traffic advisory
-
HYD: బేగంపేట రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో శీతాకాలం విడిది కోసం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ము ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల దాకా బొల్లారం నుంచి బేగంపేట రూట్లో ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రిస్తారు. కాబట్టి.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. ప్రతీయేడులాగే.. ఈసారి కూడా శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. సోమవారం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ విడిదిలో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే వీలుంది. అయితే అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 20వ తేదీన భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించి చేనేత ప్రదర్శనలో పాల్గొంటారు. ఈనెల 23న రాష్ట్రపతి ముర్ము తిరిగి ఢిల్లీ బయల్దేరే అవకాశాలు ఉన్నాయి. -
పరేడ్ గ్రౌండ్లో మోదీ సభ.. ఈ మార్గాల్లో రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం కోసం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే మాదిగల విశ్వరూప మహాసభకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 9 లేదా 10 శాతానికి పెంచే విషయంపైనా మోదీ ఏదైనా ప్రకటన చేయవచ్చునని ఊహాగానాలు సాగుతు న్నాయి. ప్రధానిమోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో నేడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ అదనపు (ట్రాఫిక్) పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. టివోలి క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజ్ ఎక్స్ రోడ్స్‌ను ఊసివేయనున్నారు. పలు మార్గాల్లో దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. సంబంధిత వార్త: నేడు తెలంగాణకు మోదీ ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. ►పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు, తివోలి ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్ల మధ్య రహదారులు మూసివేస్తారు. ►సికింద్రాబాద్ సంగీత్ కూడలి నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్ వైఎంసీఏ వద్ద క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సీటీఓ, రసూల్‌పురా, బేగంపేట వైపు వెళ్లాలి ►బేగంపేట నుంచి సంగీత్ కూడలికి వచ్చే వాహనాలను సీటీఓ ఎక్స్ రోడ్స్ వద్ద బాలంరాయ్, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్ ఉప్కార్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా మళ్లిస్తారు ►బోయినపల్లి, తాడ్‌బండ్ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను బ్రూక్ బాండ్ వద్ద సీటీఓ, రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ►కార్ఖానా, ఏబీఎస్ నుంచి ఎస్బీహెచ్-ప్యాట్ని వైపు వచ్చే ట్రాఫిక్ స్వీకార్-ఉప్కార్ వద్ద వైఎంసీఏ, క్లాక్ టవర్, ప్యాట్నీ లేదా టివోలి-బ్రూక్‌బాండ్, బాలంరాయ్, సీటీవో వైపు మళ్లిస్తారు. ►ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలకు ఎస్బీహెచ్- స్వీకార్-ఉప్కార్ వైపు అనుమతిలేదు. క్లాక్ టవర్, వైఎంసీఏ లేదా ప్యారడైజ్, సీటీఓ వైపు పంపిస్తారు. ►ఆర్టీఏ కార్యాలయం (తిరుమలగిరి), కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్ టివోలి వద్ద స్వీకార్-ఉప్కార్, వైఎంసీఏ లేదా బ్రూక్ బాండ్, బాలంరాయ్, సీటీఓ వైపు ప్రయాణించాలి. ►జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి బేగంపేటవైపు వచ్చే వాహనాలను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్‌ల్యాండ్ రాజ్‌భవన్ వైపు పంపిస్తారు. -
ఢిల్లీ ప్రజలను క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందస్తు క్షమాపణలు చెప్పారు. ఢిల్లీ వేదికగా వచ్చే నెలలో జరగబోయే జీ20 సదస్సును విజయవంతం చేయాలని రాజధాని ప్రజలను మోదీ కోరారు. అయితే ఆ సమయంలో పలువురు ప్రపంచ నేతలు ఢిల్లీ రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు. ఈ కారణంగా రాజధాని ప్రజలకు కొంత ఇబ్బందికి గురి కావచ్చని , అందుకే ముందే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఈ మేరకు బెంగుళూరు పర్యటన ముగించుకొని ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. ఎయిర్‌పోర్టు వెలుపల మాట్లాడుతూ.. G20 సమ్మిట్ కోసం జరుగుతున్న ఏర్పాట్ల కారణంగా ఢిల్లీ ప్రజలు ఎదుర్కొనే అసౌకర్యానికి ముందస్తుగా ప్రజలను క్షమించాలని కోరారు. దేశం మొత్తం జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇస్తోందని, కానీ అతిథులు ఢిల్లీకి వస్తున్నారన్నారు. ఈ సదస్సును విజయవంతం చేయడంలో ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక బాధ్యత ఉందన్నారు. దేశ ప్రతిష్టపై ఏమాత్రం ప్రభావం పడకుండా చూసుకోవాలని కోరారు. చదవండి: జాబిల్లిపై రోవర్ చక్కర్లు.. వీడియో చూశారా? ‘సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 15 వరకు చాలా అసౌకర్యం ఉండనుంది. అతిథుల విచ్చేస్తున్న క్రమంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేసి మిమ్మల్ని వేరే దారిలో మళ్లిస్తారు. ఈ మార్పులు అవసరమం. ట్రాఫిక్ నిబంధనల వల్ల ఢిల్లీ వాసులు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. అందుకు ముందుగానే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. కాగా సెప్టెంబరు 9-10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 దేశాధినేతల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్‌తో ఆహ్వానిత అతిథి దేశాలకు చెందిన 30 మందికి పైగా దేశాధినేతలు, ఉన్నతాధికారులు, 14 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది. -
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ క్లోజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 22న సాయంత్రం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్డు రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ల మధ్య ట్రాఫిక్‌కు అనుమతి లేదు. పంజగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు రోటరీ వైపు వెళ్లేందుకు అనుమతించరు. ఈ వాహనాలను షాదాన్ కళాశాల నుంచి నిరంకారి వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలకు రోటరీ చౌరస్తా వైపునకు అనుమతి ఉండదు. బుద్ధ భవన్ నుంచి వచ్చే ట్రాఫిక్ నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌వైపు వెళ్లడానికి నల్లకుంట చౌరస్తా నుంచి మళ్లిస్తారు. లిబర్టీ, అంబేడ్కర్ విగ్రహం నుంచి వచ్చే ట్రాఫిక్ ఎన్టీఆర్ మార్గ్ వైపునకు వెళ్లడానికి అనుమతి లేదు. రాణీగంజ్, కవాడిగూడల నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. బడా గణేష్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరీ వైపు, మింట్ లేన్ వైపు వచ్చే ట్రాఫిక్ బడా గణేష్ వద్ద నుంచి రాజ్‌దూత్ లేన్ వైపు మళ్లింపు ఉంటుంది. తెలంగాణ అమరవీరుల స్మారక ప్రారంభోత్సవం దృష్ట్యా 22న ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, లుంబినీపార్క్ మూసి ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి ఎగువ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి లేదు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్లను గమనించి ప్రత్యామ్న్యాయ మార్గాల్లో వెళ్లాలని సుధీర్‌బాబు సూచించారు. చదవండి: కాంగ్రెస్‌లో జోష్.. పొంగులేటి ఇంటికి రేవంత్‌రెడ్డి -
Hyderabad: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లకండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నగరానికి రానున్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు సిటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు అడిషనల్ సీపీ (నేరాలు, శాంతిభద్రతలు) విక్రమ్ సింగ్ మాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు.. 17న ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయన్నారు. సీటీఓ జంక్షన్, పీఎన్టీ ఫ్లైఓవర్, జంక్షన్, హెచ్‌పీఎస్ స్కూల్ ఔట్‌గేట్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, ఎంఎంటీఎస్, వివి స్టాట్యూ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. సికింద్రాబాద్ నుంచి వయా బేగంపేట మీదుగా అమీర్‌పేట, మెహిదీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ రూట్లో రాకుండా అప్పర్ ట్యాంక్‌బండ్ పై నుంచి వెళ్లేందుకు మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. రాజ్‌భవన్ రోడ్, మొనప్ప జంక్షన్, వీవీ స్టాచ్యూ (ఖైరతాబాద్) ఈ మార్గాల్లో రెండు వైపులా రోడ్ క్లోజ్ ఉంటుంది. పంజాగుట్ట రాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు. సీటీఓ జంక్షన్, మినిష్టర్ రోడ్డులో వచ్చే వాహనాలను రసూల్‌పురా జంక్షన్ వద్ద కొంత సమయం పాటు నిలిపివేస్తారు. పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్ మీదుగా బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా వచ్చే వాహనాలను ప్రకాష్‌నగర్ టీ జంక్షన్ వద్ద కొంత సమయం నిలుపుదల చేస్తారు. ఈ రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అడిషనల్ సీపీ (నేరాలు, శాంతిభద్రతలు) విక్రమ్ సింగ్ మాన్ వివరించారు. చదవండి: హైదరాబాద్‌లో నకిలీ మందుల కలకలం.. రూ.కోటి విలువైన మందులు స్వాధీనం -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై మూడు రోజులపాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం వరకు కేబుల్ బ్రిడ్జి మూసివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. కేబుల్ బ్రిడ్జి నిర్వహణ మ్యానువల్ ప్రకారం కాలనుగుణంగా ఇంజినీర్లచే తనిఖీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో భారీ బరువున్న క్రేన్లను కేబుల్ బ్రిడ్జిపై ఉంచాల్సి రావడంతో ట్రాఫిక్‌ను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు వాహనదారులు, పాదాచారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలని కమిషనర్ సూచించారు. మరోవైపు రాకపోకలు నిలిచిపోయే ఆ నాలుగు రోజులపాటు ట్రాఫిక్‌ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్ నం.45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. అలాగే ఐకియా రోటరీ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైతం రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. చదవండి: Alert: హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు -
మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ నెల 12వ తేదీన నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బేగంపేట ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. పంజాగుట్ట–గ్రీన్ ల్యాండ్స్–ప్రకాశ్ నగర్ టీ జంక్షన్, రసూల్‌పురా టీ జంక్షన్, సీటీవో మార్గాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అలాగే సోమాజిగూడ, మోనప్ప ఐలాండ్, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. కావున ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. చదవండి: హైదరాబాద్ ఐఎస్బీలో విద్యార్థిపై దాడి #TrafficAdvisory - In view of the visit of Hon’ble Prime Minister of India to Hyderabad on 12th November 2022 moderate traffic congestion is expected on the roads leading to and surroundings of Begumpet Airport, Hyderabad. Citizens/commuters are...https://t.co/11VXja6qtp pic.twitter.com/rWACYiE8Yr — Hyderabad City Police (@hydcitypolice) November 11, 2022 -
Viral Video: రాంగ్ రూట్లో వెళ్తున్నారా.. ఎంత ప్రమాదమో చూడండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పేరు తలుచుకుంటేనే గుర్తుకొచ్చేది ఒకటి బిర్యాని అయితే రెండు ట్రాఫిక్.. పని మీద బయటకొచ్చి రోడ్లపైకి వస్తే ఎన్ని గంటలకు గమ్య స్థానానికి చేరుతారో ఎవరూ ఊహించలేరు. ఆఫీస్‌కు లేట్ అయితే బాస్ తిడతారనే భయంతో అతివేగంతో రోడ్డు మీద ప్రయాణిస్తుంటారు. మార్గ మధ్యలో రోడ్డు దాటాల్సి వస్తే.. యూ టర్న్ వరకూ వెళ్లాలి. అలా వెళ్తే కొంత సమయం వృథా అవుతుందనే తొందరలో చాలా మంది తప్పని తెలిసినా రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా, ప్రకటనలు ఇచ్చినా కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఇతరుల ప్రాణాలకూ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియో చూస్తే విషయం అర్థమవుతుంది. చదవండి: రాజేంద్రనగర్‌లో దారుణం.. యువతిని కారుతో ఢీకొట్టి.. వీడియోలో.. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి బైక్‌పై రాంగ్ రూట్లో వస్తున్నాడు. హెల్మెట్ కూడా ధరించలేదు. అంతేగాక తప్పుడు మార్గంలో వస్తున్నాననే భయం లేకుండా బైక్ నడుపుతూ వాహనదారులకు ఎదురెళ్లాడు. ఇంతలో మలుపు నుంచి వస్తున్న కారు అతన్ని బలంగా డీకొట్టింది. దీంతో బైక్ మీద ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పిట్టలాగ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ట్రాఫిక్ రూల్ పాటించకపోవడంతో ఎంత పని జరుగుతుందో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియో చూస్తే అర్థం అవుతుంది. సెంటిమీటర్ ప్రయాణం అయినా రాంగ్ రూట్లో నడపవద్దని పోలీసులు సూచించారు. సెంటీమీటర్ ప్రయాణం అయిన రాంగ్ రూట్లో వెళ్ళకండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/SsFkp84XXc — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 7, 2022 -
హైదరాబాద్‌లో 45 రోజులు ట్రాఫిక్ మళ్లింపులు..
సాక్షి,సనత్‌నగర్: జీహెచ్ఎంసీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)–2 కింద బేగంపేట కరాచీ బేకరీ సమీపంలోని పికెట్ నాలాపై జరిగే బ్రిడ్జి పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో 45 రోజుల పాటు ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎస్ఎన్డీపీ ఈ వినతి మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఎస్పీ రోడ్డు, మినిస్టర్ రోడ్డు, సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ఆ మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని, జూన్ 4 వరకు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు విడుదల చేసిన రూట్ మ్యాప్.. రాకపోకలు ఇలా.. సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్ నుంచి రసూల్‌పురా జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హనుమాన్ దేవాలయం వద్ద లేన్ (యాత్రి నివాస్ దగ్గర) వద్ద ఎడమ వైపు మళ్లీ..పీజీ రోడ్డు, ఫుడ్ వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్ కుడి వైపు, మినిస్టర్ రోడ్డు మీదుగా రసూల్ పురా ‘టి’ జంక్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ► కిమ్స్ ఆస్పత్రి నుంచి రసూల్‌పురా ‘టి’ జంక్షన్ వైపు వచ్చే వాహనాలు న్యూ రాంగోపాల్‌పేట పీఎస్ ఎదురుగా సింథికాలనీ, పీజీ రోడ్డు వైపు రైట్ టర్న్ తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదు. ►బేగంపేట ఫ్లైఓవర్ నుంచి వచ్చే కిమ్స్ హాస్పిటల్ వైపు వెళ్లే వాహనదారులు రసూల్‌పురా ‘టి’ జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతి లేదు. ఈ మార్గంలో కేవలం సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్ వైపు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. ►హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్ వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్, రసూల్‌పురా ‘టి’ జంక్షన్ మధ్య ‘వన్ వే’గా గుర్తించారు. ►సికింద్రాబాద్ నుంచి సోమాజీగూడ వైపు గూడ్స్ వాహనాలతో పాటు ప్రైవేటు, స్కూల్స్, కాలేజీ బస్సులు వంటి రవాణా వాహనాలను అనుమతించరు. అవి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: లెక్క తప్పైతే మంత్రి పదవి రాజీనామా చేస్తా: కేటీఆర్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లే మార్గాలు ఇవీ.. పంజగుట్ట వైపు నుంచి వచ్చే ట్రాఫిక్.. ►గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, సీటీఓ ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని, హనుమాన్ టెంపుల్ లేన్, ఫుడ్‌వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్ ఎడమ మలుపు నుంచి కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లాలి. ►పంజగుట్ట ఎక్స్‌రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైవర్, నెక్లెస్ రోటరీ, పీవీఎన్ఆర్ మార్గ్, నల్లగుట్ట, ఆర్యూబీ, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్.. ►సీటీఓ జంక్షన్, ప్యారడైజ్, రాణిగంజ్ జంక్షన్ కుడి వైపు తిరిగి, మినిస్టర్ రోడ్డు మీదుగా కిమ్స్ హాస్పిటల్ చేరుకోవాల్సి ఉంటుంది. ►కోఠి, ఎంజే మార్కెట్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్, రాణిగంజ్ జంక్షన్ ఎడమ మలుపు, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ లేదా బుద్ధభవన్, నల్లగుట్ట, ఆర్యూబీ, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ చేరుకోవాల్సి ఉంటుంది. -
రోడ్లన్నీ బిజీ.. కాస్త ఆలస్యంగా వెళ్లండి!
సాక్షి, హైదరాబాద్ : మంగళ వారం.. సాయంత్రం 4.45 గంటలవుతోంది.. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్‌లో ఎడతెగని వర్షం పడుతోంది.. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై ఉన్న వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. కావున ఈ సమయంలో ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లాలనుకునే ఉద్యోగులు కాస్త ఆలస్యంగా బయటకు వస్తే మంచిది... గచ్చిబౌలిలోని విప్రో కంపెనీలో పనిచేసే అరుణ్ సెల్‌ఫోన్‌కు వచ్చిన సంక్షిప్త సమాచారం అది. ఇది ఎవరు పంపించారా.. అని చూస్తే సైబరాబాద్ కాప్ పేరుతో వచ్చింది. థ్యాంక్స్ విలువైన సమయాన్ని ఆదా చేయడంతోపాటు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోకుండా సహాయపడ్డారు. థ్యాంక్స్ టు సైబరాబాద్ కాప్స్ అనుకున్నాడు... ఇది ఒక్క అరుణ్‌కే కాదు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సెల్‌కు వెళ్లిన సారాంశమదీ. ఐటీ ఉద్యోగులతోపాటు ఈ ఐటీ కారిడార్‌లో జర్నీ చేసే ప్రతి ఒక్కరికీ ఈ సమాచారం చేరవేయడంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సఫలీకృతులయ్యారు. ఇలా గతేడాది మొదలైన ఈ అలర్ట్స్ ఇటీవల పుంజుకున్నాయి. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మార్గదర్శనంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీసు బృందాలు సోషల్ మీడియా వేదికగా సిటీవాసులను అప్రమత్తం చేస్తున్నాయి. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ తీవ్రతను పసిగట్టేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించారు. వీళ్లు గూగుల్ మ్యాప్స్‌లోని కలర్ కోడింగ్స్ ద్వారా ట్రాఫిక్ రద్దీని గుర్తించి సంబంధిత ట్రాఫిక్ పోలీసు సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితిని వివరిస్తూ ప్రజలకు ఎస్ఎంఎస్లతోపాటు వాట్సాప్ మెసేజ్, సోషల్ మీడియా ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. (వర్ష బీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్ దృశ్యాల కోసం... క్లిక్ చేయండి) -
నాంపల్లి వద్ద ట్రాఫిక్ మళ్లింపు
నాంపల్లి టీ జంక్షన్ వద్ద జరుగుతున్న మెట్రో రైలు పనుల కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ట్రాఫిక్ అడిషన్ కమిషనర్ సూచించారు. శుక్రవారం నుంచి ఏడు రోజుల పాటు మెట్రో పనులు జరగనున్నాయని చెప్పారు. పనుల కారణంగా ఏర్పాటు చేసిన మార్గం వెడల్పు తక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా వాహనదారులకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాహనచోదకులు ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. కమిషనర్ వివరించిన ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు ఇలా ఉన్నాయి. 1. ఎంజే మార్కెట్ వైపు నుంచి నాంపల్లి టీ జంక్షన్ కు వచ్చే వాహనాలను తాజ్ ఐలాండ్, ఏక్ మినార్ మసీదు క్రాస్ రోడ్స్, నాంపల్లి రైల్వేస్టేషన్, దుర్గా భవాని హోటల్ ల మీదుగా చాపెల్ రోడ్డుకు మళ్లిస్తారు. 2. జీపీఓ, అబిడ్స్, చాపెల్ రోడ్డుకు వెళ్లడానికి వచ్చే వాహనాలను తాజ్ ఐలాండ్, ఏక్ మినార్ మసీదు క్రాస్ రోడ్స్, నాంపల్లి రైల్వేస్టేషన్, దుర్గా భవాని హోటల్ ల మీదుగా చాపెల్ రోడ్డుకు మళ్లిస్తారు. 3. బజార్ ఘాట్ నుంచి వచ్చే వాహనాలను కూడా చాపెల్ రోడ్డుకు మళ్లిస్తారు. 4. జీపీఓ, అబిడ్స్ ల నుంచి వచ్చే వాహనాలను(ఆర్టీసీ బస్సులకు మినహాయింపు) హైదరాబాద్ కలెక్టరేట్ మీదుగా చిరాగ్ అలీ లైన్ కు మళ్లిస్తారు.