కూతురిపై అనుమానం.. పరువు హత్య..! | Father Murder His Daughter In Krishna district | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 30 2018 5:18 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

Father Murder His Daughter In Krishna district - Sakshi

సాక్షి, కృష్ణా : కృష్ణా జిల్లాలో శనివారం పరువు హత్య జరిగింది. కన్న తండ్రే కూతుర్ని గొడ్డలి కర్రతో కొట్టి చంపేశాడు. ఈ ఘటన జిల్లాలోని చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో చోటుచేసుకుంది. కూతురిపై అనుమానంతో తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన కూతురు వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని ఆ తండ్రి అనుమానించాడు. ఆ యువతి ఇంటి ఆవరణలో ఫోన్‌ మాట్లాడుతున్న సమయంలో తండ్రి దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. 

ఆ యువతి(22)  బీఫార్మసీ చదువుతోందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement