Exhibition Grounds
-
ఘనంగా దత్తన్న ‘అలయ్ బలయ్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ‘దత్తన్న అలయ్ బలయ్’(దసరా ఆత్మీయ సమ్మేళనం) ఉత్సవం ఘనంగా జరిగింది. బుధవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఫౌండేషన్ ప్రస్తుత చైర్మన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ కళారూపాల ప్రదర్శన, తెలంగాణ ప్రత్యేక వంటకాల రుచులు, ఇలా విభిన్న అంశాల సమాహారంగా ఈ కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది. అలయ్‌బలయ్ ఫౌండేషన్ బాధ్యులు విజయలక్ష్మి, డా.జిగ్నేశ్‌రెడ్డి దంపతులు, దత్తాత్రేయ, ఆయన వియ్యంకుడు బి.జనార్దనరెడ్డి, గవర్నర్లు, కేంద్రమంత్రులతో కలిసి పూజలు నిర్వహించారు. మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు కేంద్ర సహాయ మంత్రులు, సినీరచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, కాంగ్రెస్ నుంచి కె.జానారెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీ, వైఎస్సార్సీపీ నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీజేఎస్ నుంచి కోదండరాం, బీజేపీ నుంచి డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, డా.బూరనర్సయ్య గౌడ్ ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. ‘అలయ్ బలయ్ లేకుండా దసరా పూర్తికాదు’ అలయ్‌బలయ్ లేకుండా దసరా పండుగ పూర్తికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణం, కళలు ఉట్టిపడేలా, తెలంగాణ వంటకాల రుచులు చూపిస్తూ బండారు దత్తాత్రేయ నేతృత్వంలో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన కొనియాడారు. అలయ్ బలయ్ అనే పదానికి దత్తాత్రేయ మరోపేరుగా మారారని మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఈ కార్యక్రమం అత్యంత శక్తివంతమైనదని జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేలా, పశ్చిమ సంస్కృతి ప్రభావంలో ఉన్న కొత్తతరానికి మన సంస్కృతి తెలియజేసేలా దీనిని 17 ఏళ్లుగా నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బండారు దత్తాత్రేయ ఆశయాలు, ఆదర్శాల పరంపరను ఆయన కుమార్తె విజయలక్ష్మి కొనసాగించాలని ఆకాంక్షించారు. కులాలు, మతాలకు అతీతంగా ఐక్యతకు సంకేతంగా ఈ ఉత్సవాలు జరగడం సంతోషదాయకమని కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి చెప్పారు. అలయ్ బలయ్ సంస్కృతిపై పరిశోధన జరిపించే విషయంపై రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు విజయలక్ష్మి లేఖలు రాయాలని సీహెచ్ విద్యాసాగరరావు సూచించారు. కార్యక్రమానికి హాజరైన గవర్నర్లు, కేంద్రమంత్రులు మణిపూర్‌లో సుహృద్భావ వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత వీహెచ్ అభిప్రాయపడ్డారు. అనేక సిద్ధాంత రాద్ధాంతాలున్నా ఓ మేలుకలయికగా దీనిని నిర్వహించడం గొప్పవిషయమని డా.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణది చాలా గొప్ప సంస్కృతి అని, పూలను గౌరమ్మగా చేసి పూజించే సంస్కృతి అని బండారు విజయలక్ష్మి చెప్పారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని, వారసత్వాన్ని చాటేలా అలయ్‌బలయ్‌ను బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టగా, ఇప్పుడు దానిని తాము కొనసాగిస్తున్నామని వెల్లడించారు. -
బీఎస్పీకి అధికారం ఖాయం
సాక్షి, హైదరాబాద్, గన్‌పౌండ్రీ: రానున్న ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా, తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కొండ చిలువలకు, చలిచీమలకు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సోమవారం కాన్షీరాం 17వ వర్ధంతి సందర్భంగా ఎన్నికల నగారా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాబలం బీఎస్పీకి ఉందనీ, మరో రెండు నెలలు పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లూ కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. బహుజనులు పాలకులు కావాలని కలలుగన్న కాన్షీరాం పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతుంటే ఈ వర్గాల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రోద్బలం, ఒత్తిడితోనే వట్టే జానయ్య యాదవ్‌పై నిరాధారంగా పోలీసులు కేసులు పెట్టారని విమర్శించారు. తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగురవేయాలి బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ మాట్లాడుతూ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగురవేసి, ఏనుగుపై ప్రగతి భవన్‌కు వెళ్ళాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌లు రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. మెజారిటీ ప్రజలకు అధికారం దక్కాలనేదే బీఎస్పీ ధ్యేయమని పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డనేటర్ మంద ప్రభాకర్ అన్నారు. సభలో పార్టీ ఉపాధ్యక్షులు దాగిళ్ళ దయానంద్, చాట్ల చిరంజీవి, రుద్రవరం సునీల్ పాల్గొన్నారు. -
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రేపు ఉదయం 8 వరకు కొనసాగనుంది. చేప ప్రసాదం కోసం రెండు లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఆర్అండ్బీ, వాటర్ బోర్డు, పోలీస్, మత్స్య, విద్యుత్ తదితర శాఖల ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడేళ్ల విరామానంతరం ప్రారంభం కానున్న చేప ప్రసాదానికి ఒక రోజు ముందుగానే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది గురువారమే తరలిరావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిక్కిరిసింది. వీరికి పలు స్వచ్ఛంద సంస్థలు భోజన వసతులు కల్పించాయి. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇందుకోసం 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. బత్తిని కుటుంబాలకు చెందిన దాదాపు 250 మందితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల వారు కౌంటర్ల ద్వారా చేప ప్రసాదాన్ని అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ 6 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం ఏర్పాటు.. ప్రజల సౌకర్యార్థం పోలీసులు ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వేలాది మంది జనం రావడంతో వారికి ఇబ్బంది కలగకుండా కంట్రోల్ రూంలు పోలీస్ శాఖ అంత సమాచారాన్ని ఇవ్వనున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విన్ మార్గం ఆధ్వర్యంలో చేప ప్రసాదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. చదవండి: మృగశిర ఎఫెక్ట్.. కొర్రమీను@ 650 ట్రాఫిక్ మళ్లింపు.. పాత బస్తీ నుంచి ఎంజే మార్కెట్ మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వచ్చే వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా శుక్రవారం దారిమళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ కోటేశ్వర్రావు, ఇన్స్పెక్టర్ గురునాథ్‌లు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ దారిమళ్లింపుపై గురువారం పర్యవేక్షణ జరిపి పరిస్థితులను సమీక్షించారు. ఆర్టీసీ పలు ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల చేయూత నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు చేయూత అందించనున్నాయి. చేప ప్రసాదానికి వచ్చే ప్రజలకు అల్పాహారాలు, భోజనాలు, తాగునీరు, మజ్జిగను పంపిణీ చేస్తున్నాయి. ఆరోగ్యశాఖ అధికారులు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా 4 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. -
చేప ప్రసాదం పంపిణీ నేడు
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉదయం 9 గంటలకు ప్రారంభం హైదరాబాద్: నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాద పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయం 9 వరకు ఈ పంపిణీ కొనసాగుతుంది. ప్రభుత్వ శాఖలైన ఆర్ అండ్ బీ, మెట్రో వాటర్ బోర్డ్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖ తదితర విభాగాలు ఏర్పాట్లు చేశాయి. మత్స్యశాఖ 2 లక్షల చేపపిల్లలను అందుబాటులో ఉంచింది. గతేడాదిలానే ఈ ఏడాదీ ఆస్తమా రోగులకు ఇబ్బంది కలగకుం డా పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ఆస్తమా రోగులు చేప ప్రసాదాన్ని స్వీకరించేం దుకు ఒకరోజు ముందుగానే తరలి వచ్చారు. పెద్ద ఎత్తున ఆస్తమా రోగులు రావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. 32 కౌంటర్లు.. ఈ సంవత్సరం కూడా 32 కౌంటర్ల ద్వారా చేప ప్రసాద పంపిణీ చేయనున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్, అబిడ్స్ ఏసీపీ రాఘవేందర్‌రెడ్డిలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. పోలీసుల రిహార్సల్స్ పూర్తయ్యాయి. అందుబాటులో 5లక్షల వాటర్ బాటిళ్లు మంచినీటి సరఫరా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ ఆధ్వర్యంలో 5 లక్షల వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచారు. క్యూలో ఉండేవారికి కూడా మంచినీటిని సరఫరా చేయనున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు రోగులకు అల్పాహారాలను అందిస్తున్నాయి. వీటితో పాటు ఎగ్జిబిషన్ సొసైటీ కూడా అల్పాహారాలు అందించనున్నట్లు తెలిసింది. పార్కింగ్ ఏర్పాట్లివీ.. ► పబ్లిక్ గార్డెన్స్ వైపు నుంచి తేలికపాటి వాహనాల్లో వచ్చే వారు తమ వాహనాలను నాంపల్లి లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ (బాలికల) ప్రాంగణంలో పార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి కాలినడకన అజంతా గేట్ ద్వారా గ్రౌండ్స్‌కు చేరుకోవాలి. ఈ పార్కింగ్ ప్లేస్ నిండిపోతే వాహనాలను పబ్లిక్ గార్డెన్‌లోనే నిలుపుకోవాలి. ► బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు బాంబూ అడ్డా, మాలకుంట రోడ్ల వద్దే వాటిని దిగాలి. అక్కడి నుంచి కాలినడకన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు రావాల్సి ఉంటుంది. ఈ వాహనాలను గోషా మహల్ గ్రౌండ్స్‌లో పార్క్ చేసుకోవాలి. ► ద్విచక్ర వాహనాలపై వచ్చేవారు తమ వాహనాలను ఇందిరా భవన్, గృహకల్ప, మేడాస్ హైస్కూల్ వద్ద పార్క్ చేసుకోవాలి. ఇవి నిండితే పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ కల్పించారు. ► తాజ్ ఐలాండ్, గాంధీభవన్ వైపు నుంచి వచ్చే వీఐపీలు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో తమ వాహనాలను నిలుపుకోవాలి. ప్రసాదం తీసుకున్న తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ క్లబ్ గేట్ ద్వారా బయటకు వెళ్లాలి. ► ఎంజే మార్కెట్ వైపు నుంచి నాంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్‌ను జీపీవో మీదుగా మళ్లిస్తారు. ఎంజే బ్రిడ్జ్ నుంచి నాంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్‌ను అలాస్కా, దారుస్సలాం, ఏక్ మినార్ మీదుగా పంపిస్తారు. రూ. 15కు ఒక చేపపిల్ల ముందుగా లైన్లలో వెళ్లేవారు మధ్యలో రూ. 15 చెల్లించి చేపపిల్లను కొనుగోలు చేసి చేప ప్రసాద స్వీకరణకు వెళ్లాలి. ఈ ఏడాది కూడా లక్షల్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తామని నిర్వాహకులు బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు. -
ఘనంగా ప్రారంభమైన అలయ్ బలయ్
-
బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్ : మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ప్రతి ఏటా బత్తిన సోదరులు నిర్వహించే చేప ప్రసాదం పంపిణీని బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైంది. 32 కేంద్రాలు ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. తొలుత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. 1500 మందితో భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి ఉచిత భోజన, మంచి నీటి సదుపాయం కల్పించారు. గురువారం ఉదయం 8.30 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందని చేప ప్రసాదం పంపిణీ నిర్వాహకులు తెలిపారు. -
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
రేపటి నుంచి ఫిబ్రవరి 15 వరకు అమలు సాక్షి, సిటీబ్యూరో: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో శుక్రవారం నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభంకానుంది. దీనికి వచ్చే సందర్శకుల తాకిడి నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్దరాత్రి వరకు ఇవి అమలులో ఉంటాయి. ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగే వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని ఆయన కోరారు. ఆంక్షలు, మళ్లింపులు ఇలా... పుత్లీబౌలి నుంచి నాంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్ ఎంజే మార్కెట్, యూసుఫ్ అండ్ కంపెనీ, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్, నాంపల్లి ‘టి’ జంక్షన్ మీదుగా వెళ్లాలి. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్, ఫతేమైదాన్, పబ్లిక్ గార్డెన్స్ వైపు నుంచి అఫ్జల్‌గంజ్ వెళ్లే వాహనాలు ఏఆర్ పెట్రోల్‌పంప్, బీజేఆర్ విగ్రహం, గన్‌ఫౌండ్రీ ఎస్బీహెచ్, తాజ్ మహల్ హోటల్, జీపీఓ, యూసుఫ్ అండ్ కంపెనీ, ఎంజే మార్కెట్ మీదుగా ప్రయాణించాలి. ఎంజే బ్రిడ్జి వైపు నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలు బేగంబజార్ ఛత్రి, అలాస్కా, దారుస్సలాం, ఏక్ మీనార్ మసీదు, నాంపల్లి స్టేషన్ మీదుగా వెళ్లాలి. చాదర్‌ఘాట్ నుంచి సైఫాబాద్ వచ్చే వాహనాలు కోఠి డీఎంహెచ్ఎస్, సుల్తాన్ బజార్, కింగ్ కోఠి చౌరస్తా, నిజాం కాలేజీ వెనుక వైపు, బషీర్‌బాగ్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ మీదుగా వెళ్లాలి. బహదూర్‌పుర నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలు పురానాపూల్, మంగళ్‌హాట్, ఆగాపుర, దారుస్సలాం, ఏక్ మీనార్ మసీదు మీదుగా ప్రయాణించాలి. సైఫాబాద్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్లే వాహనాలు రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య, మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్, మెహిదీపట్నం, మొఘల్-క-నాలా, అత్తాపూర్ మీదుగా వెళ్లాలి. మదీనా నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలు అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, యూసుఫ్ అండ్ కంపెనీ, జీపీఓ, నాంపల్లి ‘టి’ జంక్షన్, అబిడ్స్ లేదా చిరాగల్లీ లైన్, చర్మాస్, బీజేఆర్ స్టాట్యూ, ఏఆర్ పెట్రోల్ పంప్ మీదుగా ప్రయాణించాలి. మెహిదీపట్నం వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలు ఆసిఫ్‌నగర్ రోడ్, భోయగూడ కమాన్, మంగళ్‌హాట్, పురానాపూల్, మూసబౌలిరోడ్, చౌక్, ఖిల్వత్ మీదుగా వెళ్లాలి. ఎస్ఏ బజార్, జామ్‌బాగ్‌ల వైపు నుంచి ఎంజే మార్కెట్ మీదుగా నాంపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఎంజే మార్కెట్ నుంచి అబిడ్స్ మీదుగా మళ్లిస్తారు. పోలీసు కంట్రోల్ రూమ్, ఫతేమైదాన్ వైపు నుంచి నాంపల్లి, ఎంజే మార్కెట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు పంపిస్తారు. బేగంబజార్ ఛత్రి వైపు నుంచి మాలకుంట వైపు వెళ్లే భారీ సరుకు రవాణా వాహనాలను అలాస్కా జంక్షన్ నుంచి దారుస్సలాం మీదుగా పంపిస్తారు. దారుస్సలాం నుంచి వచ్చే భారీ వాహనాలు, డీసీఎంలు అలాస్కా వద్ద కుడివైపు తిరిగి ఫీల్‌ఖానా, బేగంబజార్ ఠాణా మీదుగా ఎంజే మార్కెట్, అబిడ్స్ చేరుకోవాలి. -
నుమాయిష్ ఏర్పాట్లు చకచకా
ఈసారి 2500 స్టాల్స్ నిర్మాణం తొలిసారిగా ఇతర దేశాల ఉత్పత్తులు సైతం.. అబిడ్స్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)కు చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 46 రోజుల పాటు నగరవాసులను అలరించనున్న ఎగ్జిబిషన్‌ను ఈసారి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈమేరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్టాల్స్ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. దాదాపు 60-70 శాతం పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. మొదటిసారిగా ఇతర దేశాల ఉత్పత్తులు ఈ సంవత్సరం తొలిసారిగా స్వదేశీతోపాటు ఇండోనేషియా, ఈజిప్ట్, మలేషియా దేశాలు సైతం తమ ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ మూడు దేశాల వినతులు పరిశీలనలో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. అందరి ఆమోదంతో ఈ స్టాల్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెప్పారు. 2500 స్టాల్స్ ఏర్పాటు ఎగ్జిబిషన్లో ఈ సారి కూడా దాదాపు 2500 స్టాల్స్ ఏర్పాటుకు అనుమతిస్తున్నాం. వివిధ స్టాళ్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగుతోంది, ఈ నెల చివరి వరకు పనులు పూర్తవుతాయి. చుక్‌చుక్ రైలుతో పాటు వినోదాత్మకమైన అమ్యూజ్మెంట్ విభాగాలను కూడా ప్రారంభిస్తాం. సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా స్టాళ్ల నిర్మాణం కొనసాగుతుంది. మూడు ప్రధాన గేట్ల ద్వారా ప్రతి సందర్శకున్ని తనిఖీ చేసిన తరువాతనే లోపలికి అనుమతిస్తాం. - అనిల్ స్వరూప్ మిశ్రా, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు సందర్శకులకు అన్ని వసతులు ఎగ్జిబిషన్ సందర్శకుల సౌకర్యార్థం సొసైటీ ఆధ్వర్యంలో మంచినీరు, ఇతర వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఎగ్జిబిషన్ నలుమూలలా 32 హై క్వాలిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలోనే మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు అమరుస్తున్నాం. ప్రతి సన్నివేశాన్ని సీసీ కెమెరాలో బంధిస్తాం. అంతేకాకుండా పోలీసులకు తోడుగా సొసైటీ ఆధ్వర్యంలో కూడా సెక్యూరిటీ విభాగం ఉంటుంది. - వనం సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి -
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
విజయవాడ కల్చరల్ : స్వరాజ్యమైదానంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన కళావేదికపై సోమవారం నిర్వహించిన కూచిపూడి నృత్యాంశాలు ఆకట్టుకున్నాయి. బాలానందం నిర్వాహకురాలు పద్మశ్రీ హేమంత్ బృందం నృత్యాంశాలను ప్రదర్శించింది. గణపతి ప్రార్థనతో ప్రారంభమై పుష్పాంజలి, అన్నమాచార్య కీర్తన, లేఖ్యాభరణి కథక్ నృత్యం, వినాయక కౌత్వం, చందన చర్చిత శరణం భవ తదితర నృత్యాంశాలను ప్రదర్శించారు. మాలిక, లేఖ్యాభరణి, ప్రియాంక, లహరి, కార్తికేయ తదితర చిన్నారులు నృత్యాన్ని అభినయించారు. అనంతరం వివిధ రంగాల్లోని ప్రముఖులు న్యాయవాది వరప్రసాద్, సినీ దర్శకుడు ఎస్.గోపాలకృష్ణ, రచయిత అతిథి వెంకటేశ్వరరావు, కళాపోషకులు గంగిరెడ్డి బాబూరావు, విద్యాదాత గోవాడ రాబర్ట్, ఆకాశవాణి ఉద్యోగి బి.జయప్రకాష్, నటుడు బండి రామచంద్రరావు, నాట్యాచార్య సురేంద్ర, రచయిత కృష్ణమోహన్ , కళాకారుడు జి.బాబూరావు, నాటక రంగప్రముఖులు ఎస్డీ అమీర్ భాషా తదితరులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. 30న సంప్రదాయ వస్త్రధారణ పోటీలు ఈనెల 30వ తేదీన సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహిస్తునట్లు నిర్వాహకుడు నాని తెలిపారు. ఈ పోటీల్లో 16 నుంచి 25 సంత్సరాలలోపు మహిళలు పాల్గొనాలని, వివరాలకు 92464 72100 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
22 వరకు నుమాయిష్
వారం రోజులు గడువు పొడిగింపు అబిడ్స్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కొనసాగుతున్న 75వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయుష్)కు వెళ్లలేకపోయామని నిరాశ చెందుతున్న వారికి శుభవార్త. ఎగ్జిబిషన్ గడువును మరో వారం రోజులు పొడిగిస్తూ సంబంధిత సొసైటీ నిర్ణయం తీసుకుంది. జనవరి 1న ప్రారంభమైన ఈ ప్రదర్శన ఈ నెల 15 (ఆదివారం)తో ముగించాల్సి ఉంది. ఇటీవల స్వైన్‌ఫ్లూ వ్యాధి కారణంగా సందర్శకుల సంఖ్య తగ్గడంతో స్టాల్స్ నిర్వాహకులు ఎగ్జిబిషన్‌ను పొడిగించాలని సొసైటీకి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. దీంతో శుక్రవారం రాత్రి సమావేశమైన ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ గౌరవ కార్యద ర్శి పి.నరోత్తం రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్, కోశాధికారి అనిల్‌స్వరూప్ మిశ్రా వెల్లడించారు. ఈనెల 22వ తేదీన ఎగ్జిబిషన్ ముగియనుందని వారు ప్రకటించారు. -
బారులు తీరిన జనం
మొదలైన చేప ప్రసాద వితరణ నేటి సాయంత్రం వరకూ కొనసాగింపు అబిడ్స్, కలెక్టరేట్, న్యూస్‌లైన్ : చేపప్రసాదం కోసం వచ్చిన ఆస్తమా రోగులతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిటకిటలాడుతోంది. ఆదివారం మొదలైన చేపప్రసాద వితరణ సోమవారం సాయంత్రం వరకూ కొనసాగనుంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనా ఆదివారం ఉదయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఐజీ మల్లారెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డిలు బందోబస్తును పర్యవేక్షించారు. మూడేళ్ల క్రితం రాజేంద్రనగర్ చేప ప్రసాదం పంపిణీ చేయగా విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చేప ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని రెవెన్యూ, ఆర్అండ్బీ, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, పోలీస్ శాఖలను ఆదేశించింది. దీంతో ఉన్నత స్థాయి అధికారులు స్వయంగా చేప ప్రసాదం పంపిణీ ప్రశాంతంగా, జోరుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. చేప ప్రసాద వితరణకు హాజరైన ప్రజలకు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు మంచినీరు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. తప్పిపోయిన చిన్నారుల కోసం ప్రత్యేకంగా పబ్లిక్ అడ్రస్ సిస్టంను సమాచార శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి అశ్విని మార్గం, మాజీ కార్యదర్శి ఆర్. సుఖేష్ రెడ్డి, ఇతర నాయకులు అనిల్ స్వరూప్ మిశ్రా, హైదరాబాద్ ఆర్డీవో నిఖిలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. సోమవారం కూడా చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిని సోదరులు తెలిపారు. ‘డిస్కవరీ’ ద్వారా తెలుసుకున్నా ఆస్తమా వ్యాధి నయం చేయడానికి బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు డిస్కవరీ చానెల్ ద్వారా తెలుసుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చి చేప ప్రసాదం తీసుకోవడం ఇదే మొదటిసారి. గత రెండు సంవత్సరాలుగా ఆస్తమా వ్యాధితో బాధపడుతూ అల్లోపతి మందులను వాడుతున్నాను. ఒకవేళ ఈ చేప ప్రసాదంతో నా వ్యాధి తగ్గితే మరింత మందికి ప్రచారం చేస్తా. - రీణ, డెహ్రాడూన్ మొదటిసారి వచ్చా ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం గురించి స్నేహితుల ద్వారా తెలుసుకుని మొదటిసారి ప్రసాద వితరణకు వచ్చాను. ఆస్తమా వ్యాధి నయమైతే మరింత మందికి వివరిస్తా. నిర్వాహకులు ఇంతమందికి పంపిణీ చేయడం చూసి ఆశ్చర్యపోయా. ఏర్పాట్లు బావున్నాయి. - మార్క్, ఇంగ్లండ్ రెండేళ్లుగా వస్తున్నా గత ఐదు సంవత్సరాలుగా ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నాను. గత సంవత్సరం చేప ప్రసాదం తీసుకున్న తరువాత కొంత ఉపశమనం కలగడంతో ఈ ఏడాది సైతం చేప ప్రసాదాన్ని స్వీకరించాను. ఈ ప్రసాదం స్వీకరించడం వల్ల వ్యాధి బారి నుంచి కొంత ఉపశమనం కలిగింది. - శోభకరగే, మహారాష్ట్ర -
‘చేప ప్రసాదం’ ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్
అబిడ్స్, న్యూస్‌లైన్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈనెల 8,9 తేదీల్లో బత్తిని సోదరులు నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనా, ఇతర అధికారులు పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం డీఆర్వో అశోక్‌కుమార్, ఆర్డీవో నవ్య, డీసీపీ కమలాసన్‌రెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు అశ్వినీమార్గం, సుఖేష్‌రెడ్డిలతో తొలుత సమావేశమయ్యారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నలుమూలల సందర్శించారు. గత నెలలో ఎగ్జిబిషన్‌లోని కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున సర్కస్ మే 16వ తేదీన ప్రారంభమైందని జూన్ 16న ముగింపు ఉండడంతో సర్కస్‌కు అవకాశం ఇవ్వాలని సొసైటీ ప్రతినిధులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 4న చీఫ్ సెక్రటరీతో చేప ప్రసాదంపై సమావేశమైన తర్వాత తుది వివరాలు ప్రకటిస్తామన్నారు. ఆయన వెంట ఏసీపీ జైపాల్, ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తదితరులున్నారు. -
సాక్షి ‘మైత్రి’ భేష్
సాక్షి, సిటీబ్యూరో: ‘సాక్షి’ మహిళల కోసం వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వారికి వినోదం, విజ్ఞానంతో పాటు నిపుణలతో అవసరమైన సలహాలు సూచనలు అందిస్తోంది. ఈ ప్రస్తానాన్ని కొనసాగించడంతోపాటు చైతన్యవంతమైన కార్యక్రమాల పరంపరను యువత కోసం విస్తరించింది. ఇందులో భాగంగానే యువత భవిష్యత్తు కోసం సాక్షి ‘యువ మైత్రి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని సెమినార్ హాల్లో జరిగిన యువ మైత్రి కార్యక్రమానికి జంటనగరాల విద్యార్థులతో విశేష స్పందన లభించింది. కెరీర్ అంశాలపై యువత సందేహాలను ఆంధ్ర మహిళా సభ ప్రిన్సిపల్ డాక్టర్ దుర్గ నివృత్తి చేశారు. భవిష్యత్తులో యువత ప్రాధాన్యత, ఉద్యోగ అవ కాశాలు వంటి తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు వివరించారు. రెండో సెషన్లో జరిగిన మహిళ మైత్రి కార్యక్రమంలో మహిళలకు న్యాయసలహాలు, ఆరోగ్య సమస్యలపై నిపుణలు అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఉత్తేజాన్ని నింపింది సాక్షి యువ మైత్రి పేరిట నిర్వహించిన కెరియర్ సంబంధించిన మార్గదర్శకత్వం కౌన్సెలింగ్ ఉత్తేజాన్ని నింపింది. నేటియువతకు ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న యువతకు ఈ కార్యక్రమం ఒక వేదిక లాంటిది. -సాయి వీణశ్రీ (విద్యార్థిని-కరీంనగర్) యువత చేతిలోనే దేశం రాబోయే రోజుల్లో భారతదేశ అభివృద్ధి యువత చేతిలోనే ఉంటుంది. నెగిటివ్ దృక్పథం, ఆలోచనా విధానంలో లోపాలతో బాధపడుతున్న యువతకు ఈ కౌన్సెలింగ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. యువత కోసం‘సాక్షి’ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటున్నాను. -కె.శ్రీనివాస్(భువనగిరి) కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం నేటియువతకు ఏ రంగంలో రాణించాలన్నా వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. వీటిని సాక్షి ఉచితంగా అందించడం అభినందనీయం. యువ మైత్రి పేరిట కెరియర్‌కు సంబంధించిన అంశాలపై కౌన్సెలింగ్‌తోపాటు జాబ్‌ఫెయిర్‌కు సంబంధించిన సదస్సులను కూడా నిర్వహిస్తే బాగుంటుంది. - సయీఫుద్దీన్ మాలిక్ (వనస్థలిపురం) -
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన: విఠల్
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.విఠల్ డిమాండ్ చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి తెలంగాణ ఉద్యోగి రోజూ 2 గంటలు అదనంగా పనిచేస్తూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సహాయనిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు కాలేరు సురేష్, మామిడి నారయ్య, మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ తిప్పర్తి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన టైగర్ వుడ్స్
న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్‌వన్ గోల్ఫర్ టైగర్ వుడ్స్ తన అద్భుత ఆటతీరును భారత అభిమానులకు ప్రత్యక్షంగా చూపించాడు. హీరో మోటోకార్ప్ సీఈవో, ఎండీ పవన్ ముంజల్ ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చిన వుడ్స్ ఢిల్లీ గోల్ఫ్ కోర్స్‌లో 18 హోల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాడు. తన అతిథులతో కలిసి గోల్ఫ్ ఆడినందుకు వుడ్స్‌కు ముంజల్ రూ.15 కోట్లు చెల్లించినట్టు సమాచారం. పూర్తి ప్రైవేట్ కార్యక్రమమే అయినప్పటికీ వుడ్స్ ఆటతీరు చూసేందుకు దాదాపు 5 వేల మంది గోల్ఫ్ కోర్సుకు తరలివచ్చారు. తొలి తొమ్మిది హోల్స్‌ను ముంజల్‌తో కలిసి ఆడిన వుడ్స్ ఆ తర్వాత రాజీవ్ సింగ్, విక్రమ్‌జిత్ సేన్, మహిళా గోల్ఫర్ షర్మిలా నికోలెట్, జర్నలిస్టు ప్రణయ్ రాయ్, అవీక్ సర్కార్‌తో కలిసి ఆడాడు. ‘భారత్‌కు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా చిన్న గోల్ఫ్ కోర్స్. భారత్ గురించి నా స్నేహితుడు అర్జున్ అత్వల్ చాలా చెప్పాడు’ అని వుడ్స్ అన్నాడు. క్రికెటర్ మురళీ కార్తీక్, మాజీ క్రికెటర్ మదన్ లాల్ కూడా వుడ్స్ ఆటను చూసిన వారిలో ఉన్నారు. వుడ్స్‌ను కలిసిన మాస్టర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మంగళవారం టైగర్ వుడ్స్‌ను కలుసుకున్నాడు. అతడు బస చేసిన హోటల్‌కు సతీసమేతంగా వెళ్లిన సచిన్ అతడితో కొద్దిసేపు గడిపాడు. ఈ విషయాన్ని వుడ్స్ ట్విట్టర్లో తెలిపాడు. ‘కొద్దిసేపటి క్రితమే క్రికెట్ లెజెండ్ సచిన్, అతడి కుటుంబాన్ని కలిశాను. అతడు నిజంగా చాలా కూల్. నేను భారత్‌కు వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు’ అని వుడ్స్ ట్వీట్ చేశాడు. -
నుమాయిష్
-
‘పార్కింగ్ దోపిడీ’కి చెక్
సాక్షి, సిటీబ్యూరో: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నేపథ్యంలో ఎగ్జిబిషన్ గ్రౌం డ్స్ వద్ద జరుగుతున్న పార్కింగ్ దోపిడీపై పలు ఫిర్యాదులు రావడంతో ట్రాఫిక్ అధికారులు తీవ్రంగా పరిగణించారు. దీనికి చెక్ చెప్పేందుకు శాంతి భద్రతల విభాగం పోలీసులతో కలిసి ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులతో గురువారం భేటీ అయ్యారు. పలువురు అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో నిర్థారించిన పార్కింగ్ ఫీజులు ఇవి... తొలి నాలుగు గంటలకు ద్విచక్ర వాహనాలకు రూ. 20, కార్లకు రూ.50. ఆపై ప్రతి గంటకు టూ వీలర్‌కు రూ.5, ఫోర్ వీలర్స్‌కు రూ.10. పార్కింగ్ లాట్స్‌ను ట్రాఫిక్, శాంతి భద్రల విభాగం అధికారులు పర్యవేక్షిస్తారు. ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లు ట్రాఫిక్ హెల్ప్‌లైన్: 9010203626 ట్రాఫిక్ కంట్రోల్ రూమ్: 27852482 సెంట్రల్ జోన్ కంట్రోల్ రూమ్: 27852759 -
ఎల్బీ స్టేడియంలో కట్టుదిట్టమైన పోలీసులు
ఎల్బీ స్టేడియంలో సభ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఏర్పాట్ల వివరాలు.. స్టేడియంలోకి రాకపోకలు: 2 ఔట్గేట్లు, 4 ఇన్గేట్లు ఔట్ గేట్లు: ఆయకార్ భవన్, ఖాన్ లతీఫ్‌ఖాన్ ఎస్టేట్ వద్ద ఉన్న జీ,ఏ ఇన్గేట్లు: 8, 10, 15, 17 పార్కింగ్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (విజయవాడ వైపు వచ్చే వాహనాలు), ఎన్టీఆర్ స్టేడియం (కర్నూలు వైపు నుంచి వచ్చే వాహనాలు)..ఈ రెండూ నిండితే పబ్లిక్‌గార్డెన్స్ (మహబూబియా గేట్)లో సౌకర్యం కల్పిస్తారు బందోబస్తు: 3 వేల మంది పోలీసులు, రంగంలో రాష్ట్ర, కేంద్ర సాయుధ బలగాలు నగర వ్యాప్తంగా భద్రత: సిటీ పోలీసులు, 11 కంపెనీల పారా మిలటరీ, 45 ప్లటూన్ల ఏపీఎస్పీ, ఏఆర్ ట్రాఫిక్ సూచన: సాధారణ వాహనాలు స్టేడియం చుట్టుపక్కల రహదారుల్లోకి రావద్దు ప్రత్యేక దృష్టి: ఉస్మానియా విశ్వవిద్యాలయంపై.. కీలక షరతులివి... సభకొచ్చే వారిని గుర్తించేందుకు వాలంటీర్లు పోలీసుల అనుమతి లేని సభలు, సమావేశాలపై నిషేధాజ్ఞలు స్టేడియం లోపలకు వాటర్ బాటిళ్లు, బ్యాగులు, కవర్లు, మండే వస్తువులు, అగ్గిపెట్టెలు, కర్రలు నిషేధం ఉద్యోగులు స్టేడియం దాటి బయటకు వెళ్లకుండా చర్యలు స్టేడియంలో కేవలం రెండు బాక్సు తరహా స్పీకర్లను మాత్రమే వాడాలి.