న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందస్తు క్షమాపణలు చెప్పారు. ఢిల్లీ వేదికగా వచ్చే నెలలో జరగబోయే జీ20 సదస్సును విజయవంతం చేయాలని రాజధాని ప్రజలను మోదీ కోరారు. అయితే ఆ సమయంలో పలువురు ప్రపంచ నేతలు ఢిల్లీ రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు. ఈ కారణంగా రాజధాని ప్రజలకు కొంత ఇబ్బందికి గురి కావచ్చని , అందుకే ముందే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.
ఈ మేరకు బెంగుళూరు పర్యటన ముగించుకొని ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. ఎయిర్‌పోర్టు వెలుపల మాట్లాడుతూ.. G20 సమ్మిట్ కోసం జరుగుతున్న ఏర్పాట్ల కారణంగా ఢిల్లీ ప్రజలు ఎదుర్కొనే అసౌకర్యానికి ముందస్తుగా ప్రజలను క్షమించాలని కోరారు. దేశం మొత్తం జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇస్తోందని, కానీ అతిథులు ఢిల్లీకి వస్తున్నారన్నారు. ఈ సదస్సును విజయవంతం చేయడంలో ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక బాధ్యత ఉందన్నారు. దేశ ప్రతిష్టపై ఏమాత్రం ప్రభావం పడకుండా చూసుకోవాలని కోరారు.
చదవండి: జాబిల్లిపై రోవర్ చక్కర్లు.. వీడియో చూశారా?
‘సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 15 వరకు చాలా అసౌకర్యం ఉండనుంది. అతిథుల విచ్చేస్తున్న క్రమంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేసి మిమ్మల్ని వేరే దారిలో మళ్లిస్తారు. ఈ మార్పులు అవసరమం. ట్రాఫిక్ నిబంధనల వల్ల ఢిల్లీ వాసులు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. అందుకు ముందుగానే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.
కాగా సెప్టెంబరు 9-10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 దేశాధినేతల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్‌తో ఆహ్వానిత అతిథి దేశాలకు చెందిన 30 మందికి పైగా దేశాధినేతలు, ఉన్నతాధికారులు, 14 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment