హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు | traffic restrictions in hyderabad due to nampally, exhibition | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Published Fri, Jan 1 2016 8:08 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు - Sakshi

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపటి నుంచి ఫిబ్రవరి 15 వరకు అమలు
సాక్షి, సిటీబ్యూరో: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో శుక్రవారం నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభంకానుంది. దీనికి వచ్చే సందర్శకుల తాకిడి నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్దరాత్రి వరకు ఇవి అమలులో ఉంటాయి. ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగే వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని ఆయన కోరారు.

ఆంక్షలు, మళ్లింపులు ఇలా...

  • పుత్లీబౌలి నుంచి నాంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్ ఎంజే మార్కెట్, యూసుఫ్ అండ్ కంపెనీ, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్, నాంపల్లి ‘టి’ జంక్షన్ మీదుగా వెళ్లాలి.
  • ట్రాఫిక్ కంట్రోల్ రూమ్, ఫతేమైదాన్, పబ్లిక్ గార్డెన్స్ వైపు నుంచి అఫ్జల్‌గంజ్ వెళ్లే వాహనాలు ఏఆర్ పెట్రోల్‌పంప్, బీజేఆర్ విగ్రహం, గన్‌ఫౌండ్రీ ఎస్బీహెచ్, తాజ్ మహల్ హోటల్, జీపీఓ, యూసుఫ్ అండ్ కంపెనీ, ఎంజే మార్కెట్ మీదుగా ప్రయాణించాలి.
  • ఎంజే బ్రిడ్జి వైపు నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలు బేగంబజార్ ఛత్రి, అలాస్కా, దారుస్సలాం, ఏక్ మీనార్ మసీదు, నాంపల్లి స్టేషన్ మీదుగా వెళ్లాలి.
  • చాదర్‌ఘాట్ నుంచి సైఫాబాద్ వచ్చే వాహనాలు కోఠి డీఎంహెచ్‌ఎస్, సుల్తాన్ బజార్, కింగ్ కోఠి చౌరస్తా, నిజాం కాలేజీ వెనుక వైపు, బషీర్‌బాగ్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ మీదుగా వెళ్లాలి.
  • బహదూర్‌పుర నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలు పురానాపూల్, మంగళ్‌హాట్, ఆగాపుర, దారుస్సలాం, ఏక్ మీనార్ మసీదు మీదుగా ప్రయాణించాలి.
  • సైఫాబాద్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్లే వాహనాలు రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య, మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్, మెహిదీపట్నం, మొఘల్-క-నాలా, అత్తాపూర్ మీదుగా వెళ్లాలి.
  • మదీనా నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలు అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, యూసుఫ్ అండ్ కంపెనీ, జీపీఓ, నాంపల్లి ‘టి’ జంక్షన్, అబిడ్స్ లేదా చిరాగల్లీ లైన్, చర్మాస్, బీజేఆర్ స్టాట్యూ, ఏఆర్ పెట్రోల్ పంప్ మీదుగా ప్రయాణించాలి.
  • మెహిదీపట్నం వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలు ఆసిఫ్‌నగర్ రోడ్, భోయగూడ కమాన్, మంగళ్‌హాట్, పురానాపూల్, మూసబౌలిరోడ్, చౌక్, ఖిల్వత్ మీదుగా వెళ్లాలి.
  • ఎస్‌ఏ బజార్, జామ్‌బాగ్‌ల వైపు నుంచి ఎంజే మార్కెట్ మీదుగా నాంపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఎంజే మార్కెట్ నుంచి అబిడ్స్ మీదుగా మళ్లిస్తారు.
  • పోలీసు కంట్రోల్ రూమ్, ఫతేమైదాన్ వైపు నుంచి నాంపల్లి, ఎంజే మార్కెట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు పంపిస్తారు.
  • బేగంబజార్ ఛత్రి వైపు నుంచి మాలకుంట వైపు వెళ్లే భారీ సరుకు రవాణా వాహనాలను అలాస్కా జంక్షన్ నుంచి దారుస్సలాం మీదుగా పంపిస్తారు.
  • దారుస్సలాం నుంచి వచ్చే భారీ వాహనాలు, డీసీఎంలు అలాస్కా వద్ద కుడివైపు తిరిగి ఫీల్‌ఖానా, బేగంబజార్ ఠాణా మీదుగా ఎంజే మార్కెట్, అబిడ్స్ చేరుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement