ఇస్లామాబాద్: పాకిస్తాన్ పదవీచ్యుత ప్రధాని నవాజ్ షరీఫ్(69)కు మరో ఏడేళ్ల జైలు శిక్ష పడగా మరో కేసులో నిర్దోషిగా బయటపడ్డారు. షరీఫ్‌పై మిగిలి ఉన్న చివరి రెండు అవినీతి కేసుల్లో ఈ నెల 19వ తేదీతో వాదనలు పూర్తి చేసిన జవాబుదారీ న్యాయస్థానం(అకౌంటబిలిటీ కోర్టు) సోమవారం తీర్పు చెప్పింది. ‘అల్ అజీజియా కేసులో షరీఫ్‌కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయి. దుర్వినియోగమైన ప్రభుత్వ ధనం ఏమయిందో ఆయన చెప్పలేకపోయారు. దీంతో ఆయనకు రూ.17.50 కోట్లు జరిమానా విధిస్తున్నాం’ అని జడ్జి ముహమ్మద్ అర్షద్ మాలిక్ తన తీర్పులో పేర్కొన్నారు. 2017 నుంచి అకౌంటబిలిటీ కోర్టుల్లో కొనసాగుతున్న విచారణకు నవాజ్ షరీఫ్ సుమారు 165సార్లు హాజరైనట్లు డాన్ పత్రిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment