Punjab: Man Kills Daughter, Ties Body To Bike, Drags It Before Dumping - Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో దారుణం.. ఇంట్లో చెప్పకుండా వెళ్లిందన్న కోపంలో ఓ తండ్రి ఘాతుకం

Aug 11 2023 2:13 PM | Updated on Aug 11 2023 2:38 PM

Punjab: Man Kills Daughter Ties Body To Bike Drags It Before Dumping - Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌లో దారుణం వెలుగుచూసింది. 20ఏళ్ల కూతురిని తండ్రి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె పట్ల క్రూరంగా వ్యవహరించాడు. కూతురు మృతదేహాన్ని బైక్‌కు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. అనంతరం బాడీని రైల్వే ట్రాక్‌ సమీపంలో పడేశాడు. అమృత్‌సర్‌ జిల్లాలో గురువారం జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. నిందితుడిని నిహాంగ్‌ సిక్కుగా గుర్తించిన పోలీసులు శుక్రవారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

జండియాలా పట్టణం పరిధిలోని ముచ్చల్ గ్రామంంలో బావు  అనే వ్యక్తి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి 20 ఏళ్ల కూతురు ఉంది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో వాళ్లెవరికి చెప్పకుండా కూతురు బయటకు వెళ్లి మరునాడు గురువారం తిరిగి వచ్చింది. దీంతో తండ్రి బావు కూతురిపై ఆవేశంతో రెచ్చిపోయాడు. పదునైన ఆయుధంతో కొట్టి చంపాడు.

కుటుంబ సభ్యులను సైతం ఇంట్లోనే నిర్భంధించి.. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం కూతురు మృతదేహాన్ని బైక్‌కు తాడుతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. కూతురిపై ఉన్న అనుమానం కారణంగానే ఆమెను అంతమోదించినట్లు ప్రాధిమిక విచారణలో తేలింది.
చదవండి: అవమానించిన అత్తింటి బంధువులు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి భార్య ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement