ముంబయి:బ్రిటన్ మాజీ ప్రధాని,ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ ఆదివారం(ఫిబ్రవరి2) ముంబయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ ముంబయిలోని పార్సీ జింఖానా గ్రౌండ్‌లో కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ విషయమై ఆయన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.
టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడకుండా తన ముంబయి పర్యటన ఎప్పుడూ ఉండదని తెలిపారు.రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఐదు రోజులపాటు జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు రిషి సునాక్ భారత్‌కు వచ్చారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శనివారం సాయంత్రం ముంబయికి చేరుకున్నారు.
ఆదివారం ఉదయం ఇక్కడి పార్సీ జింఖానా మైదానానికి వెళ్లారు.క్లబ్ వార్షికోత్సవాల నేపథ్యంలో అక్కడికి వచ్చిన వారితో కాసేపు ముచ్చటించారు. క్లబ్ సాధించిన విజయాల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం బ్యాట్ పట్టుకుని టెన్నిస్‌బాల్‌తో కాసేపు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు.
Comments
Please login to add a commentAdd a comment