Traffic Restrictions Hyderabad in View of Martyrs Memorial Unveiled - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్క్, ఎన్టీఆర్‌ గార్డెన్, ట్యాంక్‌బండ్‌ మూసివేత 

Published Wed, Jun 21 2023 7:15 PM | Last Updated on Wed, Jun 21 2023 9:25 PM

Traffic restrictions Hyderabad in View Of Martyrs Memorial Unveiled - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 22న  సాయంత్రం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్‌ పోలీస్‌ అడిషనల్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు తెలిపారు. ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి నెక్లెస్‌ రోడ్డు రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ల మధ్య ట్రాఫిక్‌కు అనుమతి లేదు. పంజగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోడ్డు రోటరీ వైపు వెళ్లేందుకు అనుమతించరు. ఈ వాహనాలను షాదాన్‌ కళాశాల నుంచి 
నిరంకారి వైపు మళ్లిస్తారు.

ఇక్బాల్‌ మినార్‌ నుంచి వచ్చే వాహనాలకు రోటరీ చౌరస్తా వైపునకు అనుమతి ఉండదు. బుద్ధ భవన్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌వైపు వెళ్లడానికి నల్లకుంట చౌరస్తా నుంచి మళ్లిస్తారు. లిబర్టీ, అంబేడ్కర్‌ విగ్రహం నుంచి వచ్చే ట్రాఫిక్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపునకు వెళ్లడానికి అనుమతి లేదు. రాణీగంజ్, కవాడిగూడల నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్‌బండ్‌ వైపు అనుమతించరు. బడా గణేష్‌ నుంచి ఐమాక్స్, నెక్లెస్‌ రోటరీ వైపు, మింట్‌ లేన్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ బడా గణేష్‌ వద్ద నుంచి రాజ్‌దూత్‌ లేన్‌ వైపు మళ్లింపు ఉంటుంది.

తెలంగాణ అమరవీరుల స్మారక ప్రారంభోత్సవం దృష్ట్యా 22న ఎన్టీఆర్‌ గార్డెన్, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీపార్క్‌ మూసి ఉంటాయి. సికింద్రాబాద్‌ నుంచి ఎగువ ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి లేదు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్‌ డైవర్షన్లను గమనించి ప్రత్యామ్న్యాయ మార్గాల్లో వెళ్లాలని సుధీర్‌బాబు సూచించారు.   
చదవండి: కాంగ్రెస్‌లో జోష్‌.. పొంగులేటి ఇంటికి రేవంత్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement