ఎల్‌బీ స్టేడియంలో సభ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఏర్పాట్ల వివరాలు..
ఎల్‌బీ స్టేడియంలో సభ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఏర్పాట్ల వివరాలు..
స్టేడియంలోకి రాకపోకలు: 2 ఔట్‌గేట్లు, 4 ఇన్‌గేట్లు
ఔట్ గేట్లు: ఆయకార్ భవన్, ఖాన్ లతీఫ్‌ఖాన్ ఎస్టేట్ వద్ద ఉన్న జీ,ఏ
ఇన్‌గేట్లు: 8, 10, 15, 17
పార్కింగ్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (విజయవాడ వైపు వచ్చే వాహనాలు), ఎన్టీఆర్ స్టేడియం (కర్నూలు వైపు నుంచి వచ్చే వాహనాలు)..ఈ రెండూ నిండితే పబ్లిక్‌గార్డెన్స్ (మహబూబియా గేట్)లో సౌకర్యం కల్పిస్తారు
బందోబస్తు: 3 వేల మంది పోలీసులు, రంగంలో రాష్ట్ర, కేంద్ర సాయుధ బలగాలు
నగర వ్యాప్తంగా భద్రత: సిటీ పోలీసులు, 11 కంపెనీల పారా మిలటరీ, 45 ప్లటూన్ల ఏపీఎస్పీ, ఏఆర్
ట్రాఫిక్ సూచన: సాధారణ వాహనాలు స్టేడియం చుట్టుపక్కల రహదారుల్లోకి రావద్దు
ప్రత్యేక దృష్టి: ఉస్మానియా విశ్వవిద్యాలయంపై..
కీలక షరతులివి...
సభకొచ్చే వారిని గుర్తించేందుకు వాలంటీర్లు
పోలీసుల అనుమతి లేని సభలు, సమావేశాలపై నిషేధాజ్ఞలు
స్టేడియం లోపలకు వాటర్ బాటిళ్లు, బ్యాగులు, కవర్లు, మండే వస్తువులు, అగ్గిపెట్టెలు, కర్రలు నిషేధం
ఉద్యోగులు స్టేడియం దాటి బయటకు వెళ్లకుండా చర్యలు
స్టేడియంలో కేవలం రెండు బాక్సు తరహా స్పీకర్లను మాత్రమే వాడాలి.