కలిసి గంగానది అవతలి ఒడ్డున జరిగే జాతర చూసేందుకు వెళ్లాడు. అతనిది పేద కుటుంబం. తండ్రి మరణించడంతో బంధువుల వద్ద ఉంటూ తల్లి అతణ్ని పెంచుతోంది. పడవ ఖర్చుల కోసం ఆమె అతనికి కొంత డబ్బు ఇచ్చింది. దాన్ని అతను జాతరలో ఖర్చుపెట్టాడు. తిరిగి వచ్చేటప్పుడు పడవ ఎక్కేందుకు అతని వద్ద డబ్బు లేదు. మేమిస్తామని స్నేహితులు అతనికి చెప్పారు. కానీ ఆత్మగౌరవం కలిగిన అతను ఆ డబ్బు తీసుకోలేదు. స్నేహితులను పడవలో వెళ్లమని చెప్పి, తనొక్కడే నదిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. చూశారా! ఎవరి వద్దా ఊరికే డబ్బు తీసుకోకూడదని అతనికెంత పట్టుదలో! ఆ పిల్లాడెవరో కాదు, మన దేశానికి రెండో ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి. ‘జై జవాన్.. జై కిసాన్’ అన్న నినాదం ఆయన ఇచ్చిందే. అయితే మీరు ఇలాంటి సాహసాలు చేయొద్దు. బాగా ఈత వచ్చిన వారే ఇలాంటివి చేయాలి. స్ఫూర్తిని గ్రహిస్తే చాలు.ఇదీ చదవండి : మెగా మ్యూజియం గురించి తెలుసా? -
నిరాహార దీక్షకు దిగుతా: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్షకు దిగుతానని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖాజీ ఫైజ్ ఇసా తన కేసులలో న్యాయం చేయడంలో విఫలమైతే నిరాహార దీక్షకు దిగుతానని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.తమ పీటీఐ పార్టీకి సంబంధించిన కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఇసా ఉండటంపై ఇమ్రాన్ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరగని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. తమ పార్టీ కేసులను విచారించే బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి ఈసాను చేర్చడంపై తమ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారని ఇమ్రాన్‌ఖాన్ మీడియాకు తెలిపారు. తమకు న్యాయం జరగదని పీటీఐ తరపు న్యాయవాదులు విశ్వసిస్తున్నారని, అందుకే తమ కేసులను మరొకరు విచారించాలని కోరారు. -
లోక్‌సభ బరిలో మాజీ ప్రధాని కొడుకు..
లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ బరిలో నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. తాను ఇప్పటికీ సోషలిస్టు సిద్ధాంతంతోనే ఉన్నానని, రామ్ మనోహర్ లోహియా ఆలోచనలకు సమాజ్‌వాదీ పార్టీ దూరం జరిగిందని విమర్శించారు. "సోషలిస్టు భావజాలాన్ని ఎస్పీతో ముడిపెట్టకూడదు. నేను ఇప్పటికీ వ్యక్తిగతంగా సోషలిస్టు భావజాలంతోనే ముడిపడి ఉన్నాను" అని నీరజ్ శేఖర్ పీటీఐతో చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఎందుకంటే ఆయన తండ్రి దివంగత చంద్రశేఖర్ సోషలిస్ట్ భావజాలాన్ని ప్రతిపాదించినవారు. కాషాయ పార్టీని తీవ్రంగా విమర్శించేవారు. చంద్ర శేఖర్ కుటుంబం మొత్తం ప్రస్తుతం బీజేపీలో ఉంది. అతని పెద్ద కుమారుడు పంకజ్ శేఖర్, చిన్న కుమారుడు నీరజ్ శేఖర్ కాషాయ పార్టీలో ఉండగా, అతని మనవడు రవిశంకర్ సింగ్ పప్పు ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బీజేపీ సభ్యుడిగా ఉన్నారు. గతంలో బల్లియా నుంచి ఎస్పీ ఎంపీగా పనిచేసిన నీరజ్ శేఖర్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బల్లియా నుంచి బీజేపీ అభ్యర్థి భరత్ సింగ్ చేతిలో ఓడిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో నీరజ్ శేఖర్‌కు ఎస్పీ టికెట్ నిరాకరించింది. తర్వాత ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా చేసినప్పటికీ, నీరజ్ శేఖర్ పార్టీని వీడి 2019 జూలైలో బీజేపీలో చేరారు. బల్లియా నుంచి ప్రస్తుత ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్ స్థానంలో నీరజ్ శేఖర్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ తాజాగా ప్రకటించింది. 2019లో అప్పటి ప్రస్తుత ఎంపీ భరత్ సింగ్‌పై కాషాయ పార్టీ మస్త్‌కు ఎన్నికల టిక్కెట్‌ను ఇచ్చింది. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ భార్యపై విష ప్రయోగం?
