![‘పార్కింగ్ దోపిడీ’కి చెక్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71389305071_625x300.jpg.webp?itok=tXJBWzJp)
‘పార్కింగ్ దోపిడీ’కి చెక్
సాక్షి, సిటీబ్యూరో: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నేపథ్యంలో ఎగ్జిబిషన్ గ్రౌం డ్స్ వద్ద జరుగుతున్న పార్కింగ్ దోపిడీపై పలు ఫిర్యాదులు రావడంతో ట్రాఫిక్ అధికారులు తీవ్రంగా పరిగణించారు. దీనికి చెక్ చెప్పేందుకు శాంతి భద్రతల విభాగం పోలీసులతో కలిసి ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులతో గురువారం భేటీ అయ్యారు. పలువురు అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో నిర్థారించిన పార్కింగ్ ఫీజులు ఇవి...
తొలి నాలుగు గంటలకు ద్విచక్ర వాహనాలకు రూ. 20, కార్లకు రూ.50.
ఆపై ప్రతి గంటకు టూ వీలర్‌కు రూ.5,
ఫోర్ వీలర్స్‌కు రూ.10.
పార్కింగ్ లాట్స్‌ను ట్రాఫిక్, శాంతి భద్రల విభాగం అధికారులు పర్యవేక్షిస్తారు.
ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లు
ట్రాఫిక్ హెల్ప్‌లైన్: 9010203626
ట్రాఫిక్ కంట్రోల్ రూమ్: 27852482
సెంట్రల్ జోన్ కంట్రోల్ రూమ్: 27852759