మాజీ ప్రధాని పివికి ఘన నివాళి | Former PM PV Narasimha Rao 11th Death Anniversary Today | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధాని పివికి ఘన నివాళి

Published Wed, Dec 23 2015 1:31 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

మాజీ ప్రధాని పివికి ఘన నివాళి

మాజీ ప్రధాని పివికి ఘన నివాళి

హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 11వ వర్ధంతి సంస్మరణ సభ బుధవారం నెక్లెస్ రోడ్డులోని పి.వి.జ్ఞానభూమిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు నాయిని నరసింహరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతోపాటు పివి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పివి చిత్ర పటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశ ప్రధానిగా పివి అందించిన సేవలను వారు ఈ సందర్భంగా కొనియాడారు.

అనంతరం పి.వి.జ్ఞానభూమిలో ప్రార్థనలు, భజనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అందులోభాగంగా రక్తదాన శిబిరాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం పివి నరసింహరావు ఛాయ చిత్రాలను ప్రదర్శించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement