Necklace Road
-
ఆహ్లాదం.. ఆనందం..
ఖైరతాబాద్ : వీకెండ్ వస్తే చాలు నగరవాసులు నెక్లెస్ రోడ్డుకు క్యూ కడతారు. సాయం సంధ్య వేళ కుటుంబ సమేతంగా అక్కడికి విచ్చేసిన వారంతా ఆహ్లాదంగా గడుపుతారు. దీంతోపాటు అక్కడే ఉన్న పీపుల్స్ ప్లాజాలో అన్ని సీజన్లలో వివిధ రకాల ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ వేదికే మధ్యతరగతి ప్రజలకు ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్‌గా మారింది పీపుల్స్ ప్లాజా. ఇటీవల ఇక్కడ ఏర్పాటుచేసిన వింటర్ ఉత్సవ్ మేళా అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకుంటోంది. కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసిన వారు రెండు గంటల పాటు ఉత్సాహంగా గడపుతారు. ఎంటర్టైన్మెంట్ కేంద్రంగా.. ఈ ఎగ్జిబిషన్లో ఎమ్యూజ్మెంట్ రైడ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గేమింగ్ జోన్, అన్ని రకాల ఉత్పత్తులనూ ఒకే వేదికగా వివిధ రకాల స్టాల్స్ అందుబాటులో ఉండటాయి. దీంతో వారాంతాల్లో ఇక్కడికి విచ్చేసేవారు షాపింగ్ మొదలుకుని ఎంటర్టైన్మెంట్ వంటి వివిధ రకాల అంశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం.. అబ్బురపరిచే సెల్ఫీ జోన్లలో ఫొటోలు దిగుతూ కాలక్షేపం చేస్తుంటారు. దీంతో వీకెండ్ అయితే చాలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగా ఇక్కడికి క్యూ కడుతున్నారు. నూతన సంవత్సర వేడుకలను సైతం నగర వాసులు నెక్లెస్ రోడ్డు పొడవునా తిరుగుతూ ఎంజాయి చేస్తూ జరుపుకోవడం విశేషం. -
ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు..తమన్ మ్యూజిక్ షో అదుర్స్ (ఫొటోలు)
-
రారండోయ్ వేడుక చూద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మూడు రోజులు పాటు ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ముగింపు వేడుకల సందర్భంగా సచివాలయంలో సాయంత్రం 5 గంటలకు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో లక్ష మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో భారీ బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 7.30 గంటలకు ఎనీ్టఆర్ మార్గ్‌లో డ్రోన్ ప్రదర్శన, హుస్సేన్ సాగర్‌లో పెద్దఎత్తున బాణసంచా ప్రదర్శన, అనంతరం హెచ్ఎండీఏ మైదానంలో తమన్ నేతృత్వంలో సంగీత కచేరీ, సాంస్కృతిక ప్రదర్శన ఉంటుంది. ట్యాంక్‌బండ్, ఎనీ్టఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో ఫుడ్‌స్టాళ్లతో పాటు హస్తకళల, సాంస్కతిక, పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. బహు పసందుగా ఫుడ్ స్టాళ్లు ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లలోని పలు పసందైన వంటకాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నగరంలో ప్రసిద్ధి చెందిన పలు బ్రాండెడ్ హోటల్స్ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. హైదరాబాదీ బిర్యానీ, మొఘలాయి, తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో పాటు బేకరీ ఐటమ్స్ చాట్, ఐస్‌క్రీం.. ఇలా వందకు పైగా ఫుడ్‌స్టాళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణ వంటకాలు పాలమూరు గ్రిల్, తెలంగాణ విందు, అంకాపూర్ నాటుకోడి చికెన్, పుడ్ జాయింట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నగరమంతా విద్యుత్ దీపాలంకరణతో జిగేమంటోంది. డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయం, పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలతో తళుక్కుమంటున్నాయి. -
నేడు నెక్లెస్ రోడ్డులో ఎయిర్ షో !
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు నెక్లెస్ రోడ్డు వద్ద వాయుసేనకు చెందిన 9 సూర్యకిరణ్ విమానాలతో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర మంత్రులు, వీవీఐపీలు, వాయుసేన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి నేతృత్వంలో ఈ ప్రదర్శన జరగనుంది. అద్భుత వైమానిక విన్యాసాలు చేసే ప్రపంచంలోనే అత్యుత్తమ ఐదు బృందాల్లో ఒకటైన సూర్యకిరణ్ టీం హైదరాబాద్‌లో ప్రదర్శన నిర్వహిస్తుండటంతో ప్రజలు భారీగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎయిర్ షో అనంతరం రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహిస్తున్నందున.. నెక్లెస్ రోడ్డు, పీవీ మార్గ్‌లో ప్రజల కోసం ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో నిర్వహించే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి లక్ష మంది మహిళలు హాజరవుతారని సీఎస్ చెప్పారు.అందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సమీక్షలో టెలికాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీడీఎంఏ శ్రీదేవి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేవారి కోసం నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, గోశాల రోడ్, నిజాం కాలేజ్, పబ్లిక్ గార్డెన్స్ వద్ద పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ అదనపు కమిషనర్ విక్రంజీత్ సింగ్ మాన్ తెలిపారు. కాగా, వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి బృందం శనివారం సచివాలయంలో సీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను బహూకరించింది. -
నెక్లెస్ రోడ్డు : బతుకమ్మ ఘాట్‌లో భక్తిశ్రద్ధలతో ఛట్ పూజలు (ఫొటోలు)
-
Tank Bund: చల్ మోహన రంగ
సిడ్నీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తలపించే ట్యాంక్ బండ్..అద్భుత అందాలతో పాటు చారిత్రాత్మక వైభవాలకు ప్రతీకనగరానికి మణిహారం సాగర తీరం..చెప్పుకుంటూ పోతే మరెన్నో.. రింజిమ్..రింజిమ్..హైదరాబాద్.. రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రమలు గిరగిర తిరిగితే మోటరు కారు బలాదూర్.. అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు ఆ వంకా అసెంబ్లీ హాలు.. ఈ వంకా జూబిలి హాలూ తళతళ మెరిసే హుస్సేనుసాగరు.. దాటితే సికింద్రబాదూ...ఇలా చెప్పుకుంటూ పోతే.. పర్యాటక ప్రాంతాలకు కొదవేలేదు.. ఎటుచూసినా ఏదో ఒక విశేషమైన ప్రాంతం చూపరులను అబ్బురపరుసూనే ఉంటాయి... వాటిల్లో ముఖ్య ఆకర్షణగా నిలిచేది.. ట్యాంక్ బండ్.. నగరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ట్యాంక్ బండ్‌తో అవినాభావ సంబంధం ఉంటుంది. ట్యాంక్ బండ్ ప్రారంభంలోనే ‘నగర రెజిమెంట్‌కు చెందిన ఆర్మీ జవాన్ల పోరాట స్ఫూర్తికి నిదర్శనం’గా ఏర్పాటు చేసిన యుద్ధనౌక స్వాగతం పలుకగా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పార్క్ అందాలు, మహనీయుల విగ్రహాల పలకరింపుతో సాగర్‌లోని నీటి ఫౌంటేన్ల తుంపరల మధ్య శాంతిమయుడు గౌతమ బుద్ధుడిని తిలకిస్తూ అక్కడి అందాలను ఆస్వాదించడం భలే అనుభూతిని కలిగిస్తుంది. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల గురించి లుసుకుందాం... సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర చరిత్రకు తలమానికమైన చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రాంతాలే కాకుండా..దేశానికే తలమానికంగా నిరి్మతమైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పార్లమెంట్‌ను పోలిన నిర్మాణం పైన భారీ ఎత్తులో నిరి్మతమైన ఈ విగ్రహం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి తిలకించినా సగర్వంగా కనిపిస్తుంది. బుద్ధుడిని స్పూర్తిగా తీసుకుని దేశం గరి్వంచదగ్గ వ్యక్తిగా ఎదిగిన అంబేద్కర్., హుస్సేన్ సాగర్‌లోని బుద్ధుని వెనుకనే నిరి్మంచడంతో సింబాలిక్‌గా నిలుస్తుంది. నగర వైభవాన్ని ప్రతిబింబించే నిర్మాణాలైన చారి్మనార్, అసెంబ్లీ భవనాల సరసన నిలిచేలా నూతనంగా నిర్మితమైన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, కేబుల్ బ్రిడ్జి వంటివి చూపు తిప్పుకోనివ్వవు అంటే అతిశయోక్తి కాదేమో..! ఎన్.టి.ఆర్ గార్డెన్... అరుదైన బొన్సాయ్ మొక్కలు, ఆరి్టఫీషి యల్ మర్రిచెట్టులోంచి రైలు ప్రయాణం, భయపెట్టించే హంటర్ హౌస్, అబ్బురపరిచే పూల వనాలు, వింటేజ్ కార్లలో స్నాక్స్, అత్యంత ఎత్తులో నెక్లెస్ రోడ్ అందాలను చూపించే జేయింట్ వీల్, అండర్ గ్రౌండ్లో ఆటలు, ఆకట్టుకునే బొమ్మలు, ఆశ్చర్యపరిచే ఎడారి మొక్కలు, కళ్లముందు మ్యాజిక్ చేసే త్రీడి షో.. వెరసి అందరినీ అలరించే ఎన్.టీ.ఆర్ గార్డెన్. ఇక్కడే దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ హీరో ఎన్.టీ.రామారావు సమాధిని సందర్శింవచ్చు.ప్రసాద్ ఐమాక్స్.. సినిమా, షాపింగ్, గేమింగ్, ఈటింగ్ ఇలా అన్ని రకాల నగర జీవన శైలికి అద్దం పట్టే వేదిక ఐమాక్స్. ఇందులో సినిమా చూస్తే అదో క్రేజ్‌లా మారేంతలా గుర్తింపు పొందింది. కొత్త సినిమాల విడుదలతో ప్రతీ శుక్రవారం ఇక్కడ సెలబ్రిటీలు, మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలతో సందడిగా ఉంటుంది. జల్ విహార్... కేవలం నీళ్లలో ఆడే ఆటలతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తుంది నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్. రేయిన్ డ్యాన్స్, వాటర్ఫూల్స్లో ఎత్తునుంచి జారవిడిచే ఆటలతో పాటు ఇతర వాటర్ గేమ్స్ ప్రేక్షకులను బయటకు రానివ్వవు.థ్రిల్ సిటీ... ఈ మధ్యనే ప్రారంభమైన థ్రిల్ సిటీ ప్రమాదకరమైన ఆటలతో భయానకమైన వాతావరణంతో థ్రిల్లింగ్ అనుభూతిని పంచుతుంది. రోమాలను నిక్కబొడుచుకునేలా చేసే థ్రిల్లింగ్ గేమ్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి.పీవీ జ్ఞాన భూమి... ఇంతకు ముందు ఎరుగని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించిన ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు సమాధి ఈ జ్ఞాన భూమిలో కొలువుదీరింది. దేశానికి పనిచేసిన ఏ ప్రధాన మంత్రి సమాధిని చూడాలన్నా ఢిల్లీ వెళ్లాల్సిందే. కానీ దక్షిణాది ప్రధానిగా చక్రంతిప్పిన పీవీ సమాధి మాత్రం నెక్లెస్ రోడ్లో చూడవచ్చు.సంజీవయ్య పార్క్... అనేక రంగులతో అలరించే రోస్ గార్డెన్, రంగురంగుల సీతాకోకచిలుకలను కలుసుకునే బటర్ఫ్లవర్ పార్క్, ఎత్తులో దేశంలో రెండో అతిపెద్ద జాతీయ జెండాలను ప్రత్యక్షంగా చూడాలంటే సంజీవయ్య పార్క్ వెళ్లాల్సిందే. ఎత్తులో రెండో స్థానం అయినప్పటికీ త్రివర్ణ పతాకం సైజులో మాత్రం దేశంలోనే అతిపెద్దది.ఈట్ స్ట్రీట్–ఆర్ట్ స్ట్రీట్.. ఆహార ప్రియులకు అనువైన చోటు నెక్లెస్ రోడ్‌లోని ఈట్ స్ట్రీట్., సాగర్ నీటి అలల అంచున కూర్చోని వివిధ డిష్‌లను ఆస్వాదించవచ్చు. దీని ఎదురుగానే ఉన్న వీధుల్లోని ఇళ్లను మొత్తం విభిన్న చిత్రాలతో కళాకారులు తయారు చేశారు. డాగ్ పార్క్.. ప్రతీ ఆదివారం ఉదయం నగరంలోని అన్ని రకాల కుక్కలతో వారి యజమానులు ఈ డాగ్ పార్క్‌కు వస్తారు. జంతు ప్రేమికులను ఇది విశేషంగా అలరిస్తుంది. సైక్లింగ్ క్లబ్.. థ్రిల్ సిటీకి ఎదురుగా ఉన్న సైక్లింగ్ క్లబ్ ఫిట్‌నెస్‌కు మంచి మార్గం. ఇందులో మొంబర్íÙప్ తీసుకుని ఎవరైనా సైక్లింగ్ చేయవచ్చు.అమరవీరుల స్మారక కేంద్రం... తెలంగాణ అమరవీరుల త్యాగాలకు శాశ్వత శ్రద్ధాంజలిగా దీపం రూపంలో నిరి్మంచిన స్మారక కేంద్రం కొత్త శోభను తీసుకొచి్చంది. ఇందులో ప్రత్యేకంగా ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయడం అదనపు ఆకర్షణ.టూరిస్టు సర్కిల్‌గా ట్యాంక్బండ్ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని గుర్తుచేసేలా సాగర్ మధ్యలో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం నగరానికే తలమానికం. చూట్టూ ఆవరించి ఉన్న నీటి మధ్యలో ఈ బుద్ధ విగ్రహాన్ని చూడటం అద్భుతమైన అనుభూతి. ఇక్కడి బోటింగ్ సదుపాయాలు అదనపు ఆనందం.బిర్లా ప్లానిటోరియం.. విజా్ఞనం, వినూత్నం, వివేకానికి బిర్లా ప్లానిటోరియం మంచి వేదిక. విద్యార్థుల నుంచి పరిశోధకుల వరకూ అవసరమైన శాస్త్ర–సాంకేతిక, పురాతత్వ విషయాలను తెలుసుకొవచ్చు. ఇక్కడే అంతరిక్షానికి చెందిన ప్రత్యేక స్కై షో కూడా చూడవచ్చు. లుంబినీ పార్క్, బోటింగ్.. ఆటవిడుపుకు, కాలక్షేపానికి అడ్డాగా మాత్రమే కాకుండా హుస్సేన్‌సాగర్ అందాలను తనివితీరా చూపించే బోటింగ్ సదుపాయం లుంబినీ పార్క్ సొంతం. సాధారణ బోటింగ్, సినిమాల్లో చూపించే వేగంగా ప్రయాణించే స్పీడ్ బోట్లతో పాటు వ్యక్తిగత పారీ్టలు సైతం నిర్వహించుకునేలా లగ్జరీ బోట్లు అందుబాటులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. -
నెక్లెస్ రోడ్లో 10వ ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవాల కర్టెన్ రైజర్ (ఫొటోలు)
-
నెక్లెస్‌రోడ్డులో లైట్ అండ్ సౌండ్ లేజర్‌షో ప్రారంభం (ఫొటోలు)
-
హైదరాబాద్ : పీపుల్స్ ప్లాజా వద్ద వింటేజ్ కార్ల ర్యాలీ (ఫొటోలు)
-
ఫార్ములా–ఈ రేసింగ్ రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫార్ములా– ఈ కార్ రేసింగ్ పోటీలను (రేస్ రౌండ్ –4) రద్దు చేసినట్లు ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ ఈఓ) ప్రకటించింది. వచ్చే ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్లో నిర్వహించవల సిన ఈ అంతర్జాతీయ పోటీలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్న ట్లు పేర్కొంది. ఫార్ములా–ఈ పోటీలపై గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణ పురపాలన, పట్టణా భివృద్ధి (ఎంఏయూడీ) విభాగానికి నోటీసులు ఇవ్వను న్నట్లు ఎఫ్ఈఓ తెలిపింది. తెలంగాణ సర్కా ర్ వైఖరి తమను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని ఎఫ్ఈఓ కో–ఫౌండర్, చీఫ్ చాంపియన్‌షిప్ ఆఫీసర్ ఆల్బర్ట్ లొంగో అన్నారు. తదుపరి పోటీలను హాంకాంగ్‌లో నిర్వహించను న్నట్లు తెలిపారు. ఫార్ములా–ఈ పోటీల వల్ల ఎలాంటి ప్రయోజ నం లేదని భావించడం వల్లే ప్రభుత్వం విముఖతతో ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పోటీల నిర్వహణపై ప్రభుత్వ ఉన్నతాధికారు లతో చర్చించేందుకు నిర్వాహ కులు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదని ఈ నేపథ్యంలో పోటీలను రద్దు చేసినట్లు సమాచారం. గత ఏడాది భారీ ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మోటార్ స్పోర్ట్స్ ప్రియులను విశేషంగా ఆకట్టుకొనే ఫార్ములా–ఈ పోటీలు గత సంవత్సరం ఫిబ్రవరి 10, 11 తేదీల్లో హైద రాబాద్ నెక్లెస్ రోడ్డులో జరిగాయి. ఈ పోటీల కోసం హెచ్ఎండీఏ సుమారు రూ.100 కోట్లకు పైగా వెచ్చించి స్ట్రీట్ సర్క్యూట్ నిర్మాణంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈ పోటీలు జరగడంతో దేశవ్యాప్తంగా భారీఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు వేలా దిమంది మోటార్ స్పోర్ట్స్ ప్రియులు, రేసింగ్ డ్రైవర్లు హైదరాబాద్‌ను సందర్శించారు. ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు ఫార్ములా–ఈ పోటీలతో పాటు అంతకంటే రెండు నెలల ముందు జరిగిన ఒక రోజు ఇండియన్ రేసింగ్ కార్ పోటీల సందర్భంగా నగ రంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్‌రోడ్డు వైపు వచ్చే వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, హిమాయత్‌నగర్ మార్గాల్లో ఖైరతాబాద్ వైపు ట్రాఫిక్ స్తంభించింది. అమీర్‌పేట్ వైపు నుంచి లక్డీకాపూల్ వైపు వచ్చే వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐదు రోజుల ముందు నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోటీలపై సామాజిక మాధ్యమాల్లో పెద్దయెత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలకు ట్రాఫిక్ నరకాన్ని చూపుతూ ఎవరి కోసం ఈ పోటీలు అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది దుర్మార్గమైన తిరోగమన చర్య: కేటీఆర్ ఫార్ములా –ఈ రేస్‌కు ప్రభుత్వం వెనుకడుగు వేయడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్య క్షుడు కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గమైన, తిరోగ మన నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘హైదరాబాద్ ఇ– ప్రిక్స్ వంటివి ప్రపంచవ్యాప్తంగా మన నగరం, దేశం బ్రాండ్ ఇమేజ్ను పెంచుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో హైదరాబాద్ నగరాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచానికి చాటేందుకు ఉపకరిస్తాయి. ఎలక్ట్రానిక్ వాహన రంగానికి చెందిన ఔత్సాహికులు, తయారీదారులు, స్టార్టప్‌లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్‌ను నిర్వ హించేందుకు ఫార్ములా–ఈ రేస్‌ను ఒక సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించుకుంది..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్‌కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. -
టీటీఏ సేవాడేస్.. నెక్లెస్ రోడ్లో 5కే రన్!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్లో నిర్వహించిన 5కె రన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ 'రన్ ఫర్ హెల్త్ అంటూ' టీటీఏ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ముఖ్య అతిథి గా పాల్గొని, ప్రసంగించారు. 5కె రన్ కార్యక్రమాన్ని టీటీఏ టీమ్‌తో కలిసి ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ప్రారంబించారు. టీటీఏ సేవాభావం కలిగిన సంస్థ అని మాతృభూమికి సేవచేయాలనే ఆలోచన తో కదిలిన టీటీఏ సుదీర్ఘకాలం కొనసాగాలన్నారు సుధీర్ రెడ్డి. ఈ 5కె రన్ కార్యక్రమం గురించి సంస్థ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సేవా డేస్‌తో పాటు టీటీఏ సాధించిన విజయాలను సంస్థ అడ్వైసర్ మోహన్ రెడ్డి పటోళ్ల వివరించారు. ప్రతి రెండేళ్ల ఒకసారి చేసే టీటీఏ సేవా కార్యక్రమం.. ఇక నుంచి ప్రతి సంవత్సరం చేస్తామని సంస్థ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మలిపెద్ది పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల టీటీఏ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదీర్ రెడ్డితో పాటు పలువురిని శాలువాతో సన్మానించి మెమెంటోలు అందించారు. ఈ ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందిరని ఆకట్టుకున్నాయి. జుంబా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. కాలేజ్ స్టూడెంట్స్ నృత్య ప్రదర్శన, మణిపూర్ సంప్రదాయ కర్ర ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది. ఆద్యంతం ఉత్సహబరితంగా సాగిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. (చదవండి: విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి: జయంత్ చల్లా) -
ఒంటరిగా ఉన్న జంటలే టార్గెట్
సాక్షి, సిటీబ్యూరో: నెక్లెస్ రోడ్లో ఒంటరిగా ఉన్న జంటలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న సూడో పోలీసును మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 20 కేసులు నమోదైనట్లు డీసీపీ నితిక పంత్ బుధవారం వెల్లడించారు. జనగాంకు చెందిన మరాఠీ సృజన్ కుమార్ కొన్నేళ్ల క్రితం విశాఖలో ఎస్సైగా పని చేసిన శ్రావణిని వివాహం చేసుకున్నాడు. పైళ్లెన కొన్ని నెలలకే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడానికి సూడో పోలీసు అవతారం ఎత్తాడు. తన భార్య పోలీసు యూనిఫాంలో ఉన్న ఫొటోను తన ఫోన్లో పెట్టుకుని తిరిగే సృజన్ తానూ డమ్మీ తుపాకీతో దిగిన వాటినీ ఇలా సేవ్ చేసుకున్నాడు. టార్గెట్ చేసిన వ్యక్తులకు వీటిని చూపిస్తూ తాను పోలీసునని బెదిరిస్తాడు. కేసు పేరు చెప్పి వారి నుంచి అందినకాడికి దండుకుంటాడు. ఇలాంటి నేరాలు చేసిన నేపథ్యంలో సృజన్‌పై గతంలో నగరంలో పాటు విశాఖపట్నం, వరంగల్ సహా వివిధ ప్రాంతాల్లో 18 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఇతడు నెక్లెస్ రోడ్నే తన టార్గెట్‌గా మార్చుకున్నాడు. నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అక్కడ ఒంటరిగా, ఏకాంతంగా ఉన్న జంటలను ఎంచుకుంటాడు. ఫోన్లోని ఫొటోలు చూపించి తాను పోలీసు అని, తనతో ఠాణాకు రావాలని గద్దిస్తాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సి ఉందని భయపెడతాడు. అలా కాకుండా ఉండాలంటే తాను కోరిన మొత్తం ఇవ్వాలని బెదిరిస్తాడు. ఇలా రెండు జంటలను బెదిరించి డబ్బు దండుకున్నాడు. ఓ జంట నుంచి రూ.20 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. మరో జంట నుంచి ఈ పంథాలో రూ.99 వేలు తీసుకున్న సృజన్.. మరుసటి రోజు రూ.4 లక్షలు వసూలు చేశాడు. వీరి ఫిర్యాదుతో సెక్రటేరియేట్ ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ బి.రాజు నాయక్ నేతృత్వంలో ఎస్సైలు సీహెచ్.నవీన్‌కుమార్, ఎస్.సాయి కిరణ్ వలపన్ని బుధవారం నిందితుడిని పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలో ఇతడిపై ఆసిఫ్‌నగర్‌లో రెండు ఎన్బీడబ్ల్యూలు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. సృజన్ నుంచి రూ.1.38 లక్షల నగదు, వాహనం, ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం సెక్రటేరియేట్ పోలీసులకు అప్పగించారు. ఇతడు సూర్య, చరణ్, చెర్రీ పేర్లతోనూ చెలామణి అయినట్లు గుర్తించారు. -
సాగర తీరంలో.. కోచ్ రెస్టారెంట్
హైదరాబాద్: రెస్టారెంట్ ఆన్ వీల్స్‌లో భాగంగా దక్షిణమధ్య రైల్వే ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డు ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద అద్భుతమైన రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఉత్తర, దక్షిణాది వంటకాలతో అన్ని వర్గాల పర్యాటకులను ఆకట్టుకొనేవిధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ రెస్టారెంట్‌కి వెళితే కదులుతున్న ట్రైన్లో కూర్చొని నచ్చిన రుచులను ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో హుస్సేన్‌సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన ఈ కోచ్ రెస్టారెంట్ సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలుగజేస్తుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. టూరిస్ట్ హబ్‌గా నెక్లెస్‌రోడ్డు... ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు ప్రాంతాలు అంతర్జాతీయ పర్యాటక హంగులను సంతరించుకున్నాయి. ప్రతి రోజు వేలాది మంది సందర్శకులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు తరలివస్తున్నారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో పర్యాటకుల రద్దీ లక్షల సంఖ్యలో ఉంటుంది. నెక్లెస్‌రోడ్డులో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కోచ్ రెస్టారెంట్ సైతం పర్యాటకప్రియులను ఆకట్టుకోనుంది. వినియోగంలో లేని ఒక కోచ్‌లో ఈ కొత్త రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ఐదు సంవత్సరాల కాలానికి నగరానికి చెందిన మెసర్స్ బూమరాంగ్ సంస్థకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఐదేళ్లపాటు వీరే నిర్వహిస్తారు. -
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ క్లోజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 22న సాయంత్రం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్డు రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ల మధ్య ట్రాఫిక్‌కు అనుమతి లేదు. పంజగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు రోటరీ వైపు వెళ్లేందుకు అనుమతించరు. ఈ వాహనాలను షాదాన్ కళాశాల నుంచి నిరంకారి వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలకు రోటరీ చౌరస్తా వైపునకు అనుమతి ఉండదు. బుద్ధ భవన్ నుంచి వచ్చే ట్రాఫిక్ నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌వైపు వెళ్లడానికి నల్లకుంట చౌరస్తా నుంచి మళ్లిస్తారు. లిబర్టీ, అంబేడ్కర్ విగ్రహం నుంచి వచ్చే ట్రాఫిక్ ఎన్టీఆర్ మార్గ్ వైపునకు వెళ్లడానికి అనుమతి లేదు. రాణీగంజ్, కవాడిగూడల నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. బడా గణేష్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరీ వైపు, మింట్ లేన్ వైపు వచ్చే ట్రాఫిక్ బడా గణేష్ వద్ద నుంచి రాజ్‌దూత్ లేన్ వైపు మళ్లింపు ఉంటుంది. తెలంగాణ అమరవీరుల స్మారక ప్రారంభోత్సవం దృష్ట్యా 22న ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, లుంబినీపార్క్ మూసి ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి ఎగువ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి లేదు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్లను గమనించి ప్రత్యామ్న్యాయ మార్గాల్లో వెళ్లాలని సుధీర్‌బాబు సూచించారు. చదవండి: కాంగ్రెస్‌లో జోష్.. పొంగులేటి ఇంటికి రేవంత్‌రెడ్డి -
నీరు తాగుతున్నమంత్రి శీనన్న
-
హుస్సేన్ సాగర్ : కమ్మని నీరా.. కేఫ్ లోపల ఎలా ఉందో చూసేయండి (ఫొటోలు)
-
హుస్సేన్ సాగర్ తీరాన స్టార్ హోటల్‌ను తలపించేలా నీరా కేఫ్ (ఫొటోలు)
-
నెక్లెస్‌రోడ్‌లో నేడు నీరా కేఫ్ ప్రారంభం
-
నెక్లెస్‌రోడ్‌లో నేడు నీరా కేఫ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఎన్నో పోషక విలువలకు నెలవై.. పల్లె ప్రాంతాలకే అలవాలమై ‘నీరా’ జనాలు అందుకున్న అత్యుత్తమ పానీయం. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన నీరాను.. నగరవాసులకు చేరువ చేసేందుకు రంగం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన నీరా కేఫ్ ఇవాళ(బుధవారం) ప్రారంభం కానుంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం నీరాకేఫ్‌ను ప్రారంభించనున్నారు. ఈ పానీయాన్ని ఆస్వాదించేందుకు తరలివచ్చే జనాల కోసం ప్రభుత్వం ఇక్కడ అన్ని వసతులు కల్పించింది. అదే సమయంలో.. ఇక్కడ ఏర్పాటు చేసిన పలు చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. 👉 నెక్లెస్ రోడ్డులో 2020 జులై 23న నీరాకేఫ్‌ను శంకుస్థాపన చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. నీరా కేఫ్‌లో మొత్తం 7 స్టాళ్లు ఉంటాయి. 500 మంది కూర్చునేందుకు వీలుంటుంది. రేట్లు ఎలా ఉంటాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 👉 నగర శివారు నందన వనంలోని పదెకరాల్లో ఉన్న తాటి చెట్ల నుంచి నీరా సేకరిస్తారు. నీరా నాలుగు డిగ్రీల వద్ద సురక్షితంగా నిల్వ ఉంటుంది. తాటి, ఈత నీరా సేకరించాక దాన్ని సీసాల్లో పోసి.. ఐస్ బాక్సుల్లో నగరానికి తీసుకొస్తారు. నీరా కేఫ్‌లో శుద్ధి చేసి.. ప్యాకింగ్ చేసి.. విక్రయిస్తారు. 👉 నీరా కేఫ్‌ను.. పోష్ రెస్టారెంట్ తరహాలో తీర్చిదిద్దారు. తియ్యటి నీరాతో పాటు నోరూరించే అనేక ఆహార పదార్థాలు కూడా లభిస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్టు ఉంటుంది. మొదటి అంతస్తులో నీరాను అమ్ముతారు. నీరాను అక్కడే కూర్చుని తాగవచ్చు. లేదంటే టేక్ అవే సౌకర్యం కూడా ఉంది. 👉 పల్లెల్లో తాళ్లు, ఈదుల మధ్య కూర్చున్న అనుభూతి కలిగేలా... కేఫ్ చుట్టూ తాటి చెట్ల ఆకృతులు, పైకప్పును తాటాకు ఆకృతిలో రూపొందించారు. 👉 నీరా కేఫ్ నుంచి ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహం వరకు బోటింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. కల్లుకు, నీరాకు ఎంతో తేడా ఉంది. కల్లులో ఆల్కాహాల్ శాతం ఉంటుంది. కానీ నీరాలో ఆల్కాహాల్ ఉండదు. నీరా రుచి తియ్యగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హుస్సేన్ సాగర్ తీరాన స్టార్ హోటల్‌ను తలపించేలా నీరా కేఫ్ (ఫొటోలు)
Neera Cafe : హుస్సేన్ సాగర్ తీరాన స్టార్ హోటల్‌ను తలపించేలా నీరా కేఫ్ (ఫొటోలు) -
Hyderabad: సంస్థల హెచ్చరికలు.. కానరాని ప్రేమ పక్షులు
సాక్షి, హైదరాబాద్: వలెంటైన్స్ డే.. ప్రేమ పక్షులకు ఇదో ప్రత్యేకమైన రోజు. ఎంతో ఆహ్లాదకరంగా జంటలు.. జంటలుగా వలెంటైన్స్ డేను జరుపుకొంటారు. పార్కులకు వెళ్లి ప్రేమ కబుర్లతో గడుపుతుంటారు. కానీ.. మంగళవారం నాటి వలెంటైన్స్ డే.. వెలవెలాబోయింది. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే ఈ రోజున ప్రేమికులెవరూ బహిరంగంగా సంచరించవద్దని, పార్కుల్లో, ఇతర ప్రాంతాల్లో జంటలుగా కనిపించవద్దని.. ఒకవేళ కనిపిస్తే ‘పెళ్లి’ చేస్తామని కొన్ని సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో నగరంలోని పార్కుల్లో, లవ్ హైదరాబాద్ ఎదుట ప్రేమజంటల హడావుడి కనిపించలేదు. చదవండి: Makkah Masjid: ఎనిమిదేళ్లకు ‘గంట’ కొట్టింది! -
హైదరాబాద్ ‘ఫార్ములా’ అదిరింది
ఒకవైపు 320 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకుపోతున్నాయి... మరోవైపు అంతే రేంజ్లో ఫ్యాన్స్ ఉత్సాహం, ఉత్కంఠ... ఒకవైపు వీఐపీ బాక్స్‌లో నుంచి సెలబ్రిటీలు రేస్‌ను ఆస్వాదిస్తుండగా... మరోవైపు గ్యాలరీల్లో ఉన్న సాధారణ అభిమానుల హోరుతో పరిసరాలు దద్దరిల్లుతున్నాయి... రెప్పపాటులో ట్రాక్‌పై జూమ్మంటూ జనరేషన్ ‘3’ కార్లు పరుగులు తీయగా... దాదాపు గంట పాటు హుస్సేన్ సాగర్ తీరం ప్రపంచ పటంపై కనువిందు చేసింది. న్యూయార్క్, బెర్లిన్, బీజింగ్, రోమ్, జ్యూరిక్... ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఫార్ములా ‘ఇ’ రేస్‌కు ఆతిథ్యం ఇస్తున్న నగరాల్లో కొన్ని. ఇప్పుడు హైదరాబాద్ కూడా వీటి సరసన చేరింది. కొత్తగా వచ్చిన క్రీడతో ‘స్ట్రీట్ సర్క్యూట్’ వద్ద అన్ని రకాలుగా కొత్త తరహా వాతావరణం కనిపించింది. ఫార్ములా ‘ఇ’ రేస్ విజయవంతమైందన్న సంకేతాన్ని చాటింది. ఈ హోరాహోరీ సమరంలో చివరకు డీఎస్ పెన్స్కే జట్టు డ్రైవర్ జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. సాక్షి, హైదరాబాద్: భారత్‌లో తొలిసారి నిర్వహించిన ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఫార్ములా ‘ఇ’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అటు ప్రేక్షకాదరణతో పాటు ఇటు నిర్వాహకుల వైపు నుంచి కూడా సూపర్ సక్సెస్‌గా ప్రశంసలందుకుంది. ఫార్ములా ‘ఇ’ 9వ సీజన్లో భాగంగా హైదరాబాద్‌లో శనివారం నాలుగో రేస్ ముగిసింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో రూపొందించిన ‘స్ట్రీట్ సర్క్యూట్’పై 22 మంది పోటీ పడిన ఈ రేస్‌లో డీఎస్ పెన్స్కే టీమ్‌కు చెందిన జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. 33 ల్యాప్లతో 2.83 కిలోమీటర్లు ఉన్న ట్రాక్‌పై సాగిన ఈ రేస్‌ను వెర్నే అందరికంటే వేగంగా 46 నిమిషాల 01.099 సెకన్లలో పూర్తి చేశాడు. ఎన్విజన్ రేసింగ్ డ్రైవర్ నిక్ కాసిడీ రెండో స్థానంలో, పోర్‡్ష టీమ్ డ్రైవర్ ఫెలిక్స్ డి కోస్టా మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన మహీంద్రా టీమ్ డ్రైవర్ ఒలివర్ రోలండ్కు ఆరో స్థానం దక్కింది. 29 పాయింట్లతో పెన్స్కే ‘టీమ్ చాంపియన్’గా నిలిచింది. విజేతగా నిలిచిన జీన్ ఎరిక్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు... రన్నరప్ నిక్ క్యాసిడీకి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్రోఫీలు అందజేశారు. ఈ సీజన్లో భాగంగా ఐదో రేస్ ఈనెల 25న దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతుంది. హైదరాబాద్ రేస్ విశేషాలు... ► వెర్నే రేస్ పూర్తి చేసే సమయానికి అతని కారులో 0.5 శాతం ఎనర్జీ మాత్రమే మిగిలి ఉంది. ► ఎన్విజన్ డ్రైవర్ సెబాస్టియన్ బ్యూమీ మూడో స్థానంలో నిలిచినా... ‘ఓవర్ పవర్’ ఉపయోగించినందుకు 17 సెకన్ల పెనాల్టీ విధించడంతో నాలుగో స్థానానికి పడిపోయాడు. ► మహీంద్రా టీమ్ డ్రైవర్లలో రోలండ్ ఆరో స్థానంలో, డి గ్రాసి 14వ స్థానంలో నిలిచారు. ► జాగ్వార్ టీమ్‌కు చెందిన ఇద్దరు డ్రైవర్లు మిచ్ ఇవాన్స్, స్యామ్ బర్డ్ ఒకరినొకరు ట్రాక్‌పై ‘ఢీ’ కొట్టుకున్నారు. దాంతో ఇద్దరూ రేస్‌ను పూర్తి చేయలేకపోయారు. ► మూడో స్థానంలో నిలిచిన మాజీ విజేత డి కోస్టాకు ఇది 100వ రేస్ కావడం విశేషం. ► పెన్స్కే టీమ్‌కే చెందిన డిఫెండింగ్ చాంపియన్ స్టాఫెల్ వండూర్న్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ► 23వ ల్యాప్‌లో మెక్లారెన్ డ్రైవర్ జేక్ హ్యూజెస్ కారు స్టీరింగ్ జామ్ అయి ఆగిపోవడంతో సేఫ్టీ కారును తీసుకోవాల్సి వచ్చింది. చివరకు అతనూ రేస్ పూర్తి చేయలేకపోయాడు. ఓవరాల్‌గా ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయలేకపోయారు. హైదరాబాద్ ‘ఇ’ రేసు ఫలితాలు (టాప్–10): 1. జీన్ ఎరిక్ వెర్నే (డీఎస్ పెన్స్కే; 46ని:01.099 సెకన్లు), 2. నిక్ క్యాసిడీ (ఎన్విజన్; 46ని:01.499 సెకన్లు), 3. ఫెలిక్స్ డి కోస్టా (పోర్‡్ష; 46ని: 02.958 సెకన్లు), 4. వెర్లీన్ (పోర్‡్ష; 46ని: 03.954 సెకన్లు), 5. సెటె కెమారా (నియో 333 రేసింగ్; 46ని: 04.622 సెకన్లు), 6. రోలండ్ (మహీంద్రా; 46ని: 08.237 సెకన్లు), 7. నార్మన్ నాటో (నిస్సాన్; 46ని: 08.417 సెకన్లు), 8. స్టాఫెల్ వాన్డూర్న్ (డీఎస్ పెన్స్కే; 46ని: 08.663 సెకన్లు), 9. లాటరర్ (అవలాంచె; 46ని: 9.802 సెకన్లు), 10. మొర్టారా (మసెరాటి; 46ని: 10.172 సెకన్లు). -
హైదరాబాద్‌లో ముగిసిన ఫార్ములా-ఈ రేసింగ్.. విజేత ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: నెక్లెస్ రోడ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్‌షిప్ ముగిసింది. భారత్‌లో తొలిసారి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న రేసింగ్‌లో ప్రపంచస్థాయి రేసర్లు అదరగొట్టారు. శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ప్రారంభమైన రేసు గంటన్నర పాటు కొనసాగింది. ఫార్ములా-ఈ రేస్ వరల్డ్ ఛాంపియన్షిప్ విజేతగా జీన్ ఎరిక్ వెర్గ్నే(డీఎస్ పెన్స్కే రేసింగ్) నిలిచాడు. ఆ తర్వాత రెండో స్థానంలో నిక్ క్యాసిడీ(ఎన్విజన్ రేసింగ్), మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమి(ఎన్విజన్ రేసింగ్) ఉన్నారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. కాగా జీన్ ఎరిక్ ఇప్పటికే రెండుసార్లు ఫార్ములా-ఈ ఛాంపియన్ కావడం విశేషం. తాజా విజయంతో అతను మూడోసారి ఛాంపియన్‌గా అవతరించాడు. 2013లో ఫార్ములా-1 రేసు తర్వాత భారత్‌లో జరుగుతున్న ఫార్ములా-ఈ తొలి రేసుకు మన హైదరాబాద్ వేదికైంది. దీనికి తోడు ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఫార్ములా-ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్ చోటు దక్కించుకుంది. హుసేన్సాగర్ తీరప్రాంతంలో 2.8కిలోమీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్‌పై మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించారు. తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్3 కార్లతో రేసర్లు దుమ్ములేపారు. రేసింగ్‌లో విదేశీ కంపెనీలు, రేసర్లదే హవా కాగా, భారత్ నుంచి మహీంద్ర రేసింగ్, టీసీఎస్ జాగ్వార్ బరిలోకి దిగడం గర్వంగా అనిపించింది. -
ఫార్ములా ఈ రేసుకు హాజరైన మంత్రి కేటీఆర్.. అసౌకర్యంపై స్పందన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ తీరం వద్ద ఫార్ములా- రేసింగ్ పోటీలు సందడిగా సాగాయి. రెండో రోజు ఫార్ములా-ఈ రేసింగ్‌కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకైనా ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని అన్నారు. నెక్లెస్ రోడ్డులో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకుపోతుంటే చూడటానికి ఎంతో బాగుందని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఉన్న యువత, క్రీడాభిమానులు ఈ రేస్‌ను చూసేందుకు తరలివస్తున్నారని చెప్పారు. ఈ ఈవెంట్స్‌లో కొంత అసౌకర్యం కలుగుతుందన్నమాట నిజమేనన్న కేటీఆర్.. కానీ అది మన్నించి సహకరిస్తున్నందుకు నగరవాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇంటువంటి కార్యక్రమాలతో హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, ఈ కార్యక్రమం సవ్యంగా, సాఫీగా జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. కాగా దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలను వీక్షించేందుకు సినీ, క్రీడా రంగాలకు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలిరావడంతో అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తోపాటు శిఖర్ ధావన్, దీపక్ చాహర్, సినీనటుడు నాగచైతన్య, అఖిల్ అక్కినేని. మహేశ్ బాబు సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, నారా బ్రాహ్మణి హుస్సేన్ సాగర్ తీరానికి విచ్చేశారు. చదవండి: హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్.. సెలబ్రిటీల సందడి -
Formula E : హుస్సేన్ ‘సాగర తీరం’లో రేసింగ్.. సినీ, క్రికెట్ ప్రముఖుల సందడి (ఫొటోలు)