
లవ్‌కు నో ఎంట్రీ
నిత్యం వందలాది ప్రేమ జంటలతో కళకళలాడే ఇందిరాపార్కు వాలంటైన్ డే నాడు మాత్రం వెలవెలబోయింది. సాధారణ రోజులల్లో ఇక్కడి ప్రతి చెట్టు, పుట్ట వద్ద జంటలే ప్రేమ కబుర్లలో మునిగితేలేవారు. మంగళవారం పార్కు నిర్వాహకులు, పోలీసులు సైతం ప్రేమ జంటలకు అనుమతిని నిరాకరించి, బందోబస్తు ఏర్పాటు చేయడంతో పార్కు కళతప్పింది. – కవాడిగూడ
జంటలు లేవాయె..
నిత్యం ప్రేమ జంటలతో నిండిపోయే బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కు సైతం మంగళవారం కళ తప్పింది. పార్కుల్లో తిరిగే ప్రేమ జంటలకు పెళ్లి చేస్తామంటూ భజరంగ్‌దళ్ హెచ్చరికల నేపధ్యంలో జంటలు ఇటువైరు వచ్చేందుకు సాహసించలేదు. – బంజారాహిల్స్
వాలంటైన్ డేను పురస్కరించుకుని మంగళవారం పార్కులు కళ తప్పితే.. నెక్లెస్ రోడ్డు మాత్రం ప్రేమ జంటలతో కళకళలాడింది. అక్కడి పచ్చికపై కూర్చుని కబుర్లాడుకుని.. సెల్ఫీలు దిగారు. కేక్ కట్‌చేసుని, బహుమతులు ఇచ్చిపుచ్చుకుని ఆనందం పంచుకున్నారు.