నాంపల్లి వద్ద ట్రాఫిక్ మళ్లింపు
Published Fri, Dec 9 2016 6:46 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
నాంపల్లి టీ జంక్షన్ వద్ద జరుగుతున్న మెట్రో రైలు పనుల కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ట్రాఫిక్ అడిషన్ కమిషనర్ సూచించారు. శుక్రవారం నుంచి ఏడు రోజుల పాటు మెట్రో పనులు జరగనున్నాయని చెప్పారు. పనుల కారణంగా ఏర్పాటు చేసిన మార్గం వెడల్పు తక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఈ కారణంగా వాహనదారులకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాహనచోదకులు ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. కమిషనర్ వివరించిన ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు ఇలా ఉన్నాయి.
1. ఎంజే మార్కెట్ వైపు నుంచి నాంపల్లి టీ జంక్షన్ కు వచ్చే వాహనాలను తాజ్ ఐలాండ్, ఏక్ మినార్ మసీదు క్రాస్ రోడ్స్, నాంపల్లి రైల్వేస్టేషన్, దుర్గా భవాని హోటల్ ల మీదుగా చాపెల్ రోడ్డుకు మళ్లిస్తారు.
2. జీపీఓ, అబిడ్స్, చాపెల్ రోడ్డుకు వెళ్లడానికి వచ్చే వాహనాలను తాజ్ ఐలాండ్, ఏక్ మినార్ మసీదు క్రాస్ రోడ్స్, నాంపల్లి రైల్వేస్టేషన్, దుర్గా భవాని హోటల్ ల మీదుగా చాపెల్ రోడ్డుకు మళ్లిస్తారు.
3. బజార్ ఘాట్ నుంచి వచ్చే వాహనాలను కూడా చాపెల్ రోడ్డుకు మళ్లిస్తారు.
4. జీపీఓ, అబిడ్స్ ల నుంచి వచ్చే వాహనాలను(ఆర్టీసీ బస్సులకు మినహాయింపు) హైదరాబాద్ కలెక్టరేట్ మీదుగా చిరాగ్ అలీ లైన్ కు మళ్లిస్తారు.
Advertisement
Advertisement