సాగరతీరాన ఎటూ చూసినా విభిన్న మొక్కల సోయగం.. దేశీ వెరైటీలు మొదలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన మొక్కలతో సందడిగా మారింది నెక్లెస్‌రోడ్ పీపుల్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన హార్టికల్చర్ షో. సాధారణ చామంతులు మొదలు ఇంపోర్టెడ్ ఆర్కిడ్స్, హోల్కోనియా వరకూ అన్నిరకాల మొక్కలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ అంటూ వినూత్న జీవనశైలికి హంగులద్దుతున్న నగరంలోని మొక్కల ప్రియులు ఈ హారీ్టకల్చర్ షోకు పరుగులు పెడుతున్నారు. ఇక్కడ 50 రూపాయలు మొదలు లక్షకు పైగా ధరల్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయి.
కాంక్రీట్ జంగిల్‌లా మారిపోతున్న నగర జీవనశైలిలో కాసింత సాంత్వన, విశ్రాంతి మొక్కలు ఎంతో అవసరం. అంతేకాకుండా పర్యావరణ సమతుల్యం, పరిరక్షణలో ఈ మొక్కలదే కీలక పాత్ర. వెరసి గత కొన్నేళ్లుగా నగర వాసులు గార్డెనింగ్, మిద్దెపంట, ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ అంటూ విభిన్న రకాలుగా మొక్కల పెంపకం పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రతి ఏటా నగరం వేదికగా నిర్వహించే హారీ్టకల్చర్ ప్రదర్శనకు ప్లాంట్ లవర్స్ తాకిడి క్రమంగా పెరుగతోంది. సాధారణ మొక్కలు మొదలు అరుదైన మొక్కలు, బోస్సాయ్ మొక్కలు, ఔషధ మొక్కలు, ఆర్నమెంటల్ తదితర మొక్కలు అమ్మకానికి వచ్చాయి. ఇందులో భోన్సాయ్, ఫైకస్ మొక్క లక్ష రూపాయలకు పైగా అమ్మకానికి రావడం విశేషం. అంతేకాదు థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసిన కమేలియన్ మొక్క కూడా అక్షరాల లక్ష రూపాయలు పలకడం విశేషం.
అరుదైన మొక్కలు..
‘అరుదైన మొక్క స్టాగన్ ప్లింగ్ రకం ఈ సారి తీసుకొచ్చాం. ఇవి వాటి సైజుల ఆధారంగా 4 వందల నుంచి 8 వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. డ్రిఫ్ట్ వుడ్‌తో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఇంటీరియర్ మొక్కలకు పూసిన పూలు 6 నెలల వరకూ వాడిపోవు. ఇవన్నీ ఆర్కిడ్ జాతికి చెందినవి. పూణే నుంచి తీసుకొచి్చన ఈ వెరైటీ ఖరీదు 35 వేలు అని స్టాల్స్ నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా గ్రూమింగ్ చేస్తాం..
మా దగ్గర సీజనల్ చామంతి ప్రత్యేకం. వీటిని కాకినాడలోని గణపతి గార్డెన్స్‌లో ప్రత్యేకంగా గ్రూమింగ్ చేస్తాం. దాదాపు 6 నెలలు కష్టపడితే వందల పూలతో ఒక బంతిలా తయారవుతాయి. ఇందులో 25 రకాల రంగులు అందుబాటులో ఉన్నాయి. 3 వందల నుంచి 3 వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూలతో అలరిస్తాయి. రెండు మొక్కలు తీసుకుంటే 500 వందల ఆఫర్‌తో అందిస్తున్నాం.
– గణపతి గార్డెన్స్ నిర్వాహకులు
గత మూడున్నరేళ్లుగా..
దేశవ్యాప్తంగా సేకరించిన విభిన్న మొక్కలు ఈ నర్సరీ మేళాలో అందుబాటులో ఉంచాను. ముఖ్యంగా కలకత్తా నుంచి తీసుకువచి్చన కమేలియాస్ ఈ సారి ప్రత్యేకం. అజేలియాస్ హైడ్రేంజియాస్, డేలియాస్ వంటి విభిన్న మొక్కలకు మంచి ఆదరణ పెరిగింది. డేలియాస్ పూల మొక్కల్లో అతిపెద్ద సైజు వెరైటీ మొక్కలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవి ఏప్రిల్ వరకూ పూలతో అలరిస్తాయి. నాటు కమేలియాస్ మా ప్రత్యేకం.. పెద్దవి రూ.2900 చిన్నవి రూ.1200 వరకూ అమ్ముతున్నాను. నగరంలోని కౌకూర్ వేదికగా గత మూడన్నరేళ్లుగా మొక్కలతో పాటు కాంప్రహెన్సివ్ స్టోర్‌గా మార్బుల్, సిరామిక్, హుడ్, ప్లాస్టిక్ తొట్లతో సేవలందిస్తున్నాం.
– పాల్ చంద్రకాంత్, స్టాల్– బీ24, 25
30 రకాల ఆర్కిడ్స్..
ఇందులో 30 రకాల వరకూ అందుబాటులో ఉన్నాయి. కటేలియా, ఫాక్స్‌టైల్, బ్యాండ్రియం, క్రీపర్స్, ఎయిర్ ప్లాంట్స్ తదితర వెరైటీలు బాగా అమ్ముడుపోతున్నాయి. వీటిని థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసుకుని, వెస్ట్ గోదావరి తణుకు వేదికగా 7 ఎకరాల నర్సరీలో పెంచుతున్నాం. 7 వందల నుంచి 2500 వరకూ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. – సంతో‹Ù.
450కు పైగా వెరైటీలు..
తెలంగాణలో అడీనియం బోన్సాయ్ మొక్కల్లో అన్ని వెరైటీలనూ అందిస్తున్నది ‘హైదరాబాద్ అడీనియం’ మాత్రమే. 450కు పైగా వెరైటీలు అందుబాటులో ఉంటాయి. బేబీ ప్లాంట్ నుంచి 30 ఏళ్ల అడీనియం మొక్కలు 250 నుంచి 50 వేల వరకూ అందుబాటులో ఉంటాయి. కేరళ నుంచి వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం. ముఖ్యంగా వాటర్ లిల్లీ, తామర పూలు మా ప్రత్యేకం. అంతేకాకుండా అలోకేíÙయా, హెల్కోనియా, కొలకేషియా తదితర రకాలు ఉన్నాయి. తామరలోనే ఎనిమిది రకాలకు పైగా ఉన్నాయి. మా వద్ద 6 వందల నుంచి 7 వేల వరకూ ధరలు ఉన్నాయి.
జనప నారతో బ్యాగ్స్..
ఆంక్రో పెగ్రో సైన్సెస్ అనేది మా సంస్థ. మా వద్ద హెర్బల్, ఈకో ఫ్రెండ్లీ, ఆర్గానిక్ గ్రో బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎండాకాలంలో ఇవి మొక్కలకు అధిక రక్షణ ఇస్తాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఈ బ్యాగులు చూసుకుంటాయి. ఈ బ్యాగుల్లో రెండు రోజులకు ఒకసారి నీరు పోసినా సరిపోతుంది. వీటిని జనప నారతో తయారు చేస్తాం.
– ప్రదీప్
Comments
Please login to add a commentAdd a comment