సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్షకు దిగుతానని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖాజీ ఫైజ్ ఇసా తన కేసులలో న్యాయం చేయడంలో విఫలమైతే నిరాహార దీక్షకు దిగుతానని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.
తమ పీటీఐ పార్టీకి సంబంధించిన కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఇసా ఉండటంపై ఇమ్రాన్ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరగని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. తమ పార్టీ కేసులను విచారించే బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి ఈసాను చేర్చడంపై తమ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారని ఇమ్రాన్‌ఖాన్ మీడియాకు తెలిపారు. తమకు న్యాయం జరగదని పీటీఐ తరపు న్యాయవాదులు విశ్వసిస్తున్నారని, అందుకే తమ కేసులను మరొకరు విచారించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment