Traffic Advisory Issued Ahead Of PM Modi Hyderabad Visit On Sat Nov 12th, Check Details - Sakshi
Sakshi News home page

PM Modi Hyderabad Tour: మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇవే..!

Published Fri, Nov 11 2022 7:08 PM | Last Updated on Fri, Nov 11 2022 8:42 PM

Traffic Advisory in View of PM Modi Visit In Hyderabad On Sunday - Sakshi

సాక్షి, హైద‌రాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ నెల 12వ తేదీన నగరంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమల్లో ఉండనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బేగంపేట ఎయిర్‌పోర్టు ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. పంజాగుట్ట–గ్రీన్ ల్యాండ్స్–ప్ర‌కాశ్ న‌గ‌ర్ టీ జంక్ష‌న్, ర‌సూల్‌పురా టీ జంక్ష‌న్, సీటీవో మార్గాల్లో వాహ‌నాల మ‌ళ్లింపు ఉంటుంద‌ని, వాహనదారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల‌ని సూచించారు.

అలాగే సోమాజిగూడ, మోన‌ప్ప ఐలాండ్, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్ పరిధిలో మ‌ధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. కావున ఈ మార్గాల్లో ప్ర‌యాణించే వాహ‌న‌దారులు, ప్ర‌యాణికులు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
చదవండి: హైదరాబాద్‌ ఐఎస్‌బీలో విద్యార్థిపై దాడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement