ఎంజీబీఎస్ పార్కింగ్ నుంచి బైక్ రికవరీ
ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రకు దుండగుల పరారీ
ఫలితంగా కష్టసాధ్యమవుతున్న గాలింపు
అఫ్జల్‌గంజ్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్, సాక్షి: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పురోగతి చోటు చేసుకుంది. దోపిడీ కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్‌లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. నిందితులిద్దరి బీహార్ లేదంటే జార్ఖండ్ పారిపోయి ఉంటారని ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ బీదర్ పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
తొలుత తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్‌పేట వరకు వెళ్లిన దుండగులు.. అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆపై గజ్వేల్ నుంచి అదిలాబాదు వరకు లారీలో ప్రయాణించినట్లు గుర్తించారు.
అదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా బీదర్-హైదరాబాదు పోలీసుల ప్రత్యేక బృందాలు బీహార్‌తో పాటు జార్ఖండ్‌కు చేరుకున్నాయి.
‘కాల్పుల’ వాహనం దొరికింది
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకతో పాటు నగరంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన దుండగులు వినియోగించిన వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని మహాత్మా గాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) పార్కింగ్ నుంచి ఈ వాహనాన్ని మంగళవారం రికవరీ చేశారు. నిందితుల ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్న అధికారులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 750 సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌ను వడపోసిన సిటీ పోలీసులు మరిన్ని కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టారు.
నేరం జరిగిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న దుండగులు.. హైదరాబాద్‌లోనే షెల్డర్ తీసుకుని, బీదర్‌లో నేరం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బీదర్‌లోని శివాజీ జంక్షన్ వద్ద ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనాన్ని కొల్లగొట్టడానికి దుండగులు బైక్‌పై వెళ్లారు. ఈ వాహనానికి ‘ఏపీ’ రిజి్రస్టేషన్‌తో కూడిన నకిలీ నంబర్ ప్లేట్ ఉంది. దీన్ని హైదరాబాద్ లేదా శివారు ప్రాంతాల్లో చోరీ చేసి ఉంటారని భావిస్తున్న అధికారులు.. ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. బీదర్‌లో నేరం చేసిన తర్వాత రాయ్‌పూర్ వెళ్లడానికి అఫ్జల్‌గంజ్‌కు వచి్చన దుండగులు.. రోషన్ ట్రావెల్స్ వద్దకు ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చారు.
దీని ఆధారంగా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు మంగళవారం ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉన్న అనుమానాస్పద వాహనాలను పరిశీలించారు. గురువారం పార్క్ చేసిన వాటి వివరాలు ఆరా తీసి నిందితులు వాడింది గుర్తించారు. నిందితులు సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వద్ద ఎక్కిన ఆటోలో గజ్వేల్ వెళ్లాలని ప్రయత్నించి, తిరుమలగిరిలో దిగిపోయారు. అక్కడ నుంచి శుక్రవారం మధ్యాహా్ననికి ఆదిలాబాద్ చేరుకున్న దుండగులు సరిహద్దులు దాటించి మహారాష్ట్రలో ప్రవేశించినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఆద్యంతం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన నిందితుల ఆచూకీ కనిపెట్టడానికి పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా
శ్రమిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment