సాక్షి, హైదరాబాద్: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ డే పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రామానికి రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. గ్రాడ్యుయేట్స్ నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని చెప్పారు. టర్కీలో జరిగిన భూకంపంలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పనిచేసిందని కొనియాడారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఏప్రిల్‌లో సుఖాయ్ జెట్‌లో ప్రయణించడం తనకు చాలా గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చారు. ఫైటర్ జెట్ ఫైలెట్లలో మహిళలు సైతం అధికంగా ఉండటం సంతోషదాయకంగా ఉందన్నారు.
చదవండి: అప్సర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నేడు కోర్టుకు సాయికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment