
సాక్షి ‘మైత్రి’ భేష్
సాక్షి, సిటీబ్యూరో: ‘సాక్షి’ మహిళల కోసం వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వారికి వినోదం, విజ్ఞానంతో పాటు నిపుణలతో అవసరమైన సలహాలు సూచనలు అందిస్తోంది. ఈ ప్రస్తానాన్ని కొనసాగించడంతోపాటు చైతన్యవంతమైన కార్యక్రమాల పరంపరను యువత కోసం విస్తరించింది. ఇందులో భాగంగానే యువత భవిష్యత్తు కోసం సాక్షి ‘యువ మైత్రి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని సెమినార్ హాల్‌లో జరిగిన యువ మైత్రి కార్యక్రమానికి జంటనగరాల విద్యార్థులతో విశేష స్పందన లభించింది. కెరీర్ అంశాలపై యువత సందేహాలను ఆంధ్ర మహిళా సభ ప్రిన్సిపల్ డాక్టర్ దుర్గ నివృత్తి చేశారు. భవిష్యత్తులో యువత ప్రాధాన్యత, ఉద్యోగ అవ కాశాలు వంటి తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు వివరించారు. రెండో సెషన్‌లో జరిగిన మహిళ మైత్రి కార్యక్రమంలో మహిళలకు న్యాయసలహాలు, ఆరోగ్య సమస్యలపై నిపుణలు అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ఉత్తేజాన్ని నింపింది
సాక్షి యువ మైత్రి పేరిట నిర్వహించిన కెరియర్ సంబంధించిన మార్గదర్శకత్వం కౌన్సెలింగ్ ఉత్తేజాన్ని నింపింది. నేటియువతకు ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న యువతకు ఈ కార్యక్రమం ఒక వేదిక లాంటిది. -సాయి వీణశ్రీ (విద్యార్థిని-కరీంనగర్)
యువత చేతిలోనే దేశం
రాబోయే రోజుల్లో భారతదేశ అభివృద్ధి యువత చేతిలోనే ఉంటుంది. నెగిటివ్ దృక్పథం, ఆలోచనా విధానంలో లోపాలతో బాధపడుతున్న యువతకు ఈ కౌన్సెలింగ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. యువత కోసం‘సాక్షి’ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటున్నాను.
-కె.శ్రీనివాస్(భువనగిరి)
కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం
నేటియువతకు ఏ రంగంలో రాణించాలన్నా వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. వీటిని సాక్షి ఉచితంగా అందించడం అభినందనీయం. యువ మైత్రి పేరిట కెరియర్‌కు సంబంధించిన అంశాలపై కౌన్సెలింగ్‌తోపాటు జాబ్‌ఫెయిర్‌కు సంబంధించిన సదస్సులను కూడా నిర్వహిస్తే బాగుంటుంది.
- సయీఫుద్దీన్ మాలిక్ (వనస్థలిపురం)