సాక్షి, హైదరాబాద్: సాగరతీరం మరింతగా పర్యాటక హంగులను సంతరించుకుంటోంది. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా–ఈ పోటీల నేపథ్యంలో నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్ పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు, సందర్శకులను ఆకట్టుకొనేవిధంగా అనేక ఏర్పాట్లు చేపట్టారు. సాగర్ జలాలపై మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్‌షోలతో పాటు ఈ నెలలోనే నీరా కేఫ్‌ను సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతిసిద్ధమైన నీరా పానీయాన్ని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సుమారు రూ.10 కోట్లతో నెక్లెస్ రోడ్డు, పీపుల్స్‌ప్లాజా సమీపంలో ఈ కేఫ్‌ను నిర్మించింది.
నీరాతో పాటు రెస్టారెంట్ సేవలు...
తాటి, ఈత చెట్ల నుంచి తెల్లవారు జామునే సేకరించే నీరా పానీయంలోని సహజమైన పోషక విలువలు ఏ మాత్రం చెడకుండా శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేసి విక్రయిస్తారు. ఇందుకోసం రెండంతస్థుల నీరా భవనంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సురక్షితంగా నిల్వ చేసేందుకు అవసరమైన అన్ని రకాల శీతలీకరణ యంత్రాలను సిద్ధం చేశారు. భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్ సమీపంలోని ముద్విన్‌లో ఏర్పాటు చేసిన తాటివనం ప్రాజెక్టుల్లో నీరా కోసమే ప్రత్యేకంగా పెంచిన తాటి, ఈత చెట్ల నుంచి నీరాతో పాటు అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్‌లు, మినరల్స్ లభిస్తాయని వివరించారు. నీరాతో పాటే రెస్టారెంట్ సేవలు కూడా ఇక్కడ లభిస్తాయని చెప్పారు.
►ఈ కేఫ్‌లో తెలంగాణ వంటకా లన్నీ లభిస్తాయి.
►ఒకేసారి సుమారు 3 వేల మంది సందర్శించవచ్చు.
►పర్యాటక ప్రియులు, నగరవాసులు సాగరతీరంలో సేదతీరుతూ నీరాను ఆస్వాదించవచ్చు.
►తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరా నుంచి తయారయ్యే బెల్లం, సిరప్‌లు కూడా కేఫ్‌లో విక్రయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment