pv narasimha rao jayanthi
-
ఇండియా దశ దిశ మార్చిన వ్యక్తికి సలాం - ఆనంద్ మహీంద్రా
ఇండియా దశ దిశను మార్చిన తెలుగు తేజం, మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు సెల్యూట్ కొట్టారు ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా. పీవీ నర్సింహరావు జయంతిని పురస్కరించుకుని ఆయన ట్విటర్లో స్పందించారు. పీవీ ఎంతో ధైర్యంతో 1991లో అమలు చేసిన ఆర్థిక సంస్కరణ వల్లనే దేశం నేడు ఈ స్థితిలో ఉందంటూ ఆయన కొనియాడారు. లైసెన్స్ రాజ్ వ్యవస్థ బలంగా ఉండటం, విదేశీ మారక ద్రవ్యం నిధులు అడుగంటి పోవడంతో 1991 నాటికి భారత్ ఆర్థికంగా గడ్డు పరిస్థితులకు ఎదుర్కొంటోంది. ఆ సమయంలో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు సాహసోపేతంగా ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు. ఆనాటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌తో కలిసి రూపాయి విలువ తగ్గించడం, స్వేచ్ఛ వాణిజ్యం, లైసెన్స్ రాజ్‌కి చరమగీతం పాడారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఫలితంగా భారత్ నేడు ఆర్థికంగా ఒడిదుడుకులు లేని స్థితికి చేరుకోగలిగింది. చదవండి: అంబానీ రాజీనామా, జియోకి కొత్త బాస్ ఎవరో తెలుసా? -
ఆకట్టుకుంటున్న ‘మెనీ ఫేసెస్ ఆఫ్ ఎ మాస్టర్’
సాక్షి, మాదాపూర్: తెలంగాణ ముద్దుబిడ్డ... బహుముఖ ప్రజ్ఞాశాలి.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా భాషా సంస్కృతి శాఖ, ఆర్ట్‌గ్యాలరీ సంయుక్త ఆధ్వర్యంలో మాదాపూర్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ‘మెనీ ఫేసెస్ ఆఫ్ ఎ మాస్టర్’ ఫొటో ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పీవీకి సంబంధించిన దాదాపు 250లకు పైగా చిత్రాలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. ఇవి ఆయన రాజకీయ జీవితంలోని ప్రధాన ఘటనలను గుర్తుకు తెస్తున్నాయి. యువత ఈ చిత్రాలను తిలకించి పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిబిషన్‌కు క్యూరేటర్‌గా వ్యవహరిస్తున్న పీవీ కుమార్తె ఎస్.వాణిదేవి ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని ‘సాక్షి’కి వివరించారు. దేశం కోసం పరితపించేవారు.. మా నాన్నగారు ప్రతిక్షణం దేశ కోసం, దేశ ప్రజల అభ్యున్నతి కోసం పరితపించేవారు. 1957లో శాసన సభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. భారత ఆరి్థక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు భీజం వేసి, కుంటుతున్న భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించారు. నాన్నగారు మితభాషి. బహుభాషా కోవిదుడు.గొప్ప రచయిత. ఇంగ్లీసు, హిందీతో పాటు దక్షిణాది భాషలు మొత్తం 17 అనర్గళంగా మాట్లాడేవారు. నాన్నగారి జీవిత విశేషాలు అందరికీ తెలియజేసి స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాం. – ఎస్.వాణిదేవి పీవీ కుమార్తె ఇందిరాగాంధీతో పీవీ (ఫైల్) ప్రదర్శన వేళలు... ఈనెల 16వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.. చదవండి: అక్కడ చెట్టూ పుట్టా పీవీ జ్ఞాపకాలే! పైసలిస్తారా.. ఫిర్యాదు చేయాలా..? -
దేశం గర్వించే నేత పీవీ నర్సింహారావు..
సాక్షి, హైదరాబాద్ : సామాజిక విప్లవం తీసుకొచ్చిన నేత దివంవత పీవీ నరసింహరావు అని పీవీ శతాబ్ది ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పీవీ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారని, ఎల్పీజీ సృష్టికర్త అని కొనియాడారు. పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాల లోగోను గురువారం కేశవరావు రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ దేశనాయకుడని అన్నారు. ఈనెల 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో శతజయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. (అందుకు గర్వపడుతున్నా: మహమూద్ అలీ) జయంతి వేడుకల వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తారని కేశవరావు తెలిపారు. ఉత్సవాలపై పలు కమిటీలు వేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. పీవీ డాక్యుమెంటరీని తయారు చేస్తామని, పీవీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కమిటీని విస్తరిస్తాన్నారు. ఆర్థిక సంస్కర్తగా, భూసంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా పీవీకి మంచి పేరు ఉందన్నారు. దేశం గర్వించే నేత, విద్యా సంస్కరణలు అనేకం తీసుకొచ్చారని పీవీ నరసింహరావును ప్రశంసించారు. శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పీవీ నరసింహరావు కుమార్తె వీణాదేవి అన్నారు. వేడుకలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. (హరితహారం: మొక్కలు నాటిన కేటీఆర్) కేశవరావు నాయకత్వంలో కేసీఆర్ ఓ కమిటీని ఏర్పాటు చేయడం హర్షనీయమని టీఆర్ఎస్ నేత వినోద్ తెలిపారు. యాభై దేశాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ పటంలో దేశం గర్వపడేలా తీర్చిదిద్దిన నేత పీవీ అని, దేశ ఆర్ధిక స్థితిగతుల్ని మార్చిన నేత అని పేర్కొన్నారు. రాజకీయాల కారణంగా ఆయనకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ భారత్ నుంచి దేశాన్ని పాలించిన నేత పీవీ అని వినోద్ గుర్తు చేశారు. ఉత్సవాలు నిర్వహించాలన్న కేసీఆర్ నిర్ణయం గొప్పదని పీవీ ప్రభాకర్ అన్నారు. పీవీ గురించి తెలిసింది తక్కువ అని తెలియాల్సింది ఎక్కువ ఉందన్నారు. నాన్నకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని, ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కోసం ఆయన పని చేశారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని అటల్ జీ కూడా చెప్పారన్నారు. ఇవాళ చంద్ర మండలం వెళ్తున్నామంటే పీవీ వేసిన బాటలేనని ప్రభాకర్ పేర్కన్నారు. -
పీవీ సేవలు మరువలేనివి
నర్సంపేట రూరల్ : మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సం పేట మండలంలోని లక్నెపల్లి గ్రామంలో గురువారం పీవీ.నర్సింహారావు జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సురభి ఎ డ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు సుర భి వాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీవీ.నర్సింహారావు కాంస్య విగ్రహాన్ని లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌బాబు, రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సం స్కరణలు తీసుకొచ్చేందుకు పీవీ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ప్రపంచ దేశాలు పీవీ.నర్సింహారావు చేసిన సేవలను కొనియాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పీవీ.నర్సింహారావు భౌతిక కాయాన్ని కనీసం పార్టీ కార్యాలయానికి కూడా తీసుకురానివ్వలేదని విమర్శించారు. పీవీ జయంతి వేడుకలను నిర్వహించాలని నర్సంపేట ఎమ్మెల్యేకు సమాచారం అందించినా రాకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. పీవీ నర్సింహారావుపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లో 7 ఫీట్ల పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరు పీవీ.నర్సింహారావు జీవిత చరిత్రను తెలుసుకుని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. లక్నెపల్లి గ్రామంలోని పీవీ.నర్సింహారావు స్మారక మందిరంలో లైబ్రరీని ఏర్పాటుచేసేందుకు సురభి ఎడ్యుకేషన్ సొసైటీ ముందుకు రావడం చాలా సంతోషకరమన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ. నర్సింహారావు జన్మించిన లక్నెపల్లి గ్రామంలో కుటుంబ సభ్యులు స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. లక్నెపల్లి గ్రామం నుంచి ఎంతో మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కావాలని ఈసందర్భంగా కోరుకుంటున్నన్నారు. రాష్ట సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ లక్నెపల్లి గ్రామ అభివృద్ధి కోసం ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటా యించామని, త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు. అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొడారి కవిత, తహసీల్దార్ పూల్‌సింగ్‌చౌహాన్, మదన్మోహన్రావు, ఎన్ఆర్ఐ వేణుగోపాల్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఉపసర్పంచ్ భగ్గి నర్సింహారాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శి నర్సయ్య, గూళ్ల అశోక్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి, కౌన్సిలర్ నాయిని నర్సయ్య, బైరి మురళి పాల్గొన్నారు. -
తెలుగు తేజాన్ని మరిచారా?
భీమదేవరపల్లి : బహుభాషా కోవిదుడిగా, మౌనమునిగా, రాజనీతిజ్ఞుడిగా పేరుగడించి భారతదేశ ప్రధానిగా అత్యున్నత పదవిని అధిరోహించి తెలుగుఖ్యాతిని దేశవిదేశాల్లో ఇనుమడింపజేసిన తెలుగు తేజం, వంగర ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఏటా పీవీ జయంతి, వర్ధంతి వేడుకలను హైదరాబాద్‌తోపాటుగా ఆయన జన్మస్థలమైన వంగరలో అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడంతో తెలుగు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆ హామీ వంగరలో నెరవేర్చకపోవడంతో గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గురువారం పీవీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. పూర్వ కరీంనగర్ జిల్లా(ప్రస్తుత వరంగల్ అర్బన్ జిల్లా) భీమదేవరపల్లి మండలం వంగరలో 1921 జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులతోపాటుగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులకే వన్నె తెచ్చారు. పీవీ ప్రధాని కానున్న సమయంలో వంగరలో పలు అభివృద్ధి పనులు జరగడంతో పాటుగా నిత్యం రాష్ట్ర, కేంద్ర మంత్రుల పర్యటనలతో సందడిగా ఉండేది. పీవీ ప్రధాని అయ్యాక వంగలో సీసీ రోడ్లు, గ్రంథాలయం, గురుకుల పాఠశాల, తాగు నీటి బావి, పోలీస్‌స్టేషన్ తదితర అభివృద్ధి పనులు జరిగాయి. దీక్షలు చేసినా శూన్యమే.. పాలకులు మరిచినా ఇక్కడి ప్రజానీకం మాత్రం పీవీని తమ గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే కాబోలు వంగరలో 2013 సంవత్సరం పీవీ విగ్రహాన్ని చందాలతో ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు వచ్చినా.. రాకున్నా వారే జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించకుంటున్నారు. పీవీ మరణం నుంచి నేటి వరకు ఆయనకు ఏదోవిధంగా అవమానం జరుగుతూనే ఉంది. పీవీకి భారత రత్న ఇవ్వాలని, జిల్లాకు పీవీ పేరు పెట్టాలని, ఢిల్లీలో శాంతి వనం ఏర్పాటు చేయాలని ఆయన 9వ వర్ధంతిని పురస్కరించుకొని గ్రామంలోని పీవీ విగ్రహం వద్ద ప్రజలు రాజకీయాలకతతీంగా 48 గంటల పాటు దీక్ష చేపట్టినా ఏ నాయకుడు అటుగా రాలేదు. వెలవెలబోతున్న విగ్రహం వంగరలో పీవీ నర్సింహారావు విగ్రహ నిర్మాణ సమయంలో గార్డెన్‌ను నిర్మిస్తామంటూ నాయకులు ఇచ్చిన హామీ సైతం నెరవేరలేదు. నూతన రాష్ట్రంలో పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను స్వగ్రామం వంగరతో పాటుగా హైదరాబాద్‌లో అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేవలం మొదటి సంవత్సరం మాత్రమే జయంతి వేడుకలకు ఆర్డీఓ హాజరయ్యారు. అనంతరం ఆ కార్యక్రమాలను మరిచిపోయారు. ఈనె ల 28న పీవీ జయంతి సందర్భంగా అధికారిక ఏర్పాట్లు లేకపోవడంతో వంగర బోసిపోయింది. -
ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు పీవీ : కేసీఆర్
హైదరాబాద్: దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం పీవీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...సర్పంచ్ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన తెలంగాణ బిడ్డ పీవీ అని కొనియాడారు. మానవ వనరుల అభివృద్ధి కాముకుడిగా పీవీకి సుస్థిర స్థానముందన్నారు.