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి ఆర్మీ చీఫ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఒక కేసు విచారణకు హాజరైన ఆయన మాట్లాడుతూ గృహనిర్బంధంలోవున్న తన భార్య బుష్రా బీబీపై విషప్రయోగం జరిగిందని ఆరోపించారు. తన భార్యకు ఎటువంటి హాని జరిగినా అందుకు ఆర్మీ చీఫ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అడియాలా జైలులో 190 మిలియన్ పౌండ్ల తోషాఖానా అవినీతి కేసు విచారణ సందర్భంగా పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐఐ) నేత ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ తన భార్య బుష్రాకు విషమిచ్చి చంపే ప్రయత్నం జరిగిందని న్యాయమూర్తి నాసిర్ జావేద్ రాణా ఎదుట ఆరోపించారు. ఆమె శరీరంపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయని, దీని వెనుక ఎవరి హస్తం ఉందో తనకు తెలుసని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. తన భార్య బుష్రాకు ఏదైనా హాని జరిగితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యత వహించాలని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. షౌకత్ ఖానుమ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అసిమ్ సాయంతో తన భార్యకు వైద్య పరీక్షలు చేయించాలని ఇమ్రాన్ ఖాన్ కోర్టును కోరారు. ఇంతకుముందు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యునిపై తనకు, తన పార్టీకి నమ్మకం లేదని ఇమ్రాన్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విజ్ఞప్తి మేరకు ఆయన భార్య బుష్రా వైద్య పరీక్షలకు సంబంధించి దరఖాస్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ అనంతరం విలేకరులతో మాట్లాడిన బుష్రా తాను అమెరికన్ ఏజెంట్ అంటూ పార్టీలో వదంతులు వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. తన ఆహారంలో టాయిలెట్ క్లీనర్ చుక్కలు కలిశాయని ఆమె ఆరోపించారు. ఫలితంగా తన కళ్లు వాచిపోయాయని, ఛాతీ, కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్నానని ఆమె వాపోయారు. బుష్రా బీబీ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెపై విషప్రయోగం జరిగిందని పీటీఐ ప్రతినిధి ఒకరు మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. బుష్రా బీబీని కలుసుకోకూడదంటూ ఆమె కుటుంబ సభ్యులను నిర్బంధించారని, ఈ చర్య రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు. -
ఇమ్రాన్ అరెస్ట్ చట్టవిరుద్ధమన్న సుప్రీం కోర్టు
-
నన్ను చంపించేందుకు జర్దారీ కుట్ర: ఇమ్రాన్
ఇస్లామాబాద్: మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తనను చంపించేందుకు ఉగ్రవాదులకు ముడుపులిచ్చారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(70) ఆరోపించారు. ఇప్పటికే తనపై జరిగిన రెండు హత్యాయత్నాలు విఫలం కావడంతో ఈ కొత్త పథకం వేశారని పేర్కొన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బు జర్దారీ వద్ద చాలానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాజా కుట్రలో జర్దారీతోపాటు మరో ముగ్గురికి కూడా భాగముందని ఇమ్రాన్ విమర్శించారు. వజీరాబాద్ హత్యాయత్నంతో ఏర్పడిన బుల్లెట్ గాయాలు మానాక తిరిగి పోరాటం మొదలుపెట్టడం ఖాయమన్నారు. తనకు ఏదైనా జరిగితే అందుకు కారణమైన వారిని దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఇమ్రాన్ అన్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. -
Imran Khan: నన్ను చంపజూసింది ప్రధానే
ఇస్లామాబాద్/లాహోర్: ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను చంపేందుకు కుట్ర పన్నారని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ‘‘ఆంతరంగిక శాఖ మంత్రి సనావుల్లా, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఫైసల్ నసీర్తో పాటు మరొకరికి కూడా ఈ కుట్రలో భాగస్వామ్యముంది. వీరి పేర్లతో కూడిన వీడియోను ఇప్పటికే విదేశాలకు పంపించేశాను. నాకు జరగరానిది జరిగితే ఆ వీడియో బయటకు వస్తుంది’ అన్నారు. దుండగుడి కాల్పుల్లో తన కుడి కాలిలోకి నాలుగు బుల్లెట్లు దిగాయని చెప్పారు. చికిత్స పొందుతున్న తన సొంత షౌకత్ ఖానుమ్ ఆస్పత్రి నుంచి శుక్రవారం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 2011లో పంజాబ్ గవర్నర్‌ను చంపినట్లుగానే వజీరాబాద్‌లో తనను చంపేందుకు కుట్ర జరుగుతున్న విషయం ముందే తెలుసన్నారు. ‘‘నాపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఉగ్రవాది కాడు. నాపై దైవదూషణ నేరం మోపారు. అధికార పీఎంఎల్ఎన్ దాన్ని ప్రచారం చేసింది. అంతా పథకం ప్రకారం జరుగుతోంది. దీని వెనుక కుట్రను ఛేదిస్తాం’’ అన్నారు. గాయం నుంచి కోలుకున్నాక పోరాటం కొనసాగిస్తానన్నారు. దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ నేతకు కూడా న్యాయం జరగడం లేదని పాక్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ బందియాల్నుద్దేశించి అన్నారు. ఇమ్రాన్ కుడి కాలి ఎముక విరిగిందని వైద్యులు చెప్పారు. ఇమ్రాన్‌పై కాల్పులను నిరసిస్తూ పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పీటీఐ కార్యకర్తలు రావల్పిండి, ఫైజాబాద్‌ల్లో భారీగా రోడ్లపై బైఠాయించారు. పోలీసులతో ఘర్షణలకు దిగారు. లాహోర్‌లో గవర్నర్ హౌస్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ ఘటనపై పోలీసులు, నిఘా అధికారులతో సంయుక్త విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్ ప్రభుత్వం పంజాబ్‌ను కోరింది. ఇమ్రాన్ మాత్రమే చంపేందుకు కాల్పులు జరిపినట్లు నిందితుడు చెబుతున్నట్లుగా ఉన్న వీడియో లీక్‌కు కారకులైన పలువురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. వారి సెల్ఫోన్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. వజీరాబాద్ పట్టణంలో గురువారం పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ ర్యాలీలో దుండగుల తుపాకీ కాల్పుల్లో ఒకరు చనిపోగా ఇమ్రాన్ సహా పలువురు గాయపడిన విషయం తెలిసిందే. -
టెర్రరిజం కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ముందస్తు బెయిల్
ఇస్లామాబాద్: టెర్రరిజం కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు కొంత ఊరట లభించింది. ఆయనకు మూడు రోజులపాటు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత వారం రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఇమ్రాన్ ప్రసంగించారు. పోలీసులను, న్యాయ వ్యవస్థను, ప్రభుత్వ వ్యవస్థలను దూషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆయనపై యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద కేసు పెట్టారు. దీనిపై ఆయన ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ మొహిసిన్ అక్తర్ కయానీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగానే ఇమ్రాన్‌ను వేధిస్తోందని ఆయన తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇమ్రాన్‌కు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో ముందస్తు బెయిల్ ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. -
Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు కలకలం రేపాయి. జపాన్ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో భాగంగా అబే ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఆయన తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. దుండగుడు తుపాకీతో అబేపై రెండురౌండ్లు కాల్పులు జరిపారని, ఆయనకు తీవ్ర రక్తస్రావం అయిందని జపాన్‌కు చెందిన మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే తన కథనంలో తెలిపింది. హుటాహుటిన అబేను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మరోవైపు అబేకు గుండెపోటు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారని సదరు వార్తా సంస్థ పేర్కొంది. కాగా,2006 నుంచి 2012 వరకు జపాన్ ప్రధానిగా షింజో అబే సేవలందించారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించిన నేపథ్యంలో ఆయనకు కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి👇 మంత్రుల తిరుగుబాటు.. రాజీనామాకు ప్రధాని బోరిస్ ఓకే Russia-Ukraine war: ఎండ్ కార్డ్ ఎప్పుడు? -
కానుకలు అమ్ముకున్నారంటూ ఆరోపణలు.. స్పందించిన ఇమ్రాన్
ఇస్లామాబాద్: కానుకలను అమ్ముకున్నానన్న ఆరోపణలపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం ఘాటుగా స్పందించారు. అవి తనకు అందిన కానుకలని, వాటిని తోషాఖానాలో ఉంచాలో లేదో తన ఇష్టమేనని అన్నారు. పాకిస్తాన్ చట్టం ప్రకారం దేశ ప్రముఖులు తమకందని కానుకలను తోషాఖానాలో ఉంచాలి. లేదంటే సగం ధరకు కొనుక్కోవాలి. తాను అలాగే కొనుక్కున్నానని ఇమ్రాన్ అన్నారు. చట్ట ప్రకారం అది తన హక్కన్నారు. ఇమ్రాన్ 58 కానుకలను రూ.14 కోట్లకు అమ్ముకున్నారని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే. పీఓకే ప్రధానిగా సర్దార్ తన్వీర్ ఇల్యాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ పార్టీ ప్రాంతీయ అధ్యక్షుడు సర్దార్ తన్వీర్ ఇల్యాస్ సోమవారం ఎన్నికయ్యారు. -
వాజ్‌పేయి జీవితం అందరికీ ఆదర్శం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం అందరికీ ఆదర్శనీయమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాజ్‌పేయి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటుచేసిన వాజ్‌పేయి చిత్రపటాన్ని కోవింద్ మంగళవారం ఆవిష్కరించారు. సాధారణ వ్యక్తిగా వాజ్‌పేయి జీవించిన తీరు అందరికీ ఓ పాఠం లాంటిదని అభివర్ణించారు. హైవేల నిర్మాణంతో పాటు ఐటీ, టెలికాం రంగాల్లో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో శత్రువులు ఉండరని, కేవలం ప్రతిపక్షాలు మాత్రమే ఉంటాయని నమ్మే గొప్ప వ్యక్తి అటల్ అని ప్రశంసించారు. వాజ్‌పేయి ప్రసంగాల తీరు అద్భుతమని కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. వాజ్‌పేయి రాజకీయాల్లో ఆచరించిన విలువలను ప్రస్తుత తరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. వాజ్‌పేయి తన రాజకీయ జీవితంలో ప్రత్యర్థులపై ఎప్పుడూ పరుష పదజాలాన్ని ఉపయోగించలేదని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వాజ్‌పేయి చిత్రపటాన్ని తయారుచేసిన కృష్ణ కన్హయ్యను రాష్ట్రపతి సత్కరించారు. -
నవాజ్ షరీఫ్‌కు మరో ఏడేళ్ల జైలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పదవీచ్యుత ప్రధాని నవాజ్ షరీఫ్(69)కు మరో ఏడేళ్ల జైలు శిక్ష పడగా మరో కేసులో నిర్దోషిగా బయటపడ్డారు. షరీఫ్‌పై మిగిలి ఉన్న చివరి రెండు అవినీతి కేసుల్లో ఈ నెల 19వ తేదీతో వాదనలు పూర్తి చేసిన జవాబుదారీ న్యాయస్థానం(అకౌంటబిలిటీ కోర్టు) సోమవారం తీర్పు చెప్పింది. ‘అల్ అజీజియా కేసులో షరీఫ్‌కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయి. దుర్వినియోగమైన ప్రభుత్వ ధనం ఏమయిందో ఆయన చెప్పలేకపోయారు. దీంతో ఆయనకు రూ.17.50 కోట్లు జరిమానా విధిస్తున్నాం’ అని జడ్జి ముహమ్మద్ అర్షద్ మాలిక్ తన తీర్పులో పేర్కొన్నారు. 2017 నుంచి అకౌంటబిలిటీ కోర్టుల్లో కొనసాగుతున్న విచారణకు నవాజ్ షరీఫ్ సుమారు 165సార్లు హాజరైనట్లు డాన్ పత్రిక తెలిపింది. -
అటల్జీ పై పోస్ట్: ప్రొఫెసర్‌పై హత్యాయత్నం
పట్నా: దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని విమర్శించినందుకు ఓ ప్రొఫెసర్‌ను చితకబాదిన కలకలం రేపింది. అటల్జీకి నివాళులర్పించేందుకు వెళ్లిన స్వామి అగ్రివేశ్‌పై బీజేపీ అభిమానులు దాడిచేసిన వైనాన్ని ఇంకా మర్చిపోకముందే బిహార్‌కు చెందిన ప్రొఫసర్‌ను దారుణంగా కొట్టి హత్యాయత్నం చేయడం విమర్శలకు తావిచ్చింది. బిహార్‌లోని మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీలో శుక్రవారం ఉదయం ఈ ఉదంతం జరిగింది. వివరాల్లోకి వెళితే ఫేస్బుక్ లో విమర్శిస్తూ పోస్టు పెట్టినందుకు మోతీహరిలోని యూనివర్శిటీలో పనిచేస్తున్న సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్‌పై దాడికి దిగారు. మూడవ అంతస్తులోని ఆయన నివాసంనుంచి రోడ్డుమీదకు ఈడ్చుకు ఇచ్చారు. దాదాపు 12మంది గూండాలు కత్తులు, కటార్లతో ఇంట్లో ఉన్న ప్రొఫెసర్‌ను బయటకు లాక్కొచ్చి మరీ చితకబాదారు. అంతటితో ఆగకుండా ప్రొఫెసర్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించేందుకు యత్నించారు. తక్షణమే ఆ పోస్ట్‌ను డిలీట్ చేయాల్సిందిగా హెచ్చరించి పారిపోయారు. గాయపడిన ప్రొఫెసర్ స్థానిక అసుపత్రికి తరలించగా, పరిస్థితి తీవ్రంగావుండటంతో పట్నాలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దేశద్రోహి అంటూ తనను దూషిస్తూ దాడికి దిగారని బాధిత ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. తక్షణమే తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా హెచ్చరించారని తెలిపారు. జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై దాడి సందర్భంగా కూడా చంపేస్తామన్న బెదిరింపులు ప్రొఫెసర్‌కు వచ్చాయని ప్రత్యక్ష సాక్షి, విద్యార్థి మృత్యుంజయ కుమార్ ఆరోపించారు. అంతేకాదు ఈ ఘటను వీడియో తీసిన విక్రం అనే విద్యార్థిని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సంఘటనను ఖండిస్తూ మోతీహరిలోని సెంట్రల్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ ఒక ప్రకటన జారీ చేసింది. ఇది ఒక పథకం ప్రకారం జరిగిన దాడి అంటూ దీని వెనక యూవనిర్శిటీ వైస్ ఛాన్సలర్ కుట్ర ఉందంటూ విమర్శించారు. గత కొంత కాలంగా వీసీ యూనివర్శిటీ నిబంధనలను అతిక్రమించడంతోపాటు, తమపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. మరోవైపు దాడికి పాల్పడిన 12 మందిని ఇప్పటికే అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. -
ఎయిమ్స్‌లో అటల్జీ
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, 93ఏళ్ల అటల్ బిహారీ వాజ్‌పేయి సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయిని వైద్యుల సలహాతో వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్(ఆలిండియా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లోని అత్యవసర చికిత్సావిభాగం(ఐసీయూ)లో చేర్పించారు. సాధారణ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నా.. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, మూత్రనాళ ఇన్ఫెక్షన్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో తీసుకురాగానే డయాలసిస్ చేసిన వైద్యులు తర్వాత ఇన్ఫెక్షన్కు చికిత్సనందిస్తున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం వాజ్‌పేయి ఆరోగ్య బాధ్యతలను చూస్తోంది. ‘ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయన శరీరం వైద్యానికి స్పందిస్తోంది’ అని సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు. పరామర్శించిన ప్రముఖులు 1984 నుంచి వాజ్‌పేయి ఒకే కిడ్నీతో పనిచేస్తుండగా ఇప్పుడు ఆ కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ సోకడంతోనే డయాలిసిస్ చేస్తున్నారు. గులేరియా మూడుదశాబ్దాల పాటు వాజ్‌పేయికి వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించారు. ఇప్పుడూ ఆయన నేతృత్వంలోనే వైద్యులు చికిత్సచేస్తున్నారు. ఆసుపత్రిలో వాజ్‌పేయిని ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, ఎంఎం జోషి, పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, హర్షవర్ధన్, పలువురు బీజేపీ ప్రముఖులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తదితరులు పరామర్శించారు. ‘మా అందరికీ స్ఫూర్తిప్రదాత అయిన వాజ్‌పేయీజీ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం’ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. దాదాపు 50 నిమిషాల సేపు ఆసుపత్రిలో ఉన్న ప్రధాని మోదీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెల్సుకున్నారు. కుటుంబ సభ్యులతోనూ మోదీ మాట్లాడారు. అడ్వాణీ రాత్రి 9 గంటలకు తన దీర్ఘకాల సహచరుడిని చూసేందుకు ఎయిమ్స్ వచ్చారు. ఈ సందర్భంగా అడ్వాణీ కాస్త ఉద్విగ్నతకు లోనైనట్లు సమాచారం. నేడో రేపో డిశ్చార్జ్? ‘వాజ్‌పేయి ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ఉన్నతస్థాయి వైద్యబృందం ఆయనకు చికిత్సనందిస్తోంది. డాక్టర్ల సూచన మేరకు ఆయనను పర్యవేక్షణలో ఉంచారు. మంగళవారం ఉదయం వాజ్‌పేయిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది’ అని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ వెల్లడించారు. పరామర్శించేందుకు ప్రముఖులు వస్తుండటంతో ఎయిమ్స్‌తోపాటు చుట్టుపక్క ప్రాంతాల్లో భద్రత పెంచారు. వాజ్‌పేయి ఆరోగ్యం బాగానే ఉందని బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. 1998–2004 వరకు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి.. 2009 తర్వాత ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ప్రజాజీవితానికి దూరంగా ఉన్నారు. అప్పటినుంచీ ఆయన ఢిల్లీలోని తన నివాసంలో చికిత్స పొందుతున్నారు. ఐదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న తొలి కాంగ్రెసేతర నేతగా వాజ్‌పేయి రికార్డు సృష్టించారు. ఎయిమ్స్‌లో మోదీకి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్న వాజ్‌పేయి బంధువు -
పాక్ జడ్జి ఇంటిపై దుండగుల కాల్పులు
లాహోర్: పదవీచ్యుతుడైన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంటిపైకి గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. లాహోర్ మోడల్‌టౌన్ ప్రాంతంలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఇజాజ్ ఉల్ అహ్సాన్ నివాసంపై గుర్తు తెలియని దుండగులు తెల్లవారు జామున 4.30 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటల సమయంలో రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. పనామా పత్రాల కేసులో నిందితుడిగా ఉన్న ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌పై అనర్హత వేటు వేసిన సుప్రీంకోర్టు బెంచ్‌లో జస్టిస్ అహ్సాన్ కూడా ఒకరు. -
నవాజ్ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ
-
షరీఫ్‌పై జీవితకాల నిషేధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజకీయ జీవితానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ దేశ సుప్రీం కోర్టు జీవితకాల నిషేధం విధించింది. షరీఫ్తోపాటుగా పాకిస్తాన్ తెహ్రికీ ఇన్సాఫ్ (పీటీఐ) నేత జహంగీర్ తరీన్ కూడా ఇకపై జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా పాక్ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 (1) (ఎఫ్) ప్రకారం ఓ చట్టసభ్యుడిపై ఎంతకాలం నిషేధం విధించవచ్చన్న కేసు విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ రాజ్యాంగం ప్రకారం.. ఉన్నత న్యాయస్థానం ద్వారా ఒకసారి అనర్హత వేటు పడితే ప్రజాప్రతినిధిగా పోటీ చేయలేరని కోర్టు పేర్కొంది. ఆర్టికల్ 62 ప్రకారం.. ఎంపీ నిజాయితీగా, నీతిమంతుడిగా ఉండాలి. అయితే పనామా పేపర్స్ కేసులో ఈ చట్టం ప్రకారమే షరీఫ్‌ను పాక్ సుప్రీంకోర్టు ఎంపీగా అనర్హుడిగా (జూలై 28, 2017న) ప్రకటించింది. దీంతో షరీఫ్ రాజీనామా చేశారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధ్యక్షుడిగా కూడా నవాజ్ ఉండకూడదని కోర్టు ఆదేశించింది. -
ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు పీవీ : కేసీఆర్
హైదరాబాద్: దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం పీవీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...సర్పంచ్ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన తెలంగాణ బిడ్డ పీవీ అని కొనియాడారు. మానవ వనరుల అభివృద్ధి కాముకుడిగా పీవీకి సుస్థిర స్థానముందన్నారు. -
'విభజన హామీలను బీజేపీ సర్కార్ విస్మరిస్తోంది'
అనంతపురం: విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా బండ్లపల్లి బహిరంగ సభకు మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ప్రకటించిన బీజేపీ.. ఇప్పుడు ఆ హామీలన్నింటినీ విస్మరించిందన్నారు. ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తే అభివృద్ధి చెందుతుందని అందరం భావించమని..కానీ, బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని మన్మోహన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పదేళ్లు పూరైన సందర్భంగా అనంతపురం జిల్లాలో బహిరంగసభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
మాజీ ప్రధాని పివికి ఘన నివాళి
-
మాజీ ప్రధాని పివికి ఘన నివాళి
హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 11వ వర్ధంతి సంస్మరణ సభ బుధవారం నెక్లెస్ రోడ్డులోని పి.వి.జ్ఞానభూమిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు నాయిని నరసింహరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతోపాటు పివి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పివి చిత్ర పటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశ ప్రధానిగా పివి అందించిన సేవలను వారు ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం పి.వి.జ్ఞానభూమిలో ప్రార్థనలు, భజనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అందులోభాగంగా రక్తదాన శిబిరాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం పివి నరసింహరావు ఛాయ చిత్రాలను ప్రదర్శించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.