పట్నా: దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని విమర్శించినందుకు ఓ ప్రొఫెసర్‌ను చితకబాదిన కలకలం రేపింది. అటల్‌జీకి నివాళులర్పించేందుకు వెళ్లిన స్వామి అగ్రివేశ్‌పై బీజేపీ అభిమానులు దాడిచేసిన వైనాన్ని ఇంకా మర్చిపోకముందే బిహార్‌కు చెందిన ప్రొఫసర్‌ను దారుణంగా కొట్టి హత్యాయత్నం చేయడం విమర్శలకు తావిచ్చింది. బిహార్‌లోని మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీలో శుక్రవారం ఉదయం ఈ ఉదంతం జరిగింది.
వివరాల్లోకి వెళితే ఫేస్‌బుక్ లో విమర్శిస్తూ పోస్టు పెట్టినందుకు మోతీహరిలోని యూనివర్శిటీలో పనిచేస్తున్న సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్‌పై దాడికి దిగారు. మూడవ అంతస్తులోని ఆయన నివాసంనుంచి రోడ్డుమీదకు ఈడ్చుకు ఇచ్చారు. దాదాపు 12మంది గూండాలు కత్తులు, కటార్లతో ఇంట్లో ఉన్న ప్రొఫెసర్‌ను బయటకు లాక్కొచ్చి మరీ చితకబాదారు. అంతటితో ఆగకుండా ప్రొఫెసర్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించేందుకు యత్నించారు. తక్షణమే ఆ పోస్ట్‌ను డిలీట్ చేయాల్సిందిగా హెచ్చరించి పారిపోయారు. గాయపడిన ప్రొఫెసర్ స్థానిక అసుపత్రికి తరలించగా, పరిస్థితి తీవ్రంగావుండటంతో పట్నాలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే దేశద్రోహి అంటూ తనను దూషిస్తూ దాడికి దిగారని బాధిత ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. తక్షణమే తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా హెచ్చరించారని తెలిపారు. జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై దాడి సందర్భంగా కూడా చంపేస్తామన్న బెదిరింపులు ప్రొఫెసర్‌కు వచ్చాయని ప్రత్యక్ష సాక్షి, విద్యార్థి మృత్యుంజయ కుమార్ ఆరోపించారు. అంతేకాదు ఈ ఘటను వీడియో తీసిన విక్రం అనే విద్యార్థిని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ సంఘటనను ఖండిస్తూ మోతీహరిలోని సెంట్రల్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ ఒక ప్రకటన జారీ చేసింది. ఇది ఒక పథకం ప్రకారం జరిగిన దాడి అంటూ దీని వెనక యూవనిర్శిటీ వైస్ ఛాన్సలర్ కుట్ర ఉందంటూ విమర్శించారు. గత కొంత కాలంగా వీసీ యూనివర్శిటీ నిబంధనలను అతిక్రమించడంతోపాటు, తమపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. మరోవైపు దాడికి పాల్పడిన 12 మందిని ఇప్పటికే అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment