
ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు పీవీ : కేసీఆర్
దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్: దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం పీవీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని పీవీ ఘాట్ వద్ద వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...సర్పంచ్ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన తెలంగాణ బిడ్డ పీవీ అని కొనియాడారు. మానవ వనరుల అభివృద్ధి కాముకుడిగా పీవీకి సుస్థిర స్థానముందన్నారు.