ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజకీయ జీవితానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ దేశ సుప్రీం కోర్టు జీవితకాల నిషేధం విధించింది. షరీఫ్‌తోపాటుగా పాకిస్తాన్ తెహ్రికీ ఇన్సాఫ్ (పీటీఐ) నేత జహంగీర్ తరీన్ కూడా ఇకపై జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా పాక్ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 (1) (ఎఫ్) ప్రకారం ఓ చట్టసభ్యుడిపై ఎంతకాలం నిషేధం విధించవచ్చన్న కేసు విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.
పాక్ రాజ్యాంగం ప్రకారం.. ఉన్నత న్యాయస్థానం ద్వారా ఒకసారి అనర్హత వేటు పడితే ప్రజాప్రతినిధిగా పోటీ చేయలేరని కోర్టు పేర్కొంది. ఆర్టికల్ 62 ప్రకారం.. ఎంపీ నిజాయితీగా, నీతిమంతుడిగా ఉండాలి. అయితే పనామా పేపర్స్ కేసులో ఈ చట్టం ప్రకారమే షరీఫ్‌ను పాక్ సుప్రీంకోర్టు ఎంపీగా అనర్హుడిగా (జూలై 28, 2017న) ప్రకటించింది. దీంతో షరీఫ్ రాజీనామా చేశారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధ్యక్షుడిగా కూడా నవాజ్ ఉండకూడదని కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment