Hyderabad Traffic Diversions: Traffic Advisory For President Murmu Visit On June 16th And 17th - Sakshi
Sakshi News home page

Hyderabad Traffic Diversions: నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు, బేగంపేట్‌, రాజ్‌భవన్‌ రూట్లలో..

Published Fri, Jun 16 2023 9:39 AM | Last Updated on Fri, Jun 16 2023 10:33 AM

Hyderabad: Traffic Advisory For President Murmu Visit on June 16 17 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నగరానికి రానున్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తున్నట్లు సిటీ పోలీసు కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు, ట్రాఫిక్‌ మళ్లింపులు చేస్తున్నట్లు అడిషనల్‌ సీపీ (నేరాలు, శాంతిభద్రతలు) విక్రమ్‌ సింగ్‌ మాన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు.. 17న ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయన్నారు.

సీటీఓ జంక్షన్‌, పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, జంక్షన్‌, హెచ్‌పీఎస్‌ స్కూల్‌ ఔట్‌గేట్‌, బేగంపేట ఫ్లైఓవర్‌, గ్రీన్‌ల్యాండ్స్‌ జంక్షన్‌, మొనప్ప జంక్షన్‌, యశోద హాస్పిటల్‌ రోడ్‌, ఎంఎంటీఎస్‌, వివి స్టాట్యూ జంక్షన్‌, పంజాగుట్ట జంక్షన్‌, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు. సికింద్రాబాద్‌ నుంచి వయా బేగంపేట మీదుగా అమీర్‌పేట, మెహిదీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ రూట్‌లో రాకుండా అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ పై నుంచి వెళ్లేందుకు మార్గాన్ని ఎంచుకోవాలన్నారు.

రాజ్‌భవన్‌ రోడ్‌, మొనప్ప జంక్షన్‌, వీవీ స్టాచ్యూ (ఖైరతాబాద్‌) ఈ మార్గాల్లో రెండు వైపులా రోడ్‌ క్లోజ్‌ ఉంటుంది. పంజాగుట్ట రాజ్‌భవన్‌ క్వార్టర్స్‌ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు. సీటీఓ జంక్షన్‌, మినిష్టర్‌ రోడ్డులో వచ్చే వాహనాలను రసూల్‌పురా జంక్షన్‌ వద్ద కొంత సమయం పాటు నిలిపివేస్తారు. పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్‌ మీదుగా బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా వచ్చే వాహనాలను ప్రకాష్‌నగర్‌ టీ జంక్షన్‌ వద్ద కొంత సమయం నిలుపుదల చేస్తారు. ఈ రూట్‌లలో ప్రయాణించే వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ రూట్‌లలో వెళ్లాలని అడిషనల్‌ సీపీ (నేరాలు, శాంతిభద్రతలు) విక్రమ్‌ సింగ్‌ మాన్‌ వివరించారు.
చదవండి: హైదరాబాద్‌లో నకిలీ మందుల కలకలం.. రూ.కోటి విలువైన మందులు స్వాధీనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement