mahatma gandhi bus station
-
‘అఫ్జల్‌గంజ్’ కేసులో పురోగతి
హైదరాబాద్, సాక్షి: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పురోగతి చోటు చేసుకుంది. దోపిడీ కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్‌లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. నిందితులిద్దరి బీహార్ లేదంటే జార్ఖండ్ పారిపోయి ఉంటారని ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ బీదర్ పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.తొలుత తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేట వరకు వెళ్లిన దుండగులు.. అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆపై గజ్వేల్ నుంచి అదిలాబాదు వరకు లారీలో ప్రయాణించినట్లు గుర్తించారు.అదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా బీదర్-హైదరాబాదు పోలీసుల ప్రత్యేక బృందాలు బీహార్‌తో పాటు జార్ఖండ్‌కు చేరుకున్నాయి. ‘కాల్పుల’ వాహనం దొరికిందిసాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకతో పాటు నగరంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన దుండగులు వినియోగించిన వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని మహాత్మా గాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) పార్కింగ్ నుంచి ఈ వాహనాన్ని మంగళవారం రికవరీ చేశారు. నిందితుల ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్న అధికారులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 750 సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌ను వడపోసిన సిటీ పోలీసులు మరిన్ని కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టారు. నేరం జరిగిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న దుండగులు.. హైదరాబాద్‌లోనే షెల్డర్ తీసుకుని, బీదర్‌లో నేరం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బీదర్‌లోని శివాజీ జంక్షన్ వద్ద ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనాన్ని కొల్లగొట్టడానికి దుండగులు బైక్‌పై వెళ్లారు. ఈ వాహనానికి ‘ఏపీ’ రిజి్రస్టేషన్‌తో కూడిన నకిలీ నంబర్ ప్లేట్ ఉంది. దీన్ని హైదరాబాద్ లేదా శివారు ప్రాంతాల్లో చోరీ చేసి ఉంటారని భావిస్తున్న అధికారులు.. ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. బీదర్‌లో నేరం చేసిన తర్వాత రాయ్‌పూర్ వెళ్లడానికి అఫ్జల్‌గంజ్‌కు వచి్చన దుండగులు.. రోషన్ ట్రావెల్స్ వద్దకు ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చారు. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు మంగళవారం ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉన్న అనుమానాస్పద వాహనాలను పరిశీలించారు. గురువారం పార్క్ చేసిన వాటి వివరాలు ఆరా తీసి నిందితులు వాడింది గుర్తించారు. నిందితులు సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వద్ద ఎక్కిన ఆటోలో గజ్వేల్ వెళ్లాలని ప్రయత్నించి, తిరుమలగిరిలో దిగిపోయారు. అక్కడ నుంచి శుక్రవారం మధ్యాహా్ననికి ఆదిలాబాద్ చేరుకున్న దుండగులు సరిహద్దులు దాటించి మహారాష్ట్రలో ప్రవేశించినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఆద్యంతం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన నిందితుల ఆచూకీ కనిపెట్టడానికి పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. -
ప్రజా రవాణాతోనే సురక్షిత ప్రయాణం
అఫ్జల్‌గంజ్/సాక్షి, హైదరాబాద్: సురక్షితమైన ప్రయాణానికి ప్రయాణికులు ప్రజా రవాణా వ్యవస్థను ఆదరించాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. శనివారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేశారు. వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రుల సౌకర్యార్థం సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌లోని ప్లాట్‌ఫాంల వరకు ప్రయాణికులను చేరవేసేందుకు వీలుగా నూతన బగ్గి వాహన సేవల్ని ప్రారంభించారు. త్వరలోనే అన్ని ప్రధాన బస్స్టేషన్లలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్ ఉన్న తన కార్యాలయంలో కేక్ కట్ చేశారు. -
హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద పేలుడు
హైదరాబాద్: రాజధాని నగరంలోని ప్రఖ్యాత మహాత్మాగాంధీ బస్‌స్టేషన్(సీబీఎస్, ఇమ్లీబన్ స్టేషన్) వద్ద మంగళవారం రాత్రి కలకలం రేగింది. బస్‌స్టేషన్ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నిప్పు అంటుకోవడంతో అక్కడే నిలిపిఉన్న పలు వాహనాలు తగలబడ్డాయి. ఎంజీబీఎస్.. నిత్యం లక్షల్లో ప్రయాణికులు వచ్చిపోయే ప్రదేశం కావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఆస్తి నష్టం రూ.4 కోట్లు ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్టుసర్క్యూట్‌తో మంటలు చేలరేగాయి పది ఫైరింజన్లతో ప్రయత్నించినప్పటికీ ఎంతకీ మంటలు అదుపులోకి రాలేదు. 132 కెవీఎం ట్రాన్స్ఫార్మర్ కావడంతో అందులో సుమారు 47,000 లీటర్ల ఆయిల్ ఉంటుందని, అందువల్ల మంటలు భారీగా వ్యాపించాయని చెబుతున్నారు. చివరకు ఫోమ్‌తో మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం రూ.4 కోట్ల వరకు జరిగింది అని అగ్నిమాపక అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేయడానికి ఆరు గంటల సమయం పట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
హైహై... వైఫై!
ఫ్రీ వైఫైకి విశేష స్పందన నెక్లెస్ రోడ్, ట్యాంక్బండ్లు టాప్ త్వరలో నగర వ్యాప్తంగా 3 వేల హాట్స్పాట్లు బీఎస్ఎన్ఎల్ సన్నాహాలు సిటీబ్యూరో: ఉచిత వైఫై సేవలకు సిటీజనుల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలు ఈ విషయంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. నగరంలో 15 చోట్ల బీఎస్ఎన్ఎల్ సంస్థ 20 నిమిషాల చొప్పున ఉచితంగా వైఫై సేవలు అందించేందుకు హాట్‌స్పాట్ పరికరాలు ఏర్పాటు చేసింది. క్రమంగా వీటి సంఖ్య పెంచుతోంది. దీనికి స్పందన అదే స్థాయిలో ఉంటోంది. నెక్లెస్ రోడ్లో వారానికి సగటున 79,076 సెషన్స్ మేర ఉచిత వైఫై వినియోగమవుతోందని... 8.83 టెరాబైట్ల డేటాను వినియోగదారులు వాడుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ట్యాంక్‌బండ్ వద్ద 61,745 సెషన్ల మేర 10.63 టెరాబైట్ల డేటా వినియోగించినట్లు తెలిసింది. ఆ తరవాత స్థానంలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంది. కనిష్టంగా బిర్లా ప్లానిటోరియం వద్ద 503 సెషన్స్, నిమ్స్ వద్ద 580 సెషన్స్ మేర వైఫై వినియోగిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. 3 వేల హాట్స్పాట్లు నగర వ్యాప్తంగా వైఫై సేవల విస్తరణకు 3 వేల హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు ఆలస్యం కావడం... హాట్స్పాట్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఈ పనులు ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వపరంగా సహకారం అందితే మరో ఆరు నెలల్లో 3 వేల హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేస్తామని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. నగరంలో తమ సంస్థకు 4,500 కి.మీ మేర ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అందుబాటులో ఉందని ప్రకటించింది. వినియోగంలో సమస్యలివీ.. ఉచిత వైఫై వినియోగంలో పలుమార్లు సమస్యలు ఎదురవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఒకేసారి వందలాది మంది వైఫై సేవలకు ప్రయత్నిస్తే నిరాశే ఎదురవుతోంది. స్పీడ్ తగ్గుతోందని... ఒక్కోసారి కనెక్ట్ కావడం లేదని నెక్లెస్ రోడ్‌పై వైఫై వినియోగిస్తున్న పలువురు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినపుడు సేవలు అందడం లేదని చెబుతున్నారు. హాట్‌స్పాట్ పరికరాల సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు. వినియోగించే తీరిదీ మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆప్షన్‌ను క్లిక్ చే సి మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్మిట్ చేయాలి.ఆ తరవాత మొబైల్‌కు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి.రెండో బాక్సులో యూజర్‌నేమ్, పాస్వర్డ్ టైప్‌చేసి లాగిన్ కావాలి. అపుడు 20 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలు అందుతాయి.ఆ తరవాత వినియోగించేందుకు ప్రతి అరగంటకు రూ.30 చార్జీ అవుతుంది. ఈ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించవచ్చు. లేదా హాట్స్పాట్లు ఉన్నచోట బీఎస్ఎన్ఎల్ విక్రయించే కూపన్లను కొనుగోలు చేయవచ్చు. ప్రయోజనాలివీ.. ఆన్లైన్లో అనుసంధానించినసుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచ్చు. వెఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటే చాలు.. మొబైల్ డేటా నెట్వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ను వినియోగించే వీలుంటుంది. కేబుల్ కనెక్షన్లతో అవసరం ఉండదు. ఆన్లైన్ ద్వారా ఒకే టీవీలో అన్ని చానళ్లు వీక్షించే వీలుంటుంది.ఒకే కనెక్షన్‌పై ఒకటి కన్నా ఎక్కువ మంది మాట్లాడుకునే యాక్సెస్ లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు సేవలే కాకుండా కొన్ని రకాల యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు. ఉదాహరణకు పార్కింగ్ యాప్, గార్బేజ్ యాప్ వంటివి. ఈ యాప్ సేవలతో నగరం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయి. -
కవ్విస్తున్న వ్యభిచారిణుల అరెస్ట్
హైదరాబాద్: అసభ్యకర చేష్టలు, సైగలతో విటులను ఆకర్షించేందుకు యత్నిస్తున్న నలుగురు వ్యభిచారిణులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం...గౌలిగూడలోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో విటులను ఆకర్షించేందుకు ఉప్పల్‌కు చెందిన నలుగురు వ్యభిచారిణులు ఆ దారిన వెళ్తున్న ప్రయాణికులకు సైగలు చేస్తూ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వారు ఎంజీబీఎస్ ప్రాంగణంలో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న వ్యభిచారిణులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.